IPL 2023 Mini Auction
-
ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..!
Riyan Parag: ఐపీఎల్-2023లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ (2022) నుంచే చెత్తగా ఆడుతున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. గుజరాత్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో 6 బంతుల్లో 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రియాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 20 పరుగుల స్కోర్‌ను దాటలేకపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 7 (6), పంజాబ్‌పై 20 (12), ఢిల్లీపై 7 (11), గుజరాత్‌పై 5 (7), లక్నోపై 15 నాటౌట్ (12) పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో రియాన్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పైగా గుజరాత్‌తో ఇవాల్టి మ్యాచ్‌లో రాజస్థాన్ యాజమాన్యం ఇతగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో రియాన్ విఫలం కావడంతో రాజస్థాన్ అభిమానులు ఏకీ పారేస్తున్నారు. ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ అట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. ఏదో పొడుస్తాడని రాజస్థాన్ యాజమాన్యం ఇతనిపై 3.8 కోట్లు పెట్టుబడి పెట్టిందని, వెంటనే ఇతన్ని జట్టు నుంచి తీసిపారేయలని డిమండ్ చేస్తున్నారు. రియాన్ కంటే గల్లీలో ఆడుకునే చిన్న పిల్లలు నయమంటూ ఉతికి ఆరేస్తున్నారు. ఓ పక్క జట్టు మొత్తం విఫలమైన నెటిజన్లు రియాన్నే ఎక్కువగా టార్గెట్ చేశారు. కాగా, సొంత మైదానంలో (జైపూర్) గుజరాత్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐపీఎల్.. వీళ్లకిదే తొలిసారి! తలపండినోళ్లకు తక్కువే! వాళ్లకు మాత్రం కోట్లు!
IPL 2023- Debutants: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో రారాజుగా వెలుగొందుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కలలు కంటారనడంలో సందేహం లేదు. ఒక్కసారి ఐపీఎల్లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. దశ తిరిగిపోతుందని ఇప్పటికే ఎంతో మంది ప్లేయర్లు నిరూపించారు కూడా! ఇక మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదహారవ సీజన్‌తో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం! కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్. ఐపీఎల్ మినీ వేలం-2023లో ముంబై ఇండియన్స్ అతడి కోసం ఏకంగా 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసింది. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆసీస్ తరఫున ఆడిన 8 టీ20 మ్యాచ్‌లలో 173.75 స్ట్రైక్‌రేటుతో 139 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్. గతేడాది దారుణ వైఫల్యంతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ ఆల్‌రౌండర్‌పై గంపెడాశలు పెట్టుకుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ పవర్ హిట్టర్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 20 టీ20లు ఆడి 372 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో విశ్వరూపం ప్రదర్శించిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్ మూడు మ్యాచ్‌లలో 468 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి తనని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌కు మరి ఏ మేరకు ‘తిరిగి చెల్లిస్తాడో’ ఈ యువ బ్యాటర్. సికందర్ రజా పాకిస్తాన్ మూలాలున్న జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అతడి ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 147.97 స్ట్రైక్‌రేటుతో 219 పరుగులు సాధించాడీ ఆల్‌రౌండర్. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను తిప్పలు పెడుతూ 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వే తరఫున ఇప్పటి వరకు 66 టీ20లు ఆడి.. 1259 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో గతేడాది మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రజాను 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 36 ఏళ్ల ఈ వెటరన్ ఆల్‌రౌండర్ తన తొలి ఐపీఎల్ ఎడిషన్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి! ముకేశ్ కుమార్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్. 29 ఏళ్ల ముకేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఆడిన 35 మ్యాచ్‌లలో 134 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 7.20 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రంజీ ట్రోఫీ-2021-22 సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్‌బౌలర్.. విజయ్ హజారే ట్రోఫీ-2022లో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటిన ముకేశ్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. తొలి సీజన్లోనే భారీ మొత్తం పలికిన ముకేశ్ కుమార్ ఢిల్లీ యాజమాన్యం నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో మరి! జాషువా లిటిల్ ఐరిష్ పేసర్ జాషువా లిటిల్ అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. తన పదునైన పేస్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించే లిటిల్ తొలిసారి ఐపీఎల్లో పాల్గొనబోతున్నాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఐర్లాండ్ తరఫున ఆడిన 26 టీ20లలో 39 వికెట్లు తీశాడు. గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లలో 7 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్న 23 ఏళ్ల లిటిల్ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వీరు సైతం ఇక ఈ ఐదుగురితో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి, అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం కలిగిన 32 ఏళ్ల జో రూట్(రాజస్తాన్ రాయల్స్- ధర. కోటి), న్యూజిలాండ్ బ్యాటర్, 32 ఏళ్ల మైకేల్ బ్రేస్‌వెల్(ఆర్సీబీ- ధర కోటి) కూడా ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: Cristiano Ronaldo: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్‌రైజర్స్ బ్యాటర్‌కే! కచ్చితంగా అతడే.. -
IPL 2023: నా ఫేవరెట్ జట్టు అదే! అతడు చుక్కలు చూపించాడు..
India Vs Australia 2023: అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నాడు. కోహ్లితో కలిసి వికెట్ల మధ్య పరిగెత్తడం బాగుంటుందంటూ తమ మనసులో మాట బయటపెట్టాడు. ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో లబుషేన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 244 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడీ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇక వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్వదేశానికి పయనమైన లబుషేన్.. భారత్‌కు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ట్విటర్లో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. క్వశ్చన్ & ఆన్సర్స్ సెషన్లో భాగంగా అరగంట పాటు వారికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన వివిధ ప్రశ్నలకు లబుషేన్ జవాబులు చెప్పాడు. స్టీవ్ స్మిత్‌తో కాకుండా వేరెవరితో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావని అడుగగా.. విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. ఇక ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరని ప్రశ్నించగా.. రవిచంద్రన్ అశ్విన్ అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. ఇటీవల ముగిసిన బీజీటీ-2023 సిరీస్‌లో తనకు ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ చుక్కలు చూపించాడని ఈ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానన్న మార్నస్ లబుషేన్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ఫేవరెట్ టీమ్ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఈసారి తన పేరును మినీ వేలంలో నమోదు చేసుకోలేదు. చదవండి: Sanju Samson: టీమిండియాలో చోటు దక్కకపోతేనేం.. బంపర్ ఆఫర్ కొట్టేశాడుగా..! Steve Smith- IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో.. -
ముంబై ఇండియన్స్‌కు అతి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్..!
గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విధితమే. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తాజాగా కొట్టిపారేశాయి. బుమ్రా గాయం గతంలో డాక్టర్లు నిర్ధారించిన దాని కంటే తీవ్రంగా మారిందని, అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో బుమ్రా.. ఐపీఎల్-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండడం అనుమానమేనని సూచనప్రాయంగా వెల్లడించాయి. దీంతో బుమ్రాను ఆసియా కప్ సమయానికి కంతా జట్టులోకి తీసుకురావాలని భావించిన టీమిండియా ఆశలు అడియాశలుగా మిగిలిపోనున్నాయి. అలాగే బుమ్రా గాయంపై తాజా సమాచారం అతని ఐపీఎల్ జట్టైన ముంబై ఇండియన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఫిట్నెస్ సాధించేందుకు శతవిధాల శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెండిటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ సిరీస్ తర్వాత భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడతాయి. తొలుత వన్డే సిరీస్ సమయానికి కంతా బుమ్రా ఫిట్‌గా ఉంటాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ బుమ్రా.. టీమిండియా, ముంబై ఇండియన్స్‌లకు భారీ షాకిచ్చాడు. -
IPL 2023: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో..
Dasun Shanaka- Gautam Gambhir: ‘‘నా దగ్గర తనను కొనుగోలు చేసేంత డబ్బు లేదు. తన బ్యాటింగ్ అద్భుతం. ఒకవేళ ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటే అతడు.. ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో! నా అభిప్రాయం ప్రకారం ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర అతడిని కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదు’’.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. టీమిండియాతో భారత గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో షనక అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆసియా టీ20 కప్ టీ20 టోర్నీలో లంకను విజేతగా నిలిపిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో సిరీస్‌లోనూ అదరగొట్టాడు. అదరగొట్టాడు తొలి టీ20 లో 27 బంతుల్లో 45, రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేగాక.. మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేలా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్‌ను అవుట్ చేసి రెండో టీ20లో జట్టుకు విజయం అందించాడు. ఇక మూడో మ్యాచ్‌లో 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఏదైమైనా సిరీస్ ఓడినప్పటికీ ఆటగాడిగా మాత్రం షనక సఫలమయ్యాడని చెప్పొచ్చు. అయినా పాపం! ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణిస్తున్న షనక.. ఐపీఎల్-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 50 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌లో అతడి ప్రదర్శన సందర్భంగా గంభీర్ ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు. నేనేం బాధపడటం లేదు ఈ వ్యాఖ్యలపై దసున్ షనక తాజాగా స్పందించాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అందుకే నేను అక్కడ ఆడటాన్ని ఆస్వాదిస్తా. నాలోని దూకుడైనా ఆటగాడు బయటకు వస్తాడు.. నాదైన శైలిని అక్కడ ప్రదర్శించగలను. అయితే, ఐపీఎల్ వేలంలో నన్ను ఎవరూ కొననంత మాత్రాన నేనేమీ బాధపడను. భవిష్యత్తులో నాకోసం భారత్‌లో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నా. అప్పుడు కచ్చితంగా ఐపీఎల్లో ఆడతాను’’ అని షనక తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా షనక ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్20లో ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన క్యాపిటల్స్ జట్టు ముంబై ఎమిరేట్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: IND Vs AUS: ఈజీ క్యాచ్ ఇచ్చిన రాహుల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్ Ravindra jadeja: రోహిత్, జడేజా చెప్పే చేశారు! అదేదో అంపైర్ ముందు చేయొచ్చు కదా! క్లీన్చిట్ ఇచ్చాక.. -
Ind Vs SL: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! ఒక్కడి దగ్గరా..
IPL 2023 Mini Auction- India vs Sri Lanka: శ్రీలంక కెప్టెన్ దసున్ షనక పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఆసియా కప్ టీ20 టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. వాంఖడేలో జరిగిన తొలి టీ20లో 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇక రెండో టీ20లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో లంక ఇన్నింగ్స్‌ను ముగించాడు. అంతేకాదు.. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను దెబ్బకొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో 31 బంతుల్లో 65 పరుగులతో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేలా కనిపించిన అక్షర్ పటేల్‌ను షనక పెవిలియన్‌కు పంపాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో తానే రంగంలోకి దిగి బంతిని అందుకున్నాడు. చివరి ఓవర్ మూడో బంతికి అక్షర్‌ను.. ఆఖరి బంతికి శివం మావిని అవుట్ చేశాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా మరోసారి తన విలువేంటో నిరూపించుకున్నాడు దసున్ షనక. కాగా టీమిండియా- శ్రీలంక టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. మొత్తంగా రెండు టీ20ల్లో 101 పరుగులు(స్ట్రైక్‌రేటు 206.12) చేసిన 31 ఏళ్ల దసున్ షనక.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కరి దగ్గరా డబ్బుండేది కాదు! బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చర్చ సందర్భంగా దసున్ షనకపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నా దగ్గరైతే తనను కొనగలిగేంత డబ్బు లేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా? ఒక్కసారి ఊహించుకోండి.. తను ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో! నాకు తెలిసి ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర షనకను కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదనుకుంటున్నా’’ అని గౌతీ.. లంక సారథిని కొనియాడాడు. కాగా గత కొంతకాలంగా టీ20లలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న దసున్ షనక రూ. 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2023 మినీ వేలంలోకి వచ్చాడు. నిరాశే మిగిలింది! అయితే, ఆశ్చర్యకరంగా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి పట్ల ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కాగా డిసెంబరు 23న జరిగిన వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ 17.5 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా.. పంత్ ఉంటే.. Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! -
IPL: 18.5 కోట్ల ప్లేయర్‌కు చేదు అనుభవం.. షాకయ్యానంటూ ట్వీట్
Sam Curran Tweet Viral: ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు సిబ్బంది. అయితే, ఇందుకు గల కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! అసలేం జరిగిందంటే.. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ వర్జిన్ అట్లాంటిక్ విమానంలో సామ్ ప్రయాణించేందుకు టికెట్ బుక్ అయింది. అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదట తీరా అక్కడికి వెళ్తే తను కూర్చోవాల్సిన సీటు విరిగిపోయిందనే రీజన్‌తో సామ్‌ను లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్ కరన్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘‘వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధమయ్యాను. కానీ సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. విమానంలో నేను కూర్చోవాల్సి సీటు విరిగిపోయిందట. కాబట్టి నేను అందులో ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పారు. క్రేజీగా ఉంది కదా. ఇది నన్ను విస్మయానికి గురిచేసింది. చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది’’ అంటూ సామ్ కరన్ ఎయిర్‌లైన్స్ తీరుపై మండిపడ్డాడు. ఏదేమైనా థాంక్స్ వర్జిన్ అట్లాంటిక్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇందుకు స్పందించిన సదరు ఎయిర్‌లైన్స్ యాజమాన్యం.. సామ్ కరన్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్నితమ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినట్లయితే.. అప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవాళ్లమని చింతిస్తూ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సామ్ ట్వీట్ వైరల్ కాగా.. అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. కనీసం ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణానికైనా వీలుగా ఏర్పాట్లు చేయాల్సింది కదా అని పేర్కొంటున్నారు. కాసుల వర్షం ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరొందిన సామ్ కరన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 మినీ వేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతడి కోసం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడగా.. ఏకంగా 18.5 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. కాగా ప్రపంచకప్-2022లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన సామ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ నేపథ్యంలో వేలంలో అతడిపై కాసుల వర్షం కురవడం గమనార్హం. Just turned up for a flight with @VirginAtlantic for them to tell me my seat is broken on the flight, therefore they’ve said I can’t travel on it. Absolutely crazy. Thanks @VirginAtlantic . Shocking and embarrassing 👍🏻 — Sam Curran (@CurranSM) January 4, 2023 -
అన్న త్యాగంతో కోటీశ్వరుడయ్యాడు! వాళ్లిద్దరితో కలిసి ఆడతానంటూ
IPL 2023 Auction- Vivrant Sharma- Sunrisers Hyderabad: ‘‘మా నాన్నను చాలా మిస్ అవుతున్నా. ఆయన ఎక్కడున్నా ఇప్పుడు నా సక్సెస్ చూసి సంతోషిస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా మా అన్నయ్య త్యాగం వల్లే సాధ్యమైంది. తనే లేకుంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. నాన్న చనిపోయిన తర్వాత నేను క్రికెట్ కొనసాగించగలనా లేదోననే సందేహాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో నా సోదరుడు విక్రాంత్ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. మాకున్న వ్యాపారం ఇప్పుడు తనే చూసుకుంటున్నాడు. నిజానికి తను కూడా క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. కానీ కుటుంబం కోసం, నా కోసం త్యాగం చేశాడు. తన కలను ఇలా నా రూపంలో నెరవేర్చుకుంటున్నాడు’’ అని జమ్మూ కశ్మీర్ బ్యాటర్ వివ్రాంత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. కోటీశ్వరుడయ్యాడు ఐపీఎల్ మినీ వేలం-2023లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం ఏకంగా 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో వివ్రాంత్ పంట పండినట్లయింది. కాగా వివ్రాంత్ తండ్రి సుశాంత్ కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూయగా.. ఇంటికి పెద్ద కుమారుడైన 26 ఏళ్ల విక్రాంత్ కుటుంబ బాధ్యతలు చేపట్టాడు. తమ్ముడిని క్రికెట్ కొనసాగించేలా ప్రోత్సహించాడు. కాగా విక్రాంత్ కూడా యూనివర్సిటీ లెవల్ పేసర్ కావడం విశేషం. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ తన కోసం ఇంత మొత్తం ఖర్చు చేస్తుందని ఊహించలేదన్న వివ్రాంత్.. తనతో పాటు తన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారంటూ పీటీఐతో వ్యాఖ్యానించాడు. ఆయన ప్రోత్సహించారు అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఆయనతో నేను మాట్లాడాను. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నన్ను ప్రోత్సహించారు. విలువైన సలహాలు ఇచ్చారు’’ అని వివ్రాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ఆడుతున్న కశ్మీర్ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌తో తనకు స్నేహం ఉందన్న వివ్రాంత్.. అవకాశం వస్తే వాళ్లతో కలిసి ఐపీఎల్‌నూ కనిపిస్తానంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో 124 బంతుల్లో 154 పరుగులు చేసిన వివ్రాంత్ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
Aus Vs SA: రూ.17.5 కోట్లు.. కెరీర్లో తొలిసారి ఇలా! తోకముడిచిన ప్రొటిస్
Australia vs South Africa, 2nd Test- Day 1- Cameron Green: దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మెల్బోర్న్లో సోమవారం ఆరంభమైన రెండో టెస్టు సందర్భంగా ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రెండు కీలక వికెట్లు కూల్చి డీన్ ఎల్గర్ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొత్తంగా 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చిన గ్రీన్.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఇలా కెరీర్లో తొలిసారి ఈ ఫీట్(5 వికెట్ హాల్) నమోదు చేశాడు. ఇక గ్రీన్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. 189 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కాగా ప్రొటిస్ టాపార్డర్ విఫలమైన వేళ.. ఆరోస్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ వెయిర్నే(52), మార్కో జాన్సెన్(59) అర్ధ శతకాలతో రాణించారు. నాథన్ లియాన్‌తో గ్రీన్(PC: ICC) అయితే, వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు గ్రీన్. ఈ ఇద్దరితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్(12), రబడ(4), లుంగి ఎన్గిడి(2) వికెట్లు తీశాడు. ఇక గ్రీన్‌కు తోడు స్టార్క్ 2, బోలాండ్ 1, నాథన్ లియోన్ 1 ఒక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్‌ను ఎల్గర్ లబుషేన్ రనౌట్ చేశాడు. ఈ నేపథ్యంలో 189 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. 100వ టెస్టు ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ 32, వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబై ఇండియన్స్ సంబరం ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ను గ్రీన్‌ను రూ. 17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆక్షన్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ 23 ఏళ్ల యువ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఈ మేరకు కెరీర్లో ఉత్తమ గణాంకాలు(5/27) నమోదు చేయడం గమనార్హం. దీంతో ముంబై ఫ్రాంఛైజీ ఖుషీ అవుతోంది. గ్రీన్‌ను కొనియాడుతూ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్.. ‘‘ముంబైకి మంచి రోజులు రాబోతున్నాయి. మనం మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాం. ఇలాంటి యంగ్ టాలెంట్ మనకు కావాలి. ఇండియన్ పిచ్‌లపై కూడా గ్రీన్ ఇలాగే రాణించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Mohammad Rizwan: వైస్ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు KL Rahul: రాహుల్ వరుస సెంచరీలు చేయాలి! లేదంటే కష్టమే!.. గిల్‌కు అన్యాయం చేసినట్లే కదా! Cameron चा कडक 5️⃣PELL 😍 Green claims his maiden 🖐️-wicket haul in Tests 🔥#OneFamily #AUSvSA @ICC pic.twitter.com/uSTNOymgdW — Mumbai Indians (@mipaltan) December 26, 2022 -
CSK: కొత్త కెప్టెన్‌పై సీఎస్కే క్లారిటీ.. అతడిని కొనాలనుకున్నాం.. కానీ
IPL 2023- Ben Stokes- MS Dhoni: ‘‘బెన్ స్టోక్స్‌ను దక్కించుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఎంఎస్ కూడా సూపర్ హ్యాపీ! వేలం జరుగుతున్నంత సేపు తన మాతో ఫోన్ కాల్లో టచ్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకోగలిగినందుకు ఎంఎస్ చాలా చాలా ఆనందంగా ఉన్నాడు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ అన్నారు. ఐపీఎల్ మినీ వేలం-2023లో సీఎస్కే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు కోట్ల కనీస ధరంతో వేలంలోకి వచ్చిన ఈ సీనియర్ ఆల్‌రౌండర్ కోసం చెన్నై, లక్నో, ఆర్సీబీ, రాజస్తాన్, సన్‌రైజర్స్ పోటీ పడ్డాయి. చివరికి 16.25 కోట్లకు అతడిని చెన్నై దక్కించుకుంది. ధోని ఎప్పుడంటే అప్పుడే! దీంతో కెప్టెన్సీ విషయంలో సీఎస్కేకు ఏర్పడిన సమస్యలు తొలగినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ధోని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. స్టోక్స్ కెప్టెన్సీ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే ఈ విషయంపై ధోనిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఇక వేలంలో భాగంగా సామ్ కరన్ లేదా స్టోక్స్‌ను దక్కించుకోవాలని వ్యూహాలు రచించామన్న కాశీ విశ్వనాథ్.. స్టోక్స్‌ను సొంతం చేసుకోవడంలో విజయవంతమైనందుకు సంతోషంగా ఉందన్నారు. అతడు కోలుకుంటున్నాడు అదే విధంగా కైలీ జెమీసన్ గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఈ కివీస్ ప్లేయర్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడనే సమాచారం ఉందని, అందుకే అతడిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కాగా గత సీజన్లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పగ్గాలు చేపట్టాడు. అయితే, అతడి సారథ్యంలో అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో మళ్లీ ధోనినే నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. . కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నైకి ఘోర పరాభవం తప్పలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు స్టోక్స్ జట్టులోకి తిరిగి రావడంతో అతడిని కెప్టెన్‌గా సిద్ధం చేసి ధోని రిలాక్స్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: IPL: సీఎస్‌కు కొనుగోలు చేసింది వీళ్లనే.. ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట Ind Vs Ban: ఆలస్యమెందుకు.. ఆ షర్ట్ కూడా తీసెయ్! కోహ్లికి కోపం తెప్పించిన బంగ్లా బ్యాటర్ చర్యలు #SuperAuction round up with our Super CEO! Full 📹 : https://t.co/1wSSJWtZow#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/OmsBn5XZDV — Chennai Super Kings (@ChennaiIPL) December 24, 2022 Some 🔥🥳 to brighten up your morning! #SuperAuction #WhistlePodu 🦁💛pic.twitter.com/X1ij8AXsnd — Chennai Super Kings (@ChennaiIPL) December 24, 2022 -
IPL: రూ. 2 కోట్లు.. సాల్ట్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే: అజిత్ అగార్కర్
IPL 2023 Mini Auction- Delhi Capitals: ‘‘ఫిల్ సాల్ట్ మంచి బ్యాటర్, వికెట్ కీపర్ కూడా! అయితే మా కెప్టెన్ రిషభ్ పంత్ రూపంలో మాకు వికెట్ కీపర్ ఉన్నాడు. కాబట్టి సాల్ట్‌ను కేవలం బ్యాటర్‌గానే ఉపయోగించుకుంటాం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అజిత్ అగార్కర్ అన్నాడు. కాగా కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో ఢిల్లీ ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. టీ20 ప్రపంచకప్-2022 గెలిచిన జట్టులో సభ్యుడైన ఈ 26 ఏళ్ల బ్యాటర్‌ను తమ సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా రాణించగల సాల్ట్ టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 167 మ్యాచ్‌లు ఆడి 3817 పరుగులు చేశాడు. అయితే, ఇంతవరకు అతడికి ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. సాల్ట్ గొప్ప బ్యాటర్ అంటూ కొనియాడాడు. అయితే, పంత్ ఉన్న కారణంగా సాల్ట్‌ను వికెట్ కీపర్‌గా చూసే అవకాశం లేదన్నాడు. ఇక ఇషాంత్ శర్మ గురించి చెబుతూ.. ‘‘అనుభవజ్ఞుడైన ఢిల్లీ ప్లేయర్ ఇషాంత్ శర్మ మాతో ఉన్నాడు. తన కెరీర్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో అందరికీ తెలుసు. అతడు మా జట్టులో ఉండటం సంతోషకరం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. 📹| Our Assistant Coach Ajit Agarkar spoke to us when we completed the signings of Phil Salt and Ishant Sharma, and his experience of being at the Auction table for the first time 🗣️#YehHaiNayiDilli #TATAIPLAuction #IPL2023Auction | @imAagarkar pic.twitter.com/IV20LRB7qi — Delhi Capitals (@DelhiCapitals) December 23, 2022 టాక్సీ డ్రైవర్ కొడుకుకు ఐదున్నర కోట్లు! కాగా.. టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్‌కు 50 లక్షలు వెచ్చించిన ఢిల్లీ యాజమాన్యం.. అన్క్యాప్డ్ స్పీడ్‌స్టర్ ముకేశ్ కుమార్ కోసం ఏకంగా ఐదున్నర కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయంపై ముకేశ్ స్పందిస్తూ.. ‘‘నా ఫ్రెండ్ ఫోన్ చేసి అభినందించే దాకా నేను వేలంలో అమ్ముడుపోయానన్న విషయం నాకు తెలియదు. అస్సలు నమ్మలేకపోతున్నా. గత సీజన్లో నెట్‌బౌలర్‌గా ఉన్నా. ఇప్పుడు జట్టుకు ఆడబోతున్నా’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఢిల్లీ ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు తెలిపాడు. బిహార్‌లో పుట్టి బెంగాల్‌కు ఆడుతున్నాడు ఈ పేసర్. ఇక టాక్సీ డ్రైవర్ కొడుకైన ముకేశ్ తొలిసారి ఇలా జాక్‌పాట్ దక్కించుకోవడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్.. వేలంలో కొన్న ఆటగాళ్లు ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు) చదవండి: IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట 🎶 𝘈𝘣 𝘮𝘶𝘴𝘩𝘬𝘪𝘭 𝘯𝘢𝘩𝘪 𝘬𝘶𝘤𝘩 𝘣𝘩𝘪, 𝘯𝘢𝘩𝘪 𝘬𝘶𝘤𝘩 𝘣𝘩𝘪 🥺🎶 A dream came true today 💙 Listen to Mukesh Kumar's story from the man himself 🤗#YehHaiNayiDilli #TATAIPLAuction #IPL2023 #IPL2023Auction pic.twitter.com/rueprZiQta — Delhi Capitals (@DelhiCapitals) December 23, 2022 -
IPL 2023: మిస్టర్ ఐపీఎల్ ‘సూపర్‌స్టార్’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు!
IPL 2023 Mini Auction- Suresh Raina: ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అంచనా తలకిందులైంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడతాయంటూ మిస్టర్ ఐపీఎల్ చెప్పిన జోస్యం తప్పింది. రైనా అంచనా వేసిన యువ ఆటగాళ్లలో సౌరాష్ట్ర క్రికెటర్ సమర్థ్ వ్యాస్ తప్ప మిగతా ఇద్దరూ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా ఐపీఎల్ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా షోలో.. ఆక్షన్ ఆరంభానికి ముందు రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన జయదేవ్ ఉనాద్కట్, నారాయణ్ జగదీశన్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అతడు పేర్కొన్నాడు. వీళ్ల విషయంలో నిజమైంది అందుకు తగ్గట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ ఉనాద్కట్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేయగా.. నారాయణ్ జగదీశన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ 90 లక్షలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిస్ కోసం పోటీ నెలకొంటుందని రైనా అంచనా వేయగా.. గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. లెక్క తప్పాడు! వీరితో పాటు.. బెన్ స్టోక్స్, సామ్ కరన్ విషయంలో అందరిలానే రైనా అంచనాలూ నిజమయ్యాయి. కానీ అన్క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో మాత్రం మిస్టర్ ఐపీఎల్ లెక్క తప్పింది. జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ ముజ్తాబా యూసఫ్ అమ్ముడుపోకుండా మిగిలి పోయాడు. అంతేగాక ఈ వేలంలో సూపర్‌స్టార్‌గా నిలవగల సత్తా ఉందని రైనా అంచనా వేసిన అల్లా అహ్మద్‌ను ఎవరూ పట్టించుకోలేదు. మిస్టర్ ఐపీఎల్ జోస్యంపై కామెంట్లు వేలంలో పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల ఈ అఫ్గనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇక సమర్థ్ వ్యాస్‌ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రైనా జోస్యంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాళ్ల విషయంలో మిస్టర్ ఐపీఎల్ అంచనాలు నిజమయ్యాయి. కానీ సూపర్‌స్టార్ అన్న విషయంలో మాత్రం లెక్క తప్పాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట Ind Vs Ban: అయ్యో పంత్.. సెంచరీ మిస్! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత.. -
IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్ల జాబితా, పూర్తి జట్లు.. పర్సులో ఎంత? ఇతర వివరాలు
