Glenn Maxwell
-
MLC రిటెన్షన్ జాబితా విడుదల.. అత్యధికంగా ఆస్ట్రేలియా ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీలు
ఫిబ్రవరి 19న జరుగనున్న డ్రాఫ్ట్‌కు (వేలం) ముందు మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket-2025) ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను (విదేశీ ఆటగాళ్లు) ప్రకటించాయి. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొత్తం 23 మంది విదేశీ స్టార్లను అట్టిపెట్టుకున్నాయి. ఫ్రాంచైజీలు అత్యధికంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి చెరో నలుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్ వాషింగ్టన్ ఫ్రీడం అత్యధికంగా 6 మంది విదేశీ స్టార్లను రీటైన్ చేసుకుంది. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆసీస్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్, మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర ఉన్నారు.గత సీజన్ రన్నరప్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ తమ కీలక విదేశీ స్టార్లందరినీ రీటైన్ చేసుకుంది. యూనికార్న్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, ఫిన్ అలెన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మాథ్యూ షార్ట్ ఉన్నారు.కేకేఆర్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ విదేశీ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది.తొలి సీజన్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ కీరన్ పోలార్డ్, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్‌ను అట్టిపెట్టుకుంది.సియాటిల్ ఓర్కాస్.. సౌతాఫ్రికా స్లార్లు హెన్రిచ్ క్లాసెన్, ర్యాన్ రికెల్టన్లను రీటైన్ చేసుకుంది.టెక్సాస్ సూపర్‌కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే, నూర్ అహ్మద్, మార్కస్ స్టోయినిస్‌ను రీటైన్ చేసుకుంది.అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న స్వదేశీ ఆటగాళ్ల జాబితాలను ఇదివరకే ప్రకటించాయి. కాగా, యూఎస్ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్ తొలి సీజన్ (2023) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన రెండో సీజన్లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం ఛాంపియన్‌గా నిలిచింది. -
రెడ్ హాట్ ఫామ్‌లో మ్యాక్స్‌వెల్.. పంజాబ్ కింగ్స్‌కు మంచి రోజులే..!
ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, మెల్బోర్న్ స్టార్స్ కీలక ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్లో మ్యాక్సీ రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. మ్యాక్సీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 59.40 సగటున, 194.11 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 297 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతను థర్డ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో మ్యాక్సీ మొత్తం 26 సిక్సర్లు బాదాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మ్యాక్సీ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నాడు.తాజాగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ సుడిగాలి హాఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు బ్యూ వెబ్‌స్టర్ (31 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్స్ ఇన్నింగ్స్‌లో సామ్ హార్పర్ 19 బంతుల్లో 23, థామస్ రోజర్స్ 10 బంతుల్లో 9, కార్ట్‌రైట్ 6 బంతుల్లో 12 పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో మార్కస్ బీన్, నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హరికేన్స్ తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్ల అనంతరం 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కాలెబ్ జువెల్ 5, మిచెల్ ఓవన్ 17 బంతుల్లో 38, చార్లీ వకీమ్ 0, బెన్ మెక్ డెర్మాట్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. నిఖిల్ చౌదరీ 18, మాథ్యూ వేడ్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 66 బంతుల్లో 132 పరుగులు చేయాల్సి ఉంది. విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. స్టార్స్ పేసర్ మార్క్ స్టీకిటీ (2-0-8-3) హరికేన్స్‌ను దెబ్బకొట్టాడు. టామ్ కర్రన్ ఓ వికెట్ దక్కింది.గత నాలుగు మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ స్కోర్లు..20*(10)58*(32)90(52)76*(32)పంజాబ్ కింగ్స్‌కు మంచి రోజులే..!ఐపీఎల్ 2025 మెగా వేలంలో మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. మ్యాక్సీని పంజాబ్ రూ.4.2 కోట్లకు దక్కించుకుంది. గత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడిన మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు (10 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులు చేశాడు). ఐపీఎల్-2025కి ముందు మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి రావడంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు సంబురపడిపోతున్నారు. మ్యాక్సీ ఇదే ఫామ్‌కు కొనసాగిస్తే తమ జట్టుకు మంచి రోజులు వస్తాయని అశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. మ్యాక్స్‌వెల్ గతంలో (2020 సీజన్లో) పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. -
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే? -
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్.. కేన్ రిచర్డ్సన్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్లోని తొలి సిక్సర్ (రెండో బంతి) బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్ రికార్డు సహచరుడు హిల్టన్ కార్ట్‌రైట్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో కార్ట్‌రైట్ 121 మీటర్ల సిక్సర్ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బెన్ డకెట్ (21), బ్యూ వెబ్‌స్టర్ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్ డకెట్, థామస్ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్, 55 పరుగుల వద్ద సోయినిస్ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్ (6), 75 పరుగుల వద్ద జోయల్ పారిస్ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్ బేతెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్బోర్న్ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్ కెప్టెన్ స్టోయినిస్ ఔట్ కాగానే జకో నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ 4, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 19, జేకబ్ బేతెల్ 1, విల్ సదర్‌ల్యాండ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్ 26, హ్యారీ డిక్సన్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి. -
మెరుపు అర్ద శతకం.. మ్యాక్స్‌వెల్ ఖాతాలో భారీ రికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డును సాధించాడు. లీగ్ చరిత్రలో 3000 పరుగుల మార్కును దాటిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్ 2024-25లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ అరుదైన ఘనత సాధించాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్, ఆరోన్ ఫించ్, డిఆర్కీ షార్ట్, మోసెస్ హెన్రిక్స్, జాన్ వెల్స్ మాత్రమే బీబీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ద శతకం బాదిన మ్యాక్సీ.. బీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెల్స్, హెన్రిక్స్లను అధిగమించాడు.బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్..క్రిస్ లిన్-3908ఆరోన్ ఫించ్-3311డిఆర్కీ షార్ట్-3102గ్లెన్ మ్యాక్స్‌వెల్-3047మోసెస్ హెన్రిక్స్-3035మ్యాక్సీ మెరుపు అర్ద శతకంసిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపు అర్ద శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బ్యూ వెబ్‌స్టర్ (48) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. బెన్ డకెట్ (20), డాన్ లారెన్స్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. సామ్ హార్పర్ (4), కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (4) విఫలమయ్యారు. సిక్సర్స్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, హేడెన్ కెర్ తలో వికెట్ దక్కించుకున్నారు.19వ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన హాఫ్ సెంచరీ బీబీఎల్‌లో అతనికి 19వది. ఓవరాల్‌గా అతను టీ20ల్లో 55 అర్ద శతకాలు సాధించాడు. టీ20 కెరీర్లో 427 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 154 స్ట్రయిక్‌రేట్‌తో 28 సగటున 10,183 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరఫున 133 అంతర్జాతీయ టీ20లు ఆడిన మ్యాక్సీ ఐదు సెంచరీల సాయంతో 2664 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ 16వ స్థానంలో ఉన్నాడు.చిత్తుగా ఓడిన సిక్సర్స్157 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మార్క్ స్టీకిటీ (3/14), పీటర్ సిడిల్ (2/26), మార్కస్ స్టోయినిస్ (2/30), ఉసామా మిర్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి మెల్బోర్న్ స్టార్స్‌ను గెలిపించారు. సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. కర్టిస్ ప్యాటర్సన్ (18), హేడెన్ కెర్ (21), మోసెస్ హెన్రిక్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. -
మ్యాక్స్‌వెల్‌ను అధిగమించిన స్టోయినిస్
బిగ్‌బాష్ లీగ్‌లో మార్కస్ స్టోయినిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్ ఈ ఘనత సాధించాడు. స్టోయినిస్ ఈ భారీ రికార్డు సాధించే క్రమంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును అధిగమించాడు. స్టోయినిస్‌కు ముందు మ్యాక్సీ మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. స్టోయినిస్ మెల్బోర్న్ స్టార్స్ తరఫున 2850 పరుగులు చేయగా.. మ్యాక్స్‌వెల్ 2845 పరుగులు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్, మ్యాక్స్‌వెల్ తర్వాత లూక్ రైట్ (1479), హిల్టన్ కార్ట్‌రైట్ (1429), కెవిన్ పీటర్సన్ (1110) ఉన్నారు.మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాఛ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ బ్రయాంట్ (77 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్ వాల్టర్ (21), టామ్ బాంటన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్ పారిస్, పీటర్ సిడిల్, ఉసామా మిర్, డాన్ లారెన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్టోయినిస్ (48 బంతుల్లో 62; 10 ఫోర్లు), డేనియల్ లారెన్స్ (38 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు చేసి మెల్బోర్న్ను గెలిపించారు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన మెల్బోర్న్ తొలుత తడబడింది. అయితే డేనియల్ లారెన్స్, స్టోయినిస్ బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 0, థామస్ ఫ్రేజర్ 6, సామ్ హార్పర్ 8, మ్యాక్స్‌వెల్ డకౌటయ్యారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో జేవియర్ బార్ట్లెట్ నాలుగు వికెట్లు తీశాడు. -
Viral Video: మ్యాక్స్‌వెల్ అద్భుత విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్
బిగ్‌బాష్ లీగ్ 2024-25లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన విన్యాసం చేశాడు. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ను క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసి అభిమానులు ఔరా అంటున్నారు.GLENN MAXWELL!CATCH OF THE SEASON. #BBL14 pic.twitter.com/3qB9RaxHNb— KFC Big Bash League (@BBL) January 1, 2025పూర్తి వివరాల్లోకి వెళితే.. మెల్బోర్న్ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ బ్రయాంట్ (77 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్ వాల్టర్ (21), టామ్ బాంటన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్ పారిస్, పీటర్ సిడిల్, ఉసామా మిర్, డాన్ లారెన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ను డాన్ లారెన్స్ బౌల్ చేశాడు. తొలి బంతిని ఎదుర్కొన్న విల్ ప్రెస్ట్‌విడ్జ్ భారీ షాట్ ఆడాడు. ప్రెస్ట్‌విడ్జ్ ఈ షాట్ ఆడిన విధానం చూస్తే సిక్సర్ తప్పదని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాక్స్‌వెల్ మ్యాజిక్ చేశాడు. సెకెన్ల వ్యవధిలో సిక్సర్ వెళ్తున్న బంతిని అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్‌వెల్ చేసిన ఈ విన్యాసం చూసి ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. సిక్సర్‌కు వెళ్తున్న బంతిని మ్యాక్సీ గాల్లోకి ఎగిరి లోపలికి తోశాడు. ఆతర్వాత క్షణాల్లో బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మాటల్లో వర్ణించలేనిది. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఈ క్యాచ్‌తో పాటు మరో మూడు క్యాచ్‌లు పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాన్ లారెన్స్, మార్కస్ స్టోయినిస్ (62) తమ జట్టును గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు. మరో నాలుగు పరుగులు చేస్తే మెల్బోర్న్ విజయం సాధిస్తుందనగా బార్ట్లెట్ విజృంభించాడు. వరుస బంతుల్లో స్టోయినిస్, మ్యాక్స్‌వెల్‌లను (0) ఔట్ చేశాడు. మొత్తానికి లారెన్స్ (64 నాటౌట్) బాధ్యతగా ఆడి మెల్బోర్న్ను విజయతీరాలకు చేర్చాడు. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ డకౌట్ కాగా.. థామస్ రోజర్స్ 6, సామ్ హార్పర్ 8 పరుగులు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో బార్ట్లెట్ నాలుగు, స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
అతడికి జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్సీకి టెస్టు జట్టులో ఉండే అర్హతే లేదన్నాడు. కాగా మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు బరిలో దిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2017లో తన చివరి టెస్టు ఆడాడు.ఏడు టెస్టులుచట్టోగ్రామ్ వేదికగా నాటి మ్యాచ్‌లో 36 ఏళ్ల మాక్సీ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 28, 25* పరుగులు చేశాడు. ఇక 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు మొత్తంగా.. తన కెరీర్లో ఏడు టెస్టులు ఆడాడు.టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలనే ఆశఇందులో నాలుగు టీమిండియా, ఒకటి పాకిస్తాన్, రెండు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లు. వీటన్నింటిలో కలిపి 339 పరుగులు చేసిన మాక్సీ.. ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక వన్డే, టీ20లలో అదరగొడుతున్న ఈ ఆల్‌రౌండర్.. టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలని ఆశపడుతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ టెస్టు జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని.. ఇటీవల మాక్సీ తన మనసులోని మాట బయటపెట్టాడు.అతడి ఆ అర్హత కూడా లేదుఈ విషయంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘‘నీకు దేశీ టోర్నీ జట్టులోనే చోటు దక్కనపుడు.. జాతీయ జట్టులో స్థానం కావాలని ఆశించడం సరికాదు!.. నిజానికి నీకు టెస్టుల్లో ఆడాలనే కోరిక మాత్రమే ఉంది. ఆ కారణంగా నిన్నెవరూ జట్టుకు ఎంపిక చేయరు.క్లబ్ క్రికెట్ ఆడుతూ.. అక్కడ నిరూపించుకుంటే.. టెస్టు క్రికెట్ జట్టు నుంచి తప్పకుండా పిలుపు వస్తుంది. కానీ.. అతడు అలాంటిదేమీ చేయడం లేదు. కాబట్టి.. నా దృష్టిలో మాక్సీకి టెస్టు జట్టు చోటు కోరుకునే అర్హత కూడా లేదు’’ అని వార్నర్ ఘాటు విమర్శలు చేశాడు.కాగా గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వార్విక్షైర్ తరఫున మాక్స్వెల్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున అతడు బరిలోకి దిగాల్సింది. అయితే, పాకిస్తాన్‌తో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ సమయంలో మాక్సీకి తొడ కండరాల గాయమైంది. ఫలితంగా అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కోడ్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాతో టెస్టులతో ఆసీస్ బిజీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఐదు టెస్టులు ఆడతున్న కంగారూ జట్టు సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ టెస్టులో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్‌లోని ‘ది గాబా’ మైదానం ఇందుకు వేదిక.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
జైశ్వాల్ ఒక అద్భుతం.. 40కి పైగా టెస్టు సెంచరీలు చేస్తాడు: మాక్స్వెల్
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై సత్తాచాటిన జైశ్వాల్.. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై తను ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తాచాటాడు. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో యశస్వీ అద్బుతమైన సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్, హాజిల్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలోవకగా ఎదుర్కొంటూ దిగ్గజాలను సైతం జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో జైశ్వాల్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ 40కి పైగా టెస్టు సెంచరీలు సాధిస్తాడని మాక్సీ జోస్యం చెప్పాడు."జైశ్వాల్ ఒక అద్బుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్లో నలభై కంటే ఎక్కువ సెంచరీలు చేసే సత్తా అతడికి ఉంది. విభిన్న రికార్డులను తిరిగి రాస్తాడని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ జైశ్వాల్ దగ్గర ఉంది.ఈ సిరీస్‌లో రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని మా బౌలర్లు అడ్డుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. జైశ్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుంది. అన్ని రకాల షాట్లు ఆడగలడు. స్పిన్ కూడా బాగా ఆడగలడు. అతడొక ఫుల్ ప్యాకెజ్ ప్లేయర్" అని గ్రేడ్ క్రికెటర్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్స్వెల్ పేర్కొన్నాడు. -
చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్రపుటల్లకెక్కాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్సీ.. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 10000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మ్యాక్సీకి ముందు ఈ రికార్డు కీరన్ పోలార్డ్ పేరిట ఉండేది. పోలీ 6640 బంతుల్లో 10000 పరుగుల మార్కును క్రాస్ చేయగా.. మ్యాక్సీ కేవలం 6505 బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో మ్యాక్సీ, పోలీ తర్వాత క్రిస్ గేల్ (6705), అలెక్స్ హేల్స్ (6774), జోస్ బట్లర్ (6928) ఉన్నారు.పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10031) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు దక్కుతుంది. గేల్ ఈ ఫార్మాట్లో 10060 బంతులు ఎదుర్కొని 14562 పరుగులు చేశాడు.కాగా, ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య ఇవాళ (నవంబర్ 16) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిడ్నీ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ ఐదు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఆడమ్ జంపా రెండు, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్రిస్బేన్ వేదికగా పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాబా స్టేడియంలో ఆసీస్- పాక్ మధ్య గురువారం తొలి టీ20 జరిగింది.వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ టీ20 మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగాఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్(19 బంతుల్లో 43) రాకతో సీన్ మారింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగా.. నాలుగో నంబర్ బ్యాటర్ టిమ్ డేవిడ్(10) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో మాక్సీకి తోడైన మార్కస్ స్టొయినిస్(7 బంతుల్లో 21 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.మాక్సీ, స్టొయినిస్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’కు గురైంది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో 64 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(8)ను అవుట్ చేసి స్పెన్సర్ జాన్సన్ వికెట్ల వేట మొదలుపెట్టగా.. జేవియర్ బార్ట్లెట్ మహ్మద్ రిజ్వాన్(0)ను డకౌట్ చేశాడు. అనంతరం ఉస్మాన్ ఖాన్(4)ను కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు.ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ బాబర్ ఆజం(3)తో పాటు.. ఇర్ఫాన్ ఖాన్(0) వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగిన బార్ట్లెట్ ఆఘా సల్మాన్(4)ను వెనక్కి పంపగా.. నాథన్ ఎల్లిస్ హసీబుల్లా ఖాన్(12) పనిపట్టాడు. అయితే, అబ్బాస్ ఆఫ్రిది(20 నాటౌట్)తో కలిసి టెయిలెండర్ షాహిన్ ఆఫ్రిది(6 బంతుల్లో 11) బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేయగా.. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా అతడిని బౌల్డ్ చేశాడు. అనంతరం.. పాక్ ఇన్నింగ్స్ ఆఖరి వికెట్‌గా నసీం షాను బౌల్డ్ చేసి వెనక్కి పంపించాడు. 64 పరుగులకేఈ క్రమంలో పాకిస్తాన్ ఏడు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 64 రన్స్ చేసింది. ఫలితంగా ఆసీస్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించి ఆసీస్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా రెండో టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
పాక్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత.. చరిత్ర పుటల్లోకి!
పాకిస్తాన్‌తో తొలి టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. 226కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేసిన మాక్సీ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.ఇక మాక్సీతో పాటు మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం ఏడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.కాగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలైంది.గాబా స్టేడియంలో గురువారం నాటి ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో టీ20ని ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9).. అదే విధంగా టిమ్ డేవిడ్(10) విఫలం కాగా.. మాక్సీ, స్టొయినిస్ దంచికొట్టారు.చరిత్ర పుటల్లోకి!ఇక పాక్‌తో తొలి టీ20 సందర్భంగా మాక్స్వెల్ పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10012) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో చేరారు. 'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
‘ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు.. నన్ను మళ్లీ కొనుక్కుంటారు’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నాడు. వేలంపాటలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు.బాధ లేదు..ఇక రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదని తెలిపాడు. కాగా ఈసారి ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సహా రజత్ పాటిదార్, యశ్ దయాళ్‌లను అట్టిపెట్టుకుని.. మిగతా ప్లేయర్లందరినీ రిలీజ్ చేసింది.ఈసారి పర్సు వాల్యూ రూ. 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్ పోనూ ఆర్సీబీ పర్సులో రూ. 83 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్వెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వారు ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదుముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు. నేను తిరిగి అక్కడికి వెళ్లాలనే కోరుకుంటున్నాను. ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ. అక్కడి వారితో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.రిటెన్షన్ సమయంలోనూ నాకు వారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్ , మొ బొబాట్ నాకు జూమ్ కాల్లో అంతా వివరించారు. వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. నాకు వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. నిరాశపరిచిన మాక్సీకాగా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ ఐపీఎల్-2024లో ఆర్సీబీ యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశపరిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తిరిగి సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆర్సీబీ స్టార్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లితో మాక్సీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. తాను కోహ్లిని వెక్కిరించిన కారణంగా అతడు తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని.. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో చేరిన తర్వాత తమ మధ్య స్నేహం కుదిరిందని తెలిపాడు. కాగా మైదానంలో టీమిండియా- ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య సంవాదాలు, దూషణలు, వ్యంగ్య వ్యాఖ్యలు కొత్త కాదు.ఇక 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు కూడా కోహ్లి, మ్యాక్స్‌వెల్ మధ్య అలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే, ఆర్సీబీలో చేరిన తర్వాత ఒక రోజు కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మ్యాక్సీ ఫాలో అయ్యేందుకు ప్రయత్నించగా...అది సాధ్యం కాలేదు. నువ్వు నన్ను బ్లాక్ చేశావా?దాంతో సందేహం వచ్చిన మ్యాక్స్‌వెల్ ‘నువ్వు నన్ను బ్లాక్ చేశావా’ అని కోహ్లిని అడిగాడు. వెంటనే కోహ్లి...‘అవును...నాలుగేళ్ల క్రితం నువ్వు నన్ను వెక్కిరించిన తర్వాత ఆ పని చేశాను’ అని బదులిచ్చాడు.కాగా 2017 సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లి గాయపడ్డాడు. నొప్పిని భరించలేక కోహ్లి తన భుజంపై చేతిని ఉంచి ఇబ్బందిగా నడిచాడు. అదే టెస్టులో దీనిని మ్యాక్స్‌వెల్ అనుకరించి చూపించాడు. అదే ఇది కోహ్లికి ఆగ్రహం తెప్పించింది! అయితే, 2021లో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో బెంగళూరు జట్టుతో చేరిన తర్వాత కోహ్లితో స్నేహం బలపడింది. మైదానంలోనూ, మైదానం బయట కూడా వీరిద్దరు ఎంతో సరదాగా ఉండేవారు.మాక్సీ ఆర్సీబీలో చేరడంలో కోహ్లిదే కీలక పాత్రనిజానికి ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవాలని కోహ్లి ఫ్రాంఛైజీకి సూచించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కోసం రూ. 14.25 కోట్లు ఆర్సీబీ ఖర్చు పెట్టింది. అతడి రాకతో బ్యాటింగ్ యూనిట్ విధ్వంసకరంగా మారింది. 2021, 2022, 2023 సీజన్లలో మాక్సీ వరుసగా 513, 310. 400 పరుగులు చేశాడు. అయితే, ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025 RCB Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..? -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్‌హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్‌కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్‌కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్‌వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్‌కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్‌కు ఐదో స్థానం.. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్‌కు ఆరో స్థానం.. 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్‌కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు పదో స్థానం దక్కాయి. -
రచిన్ మాయాజాలం.. హెడ్ మెరుపులు.. మ్యాక్స్‌వెల్ ఊచకోత
మేజర్ లీగ్ క్రికెట్ 2024లో వాషింగ్టన్ ఫ్రీడం ఫైనల్‌కు చేరింది. ఇవాళ (జులై 26) జరిగిన క్వాలిఫయర్‌లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. రచిన్ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్ (4-0-46-3), నేత్రావల్కర్ (4-0-23-2), ఫెర్గూసన్ (3.2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో హసన్ ఖాన్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో సునయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 1, ఆండ్రియస్ గౌస్ (9), రచిన్ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్ బౌలర్లలో హసన్ ఖాన్ 2, పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్ రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది. -
ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ టెస్టు క్రికెట్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్ ద్వారా అతడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.కాగా ప్రపంచకప్ టెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆసీస్. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ టూర్ ద్వారా సిరీస్ ద్వారా మాక్సీని తిరిగి టెస్టుల్లో ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందుకే టీ20 ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చిన బోర్డు.. టెస్టులకు సన్నద్ధం కావాలని ఆదేశించిందని ఆస్ట్రేలియా మీడియా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. రెడ్‌బాల్ క్రికెట్లో తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడినా మాక్సీపై మేనేజ్మెంట్కు నమ్మకం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.ఇక మాక్సీతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా టీమిండియాతో సిరీస్‌లో భాగంగా 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు గ్లెన్ మాక్స్వెల్.ఇప్పటి వరకు కేవలం ఏడు టెస్టులు ఆడిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఓ సెంచరీ సాయంతో 339 పరుగులు చేశాడు. అదే విధంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరిసారిగా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆడిన మాక్సీ.. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.ఈ క్రమంలో 2022లో శ్రీలంక టూర్‌కు ఎంపికైన మాక్సీ.. టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో వార్విక్షైర్ తరఫున ఆడిన మాక్స్వెల్ 81 పరుగులతో రాణించాడు.ఈ నేపథ్యంలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని ఆడించాలని బోర్డు భావించగా.. రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కాగా మాక్సీ టెస్టు కెరీర్ గొప్పగా లేకపోయినా.. శ్రీలంకలో స్పిన్నర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ బోర్డు అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. -
అది గుర్తుకొస్తే నా ఒళ్లు జలదరిస్తుంది: రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో ఆదివారం ఉదయం ఆసక్తికర పోరు జరుగనుంది. గ్రూప్-1లో భాగమైన అఫ్గనిస్తాన్ పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెయింట్ విన్సెంట్‌లోని కింగ్స్టౌన్ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.మాక్స్వెల్ రాకతో అంతా తలకిందులుఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ కారణంగా 292 పరుగులు స్కోరు చేసిన అఫ్గనిస్తాన్.. లక్ష్య ఛేదనలో కంగారూ జట్టును ఆది నుంచే బెంబేలెత్తించింది. అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాకతో అంతా తలకిందులైంది.అఫ్గన్‌తో మ్యాచ్‌లో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మాక్సీ గట్టెక్కించాడు. కండరాల నొప్పి వేధిస్తున్నా లెక్క చేయక డబుల్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించాడు.నా ఒళ్లు జలదరిస్తుందిఇక ఇరు జట్లు ఇలా మరోసారి ఐసీసీ టోర్నీలో తలపడనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ ఐసీసీ డిజిటల్‌తో తన మనసులోని భావాలు పంచుకున్నాడు. నాటి మాక్సీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘రాత్రిపూట నేను నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక్కోసారి ఆట గురించి తలచుకుంటాను.అలాంటపుడు నా ఒళ్లు జలదరిస్తుంది. అసలు అదొక అద్భుత, నమ్మశక్యం కాని ఇన్నింగ్స్. మేము చూసిన అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌లో అదొకటి’’ అని రషీద్ ఖాన్ మాక్స్‌వెల్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు.కాగా సూపర్-8లో టీమిండియా చేతిలో ఓడిన అఫ్గనిస్తాన్‌కు ఆసీస్‌తో పోరు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, కంగారూ జట్టుతో అంత ఈజీ కాదన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిమరోవైపు.. సూపర్-8లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఆంటిగ్వాలో ఆసీస్ 28 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (36 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ హృదయ్ (28 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో కమిన్స్ ‘హ్యాట్రిక్’తో టీమ్ సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఐదో బంతికి మహ్ముదుల్లా (2), చివరి బంతికి మెహదీ హసన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి తౌహీద్‌ను వెనక్కి పంపి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు.తొలి వికెట్‌కు 41 బంతుల్లోనే 65 పరుగులుఅనంతరం ఆస్ట్రేలియాకు వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెడ్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 41 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు.అనంతరం రిషాద్ తన వరుస ఓవర్లలో హెడ్, మార్ష్ (1)లను అవుట్ చేయగా...11.2 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. ఈ దశలో భారీ వర్షం కురిసింది. వాన ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆ స్థితిలో ముగిస్తున్నట్లు ప్రకటించారు.డక్‌వర్త్ నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఆసీస్ 72 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ అప్పటికే 28 పరుగులు ముందంజలో ఉన్న కంగారూ టీమ్ విజేతగా నిలిచింది. ‘హ్యాట్రిక్’ల రికార్డుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన ‘హ్యాట్రిక్’ల సంఖ్య ఏడు. బ్రెట్‌లీ (2007) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్ నిలవగా... గతంలో కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్), హసరంగ (శ్రీలంక), రబాడ (దక్షిణాఫ్రికా), కార్తీక్ మెయప్పన్ (యూఏఈ), జోష్ లిటిల్ (ఐర్లాండ్) ఈ ఘనతను నమోదు చేశారు. -
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్‌కప్‌లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్‌లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్‌లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్‌తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
టైమ్‌కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?
‘‘అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఎంతో అనుభవం గడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఎల్లప్పుడూ అద్భుతంగా ఆడతాడు. కానీ ఐపీఎల్‌కు వచ్చే సరికి.. అతడికి ఏమవుతుందో తెలియడం లేదు.బహుశా ఐపీఎల్ పట్ల అతడికి ఆసక్తి లేదేమో?!.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు తాను అవుటైనా పర్లేదనకుంటాడేమో!.. అతడి బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉంది.సమయానికి చెక్ అందుతుంది. సహచర ఆటగాళ్లతో కలిసి రాత్రుళ్లు పార్టీలు.. నవ్వులు.. సరదాలు.. ఫొటోలకు ఫోజులు.. ఇంతే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరును విమర్శిస్తూ అతడిపై మండిపడ్డాడు. ఫ్రాంఛైజీ నుంచి టైమ్‌కు చెక్కులు తీసుకోవడం మాత్రమే అతడికి తెలుసని.. ఆటపై అసలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీని ఆర్సీబీ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు ఈ ఆర్థోడాక్స్ బౌలర్.కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లోనూమానసికంగా అలసిపోయానంటూ కొన్నాళ్లు సెలవు కూడా తీసుకున్నాడు. ఇక కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ మాక్స్వెల్ తేలిపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో మాక్సీ డకౌట్ అయ్యాడు.టాపార్డర్‌లో విరాట్ కోహ్లి(33) ఒక్కడు ఫర్వాలేదనిపించగా.. ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్(27) త్వరగానే నిష్క్రమించారు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 34 పరుగులతో ఆకట్టుకోగా.. ఐదో స్థానంలో వచ్చిన మాక్సీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.క్వాలిఫయర్-2లో రాజస్తాన్మిగతా వాళ్లలో మహిపాల్ లామ్రోర్(17 బంతుల్లో 32) చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని రాజస్తాన్ 19 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఆర్సీబీ యథావిథిగా ఇంటిబాట పట్టింది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాక్సీ ఆట తీరును విమర్శిస్తూ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా ఆర్సీబీ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. వరుసగా ఆరు విజయాలు సాధించినా.. అసలు పోరులో ఓడిపోతే లాభం ఉండదంటూ పెదవి విరిచాడు.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!🎥 𝐓𝐡𝐞 𝟏% 𝐜𝐡𝐚𝐧𝐜𝐞 ❤️They were down and out. But what followed next was a dramatic turnaround and comeback fuelled with belief and emotions 🙌 Well done, Royal Challengers Bengaluru 👏 👏 #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @RCBTweets pic.twitter.com/PLssOFbBvf— IndianPremierLeague (@IPL) May 23, 2024 -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024: గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్.. విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్‌పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర.. అత్యంత అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో బుధవారం జరిగిన మూడో వన్డే సందర్భంగా చమరి ఆటపట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం శ్రీలంక వుమెన్ టీమ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది పర్యాటక శ్రీలంక. అదే జోరులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని సంకల్పించింది. అయితే, తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టి రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో శ్రీలంక అద్బుత ప్రదర్శన కనబరిచింది. పోఛెఫ్స్ట్రూమ్లో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా వల్వార్ట్ అజేయ శతకంతో ఆకట్టుకుంది. 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 184 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో లారా గుడాల్ 31, మరిజానే క్యాప్ 36, నదీనే డి క్లెర్క్ 35 రన్స్ చేయగా..మిగతా వాళ్లు నిరాశపరిచారు. వల్వార్ట్ అద్బుత సెంచరీ వృథా అయితే, వల్వార్ట్ అద్భుత సెంచరీ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపులో కెప్టెన్ చమరి ఆటపట్టుదే కీలక పాత్ర. ఈ వెటరన్ ఓపెనర్ 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 195 పరుగులతో చివరి వరకూ అజేయంగా నిలిచింది. 44.3 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది లంకను విజయతీరాలకు చేర్చింది. రికార్డు విజయం కూడా ఇక ఈ మ్యాచ్‌లో ఆటపట్టుకు తోడుగా మరో ఓపెనర్ విష్మి గుణరత్నె(26) రాణించగా.. ఆరో నంబర్ బ్యాటర్ నీలాక్షి డి సిల్వ అజేయ అర్ధ శతకం(50)తో దుమ్ములేపింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చమరి ఆటపట్టు.. వన్డేల్లో విజయవంతమైన రన్ ఛేజ్‌లో 195 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది. ఇక శ్రీలంక వన్డేల్లో ఛేజ్ చేసిన భారీ స్కోరు కూడా ఇదే! వన్డేల్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు 1. గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- అఫ్గనిస్తాన్ మీద- 2023 వరల్డ్‌కప్- 201 రన్స్(నాటౌట్) 2. చమరి ఆటపట్టు(శ్రీలంక)- సౌతాఫ్రికా మీద- 2024- 195 రన్స్(నాటౌట్) 3. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా)- బంగ్లాదేశ్ మీద- 2011- 185 రన్స్(నాటౌట్) 4. మహేంద్ర సింగ్ ధోని(ఇండియా)- శ్రీలంక మీద- 2005- 183 రన్స్(నాటౌట్) 5. విరాట్ కోహ్లి(ఇండియా)- పాకిస్తాన్ మీద- 2012- 183 రన్స్. చదవండి: ‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి -
‘తప్పించమని నేనే అడిగా’
ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా విరామం అవసరమని తాను భావించానని...అందుకే తుది జట్టు నుంచి తనను తప్పించాలని తానే కోరినట్లు ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివరణ ఇచ్చాడు. ముంబైతో మ్యాచ్‌లో వేలికి గాయం కాగా, అదే కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను ఆడించలేదని వినిపించగా... అదేమీ కారణం కాదని అతనే చెప్పాడు. ‘నేను తీసుకుంది సులువైన నిర్ణయం. కెప్టెన్, కోచ్‌ల వద్దకు వెళ్లి నా స్థానంలో మరొకరిని ప్రయత్నించేందుకు ఇది సరైన సమయమని చెప్పా. ప్రస్తుతం నాకు శారీరకంగా, మానసికంగా విరామం తప్పనిసరి అనిపించింది. అన్ని విధాలా కోలుకున్న తర్వాత మళ్లీ వచ్చి మెరుగైన ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా’ అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 5.33 సగటుతో 32 పరుగులే చేశాడు. ఇందులో 3 సార్లు డకౌట్ కాగా, ఒక్కటే మ్యాచ్‌లో ఐదుకంటే ఎక్కువ బంతులు ఆడాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో రెండు సార్లు క్యాచ్ జారవిడిస్తే 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. -
ఐపీఎల్ నుంచి తప్పుకున్న మ్యాక్స్‌వెల్
ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. శారీరక, మానసిక అలసట కారణంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు మ్యాక్సీ ప్రకటించాడు. విరామం ఎన్ని రోజుల అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మ్యాక్స్‌వెల్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. పేలవమైన ఫామ్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన మాక్స్వెల్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. తనను సన్‌రైజర్స్ మ్యాచ్ నుంచి తప్పించమని మ్యాక్స్‌వెల్ స్వయంగా ఆర్సీబీ యాజమాన్యాన్ని కోరాడు. తన స్థానంలో మరో ఆటగాడిని తీసుకోమని మ్యాక్సీ కెప్టెన్ డుప్లెసిస్‌కు విజ్ఞప్తి చేశాడు. అందుకే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ స్థానంలో విల్ జాక్స్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మ్యాక్సీ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులు (0, 3, 28, 0, 1, 0) మాత్రమే చేసిన విషయం తెలిసిందే. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. మ్యాక్సీ సహా ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మొత్తం (విరాట్ మినహా) దారుణంగా విఫలం కావడంతో ఈ సీజన్లో ఆర్సీబీ 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గత సీజన్లలో మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరఫున చేసిన స్కోర్లు.. 2021 సీజన్- 513 పరుగులు 2022 సీజన్- 301 పరుగులు 2023 సీజన్- 400 పరుగులు సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. పోరాడితే పోయేదేమీ లేదన్న చందంగా ఆర్సీబీ పోరాటం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాడింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడటం ఇష్టం: కోహ్లి
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కథ మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ క్రమంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొందడం ఆర్సీబీకి అనివార్యంగా మారింది. విజయాల బాట పడితే గానీ ఈ సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్ వరకైనా చేరుకునే అవకాశం ఉంటుంది. లేదంటే.. ‘‘వచ్చేసారి కప్ మనది’’ అంటూ ఆ జట్టు అభిమానులు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 📍 Bengaluru Royal Challengers Bengaluru ❤️ take on the Sunrisers Hyderabad 🧡 at the Chinnaswamy Stadium! Another thriller on the cards tonight? Find out 🔜#TATAIPL | #RCBvSRH | @RCBTweets | @SunRisers pic.twitter.com/WTRR28gGGs — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఇప్పటికే ఐదింట మూడు విజయాలతో సన్‌రైజర్స్ జోరు మీద ఉండగా.. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగనుండటం ఆర్సీబీకి సానుకూలాంశం. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో కోహ్లి ఆరు మ్యాచ్‌లలో కలిపి 319 పరుగులు చేశాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు. కోహ్లి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113*) కూడా ఉండటం విశేషం. అయితే, టాపార్డర్‌లో ఓపెనర్ కోహ్లి ఒక్కడే రాణిస్తుండగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విఫలం కావడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇక విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా పేరొందిన గ్లెన్ మాక్స్వెల్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇలా KGFలో కేవలం K మాత్రమే రాణిస్తుండగా.. మిలిగిన ఇద్దరు జట్టుకు పెద్దగా ఉపయోగపడకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు KGF త్రయం చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా మాక్సీ.. విరాట్ కోహ్లిని ఉద్దేశించి.. ‘‘ప్రత్యర్థి బౌలర్లలో ఎవరి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం అంటే నీకు బాగా ఇష్టం’’ అని అడిగాడు. ఇందుకు బదులిస్తూ ఒక్కసారిగా పెద్దగా నవ్వేసిన కోహ్లి.. ముందుగా మాక్స్వెల్(స్పిన్) పేరు, ఆ తర్వాత ఆస్ట్రేలియాకే చెందిన జేమ్స్ ఫాల్కనర్(పేసర్) పేరును కూడా చెప్పాడు. ఇక మూడో బౌలర్‌గా కగిసో రబడ(సౌతాఫ్రికా పేసర్) పేరు చెప్పిన కోహ్లి.. అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం చాలెంజింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక మాక్స్వెల్ తాను తరచుగా ఉపయోగించే మూడు హిందీ పదాలు ఇవేనంటూ.. ‘‘ఠీకై(మంచిది), షుక్రియా, చలో చలో’’ అని పేర్కొన్నాడు. చదవండి: BCCI: ఇకపై అలా చేస్తే భారీ జరిమానా.. ఐపీఎల్ జట్లకు వార్నింగ్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస ఓటమలు ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో అట్టడుగు (తొమ్మిది) స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు గాయమైనట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ ఎడమ చేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. ఆర్సీబీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (సన్‌రైజర్స్‌తో) మ్యాక్స్‌వెల్ ఆడటం అనుమానమేనని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. మ్యాక్స్‌వెల్ లేకపోతే వరుస ఓటమలు ఎదుర్కొంటున్న ఆర్సీబీ కష్టాలు మరింత ఎక్కువవుతాయి. ఈ సీజన్లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక విజయం సాధించింది. ఆర్సీబీ తరఫున విరాట్ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. జట్టులో మిగతా బ్యాట్లంతా కలిపి విరాట్ చేసినన్ని పరుగులు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దమవుతుంది. ఆర్సీబీ బౌలింగ్ టీమ్ విషయానికొస్తే.. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త బౌలింగ్ టీమ్‌గా కనిపిస్తుంది. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. 𝗜𝗺𝗮𝗴𝗲𝘀 𝘁𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗰𝗮𝗻 𝗵𝗲𝗮𝗿 x IPL👂📸: BCCI/IPL pic.twitter.com/YnNghTPWER— CricTracker (@Cricketracker) April 11, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు. -
కోహ్లిని టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకూడదు: మాక్స్వెల్
ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 316 పరుగులతో ఈ లీగ్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి అతడి స్ట్రైక్ రేట్‌పై మాత్రం చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కోహ్లి చాలా స్లోగా ఆడుతున్నాడని, టీ20 వరల్డ్‌కప్-2024కు అతడి స్ధానంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని కొంతమంది మాజీలు సూచిస్తున్నారు. మరి కొంత మంది విరాట్ లాంటి ఆటగాడు కచ్చితంగా వరల్డ్‌కప్ జట్టులో ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విరాట్‌ను వరల్డ్‌కప్‌కు భారత సెలక్టర్లు ఎంపిక చేయకూడదని మాక్సీ అభిప్రాయపడ్డాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన అత్యుతమ క్రికెటర్ విరాట్ కోహ్లి. విరాట్ చాలా డెంజరస్ ఆటగాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో మొహాలీలో మాపై అతను ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ ఇన్నింగ్స్ ఎప్పటికి అతడి కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. మ్యాచ్ గెలవడానికి తాను ఏమి చేయాలన్న విషయంపై ఫుల్ క్లారిటితో విరాట్ ఉంటాడు. టీ20 వరల్డ్‌కప్‌కు భారత సెలక్టర్లు కోహ్లిని ఎంపిక చేయకూడదని ఆశిస్తున్నాడు. ఎందుకంటే అతడి లేకపోతే మా జట్టుకు చాలా ప్రయోజనం చేకురుతుందని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్సీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో విరాట్,మాక్స్వెల్ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్‌తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్‌గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్‌లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్‌ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. చెత్తగా ఆడతాడు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని.. కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ మాక్సీ నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(20), ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్(24) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాపార్డర్ విఫలం కాగా.. బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్ బ్యాటర్ మాక్సీ చేతులెత్తేశాడు. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 లక్నో యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహిపాల్ లామ్రోర్(13 బంతుల్లో 33) కాసేపు పోరాడినా ఆర్సీబీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారి క్రిక్‌బజ్ షోలో మాక్స్వెల్ గురించి మాట్లాడాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు ‘‘ఆర్సీబీ గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకుంది. సరైన సమయానికి జీతం తీసుకుంటాడు. కానీ అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు అన్నట్లుగా ఉంది అతడి పరిస్థితి. ఆటగాడిగా అతడికి అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? ఐపీఎల్లో అతడి ట్రాక్ రికార్డు చూసినట్లయితే,, పంజాబ్ ఫ్రాంఛైజీకి ఆడినపుడు కూడా ఇలాగే ఉండేవాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడు. అతడి ఆటలో నిలకడలేదు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిది’’ అని మాజీ బ్యాటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 కోసం ఆర్సీబీ రూ. 11 కోట్లకు మాక్సీని రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ తరఫున గత సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 400 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడికి ఏకంగా 17 కోట్లు ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ నుంచి భారీ ధర(రూ. 17.5 కోట్లు)కు ట్రేడ్ చేసుకున్న కామెరాన్ గ్రీన్ కూడా ఆర్సీబీకి పెద్దగా ఉపయోగపడటం లేదని మనోజ్ తివారి పేర్కొన్నాడు. ఏదేమైనా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ జట్టుతో లేనిలోటు ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. ఆర్సీబీ వర్సెస్ లక్నో స్కోర్లు: టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ లక్నో స్కోరు: 181/5 (20) ఆర్సీబీ స్కోరు: 153 (19.4) ఫలితం: 28 పరుగుల తేడాతో ఆర్సీబీపై లక్నో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మయాంక్ యాదవ్(లక్నో- 3/14). చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తప్పతాగి ఆసుపత్రిపాలైన ఘటనపై స్పందించిన మ్యాక్స్‌వెల్
తప్ప తాగి ఆసుపత్రిపాలైన ఘటనపై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్పందించాడు. తన కెరీర్లో అదో చీకటి అధ్యాయమని అన్నాడు. అలా జరిగినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు. ఆ దురదృష్టకర ఘటన తనకంటే ఎక్కువగా తన ఇంట్లోని వాళ్లను ప్రభావితం చేసిందని పశ్చాత్తాపపడ్డాడు. గడ్డు పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నవారంతా మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. తన పరిస్థితి అర్ధం చేసుకుని అండగా నిలిచిన ఆసీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. చుట్టూ ఉన్న వారందరి సహకారం వల్లే త్వరగా కోలుకుని, తిరిగి మైదానంలో అడుగుపెట్టానని తెలిపాడు. విండీస్‌పై సుడిగాలి శతకం (55 బంతుల్లో 120 నాటౌట్; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) బాదిన అనంతరం మ్యాక్స్‌వెల్ పై విధంగా స్పందించాడు. కాగా, మ్యాక్స్‌వెల్ గత నెలలో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ హోస్ట్ చేసిన సంగీత కచేరీకి హాజరై తప్ప తాగి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అనంతరం మ్యాక్సీని ఆసుపత్రికి తరలించారు. మ్యాక్సీకి తప్పతాగి వార్తల్లోకి ఎక్కడం ఇది కొత్తేమీ కాదు. 2022లో స్నేహితుడి బర్త్‌డే పార్టీలో తప్పతాగి కాలు విరుగగొట్టుకున్నాడు. మ్యాక్సీకి సంబంధించి బయటపడని ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని అంటుంటారు. ఇదిలా ఉంటే, తాజా ఘటన అనంతరం వేగంగా కోలుకున్న మ్యాక్స్‌వెల్.. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20 మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సుడిగాలి శతకం బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించడమే కాకుండా రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 శతకాల రికార్డును (5) సమం చేశాడు. -
మ్యాక్స్‌వెల్ మెరుపు శతకం.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ విధ్వంకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హొల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (63) అర్దసెంచరీతో రాణించగా.. ఆండ్రీ రసెల్ (37), జేసన్ హోల్డర్ (28 నాటౌట్), జాన్సన్ చార్లెస్ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అందరూ తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లతో చెలరేగగా.. హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్, జంపా తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 13న జరుగనుంది. -
సుడిగాలి శతకం.. మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ శతకం మ్యాక్సీకి టీ20ల్లో ఐదవది. పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని సెంచరీలు చేశాడు. మ్యాక్సీ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ధాటిగానే ఆడుతున్నప్పటికీ ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (5), జాన్సన్ చార్లెస్ (24), పూరన్ (18), హోప్ (0), రూథర్‌ఫోర్డ్ (0) ఔట్ కాగా.. రోవ్‌మన్ పావెల్ (13), రసెల్ (30) క్రీజ్‌లో ఉన్నారు. 13 బంతుల్లోనే 30 పరుగులు చేసిన రసెల్ మాంచి ఊపుమీదున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్, స్పెన్సర్ జాన్సన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారంతా ఒకవైపు.. మ్యాక్స్‌వెల్ ఒక్కడే ఒకవైపు టీ20ల్లో ఐదో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంతా కలిసి సాధించినన్ని సెంచరీలను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా చేశాడు. టీ20ల్లో ఆసీస్ క్రికెటర్లంతా కలిపి ఐదు శతకాలు చేయగా.. మ్యాక్సీ ఒక్కడే ఐదేశాడు. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్‌వెల్ తర్వాత ఆరోన్ ఫించ్ అత్యధికంగా రెండు సెంచరీలు చేయగా.. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, జోష్ ఇంగ్లిస్ తలో సెంచరీ బాదారు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున మొత్తం 95 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించగా.. కేవలం కేవలం ఐదుగురు మాత్రమే సెంచరీలు చేశారు. మిగతా నలుగురు చేసిన సెంచరీలను మ్యాక్సీ ఒక్కడే చేయడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్‌వెల్ చేసిన సెంచరీలు.. - 145 (65)vs శ్రీలంక - 120(55) vs వెస్టిండీస్ - 113(55) vs ఇండియా - 104(48) vs ఇండియా - 103(58) vs ఇంగ్లండ్ -
మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు. మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్‌వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm — Johns. (@CricCrazyJohns) February 11, 2024 వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది. -
పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్..
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గ్లెన్ మాక్స్వెల్ ఓ వివాదంలో చికుకున్నాడు. జనవరి 19న ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండానే మాక్స్వెల్ పాల్గోనున్నాడు. అంతేకాకుండా ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు. పీకల దాగా తాగిన మాక్స్వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన ఆసీస్ జట్టులో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. విండీస్‌తో టీ20ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారు. అంతే తప్ప అతడిని జట్టు నుంచి తప్పించడానికి పబ్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు మాక్స్వెల్ కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో మెల్బోర్న్ కెప్టెన్సీ నుంచి మాక్సీ తప్పుకున్నాడు. చదవండి: SA20 2024: జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే.. కట్‌చేస్తే.. 52 పరుగులకే ఆలౌట్! -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం?
BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మాక్సీ మెల్బోర్న్ స్టార్స్ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్బోర్న్ రెనెగేడ్స్.. తర్వాత సిడ్నీ సిక్సర్స్ చేతిలో మెల్బోర్న్ స్టార్స్ ఓడిపోయింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్.. బీబీఎల్ 12 సీజన్లో కెప్టెన్ మాక్స్వెల్ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు. ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన మెల్బోర్న్ స్టార్స్.. తర్వాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్బోర్న్ స్టార్స్. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్వెల్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగిన గ్లెన్ మాక్స్వెల్.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి. కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
కొత్త రకం షాట్‌ను పరిచయం చేసిన మ్యాక్స్‌వెల్
ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ టోర్నీ ఏదైనా తనదైన మార్కు షాట్లతో విరుచుకుపడటం సహజం. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లోనూ అతను అలాంటి ఓ వినూత్న షాట్‌నే ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. స్కూప్ షాట్‌ను రివర్స్‌లో ఉండే ఈ షాట్ ఆడి మ్యాక్సీ బౌండరీ సాధించాడు. ఈ షాట్‌ను చూసి అతని అభిమానులు మ్యాడ్ మ్యాక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్లో ఇదో కొత్త రకం షాట్ అంటూ కితాబునిస్తున్నారు. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ వెరైటీ షాట్‌ను ఆడాడు. Glenn Maxwell inventing new shots in cricket. - The Mad Maxi. 💪💥pic.twitter.com/lTZcdWCA1n — Johns. (@CricCrazyJohns) January 2, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 7 వికెట్ల నష్టానికి 97 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఛేదనలో మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో మెల్బోర్న్ స్టార్స్ మరో 11 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు థామస్ రోజర్స్ (46 నాటౌట్) రాణించాడు. స్టార్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ లారెన్స్ (7), వెబ్‌స్టర్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, పీటర్ సిడిల్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు డికాక్ (23), జేక్ ఫ్రేసర్ (14), మెకెంజీ (18), రోజర్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయడంతో రెనెగేడ్స్ అతికష్టం మీద 97 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రాణించిన మ్యాక్సీ బంతితోనూ (3-0-8-1) సత్తా చాటాడు. స్టార్స్ బౌలర్లలో డేనియల్ లారెన్స్ 2, జోయెల్ పారిస్, ఇమాద్ వసీం, స్టీకిటీ, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్లో మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. -
స్టోయినిస్ ఊచకోత.. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్బోర్న్ న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. క్రిస్ లిన్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్బోర్న్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లతో రాణించాడు. Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్‌స్టర్, స్టోయినిస్.. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. -
ఆరంభం.. ముగింపు ఒకేలా! సౌతాఫ్రికా, టీమిండియాకు కన్నీళ్లు
Rewind: 2023... ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన రెండు జట్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడేసి.. సొంతగడ్డపై అభిమానుల మధ్య కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. వీటితో పాటు ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో చోటు చేసుకున్న ప్రధాన ఘట్టాల గురించి తెలుసుకుందాం!! 1. ఆస్ట్రేలియా ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా వేదికగా ఈ ఏడాది ఆరంభంలో మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ జరిగింది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొమ్మిదవ ఎడిషన్‌లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఓటమితో టోర్నీని ఆరంభించినా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది. బెత్ మూనీ అర్ద శతకం(53)కు తోడు బౌలర్లు రాణించడంతో 19 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. కేప్‌టౌన్ వేదికగా ట్రోఫీ గెలుపొంది.. ఏకంగా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 2. డబ్ల్యూపీఎల్ ఆరంభం భారత మహిళా క్రికెట్లో సువర్ణాధ్యాయానికి 2023లో నాంది పలికింది బీసీసీఐ. టీ20 లీగ్ ఫార్మాట్లో వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మహిళా క్రికెటర్లను ఒక్క చోట చేర్చి ఐదు జట్లుగా విభజించి పోటీని నిర్వహించింది. ఐపీఎల్ మాదిరి వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేసే అవకాశం ఫ్రాంఛైజీలకు ఇచ్చింది. ఇక ఈ చరిత్రాత్మక ఈవెంట్లో మొట్టమొదటి టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు.. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీని ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 3. ఆసియా కప్ విజేతగా టీమిండియా ఆసియా వన్డే కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా నిర్ణయించింది. ఇక ఈ టోర్నలో పాకిస్తాన్ సూపర్-4 దశలోనే నిష్క్రమించగా.. టీమిండియా- శ్రీలంక ఫైనల్ చేరాయి. తుదిపోరులో రోహిత్ శర్మ సేన లంకను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సంచలన విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. 4. జనాలు లేని వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభ మ్యాచ్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ జరిగింది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. అయితే, క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో వరల్డ్‌కప్ ఆరంభం పేలవంగా జరిగింది. ఎలాంటి హడావుడి, పెద్దగా ప్రేక్షకులు లేకుండానే తొలి మ్యాచ్ జరిగిపోయింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. 5. పసికూనలుగా వచ్చి.. సెమీస్ రేసులో నిలిచి వన్డే వరల్డ్‌కప్-2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా అడుగుపెట్టిన జట్టు అఫ్గనిస్తాన్. ఆరంభ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన అఫ్గన్.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహంలా చెలరేగింది. వరుసగా ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను ఓడించి చరిత్రాత్మక విజయాలతో సెమీస్ రేసులో తానూ ఉన్నాననే సంకేతాలు పంపింది. టాపార్డర్‌లో యువ బ్యాటర్లు రాణించడం, రషీద్ ఖాన్ నాయకత్వంలోని స్పిన్ దళ రాణించడం అఫ్గన్‌కు కలిసివచ్చింది. సెమీస్ చేరకపోయినా అద్భుత ప్రదర్శనలతో ఈసారి వరల్డ్‌కప్‌లో అఫ్గనిస్తాన్ తమదైన ముద్ర వేయగలిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కంటే మెరుగ్గా రాణించి మధుర జ్ఞాపకాలు మిగిల్చుకుంది. 6. ఒలింపిక్స్‌లో క్రికెట్ విశ్వక్రీడల్లో బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల దూకుడు చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల త్వరలోనే నెరవేరనుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ఈ ఏడాది ఆమోదం తెలిపింది. కాగా 1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. అయితే, ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇక లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్లో పురుష, మహిళా జట్లు బరిలోకి దిగనున్నాయి. 7. మాక్సీ మాగ్జిమమ్ ఇన్నింగ్స్ వన్డే వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. తన చేతిలో ఏదో మంత్రదండం ఉందా అన్న అనుమానం కలిగేలా షాట్ల మీద షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కండరాలు పట్టేయడంతో కదల్లేక క్రీజులో నిలబడిపోయినా మాక్సీ పట్టువీడక నభూతో అన్న చందంగా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ కమిన్స్ సహకారం అందిస్తుండగా.. 201 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 8. రికార్డుల రారాజు కిరీటంలో అరుదైన కలికితురాయి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదుతూ.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ శతకాల రికార్డుకు ఎసరుపెట్టిన కోహ్లి.. వన్డేల్లో అతడిని అధిగమించాడు. వన్డే ప్రపంచకప్-2023లో తన పుట్టినరోజు(నవంబరు 5) నాటి మ్యాచ్‌లో సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. న్యూజిలాండ్‌తో సెమీస్ సందర్భంగా అతడి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేశాడు. 9. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరంభంలో తడబడ్డా.. తమకే సాధ్యమైన రీతిలో పుంజుకుని ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌లో లక్ష మందికి పైగా టీమిండియా అభిమానుల ప్రత్యక్షంగా చూస్తుండగా.. రోహిత్ శర్మ సేనను ఓడించి ఆరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ట్రవిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చి వరల్డ్‌కప్ హీరోల జాబితాలో తన పేరునూ లిఖించుకున్నాడు. 10. ఆస్ట్రేలియాపై భారత్ తొలి టెస్టు గెలుపు భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జయకేతనం ఎగురవేసింది హర్మన్‌ప్రీత్ బృందం. ఇక ఇంతవరకు ఇరు జట్ల మధ్య పదకొండు టెస్టులు జరుగగా.. నాలుగు ఆసీస్ గెలవగా.. ఒకటి భారత్ సొంతమైంది. ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. -
దీపక్ హుడా సంచలన ఇన్నింగ్స్.. రికార్డులివే! మాక్స్‌వెల్‌తో పాటు..
Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు. లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్‌గా తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున లిస్ట్- ఏ క్రికెట్లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అదే విధంగా.. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(220), రవికుమార్ సమర్థ్(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్ హుడా చరిత్రకెక్కాడు. మాక్స్‌వెల్‌తో పాటు ఆ జాబితాలో అంతేగాక.. లిస్ట్-ఏ చరిత్రలో ఛేజింగ్‌లో నంబర్ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్‌గా దీపక్ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెప్ మాక్స్వెల్(201*), అఫ్గనిస్తాన్ బ్యాటర్ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్‌కు చెందిన రకీబుల్ హసన్(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్ అమీతుమీ కాగా దీపక్ హుడా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రాజస్తాన్ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపక్ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాజస్తాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్ లాంబా (73 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి దీపక్ నాలుగో వికెట్‌కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్ తలపడుతుంది. 1⃣5⃣0⃣ up for Deepak Hooda 👏👏 He brings it up off just 108 balls. He's played some fabulous shots. 👌👌 Follow the match ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/8qJ53nLmA6 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏👏 A special partnership of 255 between Deepak Hooda (180) & Karan Lamba (73*) helps Rajasthan chase down 283 after being reduced to 23/3 👌 Scorecard ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/CQEIGoErM9 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 -
వరల్డ్‌కప్ హీరోకే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు
2023 నవంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును వరల్డ్‌కప్ హీరో, ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ దక్కించుకోగా.. మహిళల విభాగంలో బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ నహీద అక్తర్ ఈ అవార్డును గెలుచుకుంది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ట్రవిస్ హెడ్, మొహమ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య తీవ్రపోటీ జరిగినప్పటికీ.. అంతింమంగా హెడ్నే అవార్డు వరించింది. వరల్డ్‌కప్ సెమీస్‌లో (2 వికెట్లు, 62 పరుగులు), ఫైనల్లో (రోహిత్ శర్మ క్యాచ్‌తో పాటు 137 పరుగులు) అద్భుత ప్రదర్శనల కారణంగా మెజార్టీ శాతం ఓట్లు హెడ్కే దక్కాయి. 29 ఏళ్ల హెడ్‌కు ఇది తొలి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కాగా.. ఆసీస్ తరఫున వార్నర్ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న ఆటగాడు హెడే కావడం మరో విశేషం. మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం బంగ్లాదేశ్ యువ క్రికెటర్ నహీద అక్తర్.. సహచర క్రికెటర్ ఫర్జానా హాక్, పాక్ స్పిన్నర్ సైదా ఇక్బాల్ నుంచి పోటీ ఎదుర్కొంది. అయితే నవంబర్ నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు (14.14 సగటున 7 వికెట్లు) గానూ నహీద ఈ అవార్డును ఎగరేసుకుపోయింది. విండీస్‌తో సిరీస్‌లో నహీద ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి బంగ్లాదేశీ మహిళా క్రికెటర్ నహీదానే కావడం విశేషం. -
ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు రేసులో మహ్మద్ షమీ..
నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో వన్డే వరల్డ్‌కప్-2023 హీరోలు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నారు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వీరిముగ్గురు దుమ్మురేపారు. మహ్మద్ షమీ.. వన్డే ప్రపంచకప్ టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా షమీ నిలిచాడు. ఈ మెగా టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు ఐసీసీ నామినేట్ చేసింది. ట్రావిస్ హెడ్.. ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో ట్రావిస్ హెడ్‌ది కీలక పాత్ర. భారత్‌తో జరిగిన ఫైనల్లో హెడ్ 137 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హెడ్.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్వెల్.. వన్డే వరల్డ్‌కప్‌తో పాటు టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో మాక్స్వెల్ దుమ్మురేపాడు. ప్రపంచకప్ టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర డబుల్ సెంచరీతో మాక్సీ చెలరేగాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను ఒంటి చేత్తో మాక్సీ గెలిపించాడు. అదే విధంగా గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. చదవండి: T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌కు కోహ్లి దూరం.. విధ్వంసకర ఆటగాడికి ఛాన్స్!? -
IPL 2024: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త చెప్పిన మ్యాక్స్‌వెల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుభవార్త చెప్పాడు. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఐపీఎల్ ఆడతానని ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌ను 'ఇక నడవలేను' అనుకునే వరకు ఆడతానని తెలిపాడు. తన జీవితంలో ఐపీఎలే తన చివరి క్రికెట్ టోర్నీ అవుతుందని అన్నాడు. తన కెరీర్‌కు ఐపీఎల్ ఎంతో మేలు చేసిందని.. ఐపీఎల్లో తాను కలిసిన ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని.. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ లాంటి ఆటగాళ్లతో భుజాలు రాసుకుంటూ గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్లో దీర్ఘకాలంపాటు కొనసాగుతానని మ్యాక్సీ చెప్పకనే చెప్పడంతో ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్సీపై గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఈ విధ్వంసకర ఆటగాడు ఈసారి ఎలాగైనా ఆర్సీబీకి టైటిల్ అందిస్తాడని నమ్మకంగా ఉన్నారు. మ్యాక్సీ ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీ అతన్ని దూరం చేసుకోదని గట్టిగా నమ్ముతున్న అభిమానులు.. కోహ్లితో ఉన్న సాన్నిహిత్యం అతన్ని ఆర్సీబీకి దూరం చేయదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను మదిలో పెట్టుకునే ఆర్సీబీ అభిమానులు ప్రస్తుత మ్యాక్సీ స్టేట్మెంట్ విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్‌తో మ్యాక్స్‌వెల్‌కు పదేళ్లకు పైగా అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. 2012 సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మొదలైన అతని ప్రస్తానం.. ఆతర్వాత ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీలతో విజయవంతంగా సాగింది. ఈ ఆసీస్ విధ్వంసకర ఆటగాడు కోహ్లి ప్రత్యేక చొరవతో 2021 సీజన్లో ఆర్సీబీతో జతకట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ మ్యాక్సీకి 14.25 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లిస్తుంది. గత సీజన్లో అతను 183.49 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. మ్యాక్స్‌వెల్ ఇటీవలి భారత పర్యటనలోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో (వరల్డ్‌కప్‌లో 2, టీ20 సిరీస్‌లో ఒకటి) విరుచుకుపడ్డాడు. -
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు..!
-
IND VS AUS 3rd T20: 35 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్ ఆతర్వాత గేర్ మార్చి చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రుతు.. ఆతర్వాతి 35 బంతుల్లో ఏకంగా 101 పరుగులు బాదాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రుతురాజ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఓవర్లో అతను సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయడంతో పాటు మరో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్ భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ చేసిన స్కోర్ (123 నాటౌట్) భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు శుభ్‌మన్ గిల్ (126 నాటౌట్) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆసీస్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. -
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాగేసుకుపోతాడు..!
ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో విరుచుకుపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లోనే శతక్కొట్టిన (9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106) మ్యాక్సీ.. అదే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తాజాగా భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ ఇంచుమించు అలాంటి మెరుపు ఇన్నింగ్సే ఆడిన మ్యాక్సీ.. ఈ మ్యాచ్‌లోనూ తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి ఛేజింగ్‌లో కింగ్ అనిపించుకున్నాడు. మ్యాక్సీ గత 21 రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ఫార్మాట్లలో ఛేజింగ్ చేస్తూ రెండు చిరస్మరణీయ సెంచరీలు సాధించాడు. దీంతో సోషల్‌మీడియా మొత్తం అతని నామస్మరణతో మార్మోగిపోతుంది. వీడెక్కడి మనిషి రా బాబూ.. టోర్నడోలా వచ్చి అమాంతం మ్యాచ్‌ను ఎగరేసుకుపోతాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ గెలవడం కష్టం అనుకున్న ప్రతిసారి మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను లగేసుకుంటున్న వైనాన్ని కొనియాడుతూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మ్యాక్స్‌వెల్‌ను మించినోడు లేడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పొట్టి క్రికెట్లో ఇతనికి మించిన ఫినిషన్ లేడు, రాబోడని కితాబునిస్తున్నారు. -
అతడు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.. ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు: సూర్యకుమార్
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడి ఆసీస్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం ప్రదర్శించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేయాలనుకున్న మా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అతడు మాపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మంచులో 220 స్కోర్‌ను డిఫెండ్ చేయాలంటే, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఈ విషయంలో కూడా మా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి నుంచే గేమ్‌లో ఉండింది. ఆఖర్లో వారు మాపై పైచేయి సాధించారు. అక్షర్ అనుభవజ్ఞుడైన బౌలర్. మంచు అధికంగా కురుస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్ స్పిన్నర్ అయినా పేసర్ అయినా ఫలితం ఒకేలా ఉంటుంది. అందుకే 19వ ఓవర్ అక్షర్‌కు ఇచ్చా. ఇది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఓడినప్పటికీ అబ్బాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉందని అన్నాడు. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్‌వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్‌లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్ ఇదివరకే భారత్‌కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్‌లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్‌కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్‌తో టీ20 సిరీస్‌కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
టాస్ ఓడిన టీమిండియా.. ఆసీస్ విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే!
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడటం సంతోషంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సెమీస్‌లో సత్తా చాటిందన్న ఈ మాజీ ఓపెనర్.. పడిలేచిన కెరటంలా ఆస్ట్రేలియా తుదిమెట్టుకు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు ఈ రెండు జట్లు వందకు వందశాతం అర్హత కలిగినవే అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్ సేనను హెచ్చరించాడు. పట్టువదలని విక్రమార్కుల్లా ఆఖరి వరకు పోరాడే ఆటగాళ్లున్న ఆస్ట్రేలియాతో పోటీ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్-2023 టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కంగారూ జట్టుతో పోటీకి సిద్ధమైంది. కాగా ఆరంభ మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించింది. ముఖ్యంగా అఫ్గనిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో.. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో.. అనూహ్య విజయం అందించాడు. ఇక సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో ఇలా ఎవరో ఒకరు అద్భుత ఆట తీరుతో గట్టెక్కించి ఆస్ట్రేలియాను ఇక్కడి దాకా తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆసీస్.. ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఇండియా టుడే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. కానీ ఆస్ట్రేలియన్లు అంత తేలికగ్గా తలవంచేవాళ్లు రకం కాదు. గ్లెన్ మాక్స్వెల్ ఆరోజు ఎలా ఆడాడో చూశాం కదా! ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించుకున్నాడు. దేశం కోసం గెలవాలన్న కసి వారిలో ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించాడు. కాబట్టి ఆసీస్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
CWC 2023- Ind vs NZ- Rohit Sharma Record: వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యధిక సిక్సర్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబై వేదికగా టీమిండియా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. వాంఖడేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. కివీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్ నాలుగో బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బౌండరీ బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మూడో ఓవర్ మూడో బంతికి సిక్సర్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు బాదాడు. దీంతో ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 27కు చేరుకుంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌ను వెనక్కి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌లో మ్యాచ్‌లో.. మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించిన హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌కు.. తొమ్మిదో ఓవర్ రెండో బంతి వద్ద తెరపడింది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు ►27 - రోహిత్ శర్మ (2023) ►26 - క్రిస్ గేల్ (2015) ►22 - ఇయాన్ మోర్గాన్ (2019) ►22 - గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2023) ►21 - ఏబి డివిలియర్స్ (2015) ►21 - క్వింటన్ డికాక్ (2023) చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, గెలుపు మనదే? View this post on Instagram A post shared by ICC (@icc) -
అదంతా చూస్తూ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు: గంగూలీ
ICC WC 2023: వన్డే ప్రపంచకప-2023లో అఫ్గనిస్తాన్ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాని రీతిలో సెమీస్ రేసులో నిలిచి మేటి జట్లకు సవాల్ విసిరింది. స్పిన్ మాత్రమే అఫ్గన్ బలం అనుకున్న వాళ్లకు బ్యాటింగ్‌లోనూ తాము తక్కువేం కాదంటూ యువ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది నిరూపించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జద్రాన్ అఫ్గన్ తరఫున వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. లీగ్ దశలో ఆడిన మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగింట జట్టును గెలిపించి హష్మతుల్లా సైతం సారథిగా తన ముద్ర వేయగలిగాడు. అయితే, అఫ్గన్ విజయాల వెనుక టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పాత్ర కీలకం అన్న విషయం తెలిసిందే. మెంటార్‌గా జట్టుకు మార్గదర్శనం చేసి ఈస్థాయిలో నిలిపిన ఘనత అతడి దక్కుతుంది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2023లో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించిన అఫ్గనిస్తాన్.. ఐదుసార్లు జగజ్జేత అయిన ఆస్ట్రేలియాను కూడా ఓడించేలా కనిపించింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా 291 పరుగులు సాధించిన హష్మతుల్లా బృందం.. ఆరంభంలోనే వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలో అజయ్ జడేజాతో పాటు అఫ్గనిస్తాన్ శిబిరం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్‌రూంలో కదలికల వల్ల సైట్స్క్రీన్ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కంప్లైంట్ చేశాడు. దీంతో అతడిని కవ్వించేలా జడేజా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాక్సీ వచ్చాక సీన్ రివర్స్ కానీ గ్లెన్ మాక్స్వెల్ రాకతో సీన్ మారిపోయింది. అప్పటిదాకా అఫ్గనిస్తాన్ చేతిలో ఉందనుకున్న మ్యాచ్ చేజారిపోయింది. మిస్‌ఫీల్డ్, క్యాచ్డ్రాప్ల మూలంగా మాక్సీకి లైఫ్ దొరకగా.. అతడు ఏకండా అజేయ ద్విశతకం బాదాడు. అఫ్గన్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అనూహ్య రీతిలో విజయం అందించి సెమీస్ చేర్చాడు. జడేజా ఏడ్చే ఉంటాడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాక్స్వెల్ క్రీజులో పాతుకుపోయినపుడు అఫ్గనిస్తాన్ బౌలర్లు ఎక్కువగా స్ట్రెయిట్ బౌలింగే చేశారు. అప్పటికే అతడు గాయపడ్డాడు అయినా కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఇచ్చారు. ఇదంతా చూస్తూ అజయ్ జడేజా కచ్చితంగా ఏడ్చే ఉంటాడు. మాక్సీ నిలబడి ఉన్నచోటే బౌండరీలు, సిక్సర్లు బాదాడు. అసలు మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలని ఏమాత్రం ప్రయత్నం చేసినట్లుగా అనిపించలేదు. ఏదేమైనా వన్డేల్లో ఇది అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌గా మిగిలిపోతుంది’’ అని కోల్‌కతా టీవీతో ముచ్చటిస్తూ గంగూలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాదేశ్‌తో ఆసీస్ మ్యాచ్.. అందుకే వాళ్లిద్దరికి రెస్ట్..
CWC 2023- Australia vs Bangladesh: వన్డే వరల్డ్‌కప్-2023 లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా.. తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కంగారూ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. అందుకే వాళ్లిద్దరికి రెస్ట్ ‘‘పొద్దు పొద్దున్నే బౌలింగ్ చేయడం మాకు అనుకూలిస్తుందనుకుంటున్నాం. బంతి బాగా స్వింగ్ అవుతుంది. కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నాం. తుదిజట్టులో రెండు మార్పులు చేశాం. మాక్స్వెల్, స్టార్క్‌లకు విశ్రాంతినిచ్చాం. సెమీస్‌లో వారిద్దరి పాత్ర కీలకం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. స్మిత్, అబాట్ జట్టులోకివచ్చారు. అబాట్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇప్పటి వరకు మేము మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేదు. ఈ మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో రాణించాలనుకుంటున్నాం’’ అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అజేయ డబుల్ సెంచరీతో సెమీస్ చేర్చి అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించి.. సెమీస్ చేర్చాడు. అంతకు ముందు తలకు తగిలిన గాయం కారణంగా జట్టుకు దూరమైన మాక్సీ.. క్రీజులో కదల్లేని స్థితిలో ఉన్నా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వహ్వా అనిపించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో అతడికి రెస్ట్ ఇచ్చింది యాజమాన్యం. ఇక అనారోగ్య సమస్యలతో అఫ్గన్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు. మరోవైపు.. ప్రపంచకప్-2023లో అన్నింటికంటే ముందే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్.. తమ ఆఖరి మ్యాచ్‌లో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో నజ్ముల్ హుసేన్ షాంటో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తుదిజట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్‌వుడ్. బంగ్లాదేశ్ తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. చదవండి: CWC 2023- Semis: ఏమైనా జరగొచ్చు.. మేమింకా రేసులోనే ఉన్నాం.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ!
జీవనసహచరులు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం మరింత సులువవుతుంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. అందుకే.. అన్ని వేళలా అండగా ఉండే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదంటారు. గ్లెన్ మాక్స్వెల్- వినీ రామన్ దంపతులు కూడా ఆ కోవకే చెందుతారు. గ్లెన్ మాక్స్వెల్.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌గా క్రికెట్ ప్రపంచానికి సుపరిచితం. మేటి జట్టులో ఆల్‌రౌండర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న ఈ విక్టోరియా వీరుడు ఒకానొక సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడు. చెయ్యి విరగ్గొట్టుకోవాలని చూశా ‘‘నేను చేసిన పనులన్నీ.. నేను చేయనివిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నా. వరల్డ్‌కప్ సమయంలో నా చెయ్యి విరగ్గొట్టుకునేందుకు ట్రై చేశా. నాకు బ్రేక్ కావాలి. ఎవరిని చూసినా ఎందుకో కోపం వస్తోంది. నిజానికి అది నా మీద నాకున్న కోపం ప్రపంచకప్ ఈవెంట్లో నేను సరిగ్గా ఆడలేకపోయినందుకు వచ్చిన విసుగు. దీని నుంచి తొందరగానే బయటపడదామనుకున్నాను. కానీ.. అనుకున్నంత సులువేమీ కాదు’’ అంటూ తాను డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని 2019లో తొలిసారి బయటపెట్టాడు మాక్సీ. శ్రీలంకతో టీ20 సిరీస్ మధ్యలోనే జట్టును వదిలివెళ్లాడు. ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు’’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మాక్సీ నిర్ణయానికి మద్దతునిచ్చింది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కూడా.. ‘‘ముందు ఆరోగ్యం.. ఆ తర్వాతే ఆట’’ అని చెప్పకనే చెప్పిన తన స్నేహితుడికి అండగా నిలిచాడు. మనసుకు దగ్గరైన మనిషి చెబితేనే బయట నుంచి ఎవరు ఎంతగా మద్దతునిచ్చినా మనసుకు దగ్గరైన మనిషి చెప్పే మాటలే ఎక్కువ సాంత్వన చేకూరుస్తాయి. మాక్సీ సమస్యను ముందుగానే పసిగట్టింది వినీ(అప్పటికి తను మాక్సీ గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే). ఒత్తిడి నుంచి అతడిని బయటపడేసే మార్గం గురించి ఆలోచించింది. ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదని.. స్పెషలిస్టును కలవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీలేదంటూ మానసిక ధైర్యాన్నిచ్చింది. మాక్సీ ఆమె మాటను కాదనలేకపోయాడు. గుండెల మీది భారం దిగిపోయింది వినీ చెప్పినట్లు చేశాడు. గుండె మీది నుంచి పెద్ద కుంపటి దించుకున్నట్లయింది. నెలలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాక్సీ మళ్లీ మునుపటిలా చలాకీగా మారిపోయాడు. పునరాగమనంలో తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానగణాన్ని ఖుషీ చేస్తున్నాడు. తాజాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆరంభంలో బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయిన్పటికీ బంతితో ప్రభావం చూపగలిగాడు. అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీతో మెరిసిన మాక్స్వెల్.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో డబుల్ సెంచరీ బాదాడు. మంత్రదండంతో మాయ చేసినట్లు తన చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు నిలబడిన చోట నిలబడినట్లే.. మంత్రదండంతో ఏదో మాయ చేసినట్లు పరుగుల వరద పారించాడు. గాయం కారణంగా అంతకు ముందు మ్యాచ్‌కు దూరమైన మాక్సీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఊహించగలరు! ఓడిపోతుందన్న మ్యాచ్‌ను గెలిపించి ఐదుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను తాజా ఎడిషన్‌లో ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక జట్టుకు చిరస్మరణీయ విజయం అందించిన తీరు ముచ్చటగొలిపింది. తన భర్తకు సంబంధించిన ఆనంద క్షణాలను ఫోన్ కెమెరాతో బందించిన వినీ.. ‘‘100 కాదు.. 201*.. భావోద్వేగాల సమాహారం’’ అంటూ సోషల్ మీడియాలో ఫొటోను పంచుకుంది. ఈ ఒక్క క్యాప్షన్ చాలు.. మాక్సీ డబుల్ సెంచరీ తమకు కేవలం ఒక నంబర్ కాదు.. ఓ ఎమోషన్ అని చెప్పడానికి!! భారత సంతతి అమ్మాయి.. తమిళనాడు ఆడపడుచు తమిళనాడుకు చెందిన వెంకట్ రామన్, విజయలక్ష్మీ రామన్ దంపతులు చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మెల్బోర్న్లో నివాసం ఏర్పరచుకున్న ఈ ఇండియన్ కపుల్‌కి 1993, మార్చి 3న వినీ జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వినీ ఫార్మాసిస్ట్‌గా కెరీర్ నిర్మించుకుంది. తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులతో ప్రయాణాలు చేయడం వినీకెంతో ఇష్టం. అలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2018లో మాక్స్వెల్ ఆమెకు పరిచయమయ్యాడు. రెండు సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న తర్వాత మాక్సీనే వినీ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తన మనసులో ఉన్న మాట.. కోరుకున్నవాడి నోటి నుంచి.. బయటకు వస్తే ఏ అమ్మాయికి మాత్రం సంతోషంగా ఉండదు. వినీ కూడా అంతే.. ఇష్టసఖుడి ప్రతిపాదనను నవ్వుతూ అంగీకరించింది వినీ. ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను పెళ్లిపీటలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అలా 2022లో క్రిస్టియన్, హిందూ వివాహ పద్ధతిలో మాక్స్వెల్- వినీ రామన్ వివాహం జరిగింది. గర్భస్రావం.. మానసిక సంఘర్షణ తమ ప్రేమకు గుర్తుగా ముద్దూమురిపాలు మూటగట్టే చిన్నారి రాబోతుందనే వార్త తెలిసి నూతన జంట ఆనందంలో తేలిపోయింది. కానీ.. దురదృష్టవశాత్తూ వినీకి గర్భస్రావమైంది. ఆ సమయంలో ఆమె కుంగిపోకుండా అండగా నిలబడ్డాడు మాక్సీ. మానసిక ధైర్యం కోల్పోకుండా కంటికి రెప్పలా కాచుకున్నాడు. ఆ విషాదం తర్వాత.. లోగాన్ మెవెరిక్ రూపంలో వారి జీవితాల్లో మళ్లీ కొత్త వసంతాలు చిగురించాయి. లోగాన్ మరెవరో కాదండి.. మాక్సీ- వినీల ముద్దుల కుమారుడు. రెయిన్బో బేబీ రాకతో ఇక ముందు తల్లిదండ్రులం అవుతామో లేదోనన్న భయాలతో ఆ దంపతుల మనసులో చెలరేగిన అలజడిని.. తుఫాన్ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సులా మాయం చేసిన బుజ్జాయి. (రెయిన్ బో బేబీ- గర్భస్రావం తర్వాత జన్మించిన బిడ్డ). ఈ ఏడాది సెప్టెంబరు 11న జన్మించాడు. నాన్నకు ఆట నుంచి కాస్త విరామం దొరకగానే ఎంచక్కా అతడి గుండెల మీద వాలి హాయిగా నిద్రపోతాడు లోగాన్!! ఇక ఒకరికోసం ఒకరు అన్నట్లు జీవిస్తున్న వినీ- మాక్సీ తమ గారాల పట్టిని నిద్రపుచ్చేందుకు జోలపాట పాడుతూ లాలిస్తూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా!? -సుష్మారెడ్డి యాళ్ల -
వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్.. టాప్‌లో మ్యాక్స్‌వెల్, ఆతర్వాత భారత ఆటగాడు
వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫాక్స్ క్రికెట్ ఇవాళ (నవంబర్ 9) ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్పై గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాక్స్ క్రికెట్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్ల ఇన్నింగ్స్‌లకు చోటు దక్కడం విశేషం. Fox Cricket picked their greatest Top 10 knocks in ODI history. pic.twitter.com/1s5qhyzlKe — Johns. (@CricCrazyJohns) November 8, 2023 ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్పై మ్యాక్సీ ఆడిన ఇన్నింగ్స్‌కు (201 నాటౌట్) టాప్ ప్లేస్ దక్కగా.. 2014లో శ్రీలంకపై రోహిత్ శర్మ సాధించిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం లభించింది. 1984లో ఇంగ్లండ్‌పై విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ 189 పరుగుల ఇన్నింగ్స్, 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్ ఇన్నింగ్స్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆతర్వాతి స్థానాల్లో 2006లో ఆసీస్‌పై సౌతాఫ్రికా ఆటగాడు హర్షల్ గిబ్స్ 175 పరుగుల ఇన్నింగ్స్, 2007లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్ 149 పరుగుల ఇన్నింగ్స్‌లు నిలిచాయి. ఏడో స్థానంలో ఏబీ డివిలియర్స్ (2015లో వెస్టిండీస్‌పై 149 పరగులు), ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237 నాటౌట్), సనత్ జయసూర్య (2000లో భారత్‌పై 189 పరుగులు), సయ్యద్ అన్వర్ (1997లో భారత్‌పై 194 పరుగులు) ఇన్నింగ్స్‌లకు దక్కాయి. -
Glenn Maxwell’s Wife Vini Raman: మాక్స్వెల్, వినీ రామన్ అపురూప (ఫొటోలు)
-
ఎక్కడ తగ్గాలో.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లు! ఇలాంటి ఆటగాళ్లు ఉంటే..
CWC 2023- Glenn Maxwell- Pat Cummins: వరల్డ్‌కప్ టోర్నీలో 68 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు.. స్ట్రయిక్‌రేటు 17.65.. వన్డేల్లో ఓ ‘బ్యాటర్’ ఖాతాలో ఇంతకంటే చెత్త గణాంకాలు ఉండవనే భావన కలగడం సహజం. కానీ.. ఈ గణాంకాలే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ప్రశంసల వర్షానికి కారణమయ్యాయి. గెలుపు కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో మరో ఎండ్‌లో ఉన్న బ్యాటింగ్ డైనమైట్‌కు ఊతంగా.. జట్టు ఓటమికి అడ్డుగా నిలిచిన అతడి తీరును ‘ది వాల్’ అంటూ కొనియాడేలా చేశాయి. ప్రపంచకప్-2023లో భాగంగా ఆఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ ముంబై వేదికగా వాంఖడేలో అఫ్గన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీతో మెరిస్తే.. బౌలర్లు సైతం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను ఆరంభంలోనే బెంబేలెత్తించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. నేనున్నానంటూ బ్యాటెత్తిన మ్యాక్సీ.. అద్వితీయ ఇన్నింగ్స్‌తో కానీ.. అక్కడున్నది ఆస్ట్రేలియా.. ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన జట్టు.. అంత తేలికగ్గా ఓటమిని అంగీకరిస్తుందా?! ఛాన్సే లేదు.. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. సహచర బ్యాటర్లు పెవిలిన్కు క్యూ కట్టిన వేళ మాక్సీ తన బ్యాటును ఓ మంత్రదండంలా మార్చి అద్భుతమైన షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు. అఫ్గన్ ఫీల్డర్ల పొరపాట్ల వల్ల తనకు దక్కిన అదృష్టాన్ని రెండుచేతులా ఒడిసిపట్టి అ‘ద్వి’తీయశతకంతో చెలరేగి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చి ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానులనూ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మాక్సీ ఇన్నింగ్స్‌లో ఏకంగా 21 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులో చురుగ్గా కదల్లేక ఇబ్బంది పడినా ఈ స్పిన్ ఆల్‌రౌండర్ మంచినీళ్లు తాగినంత సునాయాసంగా పరుగుల వరద పారించడానికి ప్రధాన కారణం కమిన్స్. ఊతంలా నిలబడి.. ఓటమికి అడ్డుపడి మాక్సీ అవుటైతే జరిగే ప్రమాదమేమిటో అతడికి తెలుసు.. కాబట్టి స్ట్రైక్ వస్తే వికెట్ పడకుండా జాగ్రత్తపడాలి.. రొటేట్ చేస్తూ మాక్సీకి అండగా నిలబడాలి.. ఇలాంటి ఆలోచనా దృక్పథంతోనే కమిన్స్ అత్యంత బాధ్యతగా వ్యవహరించాడు. మాక్సీకి వందకు వంద శాతం మద్దతుగా ఉంటూ జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మాక్స్వెల్ ఇన్నింగ్స్‌లాగే.. ప్యాట్ కమిన్స్ ‘ది వాల్’ ఇన్నింగ్స్ కూడా అలాగే చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జట్టు కష్టాల్లో ఉన్నవేళ.. కమిన్స్ మాక్సీకి సహకరించిన తీరు చూసిన క్రికెట్ ప్రేమికులకు ఓ మంచి ఫినిషర్‌కు ఇలాంటి టెయిలెండర్ తోడైతే మరిన్ని అద్భుతాలు చూడచ్చనే భావన కలగడం సహజం. అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా ఇదే అంటోంది. ‘‘ప్రతీ బ్యాట్మ్యాన్కి ఇలాంటి ఓ రాబిన్ అవసరం’’అంటూ కమిన్స్ ‘మెరుపుల’ వీడియోను షేర్ చేసింది. కాగా రాబిన్ అనే క్యారెక్టర్ డీసీ కామిక్స్లోనిది. పోరాటానికి దిగిన బ్యాట్మ్యాన్కి సహకరించేవాడే రాబిన్!! మన మాక్సీకి కమిన్స్ మాదిరి!! ఇక అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లోనే కాదు.. నెదర్లాండ్స్ మీద మాక్సీ వేగవంతమైన సెంచరీ నమోదు చేసినపుడు కూడా కమిన్స్ ఇలాగే సహకారం అందించిన విషయం తెలిసిందే. చదవండి: ఇలాంటి అద్భుతాలు నీవు మాత్రమే చేయగలవు మాక్సీ: కోహ్లి View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: మాక్సీ డబుల్ సెంచరీని కపిల్ 175తో పోల్చగలమా..?
క్రికెట్లో పోలికలు అనేవి చాలా సహజం. ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనను గతంలో నమోదైన సమాన ప్రదర్శనలతో పోల్చడం సర్వ సాధారణం. ఇక్కడ ఓ ప్రదర్శనను తక్కువ చేసి, మరో దాన్ని ఎక్కువ చేసి చూపించాలని ఎవరూ అనుకోరు. కానీ, ఏ ప్రదర్శన జట్టు విజయానికి ఎక్కువగా దోహదపడిందని విశ్లేషించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఇలాంటి ఓ పోలికనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విధ్వంసకర డబుల్ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) గెలిపించాడు. 1983 ప్రపంచకప్‌లోనూ ఇలాంటి ఓ మెరుపు ఇన్నింగ్స్‌ను మనం చూశాం. నాడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు, నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 175 పరుగులు చేశాడు. కపిల్ ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్ కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. తాజాగా మాక్సీ మెరుపు ఇన్నింగ్స్ చూశాక చాలా మంది అభిమానులు నాటి కపిల్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కొందరేమో మాక్సీ డబుల్‌ను కపిల్ 175తో పోలుస్తున్నారు. ఈ విషయంపై సోషల్‌మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య పోలిక పెట్టి, ఏది గొప్ప అని నిర్ణయించడానికి ఆస్కారమే లేదు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో దేని ప్రత్యేకత దానికి ఉంది. ఇక్కడ అభిమానులు తమ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలరు. అది తక్కువ, ఇది ఎక్కువ అని తేల్చడానికి వీలు లేదు. రెండు సందర్భాల్లో ఆటగాళ్లు జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. నాడు కపిల్ బరిలోకి దిగిన సందర్భంలో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఆ సమయంలో కపిల్ ఎదురుదాడికి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా మ్యాక్స్‌వెల్ సైతం తన జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు (292 పరుగుల లక్ష్యఛేదనలో 91/7 స్కోర్ వద్ద) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అయితే ఈ రెండు ఇన్నింగ్స్‌ల మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కపిల్ ఇన్నింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ చేసినది కాగా, మాక్సీ ఛేదనలో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక్కడ, అక్కడ ఆటగాళ్లు తమతమ జట్ల గెలుపుకు వంద శాతం దోహదపడ్డారు. ఇద్దరూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక్కడ మ్యాక్సీ పోరాడితే పోయేది ఏమీ లేదని సక్సెస్ సాధించగా.. నాడు కపిల్ సైతం ఇదే ఫార్ములాను ఉపయోగించి ఫలితం రాబట్టాడు. -
CWC 2023: ఎవరికీ సాధ్యం కాలేదు.. 52 ఏళ్ల తర్వాత మ్యాక్స్‌వెల్ చేసి చూపించాడు
52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఆస్ట్రేలియా ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రస్తుత ప్రపంచకప్‌లో సాధించాడు. వన్డే క్రికెట్ ప్రారంభమైన నాటి నుంచి (1971 జనవరి 5) ఆస్ట్రేలియన్లకు అందని ద్రాక్షగా ఉండిన డబుల్ సెంచరీని మ్యాక్సీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 128 బంతులు ఎదుర్కొన్న అతను 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయమైన డబుల్ సెంచరీ (201) చేసి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. ఆఫ్ఘన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో మ్యాక్సీ మరిన్ని రికార్డులు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో మూడో డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు. గతంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. వన్డేల్లో రెండో వేగవంతంగా డబుల్ సెంచరీ (128 బంతుల్లో) రికార్డు. ఈ విభాగంలో అత్యుత్తమ రికార్డు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది. వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా రికార్డు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానం (43 సిక్సర్లు).ఈ విభాగంలో క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓ వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో ఐదో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆఫ్ఘనిస్తాన్పై 10 సిక్సర్లు). ఈ విభాగంలో ఇయాన్ మోర్గాన్ (2019లో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో 17 సిక్సర్లు) టాప్‌లో ఉన్నాడు. వన్డేల్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (కమిన్స్‌తో కలిసి అజేయమైన 202 పరుగులు) వన్డేల్లో నాన్ ఓపెనర్‌గా అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో వన్డేల్లో ఈ రికార్డు జింబాబ్వే ఆటగాడు చార్లెస్ కొవెంట్రీ (194 నాటౌట్) పేరిట ఉండేది. ఆరు లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (175 నాటౌట్) పేరిట ఉండేది. -
AUS VS AFG: మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. కమిన్స్ ఖాతాలో చెత్త రికార్డు
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఓటమి కొరల్లో (91/7) చిక్కుకున్న ఆసీస్‌ను మ్యాక్సీ వీరోచితంగా పోరాడి ఒంటిచేత్తో గెలిపించాడు. కదలలేని స్థితిలో సైతం మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ప్రతి క్రికెట్ అభిమాని మనసు దోచుకున్నాడు. మ్యాక్సీ బ్యాట్ నుంచి జాలువారిన ఈ ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఆఫ్ఘన్‌పై గెలుపులో మ్యాక్సీ అన్నీ తానై వ్యవహరించగా, కెప్టెన్ కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (68 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) ఆడి తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ పలు అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకోగా.. కమిన్స్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ రికార్డు వ్యక్తిగతంగా కమిన్స్‌కు చెత్త రికార్డే అయినప్పటికీ.. ఆసీస్ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది. ఓ పక్క మ్యాక్సీ చెలరేగుతుంటే, మరో ఎండ్‌లో కమిన్స్ వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఆఫ్ఘన్‌పై గెలుపులో మ్యాక్సీలా కమిన్స్ పాత్ర కూడా వెలకట్టలేనిది. ఒకవేళ కమిన్స్ మ్యాక్స్‌వెల్‌కు సహకరించకపోయి ఉంటే ఆసీస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇంతకీ కమిన్స్ పేరిట నమోదైన ఆ చెత్త రికార్డు ఏంటంటే.. వరల్డ్‌కప్‌లో కనీసం 10 పరుగులు చేసి రెండో అత్యల్ప స్ట్రయిక్‌రేట్ నమోదు చేసిన ఆటగాడిగా కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఎదుర్కొన్న కమిన్స్ కేవలం 17.64 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. వరల్డ్‌కప్‌లో కనీసం 10 పరుగులు చేసి ఇంతకంటే తక్కువ స్ట్రయిక్‌రేట్ నమోదు చేసిన రికార్డు జింబాబ్వే ఆటగాడు జాక్ హెరన్ పేరిట ఉంది. 1983 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హెరన్ అత్యల్పంగా 16.43 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. రికార్డు విషయం అటుంచితే, కమిన్స్ మ్యాక్సీతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. కాగా, ఆఫ్ఘన్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. -
చాలా బాధగా ఉంది.. ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము: ఆఫ్ఘన్ కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 291 పరుగులు చేసిన ఆఫ్ఘన్లు ఓ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించేలా కనిపించారు. అయితే మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఫ్ఘన్ల ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాక్సీ ఆఫ్ఘన్లకు విజయాన్ని దూరం చేయడంతో పాటు వారి సెమీస్ అవకాశాలను సైతం సంక్లిష్టం చేశాడు. ఊహించని ఈ ఓటమితో ఆఫ్ఘన్లు ఖంగుతిన్నారు. వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. ఇది వారి కెప్టెన్ మాటల్లో స్పష్టంగా తెలిసింది. మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీది మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది. మేం ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము. ఓ దశలో గెలుస్తామని పూర్తి విశ్వాసంగా ఉన్నాము. క్రికెట్ తమాషా ఆట. క్షణాల వ్యవధిలో ఫలితం తారుమారవుతుంది. మ్యాక్స్‌వెల్ మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. అయితే డ్రాప్ క్యాచ్‌లు మా కొంపముంచాయి. పలు మార్లు లైఫ్‌లు లభించిన అనంతరం మ్యాక్స్‌వెల్ ఆగలేదు. అతను ప్రతి రకమైన షాట్ ఆడాడు. క్రెడిట్ మొత్తం అతనికే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ సాగిన తీరు వర్ణణాతీతం. మా బౌలర్లు తమ వంతు ప్రయత్నం చేసినా అతను మాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జారవిడిచిన క్యాచ్‌లకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినప్పటికీ, జట్టు ప్రదర్శన పట్ల ఇప్పటికీ గర్వంగా ఉంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇదంతా ఆటలో భాగం. దక్షిణాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పుంజుకుంటాం. ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుం. అతన్ని చూస్తే గర్వంగా ఉంది. వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన మొదటి ఆఫ్ఘన్‌గా రికార్డుల్లోకెక్కినందుకు అతను కూడా గర్వపడాలి అని అన్నాడు. కాగా, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీం జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్ ఓ దశలో (91/7) ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే మ్యాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీతో వారిని విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ తమ చివరి లీగ్ మ్యాచ్ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉంది. చదవండి: గొప్ప విజయం.. మ్యాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్ -
గొప్ప విజయం.. మాక్సీని ఎలా పొగడాలో తెలియడం లేదు: కమిన్స్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మాక్స్వెల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆడి, తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఓటమి కొరల్లో (91/7) చిక్కుకున్న జట్టును మాక్సీ ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా కీర్తించబడుతుంది. ఛేదనలో ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేదని యావత్ క్రికెట్ ప్రపంచం కొనియాడుతుంది. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మాక్స్వెల్ ఓ అద్భుతమని కొనియాడాడు. ఈ విజయం చిరస్మరణీయమని అభివర్ణించాడు. ఈ అనుభూతి వర్ణించలేనిదని అన్నాడు. క్రికెట్ చరిత్రలోనే ఇదో బెంచ్ మార్క్‌గా మిగిలిపోనుందని కితాబునిచ్చాడు. ప్రేక్షకులు మైదానాలకు వచ్చేది ఇలాంటి మ్యాచ్‌ల కోసమేనని పేర్కొన్నాడు. ప్రతి క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్‌ను చిరకాలం గుర్తించుకుంటాడని తెలిపాడు. క్రీజ్‌లో మాక్సీ చాలా ప్రశాంతంగా, ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలిపాడు. 200 పరుగులు వెనుకబడి, కేవలం 3 వికెట్లు చేతిలో ఉండి ఈ మ్యాచ్‌ను గెలవడం చాలా ప్రత్యేకమని అన్నాడు. గాయంతో బాధపడుతున్న మాక్స్వెల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాలనుకున్నాడా అన్న దానిపై స్పందిస్తూ.. మాకు చేతిలో మరో రెండు వికెట్లు ఉన్నాయి. జంపా క్రీజ్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ మాక్సీ రిటైర్డ్ అవ్వాలని అనుకోలేదు. తన జట్టును ఎలాగైనా గెలిపించాలని దృడ సంకల్పంతో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా చివరి దాకా క్రీజ్‌లో ఉండి గెలిపించి చూపించాడు. మేము ఇప్పుడు సెమీఫైనల్లో ఉన్నాము. ఇదో గొప్ప అనుభూతి. ఆఫ్ఘన్ల ఆటతీరుపై ఎదురైన ప్రశ్నను కమిన్స్ దాటవేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ఈ జట్టు లీగ్ దశలో మరో మ్యాచ్‌లో ఆడాల్సి ఉన్నా, సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడటం ఖాయమైపోయింది. సౌతాఫ్రికా సైతం మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, ఆ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేదు. రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఏదో ఒక స్థానంలో ఉంటాయి. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో భారత్ నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ ఆడటం కూడా ఖరారైపోయింది. నాలుగో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. చదవండి: చాలా బాధగా ఉంది.. ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాము: ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ -
CWC 2023 AUS V AFG: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ద్విశతకంతో (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడి, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మ్యాక్సీ ఊహకందని ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. మ్యాక్స్‌వెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా కీర్తించబడుతుంది. ఛేదనలో ఈ స్థాయి ఇన్నింగ్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ ఆడి ఉండరని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మ్యాక్సీ నామస్మరణతో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. సాహో మ్యాక్సీ అంటూ జనం కొనియాడుతున్నారు. మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి విమర్శకులు సైతం ముగ్దులవుతున్నారు. ఈ ఇన్నింగ్స్ వెలకట్టలేనిదని కామెంట్లు చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మున్ముందు కూడా ఇలాంటి ఇన్నింగ్స్ చూడలేమని ఆకాశానికెత్తుతున్నారు. లక్ష్యానికి 201 పరుగుల దూరంలో ఉండి, చేతిలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలంటే చాలా గట్స్ కావాలని అంటున్నారు. అసాధ్యమనుకున్న దాన్ని (లక్ష్య ఛేదనను) చేసి చూపించి సాహో మ్యాక్సీ అనిపించుకున్నాడని కితాబునిస్తున్నారు. ఓ పక్క గాయం వేధిస్తున్నా దిగమింగుతూ, జట్టును గెలిపించేందుకు అతను చూపిన తెగువ అసమానమని కొనియాడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో మెరవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం మ్యాక్స్‌వెల్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్ సెమీస్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. -
CWC 2023 AFG Vs AUS Highlights Pics: సాహో మ్యాక్సీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ (ఫొటోలు)
-
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్‌లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్‌కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్‌కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్‌వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్‌వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్‌కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్‌కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్‌లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్‌ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్‌లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్‌లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్‌కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్‌కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్‌తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్‌తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్‌వెల్ భారీ హిట్టింగ్‌కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్‌తో కలిసి జట్టు రాతను తన బ్యాట్‌తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్‌లు అబేధ్యమైన 8వ వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్‌పై 8వ వికెట్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్‌రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్‌పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్‌వుడ్ (బి) మ్యాక్స్‌వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్‌వుడ్ 9–0–39–2, మ్యాక్స్‌వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గాయం నుంచి కోలుకుని.. సెంచరీతో చెలరేగి! హ్యాట్సాఫ్ మాక్సీ!
ICC WC 2023- Afg Vs Aus- Glenn Maxwell: వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మరో శతకం సాధించాడు. అఫ్గనిస్తాన్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 76 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకున్నాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మాక్సీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ నెదర్లాండ్స్‌పై తొలి శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే. కేవలం 40 బంతుల్లోనే 100 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. తాజాగా అఫ్గనిస్తాన్‌పై మరోసారి హండ్రెడ్‌తో మెరిశాడు. సెమీస్ రేసులో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ముందుకు వెళ్లాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే, అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే తడబడ్డ కంగారూ జట్టు.. 8 ఓవర్లు ముగిసే సరికి 49 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో తొమ్మిదో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ బౌల్డ్ కాగా.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లిష్(0) కూడా ఆ మరుసటి బంతికి పెవిలియన్ చేరాడు. ఇలా 50 పరుగులలోపే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను మాక్సీ గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నాడు. గాయం నుంచి కోలుకుని అద్భుత శతకంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నాడు. 19 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి కేవలం 95 పరుగులు చేసిన ఆసీస్‌ను లక్ష్యాన్ని చేరువ చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు మాక్సీ గాయపడిన విషయం తెలిసిందే. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టుతప్పి పడిపోయాడు. దీంతో అతడి తలకు గాయమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న మాక్స్వెల్.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్ మధ్యలో కూడా కాళ్ల నొప్పితో ఇబ్బంది పడ్డా 42వ ఓవర్ మూడో బంతికి 150 పరుగుల మార్కు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. స్వదేశానికి పయనమైన స్టార్ ఓపెనర్
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో దూసుకుపోతున్న ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఆసీస్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ప్రపంచకప్ కోసం మార్ష్ తిరిగి భారత్‌కు రావడం అనుమానమేనని ఆసీస్ మీడియా వర్గాల సమాచారం. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ క్రికెట్ వర్గాలు ఖంగుతిన్నాయి. అభిమానులు షాక్‌కు గురయ్యారు. వరల్డ్‌కప్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆసీస్ ఇన్ ఫామ్ ప్లేయర్ సేవలు కోల్పోవడాన్ని జీర్జించుకోలేకపోతుంది. మరోవైపు ఆసీస్ మరో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలను సైతం కోల్పోనుంది. తలకు తీవ్ర గాయం కావడం చేత మ్యాక్సీ నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంకానున్నాడు. గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి కింద పడిపోవడంతో మ్యాక్సీ తలకు తీవ్ర గాయమైంది. రోజుల వ్యవధిలో ఆసీస్ ఇద్దరు స్టార్ ఆల్‌రౌండర్ల సేవలను కోల్పోవడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మార్ష్, మ్యాక్సీ ఇద్దరు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు చెరో మ్యాచ్‌లో సెంచరీ (మార్ష్ పాక్‌పై, మ్యాక్సీ నెదర్లాండ్స్‌పై) చేయడంతో పాటు వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే, ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సౌతాఫ్రికా టేబుల్ టాపర్ కాగా.. భారత్ రెండో స్థానంలో.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. -
CWC 2023 AUS VS NZ: అతి భారీ సిక్సర్ నమోదు
2023 వన్డే ప్రపంచకప్లోకెళ్లా అత్యంత భారీ సిక్సర్ ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో నమోదైంది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్‌ను సాధించాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్సర్ బాదాడు. మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్‌పై పడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అతి భారీ సిక్సర్. మ్యాక్స్‌వెల్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ పేరిట ఉండేది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 101 మీటర్ల సిక్సర్ బాదాడు. అయ్యర్‌కు ముందు డేవిడ్ వార్నర్ 98 మీటర్ల సిక్సర్, డారిల్ మిచెల్ 98 మీట్లర సిక్సర్, డేవిడ్ మిల్లర్ 95 మీటర్ల సిక్సర్లు బాదారు. Glenn Maxwell smashes the biggest six of the 2023 World Cup. 104M at the Dharamshala Stadium. pic.twitter.com/soR1PNxPNm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023 కాగా, కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగి 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతనికి ముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బౌల్ట్ చెరి 3 వికెట్లు, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (18), డారిల్ మిచెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ కోల్పోయిన 2 వికెట్లు హాజిల్‌వుడ్‌కు దక్కాయి. -
మ్యాక్స్‌వెల్ విధ్వంసం
న్యూఢిల్లీ: ప్రత్యర్థులు బహు పరాక్! వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా ఫామ్‌లోకి వచ్చేసింది. క్రికెట్ కూన నెదర్లాండ్స్‌ను హడలెత్తించింది. ఏకంగా 309 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కాగా... వన్డే ఫార్మాట్ చరిత్రలో రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. తన ఫామ్ కొనసాగిస్తూ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ చేయగా... స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71; 9 ఫోర్లు, 1 సిక్స్), లబుషేన్ (47 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) నెదర్లాండ్స్ బౌలర్ల భరతం పట్టి... వీర విధ్వంసం సృష్టించి... ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు. 40 బంతుల్లో మ్యాక్స్‌వెల్ 100 పరుగులు పూర్తి చేసి ఇదే టోర్నీలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ (49 బంతుల్లో) సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్ జంపా (3–0–8–4) మూడు ఓవర్లతోనే స్పిన్ ఉచ్చు బిగించాడు. దంచుడు వార్నర్‌తో మొదలైతే... నాలుగో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ (9) అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో డచ్ శిబిరానికి కలిగిన ఆనందం ఇదొక్కటే! తర్వాతంతా అలసిపోవడమే! ఎందుకంటే అప్పటికే క్రీజులో ఉన్న వార్నర్గానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లబు షేన్‌లు గానీ నెదర్లాండ్స్‌పై కనీస దయ చూపలేదు. బంతిని వదల్లేదు. ఫీల్డర్లను విడిచిపెట్టలేదు. బంతిని, బౌలర్లు, ఫీల్డర్లను కలిపి బలిపీఠం ఎక్కించినట్లుగా వీరబాదుడు బాదేశారు. స్మిత్ 53 బంతుల్లో, వార్నర్ 40 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్మిత్ వెనుదిరిగాడు. తర్వాత లబుõÙన్ (42 బంతుల్లో) ఫిఫ్టీ కొడితే... వార్నర్ (91 బంతుల్లో) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు 84 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో వచ్చి... 40 బంతుల్లో శతక్కొట్టి... ఓ సెంచరీ, ఇద్దరి ఫిఫ్టీలతోనే ఆసీస్ కథ ముగియలేదు. 39వ ఓవర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్‌లో తన బ్యాట్‌తో కొత్త రాత (రికార్డు) రాశాడు. 48 ఓవర్లలో ఆసీస్ స్కోరు 361/6. మ్యాక్సీ (75 పరుగులతో) సెంచరీకి దూరంగానే ఉన్నాడు. కానీ లీడే వేసిన 49 ఓవర్లో 4, 4, 6, 6, నోబ్ 6, 1, 0లతో ఏకంగా 28 పరుగులు పిండుకోవడంతో 40 బంతుల్లోనే ఎవరి ఊహకందని విధంగా శతకం పూర్తయ్యింది. 115 వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నెదర్లాండ్స్ ప్లేయర్ లీడే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో లీడే 10 ఓవర్లలో 115 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిక్ లూయిస్ (0/113; 2006లో దక్షిణాఫ్రికాపై), ఆడమ్ జంపా (0/113; 2023లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న రికార్డును లీడే అధిగమించాడు. 6 ప్రపంచకప్‌లో ఆరో సెంచరీతో వార్నర్ ఈ టోర్నీలో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. రోహిత్ శర్మ (7) అగ్రస్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 9; వార్నర్ (సి) ఆర్యన్ (బి) వాన్ బిక్ 104; స్మిత్ (సి) మెర్వ్ (బి) ఆర్యన్ 71; లబుషేన్ (సి) ఆర్యన్ (బి) లీడే 62; ఇంగ్లిస్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 14; మ్యాక్స్‌వెల్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బిక్ 106; గ్రీన్ (రనౌట్) 8; కమిన్స్ (నాటౌట్) 12; స్టార్క్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 0; జంపా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–28, 2–160, 3–244, 4–266, 5–267, 6–290, 7–393, 8–393. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–59–1, అకెర్మన్ 3–0–19–0, వాన్ బిక్ 10–0–74–4, మికెరన్ 10–0–64–0, విక్రమ్‌జీత్ 4–0–27–0, వాన్‌డెర్ మెర్వ్ 5–0–41–0, బస్ డి లీడే 10–0–115–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (రనౌట్) 25; మ్యాక్స్ ఓ డౌడ్ (బి) స్టార్క్ 6; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హాజల్‌వుడ్ 10; సైబ్రాండ్ (సి) వార్నర్ (బి) మార్ష్ 11; లీడే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 4; ఎడ్వర్డ్స్ (నాటౌట్) 12; తేజ (సి) ఇంగ్లిస్ (బి) మార్ష్ 14; వాన్ బిక్ (సి) ఇంగ్లిస్ (బి) జంపా 0; వాన్‌డెర్ మెర్వ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; ఆర్యన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 1; మికెరన్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) జంపా 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (21 ఓవర్లలో ఆలౌట్) 90. వికెట్ల పతనం: 1–28, 2–37, 3–47, 4–53, 5–62, 6–84, 7–86, 8–86, 9–90, 10–90. బౌలింగ్: స్టార్క్ 4–0–22–1, హాజల్‌వుడ్ 6–0–27–1, కమిన్స్ 4–0–14–1, మార్ష్ 4–0–19–2, జంపా 3–0–8–4. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్
WC 2023 Aus Vs Ned- Pat Cummins Comments: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రికార్డు విజయం సాధించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితో గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం తలపడింది ఆస్ట్రేలియా. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని డచ్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. డేవిడ్ వార్నర్(104) శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులు సాధించారు. ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు వీరి ముగ్గురి ఇన్నింగ్స్‌ను మరిపించేలా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 తరహా వినోదం అందించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు స్కోరు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) 90 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్ దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించిన ఆసీస్.. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా అత్యధికంగా 4 వికెట్లు దక్కించుకోగా.. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తర్వాత.. ఈ క్రమంలో వన్డే చరిత్రలో ప్రత్యర్థిని అత్యంత భారీ తేడాతో ఓడించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీమిండియా(శ్రీలంక మీద 317 పరుగుల తేడాతో) తర్వాత ఈ ఘనత సాధించిన టీమ్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో విజయానంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన విజయం. ప్రత్యర్థికి 400 పరుగుల లక్ష్యాన్ని విధించడం.. దానిని కాపాడుకోవడం.. రెండింటిలోనూ మేము పూర్తిగా విజయవంతమయ్యాం. ఆ వందలో నాకూ భాగం ఉంది ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. క్రేజీ ఇన్నింగ్స్. ఆ వంద పరుగుల భాగస్వామ్యంలో మా ఇద్దరి పాత్ర సమానమే కదా(నవ్వులు).. అద్భుతమైన ఇన్నింగ్స్. నేనిలాంటి క్లీన్ హిట్టింగ్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు’’ అంటూ మాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా స్మిత్ కూడా హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్న కమిన్స్.. ‘‘మా ఆట తీరు ఎలా ఉండాలనుకుంటామో ఈరోజు అలాగే ఆడాం. పవర్ ప్లేలో వీలైనన్ని వికెట్లు తీయాలన్న వ్యూహం అమలు చేశాం. జంపా మరోసారి నాలుగు వికెట్లు కూల్చాడు’’ అని బౌలింగ్ విభాగాన్ని కూడా ప్రశంసించాడు. మాక్సీ- కమిన్స్ జోడీ చరిత్ర.. అందుకే అలా సరదాగా కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ చరిత్రలో 100+ పరుగుల భాగస్వామ్యంలో హయ్యస్ట్ రన్‌రేటు(14.37 (103) సాధించిన మూడో జోడీగా మాక్స్వెల్- కమిన్స్ జోడీ చరిత్ర సృష్టించింది. ఈ గణాంకాలను ఉద్దేశించే కమిన్స్.. మాక్సీతో పాటు తాను కూడా ఈ పార్ట్నర్షిప్లో సమాన పాత్ర పోషించానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: WC 2023: పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా View this post on Instagram A post shared by ICC (@icc) -
పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా..
ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపింది. డచ్ జట్టును ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. సౌతాఫ్రికాపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న డచ్ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్ వన్‌సైడ్ చేసింది. తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర తద్వారా ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యంత భారీ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(104) సెంచరీతో అదరగొట్టగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో రాణించారు. మాక్సీ పరుగుల సునామీ వీరిద్దరు అర్ధ శతకాలతో రాణిస్తే ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు,8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. మాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించింది. స్టార్క్ ఆరంభిస్తే.. జంపా ముగించాడు ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆసీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. పేసర్ మిచెల్ స్టార్క్ వికెట్ల పతనం ఆరంభించగా.. స్పిన్నర్ ఆడం జంపా లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ క్రమంలో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి నెదర్లాండ్స్ ఆలౌట్ అయింది. 21 పరుగులకే కథ ముగించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ తీయగా.. బ్యాట్‌తో రాణించలేకపోయిన మిచెల్ మార్ష్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ మీద ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఫాస్టెస్ట్ సెంచరీ హీరో గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
WC 2023- Australia vs Netherlands: నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బాస్ డి లిడేకు చేదు అనుభవం ఎదురైంది. వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భాగంగా వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ఆటగాడిగా ఈ ఆల్‌రౌండర్ నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిక్ లూయీస్, ఆడం జంపాలను అధిగమించి చెత్త గణాంకాలతో చరిత్రకెక్కాడు. కాగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బౌలింగ్ చేసింది. ఆ ఆనందం కాసేపే ఈ క్రమంలో డచ్ పేసర్ లోగన్ వాన్ బీక్ ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. వాళ్లంతా ఒకెత్తు.. మాక్సీ మరో ఎత్తు వన్‌డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(71)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అద్భుత శతకం(104)తో భారీ స్కోరుకు పునాది వేశాడు. ఇక వార్నర్, స్మిత్‌లతో పాటు మార్నస్ లబుషేన్ కూడా బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 47 బంతుల్లో 62 పరుగులతో రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఆడుకోవడంలో ఈ ముగ్గురు ఒక ఎత్తైతే ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మరో ఎత్తు. డచ్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 44 బంతుల్లోనే మొత్తంగా 106 పరుగులు రాబట్టాడు. రెండో అత్యుత్తమ స్కోరు వార్నర్, స్మిత్, లబుషేన్.. మాక్సీ.. ఇలా ఈ నలుగురి విజృంభణతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 399 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్ చరిత్రలో తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. పాపం.. బాస్ బలి అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ల పరుగుల దాహానికి బలైపోయిన బౌలర్లలో బాస్ డి లిడే ముందు వరుసలో ఉన్నాడు. ఈ రైట్ఆర్మ్ మీడియం పేసర్ తన 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి రికార్డు స్థాయిలో 115 పరుగులు సమర్పించుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బాస్ డి లిడే నిలిచాడు. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్ రూపంలో రెండు వికెట్లు తీయడం ఒక్కటే అతడికి కాస్త ఊరట. బాస్ డి లిడే సంగతి ఇలా ఉంటే.. నెదర్లాండ్స్ ఇతర బౌలర్లలో వాన్ బీక్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్‌కు ఒక్క వికెట్ దక్కింది. ఇంటర్నేషనల్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు వీరే ►2/115 (10) - బాస్ డి లిడే(నెదర్లాండ్స్)- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో- ఢిల్లీ-2023 ►0/113 (10) - మిక్ లూయిస్(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- జొహన్నస్‌బర్గ్- 2006 ►0/113(10) - ఆడం జంపా(ఆస్ట్రేలియా)- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- సెంచూరియన్- 2023 ►0/110 (10)- వాహబ్ రియాజ్(పాకిస్తాన్)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- నాటింగ్‌హాం- 2016 ►0/110 (9) - రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో- మాంచెస్టర్- 2019. చదవండి: WC 2023: వార్నర్ 22వ సెంచరీ.. రికార్డులు బద్దలు! సచిన్‌తో పాటు View this post on Instagram A post shared by ICC (@icc) -
వార్నర్ సెంచరీ.. మాక్సీ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్ చరిత్రలో ఆసీస్ ఇలా..
ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత శతకాల కారణంగా పసికూన నెదర్లాండ్స్‌పై భారీ స్కోరు సాధించింది. కాగా ప్రపంచకప్ -2023లో భాగంగా అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో డచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన వార్నర్ 104 పరుగులతో అదరగొట్టగా.. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ 71 రన్స్, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మార్నస్ లబుషేన్ 62 పరుగులతో రాణించాడు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన మాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డులకెక్కాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఆఖరి ఓవర్ మూడో బంతికి వాన్ బీక్ బౌలింగ్‌లో అవుటై మాక్సీ నిష్క్రమించాడు. ఇలా స్టార్ బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు స్కోరు చేసింది. ఇక డచ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ వికెట్లు మాత్రం తీయగలిగారు. వాన్ బీక్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. బాస్ డీ లీడే రెండు, ఆర్యన్ దత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ రనౌట్‌గా వెనుదిరగడంతో మొత్తంగా 8 వికెట్లు పడ్డాయి. వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్లు ఇవే! ►417/6- అఫ్గనిస్తాన్‌పై, పెర్త్‌లో- 2015 ►399/8- నెదర్లాండ్స్‌పై ఢిల్లీలో- 2023 ►381/5- బంగ్లాదేశ్‌పై నాటింగ్‌హాంలో- 2019 ►377/6- సౌతాఫ్రికా మీద బాసెటెరెలో- 2007 ►376/9- శ్రీలంక మీద సిడ్నీలో- 2015. చదవండి: మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ View this post on Instagram A post shared by ICC (@icc) -
మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ
WC 2023- #AUSvsNED- #GlennMaxwellFastestCentury: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 252.50 స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్-2023లో ఢిల్లీలోనే మార్కరమ్ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు(ఎదుర్కొన్న బంతుల పరంగా) నమోదు చేసింది వీరే ►40 - గ్లెన్ మాక్స్వెల్ నెదర్లాండ్స్ మీద, ఢిల్లీలో-2023 ►49 - ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంక మీద, ఢిల్లీలో- 2023 ►50 - కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్ మీద, బెంగళూరులో- 2011 ►51 -గ్లెన్ మాక్స్వెల్ శ్రీలంక మీద, సిడ్నీలో- 2015 ►52 - ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్ మీద, సిడ్నీలో 2015 ఆస్ట్రేలియా భారీ స్కోరు: నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 104 , స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టగా.. మాక్సీ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు
మొహాలీ వేదికగా టీమిండియాతో రేపు (సెప్టెంబర్ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాల కారణంగా తొలి వన్డేకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కొద్దిసేపటి కిందట నిర్ధారించారు. గజ్జల్లో నొప్పి కారణంగా స్టార్క్.. చీలిమండ గాయం కారణంగా మ్యాక్సీ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంటారని స్టార్క్ తెలిపారు. మరోవైపు సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు భారత్‌తో తొలి వన్డేకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ట్ సాధించి, బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. స్టార్క్, మ్యాక్స్‌వెల్ మినహా తొలి వన్డేలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియాల మధ్య సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్‌లో, మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే వరల్డ్‌కప్ సన్నాహక మ్యాచ్‌లు మొదలవుతాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో 2023 వరల్డ్‌కప్ మొదలవుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మెగా టోర్నీలో భారత్.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 14న పాకిస్తాన్లను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్ధితో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
WC: ఇప్పటికే నలుగురికి గాయాలు.. మరో షాక్! స్టార్ బ్యాటర్ చెయ్యి ఫ్రాక్చర్
Travis Head Injury: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. సౌతాఫ్రికాతో నాలుగో వన్డే సందర్భంగా అతడి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే హెడ్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇలా కీలక బ్యాటర్ గాయపడటం ఆసీస్‌ను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ గాయం గురించి ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అప్డేట్ ఇస్తూ.. ‘‘ఫ్రాక్చర్ అయిన మాట వాస్తవమే. అయితే, హెడ్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఇప్పటికే నలుగురు స్టార్లకు గాయాలు స్కానింగ్ తర్వాతే గాయం తీవ్రత గురించి తెలుస్తుంది. ప్రపంచకప్‌నకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్లు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న వేళ హెడ్ గాయంతో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలినట్లయింది. అదొక్కటే కాస్త ఊరట కాగా కమిన్స్‌కు మణికట్టు భాగంలో ఫ్రాక్చర్ అయింది. స్టార్క్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. మాక్స్‌వెల్‌కు మడిమ నొప్పితో సతమతమవుతున్నాడు. అయితే, స్టీవ్ స్మిత్ మణికట్టు గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా గాయపడిన ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోలుకుని వైద్య బృందం పరీక్షల్లో పాస్ కావడం ఆస్ట్రేలియాకు కాస్త ఊరట కలిగించింది. గాయాల బెడద.. మాజీ చాంపియన్ ఏం చేస్తుందో? ఇక భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు జట్లకు అవకాశం ఉంది. ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో.. వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని అత్యధికంగా 5 సార్లు గెలిచిన ఆసీస్ ఈసారి టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి! ప్రపంచకప్-2023కి ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ -
ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..
Australia 15 Man Squad For WC 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ఆస్ట్రేలియా తమ జట్టును ఖరారు చేసింది. ఐసీసీ ఈవెంట్లో భాగం కానున్న 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. ప్రాథమిక జట్టులో.. తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ ఆర్డోన్ హార్డీ, తన్వీర్ సంఘాకు మొండిచేయి ఎదురైంది. అతడు కూడా అవుట్ అదే విధంగా.. యువ పేసర్ నాథన్ ఎల్లిస్‌కు కూడా చోటు దక్కకపోగా... రైట్ ఆర్మ్ పేసర్ సీన్ అబాట్ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టెస్టు స్పెషలిస్టు మార్నస్ లబుషేన్ పేరును ఈసారి కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మూడే మార్పులు ఎల్లిస్, తన్వీర్, హార్డీ.. ఈ ముగ్గురు తప్ప ప్రిలిమినరీ జట్టులో చోటు దక్కించుకున్న వాళ్లంతా ఫైనల్ టీమ్‌లో స్థానం సంపాదించారు. ఇదిలా ఉంటే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్‌లేమితో సతమతం కావడం మాజీ చాంపియన్‌ను కంగారుపెడుతోంది. కెప్టెన్ సహా వాళ్లంతా ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెగా ఈవెంట్‌కు ఇంకా సమయం ఉందని.. అప్పటికి తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు సౌతాఫ్రికా, టీమిండియా(సెప్టెంబరు 22-27)తో తాము ఎనిమిది వన్డేలు ఆడటం సానుకూలాంశమన్న బెయిలి.. కీలక టోర్నీకి ముందు ఈ సిరీస్‌లు తమకు సన్నాహకాలుగా ఉపయోగపడుతాయని హర్షం వ్యక్తం చేశాడు. అప్పటిదాకా టైమ్ ఉంది.. కాబట్టి కాగా 15 మంది సభ్యుల జట్టులో ప్రధాన వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ ఉండగా.. అతడికి బ్యాకప్‌గా జోష్ ఇంగ్లిస్‌కు స్థానం దక్కింది. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మెగా ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు జట్లకు అవకాశం ఉంది. కాబట్టి ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలిచిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్-2023కి ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. చదవండి: WC Team India: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup! The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi — Cricket Australia (@CricketAus) September 6, 2023 View this post on Instagram A post shared by Cricket Australia (@cricketaustralia)