
PC: IPL.com
ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌తో పాటు మరి కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 23న జరిగిన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ట్రైనింగ్ సెషన్‌లో అలీ గాయపడ్డాడు. దీంతో అతడు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
అయితే అతడు ఇంకా గాయం నుంచి కోలులేనట్టు తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో మిచెల్ సాంట్నర్ కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వాంఖడే వేదికగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. కాగా ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి సీఎస్‌కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
చదవండి: IPL 2022: నా అద్భుతమైన ఫామ్‌కు కారణం అతడే: జోస్ బట్లర్
Comments
Please login to add a commentAdd a comment