PC: IPL Twitter
క్రికెట్‌లో ఒక జట్టు మేజర్ కప్ గెలిచిదంటే ముందుగా పేరొచ్చేది జట్టు కెప్టెన్‌కే. ఎందుకంటే కెప్టెన్ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి. ఒక కెప్టెన్‌గా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించి చాంపియన్‌గా నిలపడం అతని లక్ష్యం. కానీ కెప్టెన్ పేరు ప్రత్యక్షంగా కనిపిస్తే.. తెరవెనుక కనిపించని హీరో మరొకరు ఉంటారు.
అతనే టీమ్ కోచ్. జట్టులో ఎవరు సరిగా ఆడుతున్నారు.. ఎవరు బలహీనంగా ఉన్నారు.. బాధ్యతగా ఎవరు ఆడుతున్నారు.. ఒక ఆటగాడి వల్ల జట్టుకు ఎంత ఉపయోగం అనేది కోచ్ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ప్రత్యక్షంగా కెప్టెన్‌కు ఎంత పేరు వస్తుందో.. కోచ్‌కు కూడా అంతే ఉంటుంది. అయితే అది తెర వెనుక మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా అన్నీ తానై నడిపించిన హార్దిక్ పాండ్యాను మెచ్చుకోవడానికి ముందు మరొక అజ్ఞాతవ్యక్తిని తప్పక పొగడాల్సిందే. గుజరాత్ టైటాన్స్ మెంటార్స్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆశిష్ నెహ్రా గురించి పక్కనబెడితే కిర్‌స్టెన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.
PC: IPL Twitter
ఎప్పుడైతే గ్యారీ కిర్‌స్టెన్ గుజరాత్ టైటాన్స్‌కు మెంటార్‌గా వచ్చాడో.. ఆ జట్టు అప్పుడే సగం విజయం సాధించినట్లయింది. ఎందుకంటే కిర్‌స్టెన్ ఎంత గొప్ప కోచ్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో కోచ్ కిర్‌స్టెన్ పాత్ర కీలకం. నాయకుడిగా ధోని జట్టును ముందుండి నడిపిస్తే.. తెరవెనుక కోచ్ పాత్రలో కిర్‌స్టెన్ విలువైన సలహాలు ఇచ్చి టీమిండియాను 28 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిపాడు. అలాంటి వ్యక్తి.. గుజరాత్ టైటాన్స్‌కు మెంటార్‌గా రావడం.. అతని సలహాలు కెప్టెన్ పాండ్యా తప్పకుండా పాటించడం జట్టుకు మేలు చేశాయి.
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో ''మ్యాచ్ కిల్లర్''గా మారినడేవిడ్ మిల్లర్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించింది లేదు. అయినప్పటికి హార్దిక్ అతన్ని జట్టులో కొనసాగించడంపై మాస్టర్ ప్లాన్ కిర్‌స్టెన్‌దే. కట్‌చేస్తే మిల్లర్ ఫైనల్లోనూ చెలరేగి గుజరాత్ టైటాన్స్‌కు కప్ అందించాడు. అంతేకాదు లీగ్ ఆరంభానికి ముందు పాండ్యాపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంతకముందు జరిగిన టి20 ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో గుజరాత్‌కు కెప్టెన్‌గా రావడం.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా కిర్‌స్టెన్ పాండ్యాను ప్రోత్సహించడం జరిగిపోయాయి. మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ చేతల్లోనే పనిని చూపించే వ్యక్తి కిర్‌స్టెన్.. ఒక రకంగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంలో తన పాత్ర కూడా ఉంటుంది.
చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'
Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక
Comments
Please login to add a commentAdd a comment