
ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత శతకాల కారణంగా పసికూన నెదర్లాండ్స్‌పై భారీ స్కోరు సాధించింది. కాగా ప్రపంచకప్ -2023లో భాగంగా అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో డచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన వార్నర్ 104 పరుగులతో అదరగొట్టగా.. వన్‌డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్ 71 రన్స్, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మార్నస్ లబుషేన్ 62 పరుగులతో రాణించాడు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డులకెక్కాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఆఖరి ఓవర్ మూడో బంతికి వాన్ బీక్ బౌలింగ్‌లో అవుటై మాక్సీ నిష్క్రమించాడు.
ఇలా స్టార్ బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు స్కోరు చేసింది. ఇక డచ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ వికెట్లు మాత్రం తీయగలిగారు. వాన్ బీక్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. బాస్ డీ లీడే రెండు, ఆర్యన్ దత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ రనౌట్‌గా వెనుదిరగడంతో మొత్తంగా 8 వికెట్లు పడ్డాయి.
వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్లు ఇవే!
►417/6- అఫ్గనిస్తాన్‌పై, పెర్త్‌లో- 2015
►399/8- నెదర్లాండ్స్‌పై ఢిల్లీలో- 2023
►381/5- బంగ్లాదేశ్‌పై నాటింగ్‌హాంలో- 2019
►377/6- సౌతాఫ్రికా మీద బాసెటెరెలో- 2007
►376/9- శ్రీలంక మీద సిడ్నీలో- 2015.
చదవండి: మాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