IPL 2022: Arshdeep Singh Celebrated in a Unique Style After Dismissing Mitchell Santner - Sakshi
Sakshi News home page

IPL 2022: ఏంటీ రథం తోలుతున్నావా? అర్ష్‌దీప్‌ సెలబ్రేషన్‌ వైరల్‌!

Published Tue, Apr 26 2022 2:41 PM | Last Updated on Tue, Apr 26 2022 6:13 PM

IPL 2022 PBKS Vs CSK: Arshdeep Singh Chariot Riding Celebration Viral - Sakshi

అర్ష్‌దీప్‌ సెలబ్రేషన్‌(PC: IPL/BCCI)

IPL 2022 PBKS Vs CSK: ఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శిఖర్‌ ధావన్‌ అదిరిపోయే ఆరంభం అందించాడు. 88 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గబ్బర్‌కు తోడు భనుక రాజపక్స 42 పరుగులతో రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(30 పరుగులు).. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు(78) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. పంజాబ్‌ బౌలర్ల ధాటికి చెన్నై మిడిలార్డర్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. వారి పేలవ ప్రదర్శన కారణంగా 11 పరుగుల తేడాతో జడ్డూ బృందం ఓటమిపాలైంది.

కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు మిచెల్‌ సాంట్నర్‌ వికెట్‌ తీసిన సందర్భంగా పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ సెలబ్రేట్‌ చేసుకున్న తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరో ఓవర్‌ మూడో బంతికి అర్ష్‌దీప్‌.. సాంట్నర్‌ను బౌల్డ్‌ చేశాడు. ఫ్లిక్‌ షాట్‌ ఆడదామనుకున్న బ్యాటర్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో రథం నడుపుతున్నట్లుగా వినూత్న రీతిలో అతడు సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్లు బౌల్‌ చేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 38: పంజాబ్‌ వర్సెస్‌ చెన్నై మ్యాచ్‌ స్కోర్లు
పంజాబ్‌-187/4 (20)
చెన్నై-176/6 (20)

చదవండి👉🏾 Shikhar Dhawan: జట్టులో సీనియర్‌ను కదా.. కొంతమంది మరీ ఎక్కువగా ఆలోచిస్తారు.. అందుకే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement