ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ రేసులో దూసుకుపోతున్న ఫైవ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు. వరల్డ్‌కప్‌లో ఆసీస్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ప్రపంచకప్ కోసం మార్ష్ తిరిగి భారత్‌కు రావడం అనుమానమేనని ఆసీస్ మీడియా వర్గాల సమాచారం.
ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ క్రికెట్ వర్గాలు ఖంగుతిన్నాయి. అభిమానులు షాక్‌కు గురయ్యారు. వరల్డ్‌కప్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆసీస్ ఇన్ ఫామ్ ప్లేయర్ సేవలు కోల్పోవడాన్ని జీర్జించుకోలేకపోతుంది. మరోవైపు ఆసీస్ మరో స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలను సైతం కోల్పోనుంది. తలకు తీవ్ర గాయం కావడం చేత మ్యాక్సీ నవంబర్ 4న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంకానున్నాడు.
గోల్ఫ్ కార్ట్ వాహనం నుండి పట్టు తప్పి కింద పడిపోవడంతో మ్యాక్సీ తలకు తీవ్ర గాయమైంది. రోజుల వ్యవధిలో ఆసీస్ ఇద్దరు స్టార్ ఆల్‌రౌండర్ల సేవలను కోల్పోవడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మార్ష్, మ్యాక్సీ ఇద్దరు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు చెరో మ్యాచ్‌లో సెంచరీ (మార్ష్ పాక్‌పై, మ్యాక్సీ నెదర్లాండ్స్‌పై) చేయడంతో పాటు వికెట్లు కూడా తీశారు.
ఇదిలా ఉంటే, ఆసీస్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన 0.970 రన్‌రేట్ కలిగి ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో సౌతాఫ్రికా టేబుల్ టాపర్ కాగా.. భారత్ రెండో స్థానంలో.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment