ఐపీఎల్ మినీ వేలం నేపథ్యంలో రైనా వ్యాఖ్యలు(PC: IPL/ Suresh Raina Twitter)
IPL 2023 Mini Auction- Watch Out: ఐపీఎల్- 2023 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆక్షన్‌లో సత్తా చాటగల అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లేనంటూ ముగ్గురు యువ క్రికెటర్ల పేర్లు ప్రస్తావించాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్ సహా అఫ్గన్ యువ కెరటం అల్లా మహ్మద్‌లపై ప్రశంసలు కురిపించాడు.
ఈ ముగ్గురు తమ తమ జట్ల తరఫున అద్భుత ప్రదర్శన చేశారని, వేలంలో వీరు మంచి ధర పలకడం ఖాయమని మిస్టర్ ఐపీఎల్ అభిప్రాయపడ్డాడు. కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది.
మొత్తంగా 87 బెర్త్‌ల కోసం బరిలో 405 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఉనాద్కట్ ఇంకా..
ఈ మేరకు.. ‘‘భారత క్రికెటర్లలో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలిపిన కెప్టెన్, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్, తమిళనాడు ప్లేయర్ జగదీశన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి.
ఆ ఐరిష్ బౌలర్
విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ సహా టీ20 ప్రపంచకప్-2022లో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కోసం పోటీ నెలకొంటుంది.
సూపర్‌స్టార్ కాగలడు!
అన్‌క్యాప్డ్ ప్లేయర్లలో ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్, అల్లా మహ్మద్ సత్తా చాటగలరు. నేను ముజ్తాబాతో కలిసి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాను. తను అద్భుతమైన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్.
ఇక సౌరాష్ట్ర తరఫున సమర్థ్ వ్యాస్ 150 స్ట్రైక్‌రేటుతో మెరిశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్-5 బ్యాటర్లలో ఒకడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఇక అల్లా మహ్మద్.. ఆరడుగుల మీద రెండు అంగుళాల ఎత్తు ఉండే ఈ 15 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. సూపర్‌స్టార్ కాగలడు’’ అని రైనా పేర్కొన్నాడు.
కాగా దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున ఆడుతున్న ముజ్తాబా యూసఫ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక సమర్థ్ వ్యాస్.. సౌరాష్ట్ర తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అఫ్గనిస్తాన్ యువ సంచలనం 15 ఏళ్ల అల్లా మహ్మద్ అండర్-19 టోర్నీలో(బెస్ట్ 4/15) రాణిస్తున్నాడు.
మిస్టర్ ఐపీఎల్
చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. ఐపీఎల్‌లో 5528 పరుగులు సాధించాడు. 205 మ్యాచ్‌లలో 136.76 స్ట్రైక్‌రేటుతో ఈ మేరకు రన్స్ చేసి మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు. రైనా ఐపీఎల్ ఖాతాలో ఓ సెంచరీ, 39 అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: Ind Vs Ban: టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు..
IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..!
Comments
Please login to add a commentAdd a comment