IPL 2022 Hardik Pandya Bat Goes Flying In The Air During RCB Vs GT, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Hardik Pandya Viral Video: వైరల్‌గా మారిన హార్దిక్‌ చర్య.. నటాషా నవ్వింది

Published Thu, May 19 2022 10:35 PM | Last Updated on Fri, May 20 2022 11:28 AM

IPL 2022 Hardik Pandya Bat Goes Flying While Tries To Hit Glenn Maxwell - Sakshi

PC: IPL Twitter

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చేసిన ఒక పని మైదానంలో నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. మాథ్యూ వేడ్‌ వికెట్‌ తీసిన మ్యాక్స్‌వెల్‌ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ వేస్తున్నాడు. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ మరోసారి బౌలింగ్‌కు వచ్చాడు.

అప్పటికే పాండ్యా, మిల్లర్‌లు కలిసి ఆ ఓవర్‌లో ఏడు పరుగులు రాబట్టారు. ఓవర్‌ చివరి బంతిని స్ట్రెయిట్‌ డెలివరీ వేశాడు. పాండ్యా స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌ను తాకడంలో విఫలమైంది. అంతే బంతికి బదులుగా బ్యాట్‌ గాల్లోకి లేచి దాదాపు 100 మీటర్ల దూరంలో పడింది. ఈ చర్య మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌ వీక్షిస్తున్న పాండ్యా భార్య నటాషా ''ఏంటిది..'' అన్నట్లుగా నవ్వడం ​కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే .. హార్దిక్‌ పాండ్యా కీలక సమయంలో అర్థసెంచరీతో మెరిశాడు. 62 పరుగులు చేసిన పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. ఆర్‌సీబీ పరిస్థితి చావో రేవో అన్నట్లుగా తయారైంది. భారీ తేడాతో గెలిస్తేనే ఆర్‌సీబీకి ప్లే ఆఫ్‌ అవకాశాలు ఉంటాయి. 

చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్‌.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement