IPL 2022 RCB Vs RR Match Live Score Updates, Latest News And Highlights - Sakshi
Sakshi News home page

IPL 2022 RCB Vs RR Live Score Updates: IPL 2022 Playoffs: రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఆర్సీబీ చిత్తు.. ఫైనల్లో గుజరాత్‌తో ఢీ

Published Fri, May 27 2022 7:06 PM | Last Updated on Fri, May 27 2022 11:06 PM

IPL 2022: RCB Vs RR Match Live Updates And Highlights - Sakshi

PC: IPL.com

ఆర్సీబీను చిత్తు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌.. ఫైనల్లో గుజరాత్‌తో ఢీ

ఐపీఎల్‌-2022 ఫైనల్లో రాజస్తాన్‌ రాయల్స్‌ అడుగు పెట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్‌-2లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ సెంచరీతో చేలరేగాడు. 60 బంతుల్లో 106 పరుగులు సాధించాడు.

ఆర్సీబీ బౌలర్లలో హాజల్‌వుడ్‌ రెండు వికెట్లు,హాసరంగా ఒక వికెట్‌ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్‌ పాటిదార్‌ 58 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్‌ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్‌, అశ్విన్‌ తలా వికెట్‌ పడగొట్టారు. ఇక ఆదివారం(మే29) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ తలపడనుంది.

15 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 126/2
15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్‌(75), పడిక్కల్‌(7), పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
113 పరుగుల వద్ద రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన శాంసన్‌.. హాసరంగా బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. క్రీజులో బట్లర్‌(69), పడిక్కల్‌(1)ఉన్నారు.
8 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 81/1
8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్‌(56), శాంసన్‌(4), పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌ 
61 పరుగుల వద్ద రాజస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన జైశ్వాల్‌.. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 68/1. క్రీజులో బట్లర్‌(45), శాంసన్‌ ఉన్నారు.

2 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 22/0
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(16), బట్లర్‌(6) పరుగులతో ఉన్నారు.

తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్తాన్‌ టార్గెట్‌ 158 పరుగులు
20 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్‌ పాటిదార్‌ 58 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్‌ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. బౌల్ట్‌, అశ్విన్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 154/7
ఆర్‌సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్‌ ​కృష్ణ బౌలింగ్‌లో దినేష్‌ కార్తీక్‌, హాసరంగా పెవిలియన్‌కు చేరారు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 154/7

142 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్‌.. మెకాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

17 ఓవర్లకు ఆర్సీబీ  స్కోర్‌: 139/4
17 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ  నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో కార్తీక్‌(5),లోమ్రోర్(7) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
130 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 58 పరుగులు చేసిన పాటిదార్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దినేష్‌ కార్తీక్‌ వచ్చాడు.

పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ
15 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్‌ 52, లామోర్‌ 2 ఉన్నారు. 40 బంతుల్లోనే పాటిదార్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
14 వ ఓవర్‌లో ఆర్సీబీ కీలకమైన మాక్స్‌వెల్‌ వికెట్‌ను కోల్పోయింది. ఇప్పటికే కోహ్లి, డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరగా.. బౌల్ట్‌ బౌలింగ్‌లో మెకాయ్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా మాక్సీ (24) వికెట్‌ సమర్పించుకున్నాడు. 

సెంచరీకి చేరువగా ఆర్సీబీ
12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు (కోహ్లి 7, డుప్లెసిస్‌ 25) వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్‌ 41, మాక్స్‌వెల్‌ 9 ఉన్నారు.

డుప్లెసిస్‌ (25) ఔట్‌
ఆర్సీబీ కీలక బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ 11 ఓవర్‌లో పెలివియన్‌కు చేరాడు. ఒబెద్‌ మెకాయ్‌ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి తన వ్యక్తిగత స్కోరు 25 వద్ద డుప్లెసిస్‌ ఔట్‌ అయ్యాడు.

10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 74-1 
డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌ కీలకమైన 65 పరుగుల భాగస్వామ్యంతో ఆర్సీబీ 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 25 , రజత్‌ పాటిదార్‌ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 58-1 
ఆర్సీబీ బ్యాటర్లు నిలకడగా ఇన్నింగ్స్‌ నిర్మిస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి బెంగళూరు 58 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 22, రజత్‌ పాటిదార్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 37/1
5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్‌(17), పాటిదార్‌(5) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి ఔట్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆదిలోనే విరాట్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 13/1

ఐపీఎల్‌-2022లో భాగంగా క్వాలిఫైయర్‌-2లో అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన  రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. 

తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

రాజస్తాన్‌ రాయల్స్‌
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement