IPL 2022: Dwayne Bravo New Dance Celebration After Dismissing Venkatesh Iyer - Sakshi
Sakshi News home page

IPL 2022: వికెట్‌ తీసిన ఆనందం.. బ్రావో డ్యాన్స్‌ అదిరిపోయిందిగా.. వీడియో వైరల్‌!

Published Sun, Mar 27 2022 8:09 AM | Last Updated on Sun, Mar 27 2022 11:08 AM

Dwayne Bravo new dance celebration after dismissing Venkatesh Iyer - Sakshi

Courtesy: IPL Twitter

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఫీల్డ్‌లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వికెట్‌ తీసిన క్యాచ్‌ పట్టిన డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా ఐపీఎల్‌-2022లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్రావో మరో సారి డ్యాన్స్‌ చేశాడు. కేకేఆర్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో బ్రావో స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌ 7 ఓవర్‌ బౌలింగ్‌ చేసిన బ్రావో.. వెంకటేశ్‌ అయ్యర్‌ను ఔట్‌ చేసి సీఎస్కేకు తొలి వికెట్‌ అందిం‍చాడు. ఈ క్రమంలో బ్రావో తనదైన శైలిలో డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 6 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎమ్మెస్‌ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 4 వి​కెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Dwayne Bravo: ఐపీఎల్‌లో డ్వేన్‌ బ్రావో సరికొత్త చరిత్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement