
Ben Stokes, Sam Curran Available For IPL 2023 Auction: టీ20 వరల్డ్‌కప్-2022 హీరోలు, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రన్‌లు.. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా పాక్‌తో జరిగిన ఫైనల్లో సంచలన ప్రదర్శన నేపథ్యంలో ఈ ఇద్దరు మ్యాచ్ విన్నర్లపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడం కోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.
వివిధ కారణాల చేత గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న వీరిని దక్కించేందుకు, ఎంత ధర అయినా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తమ పర్స్ నుంచి ఏకంగా 20 కోట్లు వెచ్చించేందుకైనా రెడీ అన్న సంకేతాలు పంపాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్-2023 సీజన్ పూర్తయిన వెంటనే (జూన్) ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వీరు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా, కర్రన్ ఆ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న నేపథ్యంలో వీరు ఐపీఎల్-2023పై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఐపీఎల్‌లో స్టోక్స్ ప్రస్తానం.. 2017 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.. స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో 14.5 కోట్లకు సొంతం చేసుకోగా, ఆతర్వాతి సీజనే (2018) రాజస్తాన్ రాయల్స్ అతన్ని 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వరుసగా రెండు సీజన్ల పాటు (2019, 2020) ఆర్‌ఆర్ తరఫున సత్తా చాటిన స్టోక్స్.. 2021 సీజన్‌లో గాయపడటంతో టోర్నీ ఆరంభంలోనే జట్టును వీడాడు. ఆతర్వాత 2022 మెగా వేలంలో ఆర్‌ఆర్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో అలకబూనిన స్టోక్స్.. మెగా వేలంలో తన పేరును సైతం రిజిస్టర్ చేసుకోలేదు.
🚨 Ben Stokes have been made available for the IPL mini auction.#IPLAuction #IPL2023 #IPL2023Auction #Ipl2023Retention #IPLretention #ipltrade #IPL #iplauction2023 #iplretentions #IPLT20 #BenStokes pic.twitter.com/V9P1Z1rrCZ
— Top Edge Cricket (@topedge_cricket) November 15, 2022
ఐపీఎల్‌లో సామ్ కర్రన్ ప్రస్తానం.. 2019లో టీమిండియాపై సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన సామ్ కర్రన్‌ను అదే ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.2 కోట్ల భారీ మొత్తం వెచ్చింది కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో బంతితో, బ్యాట్‌తో ఓ మోస్తరుగా రాణించిన కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ 2020 వేలంలో అనూహ్యంగా వదులుకుంది. దీంతో ఆ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. సీఎస్‌కే తరఫున 2020, 2021 సీజన్‌లలో పర్వాలేదనిపించిన కర్రన్.. 2022 మెగా వేలానికి ముందు గాయం బారిన పడి, ఆ సీజన్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు.
చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..!