
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నైసూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. వీసా సమస్యతో మొయిన్ అలీ సకాలంలో భారత్‌కు చేరుకోవడంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. కేకేఆర్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు మొయిన్ అలీ అందుబాటులో లేడని అతడు తెలిపారు.
“మొయిన్ అలీ తొలి మ్యాచ్‌కు దూరమవడం దాదాపు ఖాయం. అతనికి ఇంకా వీసా రాలేదు. బీసీసీఐతో అతడి వీసా సమస్య గురుంచి మేము చర్చించాం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కరించబడుతుందని నేను భావిస్తున్నాను. అతడు ఇక్కడకు చేరుకున్నాక మూడు రోజుల పాటు క్వారంటైన్ ఉండనున్నాడు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో అతడికి వీసా లభించినా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు అని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇక మార్చి 26 నుంచి వాంఖడే వేదికగా ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది.
చదవండి: BAN vs SA: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి!