Sam Curran
-
సామ్ కర్రన్ వీర బాదుడు
టీ20 బ్లాస్ట్ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్ సిబ్లే (67), సామ్ కర్రన్ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్ కర్రన్ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్ రెయినే (23), మైఖేల్ జోన్స్ (37 నాటౌట్), టర్నర్ (27), బాస్ డి లీడ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్ వారెల్, రీస్ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్ కర్రన్, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్ సిబ్లే, సామ్ కర్రన్ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విల్ జాక్స్ 8, లారీ ఈవాన్స్ 1, రోరి బర్న్స్ 10 పరుగులు చేశారు. డర్హమ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, పార్కిన్సన్ తలో రెండు వికెట్లు, బెన్ రెయినే ఓ వికెట్ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్ రెండో క్వార్టర్ ఫైనల్లో ఇవాళ ససెక్స్, లాంకాషైర్ జట్లు తలపడనున్నాయి. -
సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షో
హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ అద్భుత ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోతున్న సామ్.. తాజాగా మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్.. తొలుత బంతితో (20-7-28-2), ఆతర్వాత బ్యాట్‌తో (18 బంతుల్లో 35; 5 సిక్సర్లు) చెలరేగి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో సామ్ సోదరుడు టామ్ కూడా రాణించాడు. టామ్ నాలుగు వికెట్లు తీసి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాశించాడు. సామ్, టామ్ బంతిలో సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. అలెక్స్ డేవిస్ (5), ఆండ్రీ ఫ్లెచర్ (1), లూస్ డి ప్లూయ్ (4), లారీ ఈవాన్స్ (4), కీరన్ పోలార్డ్ (18), జోఫ్రా ఆర్చర్ (10), అకీల్ హొసేన్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సామ్, టామ్‌తో పాటు విల్ జాక్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీశారు.119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. సామ్ కర్రన్, జోర్డన్ కాక్స్ (29 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 85 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ 6, డేవిడ్ మలాన్ 14, సామ్ బిల్లింగ్స్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బ్రేవ్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్, టైమాల్ మిల్స్, క్రిస్ జోర్డన్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు. -
సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షో.. మెరుపు హాఫ్ సెంచరీ.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు
మెన్స్ హండ్రెడ్ లీగ్ 2024లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఆటగాడు సామ్ కర్రన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో (22 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్సర్లు) పాటు హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన (20-11-16-5) నమోదు చేశాడు. సామ్ కర్రన్ వీర లెవెల్లో విజృంభించడంతో ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హండ్రెడ్ లీగ్‌లో సామ్ కర్రన్ నమోదు చేసిన హ్యాట్రిక్ మూడవది. సామ్‌కు ముందు టైమాల్ మిల్స్, ఇమ్రాన్ తాహిర్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కర్రన్‌తో పాటు డేవిడ్ మలాన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. విల్ జాక్స్ (2), జోర్డన్ కాక్స్ (14), డొనోవన్ ఫెరియెరా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యాడు. లండన్ బౌలర్లు ఓలీ స్టోన్, లియామ్ డాసన్, నాథన్ ఇల్లిస్, క్రిచ్లీ తలో వికెట్ పడగొట్టారు.148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ స్పిరిట్.. 95 బంతుల్లో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సామ్ కర్రన్ హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. ఆడమ్ జంపా 3, విల్ జాక్స్, నాథన్ సౌటర్ తలో వికెట్ పడగొట్టారు. లండన్ ఇన్నింగ్స్‌లో కైల్ పెప్పర్ (20), డానియల్ లారెన్స్ (27), హెట్‌మైర్ (20) మాత్రమే 20 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై నార్త్ర్నన్ సూపర్ ఛార్జర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఒరిజినల్స్ 100 బంతుల్లో 153 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. మాథ్యూ హర్స్ట్ (78) ఒరిజినల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్ కరన్ తొలి టీ20 సెంచరీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ టీ20 క్రికెట్లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సర్రే క్రికెటర్.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సర్రే- హాంప్‌షైర్ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన సర్రే టీమ్ తొలుత బౌలింగ్ చేసింది.హాంప్‌షైర్ బ్యాటర్లలో కెప్టెన్ జేమ్స్ వినిస్(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ 66 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్‌షైర్ ఆలౌట్ అయింది.సామ్ కర్రన్ ఫోర్లు, సిక్సర్ల వర్షంఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ విల్ జాక్స్ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్(8), రోరీ బర్ర్స్(7) చేతులెత్తేశారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్ కర్రన్.. ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన సామ్ కర్రన్ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్ కర్రన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా హాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏమిటీ టీ20 బ్లాస్ట్ లీగ్?రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న టీ20 లీగ్ ఈ టీ20 బ్లాస్ట్. ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది.తొలుత దీనిని ట్వంటీ20 కప్(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్లైఫ్ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్ టీ20 బ్లాస్ట్.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్గా పిలుస్తున్నారు.ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్-2024 సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.ఈ సీజన్లో ప్రస్తుతం నార్త్ గ్రూపు నుంచి బర్మింగ్‌హాం 18 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. సౌత్ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. SAM CURRAN!! 🤩What a stunning way to reach your maiden T20 century and win a match! pic.twitter.com/bHPxZ6sTvc— Vitality Blast (@VitalityBlast) July 18, 2024 -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజన్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
PBKS Vs RR: మళ్లీ ఓడిన రాజస్తాన్
గువాహటి: పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ ‘షో’ ధాటికి రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ఐపీఎల్ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. కెప్టెన్ స్యామ్ కరన్ (2 వికెట్లు; 41 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించి పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. స్యామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. జితేశ్ శర్మ (20 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), అశుతోష్ శర్మ (11 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)లతో స్యామ్ కరన్ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పరాగ్ నిలబడటంతో... ఇప్పటికే ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన రాజస్తాన్ జట్టు బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనర్లు యశస్వి (3), కొహ్లెర్ (18), టాపార్డర్ బ్యాటర్ సామ్సన్ (18) వికెట్లు పారేసుకోవడంతో మెరుపులు కాదుకదా... పరుగుల్లో వేగమే కనిపించలేదు. పరాగ్, అశ్విన్ (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంత సేపు ఇన్నింగ్స్ మెరుగవుతుందనిపించింది. కానీ అశ్విన్ అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ఐదుగురు బ్యాటర్లలో బౌల్ట్ (12) మినహా ఇంకెవరూ పది పరుగులైనా చేయలేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ సులువైన లక్ష్యమే అయినా పంజాబ్ తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ (6)... అవేశ్ వేసిన ఐదో ఓవర్లో రోసో (13 బంతుల్లో 22; ఫోర్లు), శశాంక్ (0) అవుట్ కావడంతో 36 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. కాసేపటికే బెయిర్‌స్టో (14)ను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ సంబరాల్లో మునిగింది. 48/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను కెప్టెన్ స్యామ్ కరన్... జితేశ్ శర్మతో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరు వికెట్‌ను కాపాడుకొని తర్వాత భారీషాట్లపై దృష్టి పెట్టారు. జట్టు స్కోరు 100 దాటాకా ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక జితేశ్ ఆటను చహల్ ముగించాడు. ఈ దశలో స్యామ్ కరన్ పంజాబ్‌ను లక్ష్యంవైపు తీసుకెళ్లాడు. అశుతోష్‌తో కలిసి మరో వికెట్ పడకుండా 19వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) స్యామ్ కరన్ 4; టామ్ కోహ్లెర్ (సి) జితేశ్ (బి) చహర్ 18; సామ్సన్ (సి) చహర్ (బి) ఎలిస్ 18; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 48; అశ్విన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 28; జురెల్ (సి) హర్‌ప్రీత్ (బి) స్యామ్ కరన్ 0; పావెల్ (సి అండ్ బి) చహర్ 4; ఫెరీరా (సి) రోసో (బి) హర్షల్ 7; బౌల్ట్ (రనౌట్) 12; అవేశ్ ఖాన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–42, 4–92, 5–97, 6–102, 7–125, 8–138, 9–144. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–24–2, అర్ష్ దీప్ 4–0–31–1, ఎలిస్ 4–0– 24–1, హర్షల్ 4–0–28–2, రాహుల్ చహర్ 4–0– 26–2, హర్‌ప్రీత్ 1–0–10–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి) చహల్ (బి) బౌల్ట్ 6; బెయిర్‌స్టో (సి) పరాగ్ (బి) చహల్ 14; రోసో (సి) యశస్వి (బి) అవేశ్ 22; శశాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; స్యామ్ కరన్ (నాటౌట్) 63; జితేశ్ (సి) పరాగ్ (బి) చహల్ 22; అశుతోష్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–6, 2–36, 3–36, 4–48, 5–111. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–1, సందీప్ 4–0–28–0, అవేశ్ ఖాన్ 3.5–0–28–2, అశ్విన్ 4–0–31–0, చహల్ 4–0–31–2. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X గుజరాత్ వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్‌ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్‌ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్‌కు వచ్చి.. వరుసగా ఏడు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచాడు. అంతేకాదు ధనాధన్ ఇన్నింగ్స్‌తో వింటేజ్ తలాను గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.కానీ పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో ఈ ఫీట్లకు తెరపడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి.. రనౌట్ అయ్యాడు.నిజానికి రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 62) అవుటైన తర్వాత ఏడో స్థానం(పద్దెనిమిదో ఓవర్ ఆఖరి బంతి)లో క్రీజులోకి వచ్చిన ధోని ప్రమాదకరంగా మారతాడని భావించగా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అనూహ్యంగా స్పిన్నర్ రాహుల్ చహర్‌ను బరిలోకి దించాడు.అప్పటికి పేసర్ హర్షల్ పటేల్ ఒక్క ఓవర్ మాత్రమే వేసి ఉన్నా.. చహర్ వైపే మొగ్గు చూపి సామ్ కరన్ కీలక సమయంలో ప్రయోగానికి దిగాడు. అయితే, అతడి అంచనాలను నిజం చేస్తూ రాహుల్ చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ క్రీజులో ఉన్నా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. కీలకమైన పందొమ్మిదో ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో పాటు మొయిన్ అలీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో చెన్నై విజయానంతరం పంజాబ్ సారథి సామ్ కరన్ మాట్లాడుతూ.. ‘‘ప్రయోగాలు అన్నిసార్లూ ఫలితాలను ఇస్తాయనే నమ్మకం లేదు. కానీ నేను రాహుల్ చహర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి అతడి చేతికి బంతినిచ్చాను.అతడు తన ప్రణాళికలను పక్కాగా అమలు చేసి ఫలితం రాబట్టాడు. ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలోనే ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. The artist performing his art 🎨 😎Chepauk roars to MS Dhoni's fireworks 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #CSKvPBKS | @ChennaiIPL pic.twitter.com/WE7AnyBR8e— IndianPremierLeague (@IPL) May 1, 2024 -
IPL 2024: బోణీ కొట్టిన పంజాబ్.. రీఎంట్రీ తొలి మ్యాచ్‌లోనే ఓడిన పంత్
ముల్లన్పూర్: కొత్త సీజన్లో, కొత్త మైదానంలో పంజాబ్ కింగ్స్ భాంగ్రా ఆడుకుంది. తొలి పోరులో చక్కటి విజయంతో బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షై హోప్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (10 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పంజాబ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (47 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్), లయమ్ లివింగ్‌స్టోన్ (21 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 67 పరుగులు జోడించి గెలిపించారు. అంతా అంతంతమాత్రంగా... ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్‡్ష (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ప్రారంభించారు. తొలి 3 ఓవర్లలో వీరిద్దరు 33 పరుగులు రాబట్టారు. మార్ష్ వెనుదిరిగినా...కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న హోప్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 10.3 ఓవర్లలో స్కోరు 94/3తో మెరుగ్గా అనిపించింది. అయితే ఈ దశలో బ్యాటింగ్ తడబడింది. పంత్ (18) ప్రభావం చూపలేకపోగా...భుయ్ (3), స్టబ్స్ (5) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగలిగాడు. అయితే చివర్లో పొరేల్ దూకుడు ఢిల్లీకి చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. స్కోరు 137/7 వద్ద క్రీజ్‌లోకి వచ్చిన అతను హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 6, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. రాణించిన లివింగ్‌స్టోన్... ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో శిఖర్ ధావన్ (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) జోరు ప్రదర్శించాడు. అయితే అతనితో పాటు బెయిర్‌స్టో (9) ఐదు బంతుల వ్యవధిలో వెనుదిరగ్గా...ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 26; 5 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. కానీ ప్రభ్‌సిమ్రన్‌తో పాటు జితేశ్ శర్మ (9) తన వరుస ఓవర్లలో అవుట్ చేసి కుల్దీప్ ఆశలు పెంచాడు. గెలుపు కోసం 51 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో కరన్, లివింగ్‌స్టోన్ జత కలిశారు. 33 పరుగుల వద్ద కరన్ ఇచ్చిన క్యాచ్‌ను స్టబ్స్ వదిలేయడం కలిసొచ్చింది. వీరిద్దరిని కొద్ది సేపు ఢిల్లీ బౌలర్లు నిలువరించగలిగారు. అయితే మార్‡్ష వేసిన 15వ, 17వ ఓవర్లలో కలిపి మొత్తం 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో పంజాబ్ 36 పరుగులు రాబట్టడంతో ఆట స్వరూపం మారిపోయింది. విజయానికి పది పరుగుల దూరంలో కరన్ అవుటైనా...లివింగ్‌స్టోన్ మిగతా పనిని పూర్తి చేశాడు. మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ఆరో ఓవర్లోనే ఇషాంత్ గాయపడటం కూడా ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రధాన బౌలర్ దూరం కావడంతో ప్రత్యామ్నాయం లేక పరుగులు ఇస్తున్నా సరే మార్ష్‌తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జితేశ్ (బి) హర్షల్ 29; మార్ష్ (సి) చహర్ (బి) అర్ష్‌దీప్ 20; హోప్ (సి) బ్రార్ (బి) రబాడ 33; పంత్ (సి) బెయిర్‌స్టో (బి) హర్షల్ 18; భుయ్ (సి) జితేశ్ (బి) బ్రార్ 3; స్టబ్స్ (సి) శశాంక్ (బి) చహర్ 5; అక్షర్ (రనౌట్) 21; సుమీత్ (సి) జితేశ్ (బి) అర్ష్‌దీప్ 2; పొరేల్ (నాటౌట్) 32; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–39, 2–74, 3–94, 4–111, 5–111, 6–128, 7–138, 8–147, 9–174. బౌలింగ్: స్యామ్ కరన్ 1–0–10–0, అర్‡్షదీప్ 4–0–28–2, రబాడ 4–0–36–1, హర్‌ప్రీత్ బ్రార్ 3–0–14–1, రాహుల్ చహర్ 4–0–33–1, హర్షల్ 4–0–47–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) ఇషాంత్ 22; బెయిర్‌స్టో (రనౌట్) 9; ప్రభ్‌సిమ్రన్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 26; స్యామ్ కరన్ (బి) అహ్మద్ 63; జితేశ్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 9; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 38; శశాంక్ (సి) పంత్ (బి) అహ్మద్ 0; బ్రార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–34, 2–42, 3–84, 4–100, 5–167, 6–167. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–43–2, ఇషాంత్ 2–0–16–1, మార్ష్ 4–0–52–0, అక్షర్ 4–0–25–0, కుల్దీప్ 4–0–20–2, సుమీత్ 1.2–0–19–0. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్‌స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్‌ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
WI VS ENG 1st ODI: చెత్త రికార్డు మూటగట్టుకున్న సామ్ కర్రన్
వెస్టిండీస్‌తో నిన్న (డిసెంబర్ 3) జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ లేకుండా (9.5 ఓవర్లు) 98 పరుగులు సమర్పించుకున్న కర్రన్.. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కర్రన్‌కు ముందు ఈ చెత్త రికార్డు స్టీవ్ హార్మిసన్ పేరిట ఉండేది. 2006లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హార్మిసన్ వికెట్ లేకుండా 97 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అతి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో క్రిస్ జోర్డన్ (2015లో 1/97), జేక్ బాల్ (2017లో 1/94) కర్రన్, హార్మిసన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (45), జాక్ క్రాలే (48), సామ్ కర్రన్ (28), బ్రైడన్ కార్స్ (31 నాటౌట్) పర్వాలేదనిపించగా.. విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్‌తో పాటు అలిక్ అథనాజ్ (66), రొమారియో షెపర్డ్ (49), బ్రాండన్ కింగ్ (35), షిమ్రోన్ హెట్‌మైర్ (32) రాణించారు. ఇరు జట్ల మధ రెండో వన్డే డిసెంబర్ 6న జరుగనుంది. -
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్‌కు షాకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్‌గా శిఖర్ ధవన్‌ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షారుఖ్ ఖాన్ భానుక రాజపక్స మోహిత్ రతీ బల్తేజ్ ధందా రాజ్ అంగద్ బవా పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. శిఖర్ ధవన్ (కెప్టెన్) జానీ బెయిర్‌స్టో జితేశ్ శర్మ ప్రభ్‌సిమ్రన్ సింగ్ మాథ్యూ షార్ట్ హర్‌ప్రీత్ బ్రార్ అథర్వ తైడే రిషి ధవన్ సామ్ కర్రన్ సికంబర్ రజా లియామ్ లివింగ్‌స్టోన్ గుర్నూర్ సింగ్ బ్రార్ శివమ్ సింగ్ రాహుల్ చాహర్ అర్షదీప్ సింగ్ హర్‌ప్రీత్ బ్రార్ విధ్వత్ కావేరప్ప కగిసో రబాడ నాథన్ ఇల్లిస్ -
పంజాబ్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడికి గుడ్‌బై!?
ఐపీఎల్-2024 సీజన్ కోసం ఆయా ప్రాంఛైజీలు అంటిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించడానికి గడువు నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 4లోపు ఫ్రాంచైజీలు తమ రిటేన్షన్ లిస్ట్‌ను అందజేయాలి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్ యువ సంచలనం సామ్ కుర్రాన్‌ను పంజాబ్ కింగ్స్ వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023 మినీవేలంలో కుర్రాన్‌ను ఏకంగా రూ.18.5 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ గత సీజన్లో తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కుర్రాన్ విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తీవ్రనిరాశపరిచాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 276 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టాడు. ధావన్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైతే కుర్రానే జట్టును నడిపించాడు. అయితే అతడిని విడిచిపెట్టి వేలంలో మరో యువ ఆల్‌రౌండర్ సొంతం చేసుకోవాలని పంజాబ్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా: ఏబీ డివిలియర్స్ -
రసవత్తర పోరు.. ఆఖర్లో హైడ్రామా.. ఎట్టకేలకు గెలిపించిన సామ్ కర్రన్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన రసవత్తర పోరులో ఓవల్ ఇన్విన్సిబుల్స్ స్వల్ప తేడాతో గటెక్కింది. ఇన్విన్సిబుల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి లండన్ స్పిరిట్ 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), విల్ జాక్స్ (42 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 46 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (17 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. లండన్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, డారిల్ మిచెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ టీమ్.. ఆఖరి బంతి వరకు పోరాడి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సామ్ కర్రన్ వేసిన 98వ బంతిని క్రిచ్లీ సిక్సర్ బాది లండన్ గెలుపుపై ఆశలు చిగురింపజేయగా.. ఆఖరి బంతికి డాట్ బాల్ వేసి సామ్ కర్రన్ లండన్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ఈ మధ్యలో పెద్ద డ్రామా జరిగింది. లండన్ 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో వైట్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో బౌండరీకి వెళ్లాల్సిన బంతిని అడ్డుకుని 2 పరుగులు సేవ్ చేయగా, ఆఖరి బంతిని కర్రన్ నో బాల్ వేసి మళ్లీ లండన్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఈ బంతికి క్రిచ్లీ రెండు పరుగు రాబట్టడంతో పాటు నో బాల్ ఫలితంగా లండన్‌కు అదనంగా మరో పరుగు, ఫ్రీ హిట్ లభించాయి. దీంతో ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సామ్ కర్రన్ ఆఖరి బంతిని అద్భుతమై యార్కర్‌గా సంధించడంతో లండన్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఫలింతగా ఇన్విన్సిబుల్స్ రసవత్తర పోరులో విజయం సాధించింది. లండన్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (61) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో మాథ్యూ క్రిచ్లీ (13 బంతుల్లో 32 నాటౌట్) ఇన్విన్సిబుల్స్ ఆటగాళ్లకు చమటలు పట్టించాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ చాపెల్, సామ్ కర్రన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సామ్ కర్రాన్ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సర్రే క్లికెట్ క్లబ్‌కు సామ్ కర్రాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో , గ్లామోర్గాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్రాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు బౌలర్లను కర్రాన్ ఊచకోత కోశాడు. కర్రాన్ కేవలం 18 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సామ్ కర్రాన్ తన పేరిట లిఖించకున్నాడు. ఓవరాల్ ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఓపెనర్లు విల్ జాక్స్(69), ఏవెన్స్(40) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే..238 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. గ్లామోర్గాన్ బ్యాటర్లలో క్రిస్ కోక్(49) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సర్రే బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, నరైన్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని Sam Curran was in electric form with the bat last night ⚡️ His 59 from 22 helped Surrey to their third-highest T20 total ever - 238/5!#Blast23 pic.twitter.com/ymYCoQRux3 — Vitality Blast (@VitalityBlast) June 21, 2023 -
ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ
టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సోమర్సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు. ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్‌పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం -
విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ
టీ20 బ్లాస్ట్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్స్, బ్రదర్స్ సామ్ కర్రన్, సామ్ కర్రన్లు విధ్వంసం సృష్టించారు. ససెక్స్‌తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత సామ్ (35 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో టామ్ (9 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అసలుసిసలు టీ20 మజాను ప్రేక్షకులకు అందించారు. వీరికి తోడు లారీ ఈవాన్స్ (51 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సర్రే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 బ్లాస్ట్‌లో ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్. ససెక్స్ బౌలర్లలో తైమాల్ మిల్స్, హెన్రీ క్రొకోంబ్ తలో 2 వికెట్లు, మెక్ ఆండ్రూ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ససెక్స్.. సునీల్ నరైన్ (3/12), కెమరూన్ స్టీల్ (3/41), విల్ జాక్స్ (2/29), టామ్ లావెస్ (2/17) ధాటికి 14.5 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా సర్రే 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టామ్ అల్సోప్ (17), మైఖేల్ బుర్గెస్ (12), డానియల్ ఇబ్రహీం (17), హడ్సన్ ప్రెంటిస్ (11)లు రెండంకెల స్కోర్లు చేశారు. A 🆕 entry on the highest Blast totals list 👀 @surreycricket with an astonishing display of hitting tonight!#Blast23 pic.twitter.com/xF1zYWKo5q — Vitality Blast (@VitalityBlast) June 9, 2023 కాగా, ఐపీఎల్లో కోట్లు కుమ్మరించినా ఆడని సామ్ కర్రన్ స్వదేశంలో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో మాత్రం చెలరేగిపోతున్నాడు. కర్రన్ ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో మెరుపు వేగంతో పరుగుల సాధించడంతో (237, 13 సిక్సర్లు) పాటు వికెట్లు (7) కూడా తీస్తున్నాడు. కర్రన్ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా సర్రే పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చదవండి: బజ్‌బాల్ లేదు తొక్కా లేదు.. మీ పప్పులు మా ముందు ఉడకవు.. ఇంగ్లండ్‌కు స్టీవ్ స్మిత్ వార్నింగ్ -
జోస్ బట్లర్ వీరవిహారం.. శివాలెత్తిన సామ్ కర్రన్
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా నిన్న (జూన్ 7) జరిగిన వివిధ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు పేట్రేగిపోయారు. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహించిన జోస్ బట్లర్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. గ్లామోర్గన్‌పై ససెక్స్ ఆటగాళ్లు లారీ ఈవాన్స్ (60 బంతుల్లో 118 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు), సామ్ కర్రన్ (29 బంతుల్లో 66; ఫోర్, 7 సిక్సర్లు, 2/36) రెచ్చిపోయారు. ఫలితంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఘన విజయం సాధించాయి. బట్లర్ వీరవిహారం.. లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్సెస్టర్‌షైర్ ఆడమ్ హోస్ (29 బంతుల్లో 42), మిచెల్ సాంట్నర్ (33 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. లాంకాషైర్ బౌలర్లలో డారిల్ మిచెల్ 3, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 2, లూక్ వుడ్, టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో జోస్ బట్లర్, స్టీవ్ క్రాఫ్ట్ (40), డారిల్ మిచెల్ (33 నాటౌట్), లివింగ్‌స్టోన్ (23) రాణించడంతో లాంకాషైర్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్సెస్టర్‌షైర్ బౌలర్లలో పెన్నింగ్టన్, పాట్రిక్ బ్రౌన్ తలో 2 వికెట్లు, ఆడమ్ ఫించ్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన ఈవాన్స్.. శివాలెత్తిన సామ్ కర్రన్ గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. లారీ ఈవాన్స్, సామ్ కర్రన్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన గ్లామోర్గన్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసి 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సర్రే బౌలర్లలో కర్రన్, అట్కిన్సన్, క్రిస్ జోర్డన్ తలో 2 వికెట్లు, సీన్ అబాట్,సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. నిన్న జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఎసెక్స్‌పై కెంట్ 4 వికెట్ల తేడాతో.. వార్విక్‌షైర్‌పై డెర్బీషైర్ 6 వికెట్ల తేడాతో.. సోమర్సెట్పై హ్యాంప్‌షైర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించాయి. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా -
ఐపీఎల్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ న్ని వదిలించుకుంటున్న పంజాబ్
-
IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..?
ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు (రూ. 18.5 కోట్లు) సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ వదిలించుకోనుందా.. ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఐపీఎల్-2023లో సామ్ కర్రన్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పంజాబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం పరోక్షంగా సమర్ధించాడు. ఐపీఎల్ 2024 వేలానికి ముందు పంజాబ్.. కర్రన్‌ను తప్పక వదించుకోవాలని భావిస్తుంటుందని అన్నాడు. కర్రన్.. సీఎస్కే తరఫున అడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు పంజాబ్ తరఫున ఆడలేదని, అతనిపై పెట్టిన పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేదని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో కర్రన్ ప్రదర్శన చూసి పంజాబ్ యాజమాన్యం తొందరపడిందని , అతనిపై వెచ్చించిన సొమ్ముతో నలుగురు నిఖార్సైన ఆల్రౌండర్లను సొంతం చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కర్రన్‌పై వెచ్చించిన సొమ్ములో పంజాబ్ కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోయిందని, అతనిపై భారీ అంచనాలే పంజాబ్‌ను వరుసగా తొమ్మిదో సారి ప్లే ఆఫ్స్‌కు చేరనీయకుండా చేశాయని తెలిపాడు. గత సీజన్లో కర్రన్‌కు కొత్త బాల్ అప్పజెప్పిన పంజాబ్.. అర్షదీప్‌కు అన్యాయం చేసిందని, అర్షదీప్ ఫెయిల్యూర్‌కు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. కొత్త బంతితో కర్రన్ అద్భుతంగా చేయగలిగినప్పటికీ... భారత పిచ్‌లు అందుకు సహకరించవని అన్నాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్లో కర్రన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.96 స్ట్రయిక్ రేట్‌తో 276 పరుగులు చేసి, 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే ఏం చేయలేకపోయాడు.. అక్కడికి వెళ్లగానే..?
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు. నిన్న (మే 25) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడిన సామ్ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్సర్లు).. అన్న టామ్ కర్రన్ (33 బంతుల్లో 50; 8 ఫోర్లు) సహకారంతో తన జట్టు సర్రేను గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన మిడిల్సెక్స్.. విల్ జాక్స్ (3/17), గస్ అట్కిన్సన్ (3/20), సునీల్ నరైన్ (2/37), సీన్ అబాట్ (1/22) ధాటికి 14.5 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ హోల్డెన్ (43), పీటర్ మలాన్ (30), జాన్ సిమ్సన్ (15), జో క్రాక్నెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బంతితో ఇరగదీసిన విల్ జాక్స్ బ్యాటింగ్‌లోనూ (22 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు కనబర్చి, తన జట్టులో గెలుపులో కీలకపాత్ర పోషించిన సామ్ కర్రన్‌పై కొందరు భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించని సొమ్మునిచ్చిన ఐపీఎల్లో ఏం చేయలేకపోయాడు కానీ, సొంత దేశ లీగ్‌లో మాత్రం ఇరగదీస్తున్నాడని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2023లో 18.50 కోట్లు పెడితే ఒక్క మ్యాచ్‌లో కూడా పంజాబ్‌ను గెలిపించలేకపోయిన సామ్.. టీ20 బ్లాస్ట్‌లో వచ్చీ రాగానే అన్న సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన సామ్ కర్రన్.. 27.60 సగటున, 135.96 స్ట్రయిక్ రేట్‌తో ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 276 పరుగులు చేశాడు. అలాగే 10 వికెట్లు కూడా పడగొట్టాడు. సామ్ తీసుకున్న మొత్తంతో పోలిస్తే అతని ప్రదర్శన రవ్వంత కూడా కాదు. 10 లక్షల కనీస ధర పెట్టిన ఆటగాళ్లు సైతం అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇరగదీస్తున్న వేల కోట్లు కుమ్మరించి కొనుక్కున్న సామ్ తేలిపోవడం నిజంగా బాధాకరం. చదవండి: IPL 2023: అత్యుత్తమ భారత ఆటగాళ్లతో కూడిన జట్టు ఇదే..! -
ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు
రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ఈ వారంతో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, లక్నోసూపర్జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇక ఎలిమినేటర్ పోరులో లక్నో, ముంబై తలపడనున్నాయి. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ 16వ సీజన్ విదేశీ ఆటగాళ్లకంటే దేశవాలీ ఆటగాళ్లనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అమ్ముడయిన చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ టైడే, తుషార్ దేశ్‌పాండే, యశస్వి జైశ్వాల్, మతీషా పతీరానా సహా చాలా మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఐపీఎల్ 2023 సీజన్‌కు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లలో చాలా మంది దారుణంగా విఫలమయ్యారు. కొందరు గాయాలతో సీజన్‌కు దూరంగా ఉంటే.. అవకాశాలు ఇచ్చినా ఆడడంలో ఫెయిలయ్యారు. మరి ఐపీఎల్ 16వ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికి ఫ్లాప్ షో కనబరిచిన టాప్-5 విదేశీ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. బెన్ స్టోక్స్(సీఎస్కే): Photo: IPL Twitter ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సీఎస్కే తరపున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 18 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అసలు సీజన్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ సీఎస్కేకు కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికి స్టోక్స్‌ను జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. అలా రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైన స్టోక్స్ ఐర్లాండ్‌తో టెస్టుమ్యాచ్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్కే బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్): Photo: IPL Twitter జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కీలకంగా మారడం అటుంచి తన ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. సీజన్లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆర్చర్ 9.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారిలో ఆర్చర్ ఒకడిగా మిగిలిపోయాడు. హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్): Photo: IPL Twitter ఐపీఎల్ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్‌పై మంచి అంచనాలున్నాయి. ఎస్ఆర్హెచ్ ఏరికోరి బ్రూక్‌ను రూ. 13.35 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ తన ధరకు బ్రూక్ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి అంచె పోటీల్లో అన్ని మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ తర్వాత అంచె పోటీల్లో కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిన బ్రూక్ ఐపీఎల్లో మాత్రం ఫ్లాప్ షో చేశాడు. కగిసో రబాడ(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరపున టాప్ బౌలర్. అతని వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రబాడ ఐపీఎల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన రబాడ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. సామ్ కరన్(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న సామ్ కరన్.. ధావన్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా సామ్ కరన్ అందరిలో కాస్త బెటర్‌గా కనిపిస్తున్నప్పటికి.. అతనికి వెచ్చించిన ధర ప్రకారం ఈ ప్రదర్శన ఫ్లాప్ అని చెప్పొచ్చు. చదవండి: 'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!' -
లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా!
ఐపీఎల్-2023లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో పంజాబ్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్.. ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక ఈ పంజాబ్ విజమంలో ఆ జట్టు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. శిఖర్ ధావన్, లైమ్ లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట.. ప్రభ్సిమ్రాన్ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ప్రభ్సిమ్రాన్ కేవలం 65 బంతుల్లోనే 10ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. పంజాబ్ 161 గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ప్రభ్సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన ప్రభ్‌సిమ్రాన్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా పంజాబ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవతున్నాడని సెహ్వాగ్ విమర్శించాడు. కాగా ఐపీఎల్లో వేలంలో శామ్ కర్రాన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18. 5 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన శామ్ కర్రాన్ 216 పరుగులతో పాటు కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ప్రభ్‌సిమ్రన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. పంజాబ్‌కు చాలా బెనిఫిట్ కలుగుతుంది. ప్రభ్‌సిమ్రన్ తన అరంగేట్ర సీజన్లో భారీ మొత్తం (రూ. 4.8 కోట్లు) దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు కేవలం రూ. 60 లక్షలకు మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ తన టాలెంట్ ఎంటో చూపించాడు. అతడికి సెంచరీలు కొట్టగలిగే సత్తా ఉంది అని నిరూపించాడు. ఇటువంటి యువ ఆటగాడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపిస్తుంటే అంతకు మించి ఏమి కావాలి. సామ్ కర్రాన్‌ను 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగొలు చేసింది. ఏం లాభం. ఒక్క మ్యాచ్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా 𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥 Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM — JioCinema (@JioCinema) May 13, 2023 -
అర్ష్‌దీప్ సూపర్ బౌలింగ్.. పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పోరాడి ఓడింది.215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు, కామెరాన్ గ్రీన్ 43 బంతుల్లో 67, రోహిత్ శర్మ 27 బంతుల్లో 44 పరుగులు చేయగా.. టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 25 నాటౌట్ పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఉన్నంతసేపు మ్యాచ్ ముంబైవైపే ఉంది. కానీ సెకండ్ స్పెల్ బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ సూర్యకుమార్ వికెట్‌తో పాటు.. తన చివరి ఓవర్లో తిలక్ వర్మ, నెహాల్ వదేరాలను ఔట్ చేసి పంజాబ్ వరుస ఓటములకు బ్రేక్ వేశాడు. సూర్యకుమార్ ఔట్.. ముంబై 184/4 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ 25 బంతుల్లో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 32 పరుగులు కావాలి. 14 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 132/2 తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 46 ,సూర్యకుమార్ 39 పరుగులతో ఆడుతున్నారు. రోహిత్ శర్మ(44) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ముంబై 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. గ్రీన్ 43, సూర్యకుమార్ 20 పరుగులతో ఆడుతున్నారు. 9 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 79/1 తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 35, రోహిత్ శర్మ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ముంబై ఇండియన్స్ 54/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 24, రోహిత్ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఒక్క పరుగు చేసిన ఇషాన్ కిషన్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు.. ముంబై టార్గెట్ 215 ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ కరన్ 55 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. హర్‌ప్రీత్ బాటియా 41 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ ఏడు బంతుల్లోనే 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో పంజాబ్ కింగ్స్ 160 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ అర్జున్ టెండూల్కర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మర్చేసింది. ఆ ఓవర్లో అర్జున్ వైడ్, నోబ్ సహా 6,4,4,6,4,4,1 మొత్తంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై బౌలర్లలో గ్రీన్, పియూష్ చావ్లా తలా రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, అర్జున్, జాసన్ బెహండార్ఫ్లు తలా ఒక వికెట్ తీశారు. 17 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 162/4 14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ 44, సామ్ కరన్ 33 పరుగులతో ఆడుతున్నారు. 14 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 105/4 14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ 15, బాటియా 8 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఆరు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 58/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 25, అథర్వ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 11 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ గ్రీన్ బౌలింగ్‌లో చావ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం 31వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదు ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం రెండు వరుస ఓటములను ఎదుర్కొంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, ప్రభ్సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్