PC: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్ చాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన గుజరాత్.. అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్‌రౌండర్ అనేది మరోసారి రుచి చూపించాడు. అటు కెప్టెన్‌గా రాణించడంతో పాటు.. ముందు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు, బ్యాటింగ్‌లో 34 పరుగులు చేసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
PC: IPL Twitter
సీజన్ ప్రారంభానికి ముందు పాండ్యాపై విమర్శలు దారుణంగా వచ్చాయి. ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా జట్టును ఏం నడిపిస్తాడు.. ఆల్‌రౌండర్‌గా పనికిరాలేడు.. ఇక కెప్టెన్‌గా ఏం చేస్తాడంటూ అవమానించారు. ఆ సమయంలో పాండ్యాకు తన భార్య నటాషా స్టాంకోవిక్ అండగా నిలబడింది. తన కొడుకు అగస్త్యతో కలిసి గుజరాత్ టైటాన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు హాజరై ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. హార్దిక్ ఔటైన రోజున ముఖం మాడ్చుకోవడం.. అతను విజృంభించిన రోజున పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేయడం.. ఇలా తన చర్యలతో సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
PC: IPL Twitter
ఇక ఫైనల్లో తన భర్త కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు బౌలింగ్‌లోనూ.. కెప్టెన్‌గానూ మెరవడంతో నటాషా ఊరుకుంటుందా.. అందుకే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్ గెలవగానే గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి పాండ్యాను గట్టిగా హగ్ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీజన్ ఆరంభానికి ముందు పాండ్యా కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టులో ఇద్దరు, ముగ్గురు మినహా పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోవడంతో ప్లేఆఫ్‌కు వెళ్లడమే ఎక్కువని అంతా భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంతో ప్లే ఆఫ్ చేరుకుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1లో.. మరోసారి ఫైనల్లో రాజస్తాన్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
— Ashok (@Ashok94540994) May 29, 2022
Comments
Please login to add a commentAdd a comment