బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా! | IPL 2022: Arshdeep Singh Scores Boundary But Forget Which End-Was Batting | Sakshi
Sakshi News home page

IPL 2022: బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా!

Published Fri, Apr 8 2022 10:51 PM | Last Updated on Fri, Apr 8 2022 10:57 PM

IPL 2022: Arshdeep Singh Scores Boundary But Forget Which End-Was Batting - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ కొట్టిన పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌.. తాను స్ట్రైకింగ్‌ లేదా నాన్‌స్ట్రైక్ ఎండ్‌ అన్న విషయం మరిచిపోయాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో చోటుచేసుకుంది. ఫెర్గూసన్‌ వేసిన ఆ ఓవర్‌ ఆఖరి బంతిని అర్ష్‌దీప్‌ బౌండరీ తరలించాడు.

నిబంధనల ప్రకారం ఓవర్‌ ఆఖరి బంతికి ఫోర్‌ కొడితే బ్యాట్స్‌మన్‌.. మరుసటి ఓవర్‌లో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కు వెళ్లాలి. కానీ ఆ విషయం మరిచిపోయిన అర్ష్‌దీప్‌ 20 ఓవర్‌ ప్రారంభానికి ముందు స్ట్రైకింగ్‌ ఎండ్‌లో నిలబడ్డాడు. అవతలి ఎండ్‌లో ఉన్న రాహుల్‌ చహర్‌ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంతలో గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌ గమనించి అర్ష్‌దీప్‌ రాంగ్‌సైడ్‌ నిల్చున్నాడని అంపైన్‌ దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో అంపైర్‌ నవ్వుతూను అర్ష్‌దీప్‌ను నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కు పిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ఏంటయ్యా బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: Hardik Pandya: ఔట్‌ చేయాలన్న తొందర.. అసలు విషయం మరిచిపోయాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement