Moeen Ali Reunites With CSK: ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊరట కలిగించే వార్త తెలిసింది. క్వారంటైన్ నిబంధనల కారణంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇవాళ (మార్చి 28) జట్టుతో కలిశాడు. అలీ జట్టు సభ్యులను పలకరిస్తూ, ఆలింగనం చేసుకుంటున్న వీడియోను సీఎస్‌కే తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Vanganna Vanakkangana! 🙏🏻
— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2022
A Superfam welcome to Namma Mo Bhai! 🦁💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Y9L5tqES7r
కాగా, ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్‌కే... కేకేఆర్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై తమ రెండో మ్యాచ్‌ను మార్చి 31న ఆడనుంది. ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌తో సీఎస్‌కే తలపడనుంది.
చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment