వరుసగా నాలుగో ఓటమి
పంజాబ్‌ను గెలిపించిన స్యామ్ కరన్
అదరగొట్టిన చహర్, హర్షల్
గువాహటి: పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ ‘షో’ ధాటికి రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఐపీఎల్ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. కెప్టెన్ స్యామ్ కరన్ (2 వికెట్లు; 41 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. స్యామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. జితేశ్ శర్మ (20 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (11 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లతో స్యామ్ కరన్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
పరాగ్ నిలబడటంతో...
ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన రాజస్తాన్ జట్టు బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనర్లు యశస్వి (3), కొహ్లెర్ (18), టాపార్డర్ బ్యాటర్ సామ్సన్ (18) వికెట్లు పారేసుకోవడంతో మెరుపులు కాదుకదా... పరుగుల్లో వేగమే కనిపించలేదు.
పరాగ్, అశ్విన్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంత సేపు ఇన్నింగ్స్ మెరుగవుతుందనిపించింది. కానీ అశ్విన్ అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ఐదుగురు బ్యాటర్లలో బౌల్ట్ (12) మినహా ఇంకెవరూ పది పరుగులైనా చేయలేదు.
కెప్టెన్ ఇన్నింగ్స్
సులువైన లక్ష్యమే అయినా పంజాబ్ తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ (6)... అవేశ్ వేసిన ఐదో ఓవర్లో రోసో (13 బంతుల్లో 22; ఫోర్లు), శశాంక్ (0) అవుట్ కావడంతో 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. కాసేపటికే బెయిర్‌స్టో (14)ను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ సంబరాల్లో మునిగింది.
48/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను కెప్టెన్ స్యామ్ కరన్... జితేశ్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరు వికెట్‌ను కాపాడుకొని తర్వాత భారీషాట్లపై దృష్టి పెట్టారు.
జట్టు స్కోరు 100 దాటాకా ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక జితేశ్ ఆటను చహల్ ముగించాడు. ఈ దశలో స్యామ్ కరన్ పంజాబ్‌ను లక్ష్యంవైపు తీసుకెళ్లాడు. అశుతోష్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 19వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) స్యామ్ కరన్ 4; టామ్ కోహ్లెర్ (సి) జితేశ్ (బి) చహర్ 18; సామ్సన్ (సి) చహర్ (బి) ఎలిస్ 18; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 48; అశ్విన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 28; జురెల్ (సి) హర్‌ప్రీత్ (బి) స్యామ్ కరన్ 0; పావెల్ (సి అండ్ బి) చహర్ 4; ఫెరీరా (సి) రోసో (బి) హర్షల్ 7; బౌల్ట్ (రనౌట్) 12; అవేశ్ ఖాన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–42, 4–92, 5–97, 6–102, 7–125, 8–138, 9–144. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–24–2, అర్ష్ దీప్ 4–0–31–1, ఎలిస్ 4–0– 24–1, హర్షల్ 4–0–28–2, రాహుల్ చహర్ 4–0– 26–2, హర్‌ప్రీత్ 1–0–10–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) చహల్ (బి) బౌల్ట్ 6; బెయిర్‌స్టో (సి) పరాగ్ (బి) చహల్ 14; రోసో (సి) యశస్వి (బి) అవేశ్ 22; శశాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 63; జితేశ్ (సి) పరాగ్ (బి) చహల్ 22; అశుతోష్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–6, 2–36, 3–36, 4–48, 5–111. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–1, సందీప్ 4–0–28–0, అవేశ్ ఖాన్ 3.5–0–28–2, అశ్విన్ 4–0–31–0, చహల్ 4–0–31–2.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X గుజరాత్
వేదిక: హైదరాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment