IPL 2023 Auction Player List, Updates and Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 Mini Auction Live Updates: సరికొత్త రికార్డు.. సామ్‌ కరన్‌కు రూ. 18.50 కోట్లు

Published Fri, Dec 23 2022 2:50 PM | Last Updated on Fri, Dec 23 2022 9:37 PM

IPL 2023 Mini Auction Dec 23 2022 Updates And Highlights - Sakshi

IPL 2023 Mini Auction Details:
కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో ఇంగ్లండ్‌ నుంచి ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్‌ కరన్‌(18.50 ​కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌) ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక  ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌(రూ. 16.25 కోట్లు- సీఎస్‌కే)తో పాటు బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌(రూ. 13.25 కోట్లు- ఎస్‌ఆర్‌హెచ్‌) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు.

ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరున్‌ గ్రీన్‌ను ఎవరు ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌ రూ. 17.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా కామెరున్‌ గ్రీన్‌ నిలిచాడు. ఇక చివరగా ఇంగ్లండ్‌ టెస్టు స్పెషలిస్ట్‌ జో రూట్‌ రూ. కోటి కనీస ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. దీంతో వేలం ముగిసినట్లు ప్రకటించారు. 

రిలీ రోసౌకు రూ.4.6 కోట్లు
► జో రూట్- రూ. కోటి- రాజస్తాన్‌ రాయల్స్‌
► షకీబ్ అల్ హసన్- రూ. 1.5 కోట్లు- కేకేఆర్‌
►రిలీ రోసౌ- రూ.4.6 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌

►లిట్టన్ దాస్- రూ.50 లక్షలు- కేకేఆర్‌  
►అకేల్ హోసేన్- రూ.1 కోటి- ఎస్‌ఆర్‌హెచ్‌ 

►ఆడమ్ జంపా- రూ. 1.5 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌
►అన్మోల్‌ప్రీత్ సింగ్- రూ.20 లక్షలు- ఎస్‌ఆర్‌హెచ్‌
►కేఎమ్‌ ఆసిఫ్- రూ.30 లక్షలు- రాజస్తాన్‌ రాయల్స్‌

►ఎం అశ్విన్- రూ.20 లక్షలు- రాజస్తాన్‌ రాయల్స్‌
►మన్‌దీప్ సింగ్- రూ. 50 లక్షలు- కేకేఆర్‌
►ఆకాష్ వశిష్ట్- రూ. 20 లక్షలు- రాజస్తాన్‌ రాయల్స్‌

►యుధ్వీర్ చరక్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
►రాఘవ్ గోయల్- రూ. 20 లక్షల- ముంబై ఇండియన్స్‌
►అబుల్ పీఏ- రూ. 20 లక్షలు- రాజస్తాన్‌ రాయల్స్‌

జోషువా లిటిల్‌కు రూ. 4.4 కోట్లు
►జోషువా లిటిల్‌- రూ.4.4 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌
►అవినాశ్‌ సింగ్‌- రూ. 60 లక్షలు-  ఆర్‌సీబీ
►నితీష్‌ కుమార్‌ రెడ్డి- రూ.20 లక్షలు- ఎస్‌ఆర్‌హెచ్‌

►డేవిడ్‌ వీస్‌- రూ. కోటి- కేకేఆర్‌
►స్వప్నిల్‌ సింగ్‌- రూ. 20 లక్షలు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
►మోహిత్‌ శర్మ- రూ. 50 లక్షలు- గుజరాత్‌ టైటాన్స్‌
►షామ్స్‌ ములానీ- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్‌

►రాజన్‌ కుమార్‌- రూ.70 లక్షలు- ఆర్‌సీబీ
►విద్వాంత్‌ కవెరప్ప- రూ.20లక్షలు- పంజాబ్‌ కింగ్స్‌
► విష్ణు వినోద్‌- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్‌

► డోన్‌వన్‌ ఫెర్రెరియా- రూ. 20 లక్షలు- కేకేఆర్‌
► ఉర్విల్‌ పటేల్‌- రూ. 20లక్షలు- గుజరాత్‌ టైటాన్స్‌
► మయాంక్‌ డాగర్‌- రూ. 1.8 కోట్లు- ఎస్‌ఆర్‌హెచ్‌

► డాన్‌ జాన్సెన్‌- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్‌
► ప్రేరక్‌ మన్కడ్‌- రూ. 20 లక్షలు- లక్నో సూపర్‌జెయింట్స్‌
► పియూష్‌ చావ్లా- రూ. 50 లక్షలు- ముంబై ఇండియన్స్‌

► అమిత్‌ మిశ్రా- రూ. 50 లక్షలు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
► హర్‌ప్రీత్‌ బాటియా- రూ. 40 లక్షలు- పంజాబ్‌ కింగ్స్‌
► మనోజ్‌ బాండగే- రూ.20 లక్షలు- ఆర్‌సీబీ

► రొమారియో షెపర్డ్‌- రూ. 50 లక్షలు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
► డేనియల్‌ సామ్స్‌- రూ. 75 లక్షలు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
► కైల్‌ జేమీసన్‌- రూ. 1కోటి- సీఎస్‌కే

ముఖేష్‌ కుమార్‌కు కళ్లు చెదిరే మొత్తం..
►ముఖేష్‌ కుమార్‌- రూ. 5.5 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌
►హిమాన్షు శర్మ- రూ. 20 లక్షలు- ఆర్‌సీబీ
►మనీష్‌ పాండే- రూ. 2.4 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌
►విల్‌ జాక్స్‌- రూ. 3.2 కోట్లు- ఆర్‌సీబీ

శివం మావికి ఆరు కోట్లు
►హిమాంశు శర్మ- ఆర్సీబీ- 20 లక్షలు
►శివం మావి- గుజరాత్‌- 6 కోట్లు
►ముకేశ్‌కుమార్‌- ఢిల్లీ- 5.5 కోట్లు
►సన్వీర్‌ సింగ్‌- సన్‌రైజర్స్‌- 20 లక్షలు

శ్రీకర్‌ భరత్‌ ఏ జట్టుకంటే!
►నిశాంత్‌ సింధు- చెన్నై- 60 లక్షలు
►శ్రీకర్‌ భరత్‌- గుజరాత్‌- 1. 20 కోట్లు
►ఉపేంద్ర యాదవ్‌- సన్‌రైజర్స్‌- 25 లక్షలు
►వైభవ్‌ అరోరా- కేకేఆర్‌- 60 లక్షలు
►యశ్‌ ఠాకూర్‌- లక్నో- 45 లక్షలు

వివ్రాంత్‌ శర్మకు 2.6 కోట్లు
►సౌరభ్‌ కుమార్‌- అమ్ముడుపోలేదు
►సమర్థ్‌ వ్యాస్‌- 20 లక్షలు- సన్‌రైజర్స్‌
►ప్రియం గార్గ్‌- అమ్ముడుపోలేదు
►వివ్రాంత్‌ శర్మ- కనీస ధర 20 లక్షలు.. సన్‌రైజర్స్‌- 2.6 కోట్లకు కొనుగోలు చేసింది

రోహన్‌ కన్నుమ్మల్‌కు చేదు అనుభవం
►హిమ్మత్‌ సింగ్‌- అమ్ముడుపోలేదు
►షేక్‌ రషీద్‌- చెన్నై- 20 లక్షలు
►రోహన్‌ కన్నుమ్మల్‌ అమ్ముడుపోలేదు
►చేతన్‌ ఎల్‌ ఆర్‌, శుభం ఖజూరియా- అమ్ముడుపోలేదు
►అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌- అమ్ముడుపోలేదు

ఇషాంత్‌కు ఎంతంటే
►తబ్రేజ్‌ షంసీ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌- అమ్ముడుపోలేదు
►ఆడం జంపా- అమ్ముడుపోలేదు
►అకీల్‌ హొసేన్‌- అమ్ముడుపోలేదు
►ఇషాంత్‌ శర్మ- ఢిల్లీ- 50 లక్షలు

►జై రిచర్డ్‌సన్‌- ముంబై- 1.5 కోట్లు
►ఆడం మిల్నే- అమ్ముడుపోలేదు

ఉనాద్కట్‌కు 50 లక్షలు
►జయదేవ్‌ ఉనాద్కట్‌- లక్నో- 50 లక్షలు
►రీస్‌ టోప్లే- ఆర్సీబీ- 1.9 కోట్లు
►క్రిస్‌ జోర్డాన్‌- అమ్ముడుపోలేదు
►ఫిల్‌ సాల్ట్‌- ఢిల్లీ- 2 కోట్లు
►టామ్‌ బాంటన్‌- అమ్ముడుపోలేదు

పూరన్‌కు 16 కోట్లు
వెస్టిండీస్‌ ప్లేయర్‌ నికోలస్‌ పూరన్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. అతడి కోసం ఢిల్లీ, రాజస్తాన్‌ పోటీ పడగా.. ఏకంగా 16 కోట్లు వెచ్చించింది.

బెన్‌ స్టోక్స్‌(కనీస ధర: రూ. 2 కోట్లు)
ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సైతం భారీ ధర పలికాడు. అతడి కోసం లక్నో, ఆర్సీబీ, రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ పోటీ పడగా సీఎస్‌కే దక్కించుకుంది. 16. 25 కోట్లకు స్టోక్స్‌ను కొనుగోలు చేసింది.

కామెరూన్‌ గ్రీన్‌: (కనీస ధర రూ. 2 కోట్లు)
ఐపీఎల్‌-2023 మినీ వేలంలో హాట్‌ ఫేవరెట్‌గా పేరొందిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ 17.5 ​​కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్‌ ఈ భారీ మొత్తం చెల్లించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది.

అయితే, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సామ్‌ కరన్‌.. గ్రీన్‌ కంటే కోటి రూపాయలు ఎక్కువ ధర పలికి రికార్డు సృష్టించాడు. 

► సామ్‌ కరన్‌(కనీసం ధర రూ 2 కోట్లు)- రూ. 18.50 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్‌ కరన్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన  ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా  ఆ రికార్డును సామ్‌ కరన్‌ బద్దలుకొట్టాడు.

► జో రూట్‌(కనీస ధర 50 లక్షలు)- అమ్ముడుపోలేదు

► అజింక్యా రహానే(కనీస ధర 50 లక్షలు)-  సీఎస్‌కే(రూ. 50 లక్షలు)

మయాంక్‌ అగర్వాల్‌- ఎస్‌ఆర్‌హెచ్‌( రూ. 8.25 కోట్లు)

హ్యారీ బ్రూక్‌- ఎస్‌ఆర్‌హెచ్‌(రూ. 13.25 కోట్లు)

కేన్‌ విలియమ్సన్‌- గుజరాత్‌ టైటాన్స్‌(రూ. 2 కోట్లు కనీస ధర)

కొచ్చి: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం తమ జట్లను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో... ఇవాళ  జరగనున్న మినీ వేలంలో 10 ఫ్రాంచైజీ జట్లు పాల్గొననున్నాయి. ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత పలు ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదిలించుకున్నాయి. ఫలితంగా ఏర్పడిన 87 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు మినీ వేలం ఏర్పాటు చేశారు. ఈ వేలంలో మొత్తం 405 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఇందులో 273 మంది భారత క్రికెటర్లు కాగా... 132 మంది విదేశీ క్రికెటర్లు. 87 బెర్త్‌లలో గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాలి.

విదేశీ క్రికెటర్లలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్, స్యామ్‌ కరన్‌...బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌... ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌లపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన స్యామ్‌ కరన్‌ గాయం కారణంగా ఈ సంవత్సరం ఐపీఎల్‌ టోర్నీకి దూరంగా ఉన్నాడు. స్యామ్‌ కరన్‌ కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలో నమోదు చేసుకున్నాడు.

ఇటీవల టి20 ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించనున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తోపాటు ఏకంగా పదిమంది ఆటగాళ్లను వదిలించుకుంది. వారివద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ఏడుగురు క్రికెటర్లు... ఆంధ్ర నుంచి పది మంది క్రికెటర్లు ఈ వేలంలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement