IPL 2023 Virat Kohli Bowls In Nets Beat Glenn Maxwell Watch, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2023 SRH Vs RCB: సన్‌రైజర్స్‌తో కీలక మ్యాచ్‌..! బౌలింగ్‌ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్‌’ వీడియో వైరల్‌

Published Thu, May 18 2023 3:52 PM | Last Updated on Thu, May 18 2023 4:43 PM

IPL 2023 Virat Kohli Bowls In Nets Beat Glenn Maxwell Watch - Sakshi

నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్న కోహ్లి (PC: RCB/IPL)

IPL 2023- SRH Vs RCH- Virat Kohliఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం​ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గెలిచేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌ భారమంతా కే.జీ.ఎఫ్‌. (కోహ్లి, గ్లెన్‌, ఫాఫ్‌)పై ఉన్న నేపథ్యంలో వీరు ప్రాక్టీసు చేస్తున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

హోరాహోరీ పోరులో
కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఆరింట గెలిచి 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. చెన్నై, లక్నో, ముంబై, ఆర్సీబీ మధ్య మిగతా మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ ఉంది. రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న రాజస్తాన్‌ సైతం ఆశలు పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్‌-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ ఫలితం కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ నుంచి అధికారికంగా నిష్క్రమించిన సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో ఓడిస్తేనే ఆర్సీబీ రేసులో ఉంటుంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే!

‘కే.జీ.ఎఫ్‌.’ ఏం చేస్తుందో మరి!
ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో కోహ్లి.. మాక్సీ, ఫాఫ్‌నకు బౌలింగ్‌ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఈ సీజన్‌లో డుప్లెసిస్‌ ఇప్పటి వరకు 631 పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. కోహ్లి 438, మాక్సీ 384 పరుగులు చేశారు.  

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌- ఆర్సీబీ తుది జట్టు (అంచనా)
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, అనుజ్ రావత్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

చదవండి: చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement