Courtesy: IPL Twitter
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం (ఏప్రిల్ 5) వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు మాక్స్‌వెల్ దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మార్గదర్శకాల ప్రకారం.. బోర్డు కాంట్రాక్ట్ పొందిన ఏ ఆసీస్ ఆటగాడు ఏప్రిల్ 6 లోపు ఐపీఎల్‌లో పాల్గొనకూడదు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు గ్లెన్ మాక్స్‌వెల్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ధృవీకరించాడు.
“క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్ ప్రకారం.. ఏప్రిల్ 6వ తేదీ లోపు కాంట్రాక్టు పొందిన ఆసీస్ ఆటగాళ్లు ఎవరూ అందుబాటులో ఉండరు. కాబట్టి గ్లెన్ మాక్స్‌వెల్ జట్టుతో చేరినప్పటికి అతడు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతడు ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. తన వివాహం కారణంగా మాక్స్‌వెల్ ఐపీఎల్-2022 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
చదవండి: IPL 2022 SRH Vs LSG: ఐపీఎల్ కప్ కావాలా? లేదంటే ఆరెంజ్ క్యాప్ కావాలా?
Our Tom and Jerry forever! 😍🤩@Gmaxi_32 @yuzi_chahal #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/sHDkjMWj4g
— Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2022
Comments
Please login to add a commentAdd a comment