IPL 2024 CSK Vs RR: గెలిచి నిలిచిన చెన్నై | IPL 2024 CSK Vs RR: Chennai Super Kings Beat Rajasthan Royals By 5 Wickets, Check Score Details Inside| Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs RR: గెలిచి నిలిచిన చెన్నై

Published Mon, May 13 2024 6:00 AM | Last Updated on Mon, May 13 2024 11:56 AM

IPL 2024: Chennai Super Kings beat Rajasthan Royals by five wickets

కీలక పోరులో రాజస్తాన్‌పై విజయం

రాయల్స్‌ను కట్టడి చేసిన సిమర్‌జీత్, తుషార్‌

రాణించిన రుతురాజ్‌ ఓటమితో రాజస్తాన్‌కు తప్పని ‘ప్లే ఆఫ్స్‌’ నిరీక్షణ 

చెన్నై: రాజస్తాన్‌ రాయల్స్‌... చెన్నై సూపర్‌కింగ్స్‌! మొదటి జట్టు గెలిస్తే నేరుగా ‘ప్లే ఆఫ్స్‌’ చేరుతుంది. రెండో జట్టు గెలిస్తే ‘ప్లే ఆఫ్స్‌’ వేటలో ముందడుగు వేస్తుంది. అలా కీలకమైన ఈ పోరులో సొంతగడ్డపై చెన్నై... పేస్‌ బౌలింగ్‌తో కట్టడి చేసి... అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించి రాయల్స్‌కు చెక్‌ పెట్టి... ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ముందుగా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేయగలిగింది. రియాన్‌ పరాగ్‌ (35 బంతుల్లో 47 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... మరెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. 

చెన్నై పేస్‌ బౌలర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిమర్‌జీత్‌ సింగ్‌ (3/26), తుషార్‌ దేశ్‌పాండే (2/30) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనలో చెన్నై 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (41 బంతుల్లో 42 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌) కుదురుగా ఆడాడు. రాజస్తాన్‌ స్పిన్నర్‌ అశి్వన్‌కు 2 వికెట్లు దక్కాయి. 

జోరు తగ్గిన రాజస్తాన్‌ 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో వరుస విజయాలతో హోరెత్తించింది. కానీ ఈ మ్యాచ్‌లో బోర్‌ కొట్టించింది. యశస్వి (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బట్లర్‌ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు), కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (19 బంతుల్లో 15) ఇలా టాపార్డర్‌ వన్డేను తలపించే ఆటే ఆడటంతో పరుగుల్లో వెనుకబడింది. 

రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురెల్‌ (18 బంతుల్లో 28; 1 ఫోర్లు, 2 సిక్స్‌)లు కొట్టిన ఆ కాస్తా సిక్సర్లతో ఓ మోస్తరు స్కోరే చేసింది. కనీసం 150 పరుగుల మార్క్‌ అయిన దాటలేకపోవడంతో చెన్నైకి వారి సొంతగడ్డపై సులువైన లక్ష్యం అయ్యింది. 

నడిపించిన నాయకుడు 
రచిన్‌ రవీంద్ర (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ అసాంతం ఒపిగ్గా ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో మిచెల్‌ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), శివమ్‌ దూబే (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అవుటైనా... లక్ష్యం చిన్నదైనా... రుతురాజ్‌ మాత్రం గెలిచేదాకా జాగ్రత్త పడ్డాడు. 

రిజ్వీ (8 బంతుల్లో 15 నాటౌట్‌; 3 ఫోర్లు) బౌండరీలతో 10 బంతులు మిగిలుండగానే చెన్నై లక్ష్యాన్ని చేరింది. 

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) రుతురాజ్‌ (బి) సిమర్‌జీత్‌ 24; బట్లర్‌ (సి) తుషార్‌ (బి) సిమర్‌జీత్‌ 21; సామ్సన్‌ (సి) రుతురాజ్‌ (బి) సిమర్‌జీత్‌ 15; పరాగ్‌ (నాటౌట్‌) 47; జురెల్‌ (సి) శార్దుల్‌ (బి) తుషార్‌ 28; శుభమ్‌ (సి) దూబే (బి) తుషార్‌ 0; అశి్వన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–43, 2–49, 3–91, 4–131, 5–131. బౌలింగ్‌: తుషార్‌ 4–0–30–2, తీక్షణ 4–0–28–0, శార్దుల్‌ 4–0–32–0, సిమర్‌జీత్‌ 4–0–26–3, జడేజా 4–0–24–0. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి అండ్‌ బి) అశి్వన్‌ 27; రుతురాజ్‌ (నాటౌట్‌) 42; మిచెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్‌ 22; మొయిన్‌ అలీ (సి) అవేశ్‌ ఖాన్‌ (బి) బర్గర్‌ 10; దూబే (సి) పరాగ్‌ (బి) అశి్వన్‌ 18; జడేజా (అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌) 5; సమీర్‌ రిజ్వీ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.2 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–32, 2–67, 3–86, 4–107, 5–121. బౌలింగ్‌: బౌల్ట్‌ 2.2–0–24–0, సందీప్‌ శర్మ 3–0–30–0, అశ్విన్‌ 4–0–35–2, బర్గర్‌ 3–0–21–1, చహల్‌ 4–0–22–1, అవేశ్‌ ఖాన్‌ 2–0–12–0.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement