సన్‌రైజర్స్ హైదరాబాద్ (PC: IPL/BCCI)
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే
లీగ్ దశలో రాజస్తాన్‌కు ఇంకొక్క మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సంజూ సేన మే 19న తలపడనుంది. అయితే, కేకేఆర్‌తో పాటు రాజస్తాన్ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరినా.. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే రాజస్తాన్ రెండో స్థానంలో నిలవగలుగుతుంది.
అప్పుడు నేరుగా కేకేఆర్‌తో క్వాలిఫయర్-1 ఆడుకోవచ్చు. లేదంటే ఎలిమినేటర్ గండం దాటాల్సి ఉంటుంది. ఇక రాజస్తాన్ ఇలా చిక్కుల్లో పడటం సన్‌రైజర్స్ హైదరాబాద్ పాలిట వరంలా మారింది.
సన్‌రైజర్స్ పాలిట వరం.. ఎందుకంటే?
లీగ్ దశలో హైదరాబాద్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్(మే 16), పంజాబ్ కింగ్స్(మే 19)న ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ రెండింటికి రెండూ గెలిస్తే రైజర్స్ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి.
సొంతమైదానం ఉప్పల్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనుండటం, ఇప్పటికే సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీకి ఉన్న విధ్వంసకర రికార్డు చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.
ఒక్కటి ఓడినా కూడా
అలా కాకుండా.. రాజస్తాన్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడి.. సన్‌రైజర్స్ కూడా ఈ రెండింటిలో ఒకటి ఓడితే.. అప్పుడు కూడా హైదరాబాద్ జట్టు టాప్-2తో ముగించే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు(16) వచ్చినా రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్ ముందుంటే రాజస్తాన్‌ను వెనక్కినెట్టడం ఖాయం. అప్పుడు పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.
అలా అయితే మొదటికే మోసం మరి!
అలా కాకుండా ఆఖరి రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. కేకేఆర్- రాజస్తాన్, చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదీ సంగతి!
ఐపీఎల్-2024 పాయింట్ల పట్టిక(మే 15 నాటికి)లో టాప్-5 ఇలా:
1. కేకేఆర్- ఆడినవి 13.. గెలిచినవి 9.. పాయింట్లు 19.. నెట్ రన్‌రేటు 1.428(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)
2. రాజస్తాన్- ఆడినవి 13.. గెలిచినవి 8.. పాయింట్లు 16.. నెట్ రన్‌రేటు 0.273(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)
3. చెన్నై సూపర్ కింగ్స్- ఆడినవి 13.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్‌రేటు 0.528
4. సన్‌రైజర్స్- ఆడినవి 12.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్ రన్‌రేటు.. 0.406.
5. ఆర్సీబీ- ఆడినవి 13.. గెలిచినవి 6.. పాయింట్లు 12.. నెట్ రన్‌రేటు.. 0.387.
విజేతకు దారిలా
👉 క్వాలిఫయర్-1(మే 21): టాప్-2 జట్ల మధ్య.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి..
👉ఎలిమినేటర్(మే 22): టాప్-3, 4 లో ఉన్న జట్ల మధ్య.. ఓడిన జట్టు ఇంటికి..
👉గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.
👉క్వాలిఫయర్-2(మే 24): గెలిచిన జట్టు ఫైనల్‌లో అడుగుపెడుతుంది.
👉ఫైనల్(మే 26): క్వాలిఫయర్-1- క్వాలిఫయర్-2 మధ్య పోరు. గెలిచిన జట్టు చాంపియన్.
చదవండి: Virat Kohli: కోహ్లి నోట రిటైర్మెంట్ మాట.. ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే!
Comments
Please login to add a commentAdd a comment