IPL 2023 Mini Auction- 10 Squads- Purse Remaining- Slots: కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ స్టోక్స్‌లకు సైతం భారీ మొత్తం దక్కింది. కరన్‌ను పంజాబ్ దక్కించుకోగా.. గ్రీన్‌ను ముంబై సొంతం చేసుకుంది. ఇక స్టోక్స్‌ను తిరిగి తమ కుటుంబంలోకి ఆహ్వానించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. ఇక అట్టహాసంగా ముగిసిన శుక్రవారం నాటి వేలంలో 10 ఫ్రాంఛైజీలు కొన్న ఆటగాళ్ల వివరాలు, ఆక్షన్ తర్వాత పూర్తి స్థాయి జట్లు, పర్సులో మిలిగిన మొత్తం, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న అంశాలపై ఓ లుక్కేద్దాం. 1. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో కొన్న ఆటగాళ్లు(ధర రూపాయల్లో): హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ ( 8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ ( 5.25 కోట్లు), అదిల్ రషీద్ ( 2 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు), వివ్రంత్ శర్మ ( 2.6 కోట్లు), సమర్థ్ వ్యాస్ ( 20 లక్షలు), సన్వీర్ సింగ్ ( 20 లక్షలు), ఉపేంద్ర యాదవ్ ( 25 లక్షలు), మయాంక్ దాగర్ ( 1.8 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి ( 20 లక్షలు), అకేల్ హోసేన్ (1 కోటి), అన్మోల్ప్రీత్ సింగ్ (20 లక్షలు) ►పర్సులో ఇంకా మిగిలి ఉన్న మొత్తం: 6.75 కోట్ల రూపాయలు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫారూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 2. చెన్నై సూపర్‌కింగ్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: అజింక్యా రహానే (50 లక్షలు), బెన్ స్టోక్స్ ( 16.25 కోట్లు), షేక్ రషీద్ ( 20 లక్షలు), నిశాంత్ సింధు ( 60 లక్షలు), కైల్ జేమిసన్ ( 1 కోటి), అజయ్ మండల్ ( 20 లక్షలు), భగత్ వర్మ ( 20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 1.7 కోట్ల రూపాయలు ►ఖాళీ స్థానాలు: 0 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సిమ్ పజేతిరి, సిమ్ పజేతిరి చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ 3. ముంబై ఇండియన్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: కామెరాన్ గ్రీన్ (17.5 కోట్లు), ఝే రిచర్డ్సన్ (1.5 కోట్లు), పియూష్ చావ్లా (50 లక్షలు), డువాన్ జాన్సెన్ (20 లక్షలు), విష్ణు వినోద్ (20 లక్షలు), షామ్స్ ములానీ (20 లక్షలు), మెహల్ వధేరా ( 20 లక్షలు), రాఘవ్ గోయల్ (20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 0.05 కోట్లు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ ఆటగాళ్ల జాబితా: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్ 4. గుజరాత్ టైటాన్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు కేన్ విలియమ్సన్ (2 కోట్లు), ఓడియన్ స్మిత్ (50 లక్షలు), KS భరత్ (1.2 కోట్లు), శివమ్ మావి (6 కోట్లు), ఉర్విల్ పటేల్ (20 లక్షలు), జాషువా లిటిల్ (4.4 కోట్లు), మోహిత్ శర్మ (50 లక్షలు) ►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు ►ఖాళీ స్థానాలు: 0 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 వేలానికి ముందు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్ 5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వేలంలో కొన్న ఆటగాళ్లు రీస్ టోప్లే (1.9 కోట్లు), హిమాన్షు శర్మ (20 లక్షలు), విల్ జాక్స్ (3.2 కోట్లు), మనోజ్ భాండాగే (20 లక్షలు), రాజన్ కుమార్ (70 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు) ►పర్సులో మిగిలింది: 1.95 కోట్లు ►ఖాళీ స్థానాలు: 1 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, జోహ్మద్ సిరాజ్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ 6. కోల్‌కతా నైట్‌రైడర్స్ వేలంలో కొన్న ఆటగాళ్ల లిస్టు నారాయణ్ జగదీశన్ (90 లక్షలు), వైభవ్ అరోరా (60 లక్షలు), సుయాష్ శర్మ (20 లక్షలు), డేవిడ్ వీస్ (1 కోటి), కుల్వంత్ ఖేజ్రోలియా (20 లక్షలు), లిట్టన్ దాస్ (50 లక్షలు), మన్దీప్ సింగ్ (50 లక్షలు), షకీబ్ అల్ హసన్ (1.50 కోట్లు) ►పర్సులో మిగిలింది: 1.65 కోట్లు ►ఖాళీ స్థానాలు: 3 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 0 రిటెన్షన్ జాబితా: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకు సింగ్ 7. లక్నో సూపర్ జెయింట్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు నికోలస్ పూరన్ (16 కోట్లు), జయదేవ్ ఉనాద్కట్ (50 లక్షలు) యష్ ఠాకూర్ (45 లక్షలు), రొమారియో షెపర్డ్ (50 లక్షలు), డేనియల్ సామ్స్ ( 75 లక్షలు), అమిత్ మిశ్రా (50 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (20 లక్షలు), నవీన్-ఉల్-హక్ ( 50 లక్షలు), యుధ్వీర్ చరక్ (20 లక్షలు) ►పర్సులో మిగిలింది: 3.55 కోట్లు ►మొత్తం ఖాళీలు: 0 రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ 8. పంజాబ్ కింగ్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు: సామ్ కరన్ (18.50 కోట్లు), సికందర్ రజా (50 లక్షలు), హర్‌ప్రీత్ భాటియా (40 లక్షలు), విద్వాత్ కవేరప్ప (20 లక్షలు), మోహిత్ రాతీ (20 లక్షలు), శివమ్ సింగ్ (20 లక్షలు) ►పర్సులో మిగిలిన మొత్తం: 12.2 కోట్లు ►ఖాళీలు: 3 ►విదేశీ ఆటగాళ్ల స్లాట్: 1 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ 9. రాజస్తాన్ రాయల్స్ వేలంలో కొన్న ఆటగాళ్ల జాబితా జేసన్ హోల్డర్ (5.75 కోట్లు), డోనోవన్ ఫెరీరా (50 లక్షలు), కునాల్ రాథోడ్ (20 లక్షలు), ఆడమ్ జంపా (1.5 కోట్లు), కేఎల్ ఆసిఫ్ (30 లక్షలు), మురుగన్ అశ్విన్ (20 లక్షలు), అబ్దుల్ (20 లక్షలు), ఆకాష్ వశిష్ట్ ( 20 లక్షలు), జో రూట్ ( 2 కోట్లు) ►పర్సులో మిగిలింది: 3.35 కోట్లు ►ఖాళీలు: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కులదీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, యుజవేంద్ర చహల్ 10. ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో కొన్న ఆటగాళ్లు ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు) ►పర్సులో మిగిలింది: 4.45 కోట్లు ►ఖాళీ స్థానాలు: 0 రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యష్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగిజ్ ఎన్గిడి, లుంగిజ్ ఎన్గిడి, , అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. - వెబ్ స్పెషల్ చదవండి: Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా -
IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు
ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ పంట పండింది. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన కరన్‌కు ఊహించినట్లుగానే ఐపీఎల్ వేలంలో భారీ మొత్తం పలికింది. పంజాబ్ కింగ్స్ టీమ్ అతడిని ఏకంగా రూ. 18 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఒక ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే కాగా... లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా 24 ఏళ్ల కరన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (2021లో రాజస్తాన్ రాయల్స్ రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది) పేరిట ఉంది. వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్‌గా కూడా కరన్‌దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లిని రీటెయిన్ చేసుకున్నప్పుడు కూడా బెంగళూరు... కేఎల్ రాహుల్ కోసం లక్నో గరిష్టంగా రూ. 17 కోట్లు చెల్లించాయి. ఇక అంచనాలకు అనుగుణంగా ఆల్‌రౌండర్లు కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) కూడా భారీ మొత్తం పలకగా, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై కూడా తొలి ఐపీఎల్‌లోనే కోట్ల వర్షం కురిసింది. అటు ఐపీఎల్లో, ఇటు అంతర్జాతీయ క్రికెట్లోనూ ‘నిలకడగా’ పేలవ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనూహ్యం. కొచ్చి: ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ యువస్టార్ స్యామ్ కరన్ బాక్స్‌లు బద్దలు కొడితే ఆశ్చర్యపోవద్దు! వేలానికి ముందు పలువురు క్రికెట్ విశ్లేషకులు, మాజీల మాట ఇది. నిజంగానే ఈ మాట నిజమైంది. వారి అంచనా తప్పలేదు. ఎందుకంటే కరన్ బంతితో, బ్యాట్‌తో రెండు రకాలుగా ప్రభావం చూపించగల డని అత్యున్నత స్థాయిలో ఇప్పటికే రుజువైంది. ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలి చాడు. అన్నింటితో పాటు అతని వయసు 24 ఏళ్లే! సరిగ్గా ఇదే కోణంలో ఫ్రాంచైజీలు ఆలోచించాయి. అందుకే అతని కోసం పోటీ పడ్డాయి. ముంబైతో మొదలు పెడితే బెంగళూరు, రాజస్తాన్, చెన్నై, పంజాబ్ విలువను పెంచుకుంటూ పోయాయి. చివరకు ముంబై రూ.18 కోట్ల వరకు తీసుకురాగా, పంజాబ్ మరో రూ.50 లక్షలు పెంచి రూ. 18 కోట్ల 50 లక్షలకు కరన్‌ను సొంతం చేసుకుంది. 2019 ఐపీఎల్లో పంజాబ్ జట్టే కరన్‌కు రూ. 7 కోట్ల 20 లక్షలు చెల్లించింది. తర్వాతి రెండు సీజన్లు చెన్నైకి ఆడిన అతను గాయంతో గత సీజన్‌కు దూరమయ్యాడు. ఓవరాల్‌గా 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో 9.21 ఎకానమీతో 32 వికెట్లు తీసిన కరన్... 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 337 పరుగులు చేశాడు. ఆ ముగ్గురూ సూపర్... ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన బెన్ స్టోక్స్‌కు సరైన విలువ లభించింది. అతని కోసం హైదరాబాద్, లక్నో మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరకు రూ. 16 కోట్ల 25 లక్షలకు అతను చెన్నై జట్టులోకి చేరాడు. వేలంలో చెన్నై తరఫున అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ (రూ. 16 కోట్లు) రికార్డును స్టోక్స్ సవరించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం (రూ. 17.5 కోట్లు) చెల్లించింది. ఓవరాల్‌గా టి20 రికార్డు గొప్పగా లేకపోయినా... ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, ఆకట్టుకునే పేస్ బౌలింగ్‌తో పాటు ఇటీవల భారత గడ్డపై చేసిన రెండు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు గ్రీన్ విలువను పెంచాయి. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను పెద్ద మొత్తానికి (రూ. 13 కోట్ల 25 లక్షలు) సన్‌రైజర్స్ ఎంచుకుంది. దూకుడైన ఆటతో మిడిలార్డర్లో, ఫినిషర్‌గా సత్తా చాటగల బ్రూక్ ఇటీవల పాకిస్తాన్‌తో టి20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గత ఐపీఎల్లో నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో కలిపి 306 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఒక్కటీ జట్టుకు చెప్పుకోదగ్గ విజయం అందించలేకపోయింది. నాడు అతనికి రైజర్స్ రూ. 10 కోట్ల 75 లక్షలు చెల్లించింది. ఇక ఇటీవలి వరల్డ్‌కప్‌లోనైతే అతను 5, 7, 13 చొప్పున పరుగులు చేశాడు. అయినా సరే, వేలంలో పోటీ బాగా కనిపించింది! ఎడంచేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కావడం ఒక కారణం కావచ్చు. చివరకు రూ. 16 కోట్లకు లక్నో ఎంచుకోవడం విశేషం. వేలం ఇతర విశేషాలు ► అందరికంటే ముందుగా విలియమ్సన్ పేరు రాగా సన్‌రైజర్స్ పట్టించుకోలేదు. గుజరాత్ రూ. 2 కోట్లకు విలియమ్సన్‌ను తీసుకుంది. స్వదేశీ ఓపెనర్ అవసరం ఉన్న సన్‌రైజర్స్...చెన్నైతో చివరి వరకు పోటీ పడి మయాంక్ అగర్వాల్‌ను రూ. 8 కోట్ల 25 లక్షలకు తీసుకుంది. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజాకు తొలి అవకాశం దక్కింది. పంజాబ్ కింగ్స్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. ► ఆంధ్ర యువ క్రికెటర్ షేక్ రషీద్‌ను రూ. 20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఆంధ్ర కీపర్ కోన శ్రీకర్ భరత్‌ను గుజరాత్ రూ. కోటీ 20 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ యువ ఆటగాడు భగత్ వర్మను రూ. 20 లక్షలకు చెన్నై... ఆంధ్ర ప్లేయర్ నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్ ఎంచుకున్నాయి. ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ను రూ. 4 కోట్ల 40 లక్షలకు గుజరాత్ తీసుకుంది. ఐపీఎల్ ఆడ నున్న తొలి ఐర్లాండ్ ప్లేయర్‌గా లిటిల్ ఘనత వహిస్తాడు. -
ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్?
ఆంధ్ర యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 23) జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2022లో అద్భుతంగా రాణించిన రషీద్.. సీఎస్కే టాలెంట్ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది ఎపీఎల్‌లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్ 159 పరుగులు సాధించాడు. అదే విధంగా 2022 అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న యువ భారత జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రపంచకప్ ముగిసిన అనంతరం జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంలో రషీద్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల రషీద్‌తో పాటు పలువురు అండర్-19 ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. కానీ ఐపీఎల్-2023 మినీవేలంలో మాత్రం రషీద్ కల నెరవేరింది. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతోనే తన ఐపీఎల్ కెరీర్‌ను మొదలపెట్టనున్నాడు.ఇక ఎంస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూంను షేర్ చేసుకోబోతున్న రషీద్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ షేక్ రషీద్? ►18 ఏళ్ల షేక్ రషీద్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఒక మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు. ►చిన్నతనం నుంచే రషీద్‌కు క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్లో అతడు అరంగేట్రం చేశాడు. ►2022 అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యునిగా రషీద్ ఉన్నాడు. ►ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 50 పరుగులున చేసిన రషీద్.. భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ►2022 అండర్-19 ప్రపంచకప్‌లో రషీద్ 201 పరుగులు సాధించాడు. ►ఇక దేశీవాళీ క్రికెట్లో కూడా రషీద్ ఎంట్రీ ఇచ్చాడు. ►ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రషీద్ ఆంధ్ర తరపున అరంగేట్రం చేశాడు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా -
ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా
ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. ఎప్పటిలాగే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. అయితే పేరు మోసిన ఆటగాళ్లలో రాసీ వాండర్ డసెన్, వేన్ పార్నెల్, పాల్ స్టిర్లింగ్, జేమ్స్ నీషమ్, డేవిడ్ మలాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ వేలంలో ఇంగ్లండ్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్ కరన్(18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(రూ. 16.25 కోట్లు- సీఎస్కే)తో పాటు బ్యాటర్ హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు- ఎస్ఆర్హెచ్) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే.. ► కుశాల్ మెండిస్ ► టామ్ బాంటన్ ► క్రిస్ జోర్డాన్ ► ఆడమ్ మిల్నే ► పాల్ స్టిర్లింగ్ ► రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ► షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ► ట్రెవిస్ హెడ్ ► డేవిడ్ మలన్ ► డారిల్ మిచెల్ ► మహమ్మద్ నబీ ► వేన్ పార్నెల్ ► జిమ్మీ నీషమ్ ► దాసున్ షనక ► రిలే మ్రెడిత్ ► సందీప్ శర్మ ►తబ్రైజ్ షమ్సీ ►ముజీబ్ రెహమాన్ ►చేతన్ ఎల్ఆర్ ►శుభమ్ ఖజురియా ►రోహన్ కున్నుమ్మల్ ► హిమ్మత్ సింగ్ ► ప్రియం గార్గ్ ► సౌరభ్ కుమార్ ► కార్బిన్ బాష్ ► అభిమన్యు ఈశ్వరన్ ► శశాంక్ సింగ్ ► సుమిత్ కుమార్ ► దినేష్ బానా ► మహ్మద్ అజారుద్దీన్ ► ముజ్తబా యూసుఫ్ ► లాన్స్ మోరిస్ ► చింతన్ గాంధీ ► ఇజారుల్హుక్ నవీద్ ► రేయాస్ గోపాల్ ► ఎస్ మిధున్ ► తస్కిన్ అహ్మద్ ► దుష్మంత చమీర ► ముజారబానీ దీవెన ► సూర్యాంశ్ షెడ్జ్ ► జగదీశ సుచిత్ ► బాబా ఇంద్రజిత్ ► కిరంత్ షిండే ► ఆకాష్ సింగ్ ►పాల్ వాన్ -
IPL 2023: 11వ సారి వేలంలోకి.. ఈసారి ఎంత ధర కంటే?
ఐపీఎల్ 2023 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ 11వ సారి వేలంలోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.50 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో స్టార్ బౌలర్ అయిన ఉనాద్కట్ 2018 తర్వాత ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. 2018లో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 కోట్లకు కొన్నది. అయితే ఆ సీజన్లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా 2019లో అతడిని 8.4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020, 21లో రూ. 3 కోట్లకు ఉనాద్కట్‌ను రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టకుంది. పోయిన సీజన్ వేలంలో ఉనాద్కత్‌ను ముంబై ఇండియన్స్ 1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఉనాద్కట్ 2010లో కేకేఆర్ తరఫున ఐపీఎల్లో ఆరంగ్రేటం చేశాడు. అయితే.. అతని ఐపీఎల్ కెరీర్ 2017లో మలుపు తిరిగింది. ఆ సీజన్లో పూణె సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఉనాద్కట్ 12 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. దాంతో తర్వాతి సీజన్లో అతడిని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 పెట్టింది. దేశవాళీ టోర్నీల్లో సౌరాష్ట్ర తరఫున ఉనాద్కట్ అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఉనాద్కట్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2023: అన్క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.5.5 కోట్లు.. ఎవరీ ముఖేష్ కుమార్? -
IPL 2023: అన్క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.5.5 కోట్లు.. ఎవరీ ముఖేష్ కుమార్?
ఐపీఎల్ మినీ వేలంలో కొందరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు కాసుల వర్షం కురిపించింది. శివమ్ మావి, ముఖేష్ కుమార్ లాంటి ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలిందనే చెప్పొచ్చు. శివమ్ మావి పేరు ఐపీఎల్లో పాపులర్ అయినప్పటికి.. ముఖేష్ కుమార్ మాత్రం గత సీజన్ నుంచే వెలుగులోకి వచ్చాడు. గతేడాది సీఎస్కే తరపున ఆడిన ముఖేష్ కుమార్ రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగాడు. అతని కోసం వేలంలో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌లు పోటీపడ్డాయి. అయితే చివరకు ముఖేష్ కుమార్‌ను రూ. 5.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం ఇంత వెచ్చించడం ఆసక్తి కలిగించింది. అందుకే ముఖేష్ కుమార్ గురించి కొన్ని విషయాలు ఎవరీ ముఖేష్ కుమార్? ► 28 ఏళ్ల ముఖేష్ కుమార్ కోల్‌కతాలో జన్మించాడు. ► అతడు దేశీవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ► ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముఖేష్ 2015లో హర్యానా పై అరంగేట్రం చేశాడు. ► అదే విధంగా టీ20 క్రికెట్లో 2016లో గుజరాత్ డెబ్యూ చేశాడు. ► లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ► ఇక టీ20 క్రికెట్లో ముఖేష్ 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు. ► ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు. ► స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ముఖేష్ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ► అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్.. బెంగాల్ జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. చదవండి: జాక్‌పాట్ కొట్టాడు.. అత్యధిక మొత్తం అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా -
IPL 2023: జాక్‌పాట్ కొట్టాడు.. అత్యధిక మొత్తం అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్‌కు అదృష్టం తలుపు తట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో పూరన్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని సొంతం చేసుకుంది. తద్వారా వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పూరన్‌ను రూ. 10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది 14 మ్యాచ్‌ల్లో 306 పరుగులు చేసిన పూరన్ పెద్దగా రాణించకపోవడంతో మినీ వేలానికి ముందు అతన్ని రిలీజ్ చేసింది. అలా రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చి రూ. 16 కోట్లకు అమ్ముడుపోవడం పూరన్‌కే సాధ్యమైంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లోనూ విండీస్ దారుణంగా విఫలమైంది. అతని కెప్టెన్సీలోని వెస్టిండీస్ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆ తర్వాత అతను వెస్టిండీస్ కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇంత నెగెటివ్ ఉన్నప్పటికి పూరన్‌కు భారీ ధర పలకడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ప్రైవేట్ లీగ్ టోర్నీల్లో పూరన్‌కు మంచి రికార్డు ఉంది. అబుదాబి టి10 లీగ్‌లోనూ పూరన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పూరన్ కోసం మొదట సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. రూ. 3 కోట్లు దాటగానే ఢిల్లీ క్యాపిటల్స్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత రూ. 6 కోట్ల వరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్స్ పోటీ పడ్డాయి. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ పోటీలోకి వచ్చింది. రూ. 7.25 కోట్ల నుంచి ఒకేసారి రూ. 15 కోట్ల వరకు వెళ్లింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు పూరన్‌ను దక్కించుకుంది. చదవండి: Cameron Green: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు? ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి -
IPL 2023: హాట్ ఫేవరెట్ కావొచ్చు.. కానీ అంత ధరెందుకు?
ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ ఎవరు ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. శుక్రవారం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే కామెరున్ గ్రీన్‌ది రెండో అత్యధిక ధర. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లలో కామెరున్ గ్రీన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదే వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడంతో అతను తొలిస్థానంలో ఉన్నాడు. ఇక ఈసారి వేలంలో హాట్ ఫేవరెట్ గా ఉన్న కామెరున్ గ్రీన్ అంత ధరకు పలుకుతాడని ఎవరు ఊహించి ఉండరు. రూ. 10 నుంచి 15 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరి కామెరున్ గ్రీన్‌కు దీనిని అందుకునే అర్హత ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అయితే గ్రీన్‌కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదు. 23 ఏళ్ల వయసు మాత్రమే కలిగిన గ్రీన్ ఆస్ట్రేలియా తరపున 2020లో అడుగుపెట్టాడు. కామెరున్ గ్రీన్ అటు కొత్త బంతితో, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సమర్థుడు. అంతేకాదు బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. మంచి ఫీల్డర్ కూడా. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న కామెరున్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా తరపున కామెరున్ గ్రీన్ 20 టెస్టులు, 13 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. .@mipaltan win the bidding war to welcome Australian all-rounder Cameron Green!💰✅ He is SOLD for INR 17.5 Crore 👏 👏#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/tJWCkRgF3O — IndianPremierLeague (@IPL) December 23, 2022 చదవండి: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బ్రూక్ పంట పండింది.. ఎస్ఆర్హెచ్ తలరాత మారేనా! -
IPL 2023: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు కళ్లు చెదిరే మొత్తం లభించింది. ఈ ఆల్‌రౌండర్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తద్వారాఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో సామ్ కరన్ సూపర్ ప్రదర్శన ఇచ్చాడు. ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలకపాత్ర. డెత్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఇవాళ ఐపీఎల్లో రికార్డు ధరకు అమ్ముడయ్యేలా చేసింది. అతని కోసం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినప్పటికి.. చివరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును సామ్ కరన్ బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లు.. సామ్ కరన్- రూ. 18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్ కామెరున్ గ్రీన్- రూ. 17.5 కోట్లు- ముంబై ఇండియన్స్ బెన్ స్టోక్స్- రూ.16.25 కోట్లు- సీఎస్కే క్రిస్ మోరిస్- రూ. 16.25 కోట్లు- రాజస్తాన్ రాయల్స్ యువరాజ్ సింగ్- రూ. 16 కోట్లు- ఢిల్లీ డేర్‌డెవిల్స్ పాట్ కమిన్స్- రూ. 15.5 కోట్లు- కేకేఆర్ ఇషాన్ కిషన్- రూ. 15. 5 కోట్లు- ముంబై ఇండియన్స్ కైల్ జేమీసన్- రూ. 15 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బెన్ స్టోక్స్- రూ.14.50 కోట్లు- రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ దీపక్ చహర్- రూ. 14 కోట్లు- సీఎస్కే Record Alert 🚨 Sam Curran 𝙗𝙚𝙘𝙤𝙢𝙚𝙨 𝙩𝙝𝙚 𝙢𝙤𝙨𝙩 𝙚𝙭𝙥𝙚𝙣𝙨𝙞𝙫𝙚 𝙥𝙡𝙖𝙮𝙚𝙧 𝙚𝙫𝙚𝙧 𝙩𝙤 𝙗𝙚 𝙗𝙤𝙪𝙜𝙝𝙩 𝙞𝙣 𝙄𝙋𝙇! He goes BIG 🤯- INR 18.50 Crore & will now play for Punjab Kings 👏 👏#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/VlKRCcwv05 — IndianPremierLeague (@IPL) December 23, 2022 -
IPL 2023: బ్రూక్ పంట పండింది.. ఎస్ఆర్హెచ్ తలరాత మారేనా!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీబ్రూక్ పంట పండింది. ఇటీవలే కాలంలో నిలకడగా ఆడుతున్న బ్రూక్ టి20 వరల్డ్‌కప్‌లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాజాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో సెంచరీలతో కథం తొక్కిన హ్యారీ బ్రూక్‌కు శుక్రవారం కొచ్చి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్‌ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో ఇప్పటివరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో బ్రూక్‌దే అత్యధికం కావడం విశేషం. బ్రూక్ తర్వాత మయాంక్ అగర్వాల్ రూ. 8.25 కోట్లకు ఎస్ఆర్హెచ్కే అమ్ముడుపోయాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రూ. 2కోట్ల కనీస ధరకు గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. ఇక అజింక్యా రహానేనను సీఎస్కే కనీస ధర రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక హ్యారీ బ్రూక్ ఇటీవలే పాకిస్తాన్‌తో ముగిసిన టెస్టు సిరీస్ ద్వారా 125 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా హ్యారీబ్రూక్ నిలిచాడు.ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్ ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు(12, 153, 87, 9, 108,111) చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో విషయమేంటంటే బ్రూక్ సాధించిన ఆ మూడు సెంచరీలు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లోనే వచ్చాయి. ఇంతకముందు ఇంగ్లండ్ తరపున కేఎస్ రంజిత్‌సింగ్హ్జి 418 పరుగులు( 62, 154*, 8, 11, 175,8*), టిప్ ఫోస్టర్ 411 పరుగులు(287, 19,49*, 21, 16,19)లు ఉన్నారు. తాజాగా వీరిద్దరిని అధిగమించిన హ్యారీ బ్రూక్ 480 పరుగులతో టాప్ స్థానంలో నిలిచాడు. What do you make of this buy folks? 💰💰 Congratulations to Harry Brook who joins @SunRisers #IPLAuction | @TataCompanies pic.twitter.com/iNSKtYuk2C — IndianPremierLeague (@IPL) December 23, 2022 చదవండి: సామ్ కరన్ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా -
ముగిసిన ఐపీఎల్ 2023 మినీ వేలం
IPL 2023 Mini Auction Details: కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో ఇంగ్లండ్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడయ్యారు. సామ్ కరన్(18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(రూ. 16.25 కోట్లు- సీఎస్కే)తో పాటు బ్యాటర్ హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు- ఎస్ఆర్హెచ్) కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయారు. ఇక ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్‌ను ఎవరు ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన రెండో ఆటగాడిగా కామెరున్ గ్రీన్ నిలిచాడు. ఇక చివరగా ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్ట్ జో రూట్ రూ. కోటి కనీస ధరకు రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. దీంతో వేలం ముగిసినట్లు ప్రకటించారు. రిలీ రోసౌకు రూ.4.6 కోట్లు ► జో రూట్- రూ. కోటి- రాజస్తాన్ రాయల్స్ ► షకీబ్ అల్ హసన్- రూ. 1.5 కోట్లు- కేకేఆర్ ►రిలీ రోసౌ- రూ.4.6 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ ►లిట్టన్ దాస్- రూ.50 లక్షలు- కేకేఆర్ ►అకేల్ హోసేన్- రూ.1 కోటి- ఎస్ఆర్హెచ్ ►ఆడమ్ జంపా- రూ. 1.5 కోట్లు- రాజస్తాన్ రాయల్స్ ►అన్మోల్ప్రీత్ సింగ్- రూ.20 లక్షలు- ఎస్ఆర్హెచ్ ►కేఎమ్ ఆసిఫ్- రూ.30 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ ►ఎం అశ్విన్- రూ.20 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ ►మన్దీప్ సింగ్- రూ. 50 లక్షలు- కేకేఆర్ ►ఆకాష్ వశిష్ట్- రూ. 20 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ ►యుధ్వీర్ చరక్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ►రాఘవ్ గోయల్- రూ. 20 లక్షల- ముంబై ఇండియన్స్ ►అబుల్ పీఏ- రూ. 20 లక్షలు- రాజస్తాన్ రాయల్స్ జోషువా లిటిల్‌కు రూ. 4.4 కోట్లు ►జోషువా లిటిల్- రూ.4.4 కోట్లు- గుజరాత్ టైటాన్స్ ►అవినాశ్ సింగ్- రూ. 60 లక్షలు- ఆర్సీబీ ►నితీష్ కుమార్ రెడ్డి- రూ.20 లక్షలు- ఎస్ఆర్హెచ్ ►డేవిడ్ వీస్- రూ. కోటి- కేకేఆర్ ►స్వప్నిల్ సింగ్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ►మోహిత్ శర్మ- రూ. 50 లక్షలు- గుజరాత్ టైటాన్స్ ►షామ్స్ ములానీ- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్ ►రాజన్ కుమార్- రూ.70 లక్షలు- ఆర్సీబీ ►విద్వాంత్ కవెరప్ప- రూ.20లక్షలు- పంజాబ్ కింగ్స్ ► విష్ణు వినోద్- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్ ► డోన్వన్ ఫెర్రెరియా- రూ. 20 లక్షలు- కేకేఆర్ ► ఉర్విల్ పటేల్- రూ. 20లక్షలు- గుజరాత్ టైటాన్స్ ► మయాంక్ డాగర్- రూ. 1.8 కోట్లు- ఎస్ఆర్హెచ్ ► డాన్ జాన్సెన్- రూ. 20 లక్షలు- ముంబై ఇండియన్స్ ► ప్రేరక్ మన్కడ్- రూ. 20 లక్షలు- లక్నో సూపర్‌జెయింట్స్ ► పియూష్ చావ్లా- రూ. 50 లక్షలు- ముంబై ఇండియన్స్ ► అమిత్ మిశ్రా- రూ. 50 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ► హర్‌ప్రీత్ బాటియా- రూ. 40 లక్షలు- పంజాబ్ కింగ్స్ ► మనోజ్ బాండగే- రూ.20 లక్షలు- ఆర్సీబీ ► రొమారియో షెపర్డ్- రూ. 50 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ► డేనియల్ సామ్స్- రూ. 75 లక్షలు- లక్నో సూపర్ జెయింట్స్ ► కైల్ జేమీసన్- రూ. 1కోటి- సీఎస్కే ముఖేష్ కుమార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. ►ముఖేష్ కుమార్- రూ. 5.5 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ ►హిమాన్షు శర్మ- రూ. 20 లక్షలు- ఆర్సీబీ ►మనీష్ పాండే- రూ. 2.4 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్ ►విల్ జాక్స్- రూ. 3.2 కోట్లు- ఆర్సీబీ శివం మావికి ఆరు కోట్లు ►హిమాంశు శర్మ- ఆర్సీబీ- 20 లక్షలు ►శివం మావి- గుజరాత్- 6 కోట్లు ►ముకేశ్‌కుమార్- ఢిల్లీ- 5.5 కోట్లు ►సన్వీర్ సింగ్- సన్‌రైజర్స్- 20 లక్షలు శ్రీకర్ భరత్ ఏ జట్టుకంటే! ►నిశాంత్ సింధు- చెన్నై- 60 లక్షలు ►శ్రీకర్ భరత్- గుజరాత్- 1. 20 కోట్లు ►ఉపేంద్ర యాదవ్- సన్‌రైజర్స్- 25 లక్షలు ►వైభవ్ అరోరా- కేకేఆర్- 60 లక్షలు ►యశ్ ఠాకూర్- లక్నో- 45 లక్షలు వివ్రాంత్ శర్మకు 2.6 కోట్లు ►సౌరభ్ కుమార్- అమ్ముడుపోలేదు ►సమర్థ్ వ్యాస్- 20 లక్షలు- సన్‌రైజర్స్ ►ప్రియం గార్గ్- అమ్ముడుపోలేదు ►వివ్రాంత్ శర్మ- కనీస ధర 20 లక్షలు.. సన్‌రైజర్స్- 2.6 కోట్లకు కొనుగోలు చేసింది రోహన్ కన్నుమ్మల్కు చేదు అనుభవం ►హిమ్మత్ సింగ్- అమ్ముడుపోలేదు ►షేక్ రషీద్- చెన్నై- 20 లక్షలు ►రోహన్ కన్నుమ్మల్ అమ్ముడుపోలేదు ►చేతన్ ఎల్ ఆర్, శుభం ఖజూరియా- అమ్ముడుపోలేదు ►అన్మోల్ ప్రీత్ సింగ్- అమ్ముడుపోలేదు ఇషాంత్‌కు ఎంతంటే ►తబ్రేజ్ షంసీ, ముజీబ్ ఉర్ రహ్మాన్- అమ్ముడుపోలేదు ►ఆడం జంపా- అమ్ముడుపోలేదు ►అకీల్ హొసేన్- అమ్ముడుపోలేదు ►ఇషాంత్ శర్మ- ఢిల్లీ- 50 లక్షలు ►జై రిచర్డ్సన్- ముంబై- 1.5 కోట్లు ►ఆడం మిల్నే- అమ్ముడుపోలేదు ఉనాద్కట్‌కు 50 లక్షలు ►జయదేవ్ ఉనాద్కట్- లక్నో- 50 లక్షలు ►రీస్ టోప్లే- ఆర్సీబీ- 1.9 కోట్లు ►క్రిస్ జోర్డాన్- అమ్ముడుపోలేదు ►ఫిల్ సాల్ట్- ఢిల్లీ- 2 కోట్లు ►టామ్ బాంటన్- అమ్ముడుపోలేదు పూరన్‌కు 16 కోట్లు వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. అతడి కోసం ఢిల్లీ, రాజస్తాన్ పోటీ పడగా.. ఏకంగా 16 కోట్లు వెచ్చించింది. బెన్ స్టోక్స్(కనీస ధర: రూ. 2 కోట్లు) ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం భారీ ధర పలికాడు. అతడి కోసం లక్నో, ఆర్సీబీ, రాజస్తాన్, సన్‌రైజర్స్ పోటీ పడగా సీఎస్కే దక్కించుకుంది. 16. 25 కోట్లకు స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. కామెరూన్ గ్రీన్: (కనీస ధర రూ. 2 కోట్లు) ►ఐపీఎల్-2023 మినీ వేలంలో హాట్ ఫేవరెట్‌గా పేరొందిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ 17.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ ఈ భారీ మొత్తం చెల్లించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్.. గ్రీన్ కంటే కోటి రూపాయలు ఎక్కువ ధర పలికి రికార్డు సృష్టించాడు. ► సామ్ కరన్(కనీసం ధర రూ 2 కోట్లు)- రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డును సామ్ కరన్ బద్దలుకొట్టాడు. ► జో రూట్(కనీస ధర 50 లక్షలు)- అమ్ముడుపోలేదు ► అజింక్యా రహానే(కనీస ధర 50 లక్షలు)- సీఎస్కే(రూ. 50 లక్షలు) ► మయాంక్ అగర్వాల్- ఎస్ఆర్హెచ్( రూ. 8.25 కోట్లు) ►హ్యారీ బ్రూక్- ఎస్ఆర్హెచ్(రూ. 13.25 కోట్లు) ► కేన్ విలియమ్సన్- గుజరాత్ టైటాన్స్(రూ. 2 కోట్లు కనీస ధర) కొచ్చి: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం తమ జట్లను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో... ఇవాళ జరగనున్న మినీ వేలంలో 10 ఫ్రాంచైజీ జట్లు పాల్గొననున్నాయి. ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత పలు ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదిలించుకున్నాయి. ఫలితంగా ఏర్పడిన 87 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు మినీ వేలం ఏర్పాటు చేశారు. ఈ వేలంలో మొత్తం 405 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఇందులో 273 మంది భారత క్రికెటర్లు కాగా... 132 మంది విదేశీ క్రికెటర్లు. 87 బెర్త్‌లలో గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాలి. విదేశీ క్రికెటర్లలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, స్యామ్ కరన్...బ్యాటర్ హ్యారీ బ్రూక్... ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌లపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన స్యామ్ కరన్ గాయం కారణంగా ఈ సంవత్సరం ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉన్నాడు. స్యామ్ కరన్ కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలో నమోదు చేసుకున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్తోపాటు ఏకంగా పదిమంది ఆటగాళ్లను వదిలించుకుంది. వారివద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఏడుగురు క్రికెటర్లు... ఆంధ్ర నుంచి పది మంది క్రికెటర్లు ఈ వేలంలో ఉన్నారు. -
IPL 2023 Auction: ఎన్ని కోట్లు పెట్టడానికైనా ఎస్ఆర్హెచ్ రెడీ! కెప్టెన్‌గా అతడే!
IPL 2023 Mini Auction- Sunrisers Hyderabad: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ మినీ వేలం-2023లో కెప్టెన్ ఆప్షన్ కోసం టార్గెట్ చేయనుంది. జట్టులో ఉన్న 13 ఖాళీలను భర్తీ చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడనుంది. కాగా మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ ఖాళీలు కలిగి ఉన్న సన్‌రైజర్స్.. పర్సులో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. కెప్టెన్‌గా స్టోక్స్? ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్‌పై సన్‌రైజర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ క్రికెట్లోనూ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి బజ్‌బాల్ విధానం అవలంబిస్తూ దూకుడైన ఆటతో.. జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు ఈ ఆల్‌రౌండర్. ఆటగాడిగానూ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మినీ వేలంలో స్టోక్స్ కోసం ఫ్రాంఛైజీల మధ్య తీవ్రమైన పోటీ జరగడం ఖాయం. అయితే, గత సీజన్లలో వరుసగా కెప్టెన్లను మార్చినప్పటికీ సన్‌రైజర్స్ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. తొలుత డేవిడ్ వార్నర్.. ఇప్పుడు కేన్ విలియమ్సన్‌ను వదిలేసిన హైదరాబాద్ జట్టు స్టోక్స్ కోసం ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, సౌతాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే, సన్‌రైజర్స్ మాత్రం స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకొని కెప్టెన్ చేయాలనుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ టార్గెట్ చేసే ప్రధాన ఆటగాళ్లు(అంచనా) బెన్ స్టోక్స్ మయాంక్ అగర్వాల్ సామ్ కరన్ కామెరూన్ గ్రీన్ సన్‌రైజర్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2.6 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.5 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 6.5 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ. 4.2 కోట్లు ), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), ఫజల్హక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 4 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ. 4.2 కోట్లు), టి నటరాజన్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు) వదిలేసిన ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్‌స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్ IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
IPL 2023: ఫ్రాంఛైజీలకు బీసీసీఐ శుభవార్త.. హాట్ ఫేవరెట్ సహా..
IPL 2023 Mini Auction-Players Availability: ఐపీఎల్- 2023 మినీ వేలానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫ్రాంఛైజీలకు గుడ్‌న్యూస్ అందించింది. కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్ వంటి స్టార్లు సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు చెందిన ఇతర ఆటగాళ్లు టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించినట్లు వెల్లడించింది. ‘‘మా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు మార్చి 30 నుంచి జట్లతో చేరగలరు’’ అని సీఏ పేర్కొనగా.. ఈసీబీ సైతం తమ ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటారని తెలిపింది. అయితే, ఐపీఎల్ వేలంలో హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న కామెరూన్ గ్రీన్ అందుబాటులోకి రావడంతో అతడి కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ తీవ్రతరం కావడం ఖాయం. అదే విధంగా స్టోక్స్ విషయంలోనూ పోటీ తప్పకపోవచ్చు. కానీ ఆయా జట్ల టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో వీరిద్దరు ప్లే ఆఫ్స్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, సామ్ కరన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, టామ్ బాంటన్, ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, విల్ స్మీడ్, జాసన్ రాయ్, జార్జ్ గార్టన్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, రిచర్డ్ గ్లీసన్, ల్యూక్ వుడ్, టామ్ కరన్, టైమల్ మిల్స్, డేవిడ్ పేన్, రెహాన్ అహ్మద్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్టోఫర్ బెంజమిన్, థామస్ హెల్మ్, జేమ్స్ ఫుల్లర్, బెన్నీ హోవెల్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్ గ్రీన్, పీటర్ హాట్జోగ్లో, లాన్స్ మోరిస్, జాషువా ఫిలిప్, జై రిచర్డ్సన్, రిలే మెరెడిత్, హేడెన్ కెర్, జాక్ ప్రెస్‌విడ్జ్, బెన్ మెక్‌డెర్మోట్, బెన్ డ్వార్షూయిస్, బిల్లీ స్టాన్లేక్, ట్రావిస్ హెడ్, నాథన్ మెక్అంపాస్ , సీన్ అబాట్, క్రిస్ లిన్, డార్సీ షార్ట్, నాథన్ కౌల్టర్-నైల్, ఆండ్రూ టై, మోయిసెస్ హెన్రిక్స్ వాళ్లు ఏప్రిల్ 8 తర్వాతే ఇక సౌతాఫ్రికా క్రికెట్, వెస్టిండీస్ బోర్డులు తమ క్రికెటర్లు మార్చి 29 నుంచి అందుబాటులో ఉంటారని చెప్పగా.. శ్రీలంక బోర్డు మాత్రం ఏప్రిల్ 8 తర్వాతే తమ ఆటగాళ్లు జట్లతో కలవగలరని పేర్కొంది. ఎవరెవరు ఎప్పుడు అందుబాటులోకి.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు- ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వాళ్లు ఏప్రిల్ 8- మే 1 నుంచి న్యూజిలాండ్ క్రికెటర్లు- అందరూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన వాళ్లు మార్చి 30 తర్వాత ఐర్లాండ్- - మే 5- 15 మధ్య అందుబాటులో ఉండరు జింబాబ్వే- పూర్తి స్థాయిలో అందరూ అందుబాటులో ఉంటారు కాగా మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ ఆరంభంలో ఐపీఎల్- 2023 ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరకు మినీ వేలం మొదలుకానుంది. చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్‌స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్ Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్!? ద్రవిడ్, నువ్వూ కలిసి.. -
‘15 ఏళ్ల ఆ అఫ్గన్ బౌలర్ సూపర్‌స్టార్! ఉనాద్కట్‌కు భారీ ధర! ఇంకా..’
IPL 2023 Mini Auction- Watch Out: ఐపీఎల్- 2023 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆక్షన్‌లో సత్తా చాటగల అన్క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లేనంటూ ముగ్గురు యువ క్రికెటర్ల పేర్లు ప్రస్తావించాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్ సహా అఫ్గన్ యువ కెరటం అల్లా మహ్మద్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు తమ తమ జట్ల తరఫున అద్భుత ప్రదర్శన చేశారని, వేలంలో వీరు మంచి ధర పలకడం ఖాయమని మిస్టర్ ఐపీఎల్ అభిప్రాయపడ్డాడు. కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తంగా 87 బెర్త్‌ల కోసం బరిలో 405 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఉనాద్కట్ ఇంకా.. ఈ మేరకు.. ‘‘భారత క్రికెటర్లలో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలిపిన కెప్టెన్, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్, తమిళనాడు ప్లేయర్ జగదీశన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. ఆ ఐరిష్ బౌలర్ విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ సహా టీ20 ప్రపంచకప్-2022లో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కోసం పోటీ నెలకొంటుంది. సూపర్‌స్టార్ కాగలడు! అన్క్యాప్డ్ ప్లేయర్లలో ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్, అల్లా మహ్మద్ సత్తా చాటగలరు. నేను ముజ్తాబాతో కలిసి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాను. తను అద్భుతమైన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్. ఇక సౌరాష్ట్ర తరఫున సమర్థ్ వ్యాస్ 150 స్ట్రైక్‌రేటుతో మెరిశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్-5 బ్యాటర్లలో ఒకడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఇక అల్లా మహ్మద్.. ఆరడుగుల మీద రెండు అంగుళాల ఎత్తు ఉండే ఈ 15 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. సూపర్‌స్టార్ కాగలడు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున ఆడుతున్న ముజ్తాబా యూసఫ్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక సమర్థ్ వ్యాస్.. సౌరాష్ట్ర తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అఫ్గనిస్తాన్ యువ సంచలనం 15 ఏళ్ల అల్లా మహ్మద్ అండర్-19 టోర్నీలో(బెస్ట్ 4/15) రాణిస్తున్నాడు. మిస్టర్ ఐపీఎల్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. ఐపీఎల్లో 5528 పరుగులు సాధించాడు. 205 మ్యాచ్‌లలో 136.76 స్ట్రైక్‌రేటుతో ఈ మేరకు రన్స్ చేసి మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు. రైనా ఐపీఎల్ ఖాతాలో ఓ సెంచరీ, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs Ban: టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు.. IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలానికి ముందు అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి జియో సినిమాస్ మాక్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఆసీస్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ అత్యధికంగా 20 కోట్లకు అమ్ముడుపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రీన్ కోసం చివరి దాకా ప్రయత్నించి సొంతం చేసుకుంది. ఈ మాక్ వేలంలో రెండో అత్యధిక ధర ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్ హీరో సామ్ కర్రన్‌కు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కర్రన్‌ను 19.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. అనూహ్యంగా గ్రీన్, కర్రన్ల కంటే తక్కువ ధర పలికాడు. స్టోక్స్‌ను పంజాబ్ కింగ్స్ 19 కోట్లకు కొనుగోలు చేసింది. వీరి తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కు 8.5 కోట్లు (ముంబై ఇండియన్స్), విండీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు 8.5 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్) భారీ ధరలు పలికారు. కాగా, ఈ మాక్ వేలం కేవలం ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కోసమేనని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే, రేపు జరుగబోయే వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. -
IPL 2023: నేనో అంతర్జాతీయ క్రికెటర్‌ను.. సీఎస్కే నాకు కనీస విలువ ఇవ్వలేదు..!
Joshua Little Sensational Comments On CSK: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై ఐర్లాండ్ స్టార్ పేసర్ జాషువ లిటిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన సీఎస్కే తన పట్ల అమర్యాదగా వ్యవహరించిందని వాపోయాడు. గత ఐపీఎల్ సీజన్ (2022) మధ్యలో సీఎస్కే నెట్ బౌలర్‌గా ఎంపికైన తనను.. జట్టు యాజమాన్యం సరిగ్గా ట్రీట్ చేయలేదని, తానొక అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి కనీస మర్యాద కూడా ఇవ్వలేదని తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. సీఎస్కే యాజమాన్యం తనకు చెప్పిందొకటి, వేల కిలోమీటర్లు దాటి వచ్చాక తన పట్ల ప్రవర్తించిన తీరు మరొకటి అంటూ బాధపడ్డాడు. సీఎస్కే మేనేజ్మెంట్ తనకు తుది జట్టులో అవకాశం కల్పిస్తామని (ఎవరైనా గాయపడితే) చెప్పి, అలా చేయకపోగా, కనీసం నెట్ బౌలర్‌గా కూడా వినియోగించుకోలేదని బాధను వెల్లగక్కాడు. ఐపీఎల్ ఆడేందుకు సుదూరం నుంచి వచ్చిన తనకు ట్రయినింగ్ సెషన్స్‌లో కూడా పూర్తిగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. అప్పటికే లంక ప్రీమియర్ లీగ్, టీ10 లీగ్‌లో ఆడి, జాతీయ జట్టు తరఫున సత్తా చాటిన తన పట్ల సీఎస్కే యాజమాన్యం ప్రవర్తించిన తీరు చాలా బాధించిందని, అందుకే సీజన్ మధ్యలోనే (రెండు వారాల వ్యవధిలోనే) సీఎస్కే నుంచి వైదొలిగానని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 మినీ వేలం రేపు జరుగనున్న నేపథ్యంలో జాషువ లిటిల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022లో ఐర్లాండ్ జట్టు సంచలన ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ దశలో స్కాట్లాండ్, వెస్టిండీస్‌లపై సంచలన విజయాలు సాధించిన ఆ జట్టు.. సూపర్-12లో వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరింపించి (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) పెను సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్లు బట్లర్, హేల్స్‌ను పెవిలియన్‌కు పంపిన ఐరిష్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జాషువ లిటిల్.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సాధించి ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిలో రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ టోర్నీలో 17.18 సగటున 11 వికెట్లు పడగొట్టిన లిటిల్.. రేపు జరుగబోయే ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఐపీఎల్-2023 మినీ వేలానికి కౌంట్‌డౌన్ షురూ.. బరిలో 405 మంది ఆటగాళ్లు
IPL 2023 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మినీ వేలం రేపు (డిసెంబర్ 23) మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్లో ప్రారంభంకానుంది. ఈ వేలం కోసం స్వదేశ, విదేశాలకు చెందిన మొత్తం 991 ప్లేయర్లు దరఖాస్తు చేసుకోగా 405 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. లీగ్‌లోని 10 ఫ్రాంచైజీలు ఇదివరకే 163 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకోగా.. అవకాశం ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగనుంది. ఇందులో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడినవి కాగా.. మిగతా 57 స్థానాల కోసం స్వదేశీ ప్లేయర్స్ పోటీ పడతారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను 5 సెట్లుగా విభజించారు. తొలి సెట్లో బ్యాటర్లు, రెండో సెట్లో ఆల్‌రౌండర్లు, మూడో సెట్లో వికెట్ కీపర్లు, నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను ఉన్నారు. వేలం ప్రక్రియ మొత్తం సెట్ల వారీగా జరుగనుంది. రెండో సెట్లో ఉన్న ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఈ సెట్లో ఉన్న విదేశీ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, సామ్ కర్రన్, షకీబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్ భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. తొలి సెట్లో ఉన్న బ్యాటర్లలో రిలీ రోస్సో, హ్యారీ బ్రూక్ జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ ఉండగా.. నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్, దేశీయ సంచలనం, తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ కూడా భారీ ధర పలకవచ్చు. పర్స్ వాల్యూ విషయానికొస్తే.. లీగ్‌లో పాల్గొనే 10 జట్లు ఇదివరకే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లపై రూ.743.5 కోట్లు ఖర్చు చేయగా.. ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ.206.5 కోట్ల నిధులు ఉన్నాయి. వేలంలో పాల్గొనే ఫ్రాంఛైజీల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా 42.25 కోట్లు ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద అత్యల్పంగా 7.05 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ బ్యాలెన్స్ వివరాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు లక్నో సూపర్‌జెయింట్స్: రూ. 23.35 కోట్లు ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్: రూ. 20.45 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ. 7.05 కోట్లు బేస్ ప్రైజ్ ఆధారంగా విభజింపబడ్డ ప్రముఖ ప్లేయర్ల వివరాలు.. రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్ రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ ఆయా ప్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్. రన్నరప్ రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. -
సన్‌రైజర్స్ వద్ద అత్యధికంగా 42 కోట్లు! మిగతా ఫ్రాంఛైజీల పర్సులో?
IPL 2023 Mini Auction- Purse: కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం-2023 శుక్రవారం(డిసెంబరు 23) జరుగనుంది. క్యాష్ రిచ్ లీగ్ ఆక్షన్‌లో పాల్గొనేందుకు మొత్తంగా 991 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. 405 ప్లేయర్ల పేర్లు షార్ట్‌లిస్ట్ జాబితాలో చేరాయి. 10 ఫ్రాంఛైజీలలో ఉన్న 87 ఖాళీల భర్తీకి శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ వేలం మొదలుకానుంది. కాగా ఆక్షన్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు చెల్లించే మొత్తం పోను ఈ మేర డబ్బు మిగిలి ఉంది. మరి మిగతా ఫ్రాంఛైజీల పర్సులో ఎంత మొత్తం ఉందంటే?! కోల్‌కతా పర్సులో అత్యల్పంగా.. ►ముంబై ఇండియన్స్: రూ. 20.55 కోట్లు ►చెన్నై సూపర్‌కింగ్స్: రూ. 20.45 కోట్లు ►ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 19.45 కోట్లు ►రాజస్తాన్ రాయల్స్: రూ. 13.2 కోట్లు ►లక్నో సూపర్‌జెయింట్స్: రూ. 23.35 కోట్లు ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రూ. 8.75 కోట్లు ►గుజరాత్ టైటాన్స్: రూ. 19.25 కోట్లు ►కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ. 7.05 కోట్లు(అత్యల్పం) ►పంజాబ్ కింగ్స్: రూ. 32.2 కోట్లు చదవండి: IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. -
SRH: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేది, సన్‌రైజర్స్ కెప్టెన్ కూడా అతడే!
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది. మయాంక్ అగర్వాల్ కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్ఆర్హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది. కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్‌గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్‌గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్‌రైజర్స్ మయాంక్‌ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది. చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు -
వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం డిసెంబర్ 23న మినీవేలం జరగనుంది. వేలంలో పాల్గొనబోయేవారిని ఆయా ఫ్రాంచైజీలు షార్ట్‌లిస్ట్ చేశాయి. మొత్తంగా 991 ప్లేయర్లలో 405 మంది వేలంలోకి రానున్నారు. ఇంతకుముందు 369 మందిని షార్ట్ లిస్ట్ చేయగా.. తాజాగా ఫ్రాంఛైజీలు మరో 36 మందిని ఇందులో చేర్చాల్సిందిగా కోరాయి. దీంతో మొత్తం వేలంలో పాల్గొనే ప్లేయర్స్ సంఖ్య 405కి చేరింది. ఈసారి మినీ వేలానికి కొచ్చి వేదిక కానుంది. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 273 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ప్లేయర్స్. వీళ్లలో నలుగురు ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందిన వాళ్లు. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 119 మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు. ఇక 282 మంది తమ నేషనల్ టీమ్స్‌కు ఆడని వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం పది ఫ్రాంఛైజీలకు మొత్తం 87 మంది ప్లేయర్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో 30 వరకూ విదేశీ ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు. ఇక వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లతో 19 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. 11 మంది రూ.1.5 కోట్ల కనీస ధరతో ఉన్నారు. ఇక రూ.కోటి బేస్‌ప్రైస్‌తో 20 మంది ఉండగా.. అందులో మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్ రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ 🚨 NEWS 🚨: TATA IPL 2023 Player Auction list announced. #TATAIPLAuction Find all the details 🔽https://t.co/fpLNc6XSMH — IndianPremierLeague (@IPL) December 13, 2022 చదవండి: Steve Smith: ఎలుకలపై కోపం.. అందుకే చిరిగిన క్యాప్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కన్నెర్ర చేసిన ఐసీసీ.. 8 నెలల్లో రెండోసారి -
విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌పై కన్నేసిన రాజస్తాన్!
ఐపీఎల్-2023 మినీవేలం సమయం దగ్గరపడడంతో ఆయా ప్రాంఛైజీలు తమ వ్యూహాలను రచించేందుకు సిద్దమవుతున్నాయి. మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. ఇక ఈ వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజస్తాన్ జట్టులో బట్లర్, శాంసన్, పడిక్కల్ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఆల్‌రౌండర్ల లోపం మాత్రం సృష్టంగా ఈ ఏడాది సీజన్లో కన్పించింది. ఈ నేపథ్యంలో హోల్డర్ వంటి విధ్వంసక ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలని రాజస్తాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున హోల్డర్ ఆడాడు. కానీ మినీవేలంకు ముందు లక్నో హోల్డర్‌ను విడిచిపెట్టింది. ఐపీఎల్-2022లో 12 మ్యాచ్‌లు ఆడిన హోల్డర్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు రాజస్తాన్ రాయల్స్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం రాజస్తాన్ పర్స్‌లో రూ. 13.2 కోట్లు ఉన్నాయి. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా చదవండి: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
అతడి కోసం లక్నో పోటీ పడుతుంది! సీఎస్కే కూడా: అశ్విన్
ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఈ మినీవేలం జరగనుంది. ఈ మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా.. 21 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నారు. వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, ఆసీస్ యువ ఆటగాడు కామెరాన్ గ్రీన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి వారు ఉన్నారు. అయితే ఈ వేలంలో ముఖ్యంగా బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్ కోసం ప్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. ఇక మినీ వేలం నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేస్తుందని అశ్విన్ జోస్యం చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్‌లోకి స్టోక్స్! "బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఒక వేళ అతడిని దక్కించుకోకపోతే అప్పడు మాత్రమే ఇతర ఆటగాళ్ల కోసం ఆలోచిస్తారు. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా సామ్ కుర్రాన్ కోసం తొలుత ప్రయత్నిస్తారు. ఒక వేళ కుర్రాన్‌ను వారు సొంతం చేసుకోపోతే అప్పడు బెన్ స్టోక్స్ కోసం కూడా పోటీపడతారు. వీరిద్దరి తర్వాత సీఎస్కే ఆలోచనలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఉంటాడు. అదే విధంగా విండీస్ విధ్వంసకర ఆటగాడు పూరన్ కూడా సీఎస్కే దృష్టిలో ఉండే అవకాశం ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IPL Mini Auction: రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా -
ఐపీఎల్ వేలంలోకి వారిద్దరూ ఎంట్రీ.. రికార్డులు బద్దలు కావాల్సిందే!
ఐపీఎల్-2023 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఈ మినీ వేలం జరగనుంది. ఈ మినీవేలంలో మొత్తంగా 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 21 మంది తమ బేస్‌ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ లిస్టులో భారత్ నుంచి ఒక్క ఆటగాడి పేరు కూడా లేకపోవడం గమనార్హం. బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్‌కు భారీ ధర ఖాయం! ఈ ఏడాది ఐపీఎల్ దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్ కోసం మినీ వేలంలో ప్రాంఛైజీలు పోటీపోడే అవకాశం ఉంది. కాగా గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సామ్ కర్రాన్‌ను మళ్లీ అదే ఫ్రాంచైజీ దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా కేన్ విలియమ్సన్ విడిచి పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. స్టోక్స్‌ను ఈ వేలంలో ఎలాగైనా సొంతం చేసుకుని సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదైనా గానీ వీరిద్దరికి మాత్రం వేలంలో భారీ ధర దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక వీరిద్దరూ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను బెన్ స్టోక్స్ విజేతగా నిలపగా.. సామ్ కర్రాన్ టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టిన కర్రాన్.. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. చదవండి: ENG vs PAK 1ST Test: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ -
రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా
ఐపీఎల్-2023కు సంబంధించిన మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారత క్రికెటర్లు, 277 మది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 21 మంది క్రికెటర్లు తమ కనీస ధర రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. అయితే ఈ జాబితాలో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. అదే విధంగా మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే వంటి భారత క్రికెటర్లు తమ బేస్ ప్రైస్ కోటి రూపాయలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. రూ. 2 కోట్లు, 1.5 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ గా నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం. కాగా ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. 2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు వీరే నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ సీన్ అబోట్, రిలే మెరెడిత్, జో రిచర్డ్సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్ చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. -
వేలంలో 991 మంది ఆటగాళ్లు! అతడికి అప్పుడు 14 కోట్లు.. ఇప్పుడు కనీసం కోటి ధరతో..
ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్షన్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేయడానికి గడువు నవంబర్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. అందులో 714 భారత ఆటగాళ్లు, 277 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అదే విధంగా ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. 991 మంది ఆటగాళ్ల లిస్టులో 21 మంది తమ బేస్‌ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. కాగా 21 మంది జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ధర తగ్గించిన రహానే, ఇషాంత్ శర్మ కాగా ఈ సారి మినీవేలంలో 19 మంది టీమిండియా ఆటగాళ్లు భాగం కానున్నారు. వారిలో అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే రహానే, ఇషాంత్ ఈ సారి తమ బేస్ ప్రైస్‌ను భారీగా తగ్గించారు. ఈ ఏడాది మెగా వేలంలో కోటి రూపాయలును కనీస ధరగా ఉంచిన రహానే.. ఇప్పుడు దాన్ని రూ. 50 లక్షలకు తగ్గించాడు. మయాంక్ పరిస్థితి మరీ దారుణం అదే విధంగా ఇషాంత్ కూడా తన బేస్ ప్రైస్‌ను రూ. 75లక్షలుగా నిర్ణయించుకున్నాడు. ఇక గతేడాది లక్నో సూపర్‌జెయింట్స్ రాకతో కేఎల్ రాహుల్ తమ జట్టును వీడటంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అతడి కోసం 14 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడు విఫలం కావడంతో ఇటీవలే మయాంక్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు మినీ వేలంలో మయాంక్ తన కనీస ధరను కోటి రూపాయలుగా ప్రకటించడం గమనార్హం. 2 కోట్లు బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు వీరే నాథన్ కౌల్టర్-నైల్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రిలీ రోసోవ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ సీన్ అబోట్, రిలే మెరెడిత్, ఝే రిచర్డ్సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కోటి కనీస ధర కలిగిన ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, డారిన్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుశల్ పెరెరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకేల్ హోస్సేన్, డేవిడ్ వైస్ చదవండి: Pak Vs Eng: పాక్‌కు దిమ్మతిరిగేలా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు! టీమిండియాను వెనక్కినెట్టి.. -
పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రపంచ ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌ల్లో నెం1. కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీలో భాగం కావాలని ప్రతీ ఆటగాడు కలలు కంటాడు. ముఖ్యంగా ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి ఐపీఎల్ పరిచయం చేసింది. విరాట్ కోహ్లి నుంచి ఉమ్రాన్ మాలిక్ వరకు అక్కడ సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన వారే. అయితే వేలంలో మనకు పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ మొత్తం చెల్లించడం మనం ప్రతీ సారి చూస్తూ ఉంటాం. అయితే ఆటగాళ్ల ఎంపిక, భారీ మొత్తం చెల్లించడం వెనుక పెద్ద కథే ఉంది. ఐపీఎల్ -2023 మినీ వేలం నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం. సెలక్షన్ ట్రయల్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వివిధ రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్లను సంప్రదిస్తూ యువ ఆటగాళ్లను ట్రయల్స్‌కు ఆహ్వానిస్తాయి. ఈ ట్రయల్స్‌లో ఆయా ఫ్రాంఛైజీ టాలెంట్ స్కౌట్లు ఆటగాళ్లు సవాళ్లను, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? మ్యాచ్ పరిస్థితులను ఏ విధంగా ఆర్ధం చేసుకుంటారో వంటివి నిశితంగా పరిశీలిస్తారు. బ్యాటర్ల విషయానికి వస్తే.. పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్లలో ఎలా రాణిస్తారో, ఫాస్ట్ బౌలర్లకు ఏ విధంగా ఎదుర్కొంటారో వంటివి గమినిస్తారు. బౌండరీలు బాదే పవర్ ఉందా లేదా.. మ్యాచ్‌ను ఫినిష్ చేసే సత్తా ఉందా లేదా అన్నవి చూస్తారు. ఇక బౌలర్ల ఎంపిక విషయంలో కూడా టాలెంట్ స్కౌట్లు కొన్ని ప్రామాణాలు పాటిస్తారు. పవర్ ప్లేలో ఏ విధంగా బౌలింగ్ చేస్తారు, ఒత్తిడిని తట్టుకుని రాణించగలరా? డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయగలరా వంటివి ముఖ్యంగా చూస్తారు. ఒక వేళ ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో ఎంపిక కాకపోతే బౌలర్లను తమ జట్టు నెట్ బౌలర్లగా నియమించకుంటాయి. కాగా ప్రతీ ఐపీఎల్ జట్టుకు ఇద్దరు నుంచి ముగ్గురు వరకు నెట్ బౌలర్లు ఉంటున్నారు. దేశవాళీ టోర్నీలపై కన్ను టాలెంట్ స్కౌట్లు ట్రయల్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను మాత్రమే కాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీల్లో ఆటతీరును కూడా చూస్తారు. “మా టాలెంట్ స్కౌట్లు దేశవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లను సెలక్షన్ ట్రయల్స్‌కు పిలుస్తారు. ముఖ్యంగా వారు దేశవాళీ క్రికెట్లో ఏ విధంగా రాణిస్తాన్నారన్నది చూస్తారు. వారిలో కొంతమంది తమిళనాడు క్రికెట్ ఆసోషియషన్కు చెందిన ఆటగాళ్లు కూడా ఉంటారు" అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ గతంలో ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా తిలక్ వర్మ, అభినవ్ మనోహర్, మయాంక్ యాదవ్ వంటి ఆటగాళ్లు సీఎస్కే ట్రయల్స్‌కు హాజరైనప్పటికీ వేరే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. మాక్ వేలం ఇక సెలక్షన్ ట్రయల్స్ పూర్తి అయ్యాక టాలెంట్ స్కౌట్లు కొంత మంది ఆటగాళ్ల పేర్లను ఆయా ఫ్రాంచైజీలకు సూచిస్తారు. ఈ క్రమంలో ప్రధాన వేలంకు ముందు ఫ్రాంచైజీలు మాక్ వేలంను నిర్వహిస్తాయి. ఈ మాక్ వేలంలో ఏ ఆటగాడిపై ఎంత వెచ్చించాలో, ఇతర ఫ్రాంఛైజీలతో ఎంతవరకు పోటీ పడవచ్చు వంటి ఆంశాలపై దృష్టిసారిస్తాయి. నెట్ బౌలర్ల నుంచి ప్రధాన బౌలర్లగా టాలెంట్ స్కౌట్లు ఎంపిక చేసిన కొంత మంది బౌలర్లు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోరు. అటువంటి వారిని ఆయా ఫ్రాంచైజీలు తమ జట్టు నెట్ బౌలర్లగా ఎంపిక చేస్తాయి. వారు నెట్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రాధాన జట్టులో చోటు దక్కించకున్న చాలా సందర్భాలు ఉన్నాయి. టి నటరాజన్, మహేశ్ తీక్షణ వంటి వారు నెట్‌బౌలర్లగా వచ్చి ఆయా జట్లలో ప్రధాన బౌలర్లగా మారారు. ఇక ఐపీఎల్-2023 మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనుంది. చదవండి: PAK Vs ENG: టెస్టు సిరీస్.. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
IPL 2023: యువ బ్యాటర్ కోసం సంజూ శాంసన్ ప్లాన్! భారీ ధర పలికే అవకాశం?
IPL 2023 Mini Auction- Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారి ఈ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది. దినేశ్ కార్తిక్ వంటి వెటరన్ ప్లేయర్ల పునరాగమనానికైనా.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ వంటి యువ ఆటగాళ్ల ఎంట్రీకైనా మార్గం సుగమం చేసింది. అందుకే ఈ మెగా ఈవెంట్లో ఆడే అవకాశం రావాలని చాలా మంది ఆటగాళ్లు కోరుకుంటారు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ కేరళ యువ సంచలనం కేరళ బ్యాటర్ రోహన్ కన్నుమ్మల్ కూడా ఈ కోవకు చెందినవాడే. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న ఈ యువ ప్లేయర్.. క్యాష్ రిచ్ లీగ్‌లో భాగం కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ విషయంలో అతడికి అండగా నిలబడ్డాడు టీమిండియా ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. రోహన్ కన్నుమ్మల్ వరుస సెంచరీలు దేశవాళీ టోర్నీల్లో కేరళ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహన్.. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. అదే విధంగా సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చిన 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్ మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సంప్రదాయ క్రికెట్లో 414 పరుగులతో కేరళ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బంగ్లాదేశ్‌తో తలపడనున్న ఇండియా- ఏ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. డిసెంబరు 23న ఐపీఎల్ 2023 మినీ వేలం నేపథ్యంలో ఇప్పటికే పలు జట్లు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రోహన్ రాజస్తాన్ ట్రయల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ విషయం గురించి అతడు ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. సంజూ శాంసన్ తనకు సాయం చేశాడని పేర్కొన్నాడు. సంజూ శాంసన్ ‘‘కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నాకు రెండుమూడు సార్లు కాల్స్ వచ్చాయి. అయితే, రాష్ట్ర స్థాయి ఈవెంట్ల కారణంగా నేను ట్రయల్స్‌కు హాజరుకాలేకపోయాను. అయితే, సంజూ శాంసన్ పట్టుబట్టి మరీ నాతో పాటు మరికొంత మంది కేరళ ఆటగాళ్లను రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్‌కు తీసుకెళ్లాడు. రాజస్తాన్, ఢిల్లీ జట్ల ట్రయల్ ఈవెంట్లో సంతృప్తికర ప్రదర్శన ఇచ్చాను. ఇక వేలంలో నన్ను ఎవరైనా కొంటారా లేదా అన్న విషయం తెలియదు. మన చేతుల్లో లేని అంశాల గురించి నేను పెద్దగా ఆలోచించను’’ అని రోహన్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ ఏడాది తనకు సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా రాజస్తాన్ కెప్టెన్‌గా సంజూ ఉన్న నేపథ్యంలో యువ సంచలనం రోహన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ రాణించగల ఈ యంగ్ టాలెంట్‌ను దక్కించుకునేందుకు ఆర్ఆర్ భారీ మొత్తం వెచ్చించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: IPL 2023: 'వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే Abu Dhabi T10: వరల్డ్ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 32 బంతుల్లోనే -
కేన్ మామకే దిక్కులేదు.. కొత్తగా ఈయన వచ్చాడు..!
ఐపీఎల్-2023 మినీ వేలానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, విదేశీ స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పేర్ల నమోదుకు బీసీసీఐ డిసెంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించడంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. టీ20 వరల్డ్‌కప్-2022 హీరోలు బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, ఆసీస్ నయా సంచనలం కెమరూన్ గ్రీన్ ఇదివరకే తమ పేర్లను ఎన్రోల్ చేసుకోగా.. తాజాగా ఇంగ్లండ్ టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ కూడా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. బేస్ ధర 2 కోట్లకు రూట్ తన పేరును కోట్ చేసినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 23న జరుగనున్న వేలంలో 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకునే మొత్తం 250 మంది వరకు వేలంలో పాల్గొనవచ్చని బీసీసీఐ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కేవలం టెస్ట్‌లకే పరిమితమైన రూట్ (అడపాదడపా వన్డేలు ఆడుతున్నాడు).. 2023 ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత కొంతకాలంగా ఆటలో వేగం తగ్గి, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న రూట్.. ఐపీఎల్లో అవకాశం వస్తే సత్తా చాటి తిరిగి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. రూట్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పటికే కేన్ మామ లాంటి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీల నుంచి తప్పించబడి, తమను కనీస ధరకైనా కొనుక్కుంటారా లేక లీగ్ నుంచి మర్యాదగా తప్పుకోవడం ఉత్తమమా అన్న డైలమాలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పొట్టి క్రికెట్ ఆడి చాలా రోజులైన రూట్‌ను ఎవరైనా పట్టించుకుంటారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేన్ మామకు, రూట్‌కు టెస్ట్ క్రికెట్లో ఘనమైన రికార్డే ఉన్నప్పటికీ.. నిదానంగా ఆడతారన్న ముద్ర ఉండటంతో వీరిని ఈ వేలంలో ఎవరు కొనుగోలు చేసే అవకాశం లేదు. గత సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా వేలంలో తన పేరును నమోదు చేసుకుని భంగపడ్డాడు. టెస్ట్‌ల్లో స్మిత్‌కు కూడా మంచి రికార్డే ఉన్నప్పటికీ అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి త్వరలో జరుగబోయే మినీ వేలంలో ఈ టెస్ట్ హీరోలను ఎవరైనా కొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. -
IPL 2023: సన్‌రైజర్స్‌లోకి బెన్ స్టోక్స్.. కెప్టెన్ కూడా అతడే..?
ఐపీఎల్-2023 సీజన్ మినీ వేలానికి (డిసెంబర్ 23) రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్తగా వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. పలానా ఆటగాడిని పలానా ఫ్రాంచైజీ దక్కించుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాల్లో మునిగితేలుతున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ.. తమతమ ఫేవరెట్ జట్లు ఇలా ఉంటే బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్-2022 స్టార్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్, సికందర్ రాజా, కెమరూన్ గ్రీన్ తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్ల్లో ఉన్న బ్యాలెన్స్ లెక్కలను బేరీజు వేసుకుని పై పేర్కొన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (42.25 కోట్లు)కు ఎక్కువ మంది స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ప్రకారం.. బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, కెమరూన్ గ్రీన్‌లను చేజిక్కించుకునేందుకు ఎందాకైనా వెళ్లే ఛాన్స్ ఉంది. వీరిలో స్టోక్స్‌కు 10 నుంచి 12 కోట్లు ఖర్చు చేసినా.. హేల్స్‌కు 3 నుంచి 4 కోట్లు, గ్రీన్‌కు 6 నుంచి 8 కోట్లు వెచ్చించినా ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా బ్యాలెన్స్ మిగిలే ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సన్‌రైజర్స్.. స్టోక్స్‌పై ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ఆ జట్టు.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదిలించుకోవడంతో స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకుని, కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్- 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్-32.20 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్-23.35 కోట్లు ముంబై ఇండియన్స్-20.55 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్-20.45కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్-19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్-19.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్-13.20 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-8.75 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్-7.05 కోట్లు -
ఐపీఎల్-2023కి సంబంధించి కీలక అప్డేట్
ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న మినీ వేలంలో పాల్గొనాలకున్న ఆటగాళ్లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. వేలం బరిలో ఉండాలనుకే ఆటగాళ్లు డిసెంబర్ 15లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలలోగా ఆటగాళ్లు తమ పేర్లను ఎన్రోల్ చేసుకోకపోతే, మినీ వేలానికి వారు అనర్హులని ప్రకటించింది. కాగా, మినీ వేలానికి ముందు జరగాల్సిన ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్, ట్రేడింగ్ ప్రక్రియ ఈనెల 15న ముగిసిన విషయం తెలిసిందే. ఆయా ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వద్దనుకున్న వారిని వేలానికి వదిలిపెట్టాయి. ఇక మిగిలింది వేలం తంతు మాత్రమే. 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకునే మొత్తం 250 మంది వరకు వేలంలో పాల్గొనవచ్చని బీసీసీఐ అంచనా వేస్తుంది. టీ20 వరల్డ్‌కప్-2022 హీరోలు, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్ వేలంలో ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకోగా.. కొత్తగా ఇంగ్లండ్ టెస్ట్ ఆటగాడు జో రూట్ కూడా తన పేరును ఎన్రోల్ చేసుకున్నాడు. వరల్డ్‌కప్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సామ్ కర్రన్, ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్, సికందర్ రాజా లాంటి స్టార్లు తమ పేర్లు నమోదు చేసుకుంటారని సమాచారం. వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన ఆటగాళ్ల కోసం తీవ్ర పోటీ ఉండనున్న నేపథ్యంలో పర్స్ వ్యాల్యూ మరికొంత పెంచాలని అన్ని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు క్రిస్మస్ దృష్ట్యా వేలం తేదీని కూడా ముందుకు జరపాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని పట్టుబడుతున్నాయి. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న డబ్బు ఎంతంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్- 42.25 కోట్లు పంజాబ్ కింగ్స్-32.20 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్-23.35 కోట్లు ముంబై ఇండియన్స్-20.55 కోట్లు చెన్నై సూపర్‌కింగ్స్-20.45కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్-19.45 కోట్లు గుజరాత్ టైటాన్స్-19.25 కోట్లు రాజస్థాన్ రాయల్స్-13.20 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-8.75 కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్-7.05 కోట్లు -
5 సెంచరీలు బాదిన చిచ్చరపిడుగును వదులుకున్నామా.. ధోని పశ్చాత్తాపం
నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను గత సీజన్ నుంచి దురదృష్టం వెంటాడుంది. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు.. నాటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతీది బెడిసి కొడుతూనే ఉంది. కెప్టెన్ మార్పు దగ్గరి నుంచి ఆ జట్టు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు మిస్ ఫైర్ అయ్యాయి. దీనికి తోడు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం, ఫామ్‌లో ఉండిన డెవాన్ కాన్వే లాంటి ఆటగాడు వ్యక్తిగత కారణాల చేత పలు కీలక మ్యాచ్‌లకు దూరం కావడం, ఫలితంగా సీజన్‌ను చివరి నుంచి రెండో స్థానంతో ముగించడం.. ఇలా గత సీజన్లో ఆ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. తాజాగా ఆ ఫ్రాంచైజీ తీసుకున్న మరో నిర్ణయం, జట్టు కెప్టెన్ ధోని సహా యాజమాన్యాన్ని తీవ్ర పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. ఓ ఆటగాడిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యామన్న ఓ విషయం ధోని అండ్ కో ను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో సీఎస్కే జట్టు మొత్తం 8 మంది ఆటగాళ్లను వదులుకుంది. అందులో ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో మార్మోగిపోతున్న నారాయణ్ జగదీశన్ పేరు ఉండటమే సీఎస్కే మనోవేదనకు, పశ్చాత్తాపానికి ప్రధాన కారణం. ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న భారత దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో జగదీశన్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 5 శతకాలు బాది పూనకం వచ్చిన ఆటగాడిలా ఊగిపోతున్నాడు. ఇవాళ (నవంబర్ 21) అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 141 బంతులను ఎదుర్కొన్న జగదీశన్.. 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో రికార్డు స్థాయిలో 277 పరుగులు చేశాడు. జగదీశన్ పరుగుల ప్రవాహంలో పలు ప్రపంచ రికార్డులు కొట్టుకుపోయాయి. ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో వరుసగా 5 శతకాలు బాది (114 నాటౌట్, 107, 168, 128, 277) చరిత్ర సృష్టించాడు. ఈ చిచ్చరపిడుగు జగదీశన్నే సీఎస్కే జట్టు కొద్ది రోజుల ముందు.. ఈ ఆటగాడు మాకొద్దు బాబోయ్ అని వదులుకుంది. బహుశా ఈ అవమానమే అతనిలో కసి రగిల్చి క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసి ఉండవచ్చు. సీఎస్కే జట్టు 2022 సీజన్‌కు ముందు జగదీశన్‌ను బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. స్థానిక ఆటగాడు (తమిళనాడు) కావడం, దేశవాలీ టోర్నీల్లో రాణిస్తుండటంతో చెన్నై ఫ్రాంచైజీ అతన్ని ఈ సీజన్‌ను ముందు జరిగిన మెగా వేలంలో సొంతం చేసుకుంది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన జగదీశన్.. 2018లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ (సీఎస్కే) ఇచ్చినప్పటికీ.. అతను అరంగేట్రం చేసింది మాత్రం 2020 సీజన్లో. జగదీశన్ తన ఐపీఎల్ కెరీర్లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 110.61 స్ట్రయిక్ రేట్‌తో 73 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 39 నాటౌట్‌గా ఉంది. ఇదిలా ఉంటే, జగదీశన్ తన తాజా ఫామ్‌తో మొత్తం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతని గణాంకాలు చూసి సీఎస్కే సహా అన్ని జట్టు అతని కోసం క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్లో కేవలం 20 లక్షలకు అమ్ముడుపోయిన అతను వచ్చే నెలలో జరిగే మినీవేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. -
IPL 2023: ఐపీఎల్ సాలరీల కోసం ఆర్సీబీ ఖర్చు ఎన్ని వందల కోట్లంటే!?
Harshall Gibbs Trolls RCB- Still No Trophy Check Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం.. ఎంతో మంది యువ ఆటగాళ్లను లక్షాధికారులుగా మార్చివేసిందీ క్యాష్ రిచ్ లీగ్. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి.. వేలంలో అమ్ముడుపోతే చాలు మినిమమ్ లక్షాధికారి అయిపోవచ్చు అనే గ్యారెంటీ కలిగించింది. ఇక అదృష్టం కలిసి వచ్చి.. తుది జట్టులో చోటు దక్కి ఆడే అవకాశం రావడం.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే కోట్లు కొల్లగొట్టవచ్చు. మెరికల్లాంటి ఆటగాళ్లు దొరికితే జట్లు ట్రోఫీలు గెలవచ్చు. కాగా 2008 నుంచి 2022 వరకు పదిహేను ఐపీఎల్ సీజన్లు జరిగాయి. ఐపీఎల్-2023 కోసం సన్నద్ధమయ్యే క్రమంలో డిసెంబరు 23 నాటి మినీ వేలానికి సిద్ధమవుతున్నాయి. రేసు గుర్రాల్లాంటి క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్ సాలరీల కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసిన ఫ్రాంఛైజీ ఏదో తెలుసా? ఆర్సీబీ.. అవును.. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు అక్షరాలా తొమ్మిది వందల పది కోట్లు ఖర్చు చేసినట్లు మనీబాల్ నివేదించింది. ఆ తర్వాతి స్థానం ముంబై ఇండియన్స్దేనట! మరి మిగతా జట్ల వివరాలు తెలుసుకుందామా! ఇప్పటి వరకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఖర్చు చేసిన మొత్తం- గెలిచిన టైటిళ్లు ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 910.5 కోట్ల రూపాయలు- 0 ►ముంబై ఇండియన్స్- 884.5 కోట్ల రూపాయలు- 5 ►కోల్‌కతా నైట్‌రైడర్స్- 852.5 కోట్ల రూపాయలు- 2 ►ఢిల్లీ క్యాపిటల్స్- 826.6 కోట్ల రూపాయలు- 0 ►పంజాబ్ కింగ్స్- 778.3 కోట్ల రూపాయలు- 0 ►చెన్నై సూపర్ కింగ్స్- 761.1 కోట్ల రూపాయలు- 4 ►సన్‌రైజర్స్ హైదరాబాద్- 646.9 కోట్ల రూపాయలు- 1 ►రాజస్తాన్ రాయల్స్- 613.3 కోట్ల రూపాయలు- 1 2022లో ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లు ►లక్నో సూపర్ జెయింట్స్- 89.2 కోట్ల రూపాయలు- 0 ►గుజరాత్ టైటాన్స్- 88.3 కోట్ల రూపాయలు- 1 అత్యధిక మొత్తం.. అయినా ఒక్క ట్రోఫీ లేదు ఈ వివరాలను తెలియజేస్తూ క్రిక్‌ట్రాకర్.. ‘‘ఇప్పటి వరకు ఐపీఎల్ సాలరీల కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసిన ఫ్రాంఛైజీ ఆర్సీబీ’’ అని ట్వీట్ చేసింది. ఇక ఇందుకు స్పందించిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్.. ‘‘ఇంతవరకు ఒక్కటి కూడా’’ అంటూ ఆర్సీబీని ట్రోల్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఇక ఇందుకు బదులుగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. స్టార్ ప్లేయర్లున్నా ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోవడం వెనుక ఏదో అదృశ్య శక్తి హస్తం ఉందని.. సౌతాఫ్రికా లాగే ఆర్సీబీ కూడా చోకర్స్ అనిపించుకుంటోందని గిబ్స్కు కౌంటర్ ఇస్తున్నారు. మరికొంత మంది ఐపీఎల్లో హర్షల్ గిబ్స్‌ను ఆటను గుర్తు చేసుకుంటూ నిన్ను మిస్సవుతున్నాం అంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా దక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు గిబ్స్ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చదవండి: IND Vs NZ: 'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది' Rishabh Pant: రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్‌దే హవా.. జట్టులో కీలక ప్లేయర్‌గా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); And still no 🏆 https://t.co/SFyx6XW3S2 — Herschelle Gibbs (@hershybru) November 18, 2022 -
విలియమ్సన్‌పై కన్నేసిన ఐపీఎల్ జట్టు ఇదే..? మరీ అన్ని కోట్లా!
ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో విలియమ్సన్‌ను రూ.14 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్లో విలియమ్సన్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా కెప్టెన్సీ పరంగా జట్టును నడిపించడంలో కేన్ విఫలమయ్యాడు. ఈ నేఫథ్యంలోనే అతడిని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఇక అతడితో పాటు విండీస్ ఆటగాళ్లు నికోలాస్ పూరన్, రొమారియో షెపర్డ్ లను కూడా సన్‌రైజర్స్ వేలంలో పెట్టింది. పంజాబ్ కింగ్స్‌లోకి కేన్ మామ.. ఇక వేలంలోకి వచ్చిన విలియమ్సన్కు ఎలాగైనా సొంతం చేసుకోవాలనిపంజాబ్ కింగ్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక గతేడాది సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్ కూడా తమ జట్టు ప్రక్షాళన షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సీజన్లో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ విడుదల చేసింది. ఈ ఏడాది జరిగిన మెగావేలంలో అగర్వాల్‌ను రూ.12 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే మయాంక్ 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో అతడికి పంజాబ్ ఊద్వసన పలికింది. ఈ క్రమంలో విలియమ్సన్ వంటి అనుభవిజ్ఞుడైన ఆటగాడిని దక్కించుకోవాలని పంజాబ్ ఫ్రాంజైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికోసం దాదాపు రూ. 10 కోట్ల వరకైన వెచ్చించడానికి పంజాబ్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పంజాబ్ పర్స్‌లో రూ. 32.2 కోట్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. చదవండి: IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో.. దారుణంగా విఫలమైనా..!
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్ రెండు రోజుల కిందటే (నవంబర్ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్లో దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), సునీల్ నరైన్ (కేకేఆర్), మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్), షారుఖ్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్, 2021 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో అతనాడిన 12 మ్యాచ్‌ల్లో 107.69 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్ అయిన అయ్యర్ సీజన్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సునీల్ నరైన్ విషయానికొస్తే.. కేకేఆర్కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 11 ఏళ్ల తర్వత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్.. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్‌కు 2011 ఐపీఎల్ సీజన్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్లో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 66.66 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్ ఖాన్.. గత సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 108 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 138. 64 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రియాన్ పరాగ్‌లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
'అంతా బాగానే ఉంది'.. మధ్యవర్తిగా పనిచేసిన ధోని! జడ్డూ ట్వీట్ వైరల్
ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్లు జాబితాను మంగళవారం ప్రకటించాయి. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. కాగా చెన్నై ఫ్రాంచైజీతో జడేజాకు విభేదాలు ఉన్నాయి అని, సీఎస్కేకు గుడ్‌బై చెప్పనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకుంటాందా లేదా అన్న ఆసక్తి ఆఖరి నిముషం వరకు కొనసాగింది. అయితే జడ్డూను రిటైన్ చేసుకుని చెన్నై అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా జడేజాకు జట్టు మేనేజేమెంట్‌కు ధోని మధ్యవర్తిత్వం వహించిన్నట్లు తెలుస్తోంది. ధోని చొరవతోనే మళ్లీ జడేజాను రిటైన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక తనను మళ్లీ రిటైన్ చేసుకున్నాక జడేజా ట్విటర్ వేదికగా స్పందించాడు. "అంతా బాగానే ఉంది. రీస్టార్ట్" అంటూ ట్వీట్ చేశాడు. దీంతోపాటు సీఎస్కే జెర్సీ ధరించి ధోనికి సలాం చేస్తున్న ఫోటోను కూడా జడ్డూ షేర్ చేశాడు. జడేజా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్-2022కు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్ ధోని తప్పుకోవడంతో నూతన సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే.. తిరిగి ధోనికి అప్పగించేశాడు. అయితే ఈ ఏడాది సీజన్లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.45 కోట్లు Everything is fine💛 #RESTART pic.twitter.com/KRrAHQJbaz — Ravindrasinh jadeja (@imjadeja) November 15, 2022 చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్‌గా సూర్యకుమార్ -
అశ్విన్ విషయంలో రాజస్తాన్ రాయల్స్ దిమ్మతిరిగే కౌంటర్
ఐపీఎల్ 2023కి ముందే టోర్నీలో పాల్గొనే పది జట్లు తమ ఆటగాళ్లకు సంబంధించిన రిటైన్, రిలీజ్ జాబితాను ప్రకటించేశాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఇక వేలంలో పాల్గొనబోయే ఫ్రాంజైజీలు ఆటగాళ్లను వదులుకున్న తర్వాత అందుబాటులో ఉన్న మొత్తాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రిలీజ్ చేసినట్లు వార్తలు రావడం సంచలనం కలిగించింది. టి20 క్రికెట్లో అశ్విన్ అంతగా మెరవకపోయినప్పటికి ఐపీఎల్లో మాత్రం అతనికి మంచి రికార్డే ఉంది. పైగా గతేడాది ఐపీఎల్లో అతను బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శనే కనబరిచాడు. జట్టుకు అతని సేవలు అవసరమున్న దశలో జట్టు నుంచి రిలీజ్ చేయడమేంటని అభిమానులు కామెంట్ చేశారు. కానీ రాజస్తాన్ రాయల్స్ ఈ వార్తలను ఖండిస్తూ అసలు అశ్విన్‌ను రిలీజ్ చేయలేదని ట్విటర్ వేదికగా ప్రకటించింది. రాజస్తాన్ రిటైన్ చేసుకున్న జాబితాలో అశ్విన్ పేరు కూడా ఉంది. అశ్విన్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్ చేసిన వారిని ఉద్దేశించి రాజస్తాన్.. ''నిజంగా ఇంతలా ఆలోచించారా'' అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ తమ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్లు పెట్టి అశ్విన్‌ను కొనుగోలు చేసింది. అప్పట్లో అశ్విన్ కోసం ఢిల్లీ కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 2022 ఫిబ్రవరి వేలంపాటలో పోటీ పడ్డాయి. చివరకు అశ్విన్ విషయంలో రాజస్థాన్ పైచేయి సాధించింది. ఇక అశ్విన్ ఐపీఎల్ 2022లో.. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 12 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లోనూ పరవాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్ 27.29 యావరేజ్‌తో 191 పరుగులు చేశాడు. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, , శురాస్సీ వాన్ డెర్ డస్సెన్భమ్ గర్వాల్, తేజస్ బరోకా Did you 𝘳𝘦𝘢𝘭𝘭𝘺 think?! 🤦♂️#iplretentions pic.twitter.com/2zFf9Zvlrv — Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అలాంటి వాళ్లకు స్థానం ఉండదు.. మయాంక్ కోసం పోటీ ఖాయం: భారత మాజీ క్రికెటర్
IPL 2023 Mini Auction- Mayank Agarwal: ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ. గత సీజన్లో తమ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు గుడ్ బై చెప్పింది. అతడి స్థానంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో పంజాబ్ రిటెన్షన్ జాబితాలోలేని మయాంక్ వేలంలోకి రానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మయాంక్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయమని అభిప్రాయపడ్డాడు. సంజయ్ మంజ్రేకర్(PC: Sanjay Manjrekar Twitter) మయాంక్ కోసం పోటీ ఎందుకంటే అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘ఓ సీజన్లో చెత్తగా ఆడామంటే.. కచ్చితంగా వారి కోసం వెచ్చించిన డబ్బు గురించి యాజమాన్యం ఆలోచించడం సహజమే! మిగత వాళ్లతో పోలిస్తే మయాంక్ అగర్వాల్ విషయం కాస్త భిన్నం. అతడిని వదులుకోవడం ద్వారా వచ్చిన డబ్బులో కొంతమొత్తం చెల్లించి అతడిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ల వైపు చూడొచ్చు. నిజానికి మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు ఎంత మంచి వాడంటే.. కెప్టెన్‌గా ఉన్నపుడు తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నిజానికి గత సీజన్లలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ అయిన తర్వాత టాపార్డర్‌లో ఉన్నా కొన్నిసార్లు తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి తనకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాల్సింది. అయితే ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు. తన విషయంలో చాలా బాధగా ఉంది. ఏదేమైనా.. సరైన ఓపెనర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలు మయాంక్ కోసం పోటీ పడటం ఖాయం. 150, 160 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయగల.. స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ బ్యాటర్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తాయి’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ సారథిగా వ్యవహరించిన మయాంక్.. 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్‌గా పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్ మామ భావోద్వేగం IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు నిన్ననే (నవంబర్ 15) తమ రిటెన్షన్ లిస్ట్‌తో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో కొందరిని అవమానకర రితీలో వదిలించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రిలీజ్ చేసిన ఆటగాళ్ల గత రికార్డులు, వారి సామర్ధ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఫ్రాంచైజీలు.. సదరు ఆటగాళ్ల గత సీజన్ ఫామ్, ప్రస్తుత ఫామ్‌ను మాత్రమే కొలమానంగా తీసుకుని, కనీసం ముందస్తు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా తప్పించాయని సమాచారం. ఫ్రాంచైజీలు నోటీస్‌లు కూడా ఇవ్వకుండా రిలీజ్ చేయడంపై చాలా మంది ఆటగాళ్లు తీవ్ర మనస్థాపానికి గరయ్యారని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. ముఖ్యంగా కొందరు స్టార్ ఆటగాళ్లు, మెగా వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు.. ఫ్రాంచైజీలు ఇలా అవమానకర రీతిలో తమతో వ్యవహరిస్తాయని ఊహించలేదని వాపోయినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (14 కోట్లు) పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (14 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: నికోలస్ పూరన్ (10.75 కోట్లు) లక్నో సూపర్ జెయింట్స్: జేసన్ హోల్డర్ (8.75 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్: రొమారియో షెపర్డ్ (7.75 కోట్లు) ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా.. గుజరాత్ టైటాన్స్: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్. వీరిలో రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్‌లను కేకేఆర్ ట్రేడింగ్ చేసుకోగా, మిగిలిన ముగ్గురిని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం వేలానికి వదిలి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్. వీరిలో శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ చేసుకోగా, ఢిల్లీ యాజమాన్యం మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. రాజస్తాన్ రాయల్స్: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా. వీరిలో డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లాంటి అంతర్జాతీయ స్టార్లను ఆర్ఆర్ యాజమాన్యం చిన్నచూపు చూసింది. కేకేఆర్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్. వీరిలో పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, ఆరోన్ ఫించ్ వివిధ కారణాల చేత స్వతాహాగా లీగ్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించగా.. అలెక్స్ హేల్స్, అజింక్య రహానే, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే లాంటి స్టార్లకు అవమానకర ఉద్వాసన తప్పలేదు. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ. వీరలో కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్ అత్యంత దారుణ పరాభవం కాగా, ఒడియన్ స్మిత్ లాంటి విదేశీ ప్లేయర్‌ను ఫ్రాంచైజీ అస్సలు పట్టించుకోలేదు. ఆర్సీబీ: జేసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. వీరిలో జేసన్ బెహ్రెండార్ఫ్ను కేకేఆర్ ట్రేడ్ చేసుకోగా.. రూథర్‌ఫోర్డ్‌కు బలవంతపు ఉద్వాసన తప్పలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్. ఈ ఫ్రాంచైజీనే అత్యధికంగా స్టార్ ఆటగాళ్లను తప్పించింది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్ లాంటి విదేశీ స్టార్లు తీవ్రంగా మనసు నొచ్చుకున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్: వేలానికి ముందు అత్యధిక మంది ప్లేయర్లను వదిలిపెట్టిన ఫ్రాంచైజీ ఇదే. ఈ జట్టు కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. ఎంపై మేనేజ్మెంట్.. వీరిలో పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుని తృప్తి పరచగా.. డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్ టైమల్ మిల్స్ లాంటి ఆటగాళ్లకు అవమానం తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్. వీరిలో ఆండ్రూ టై, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే లాంటి పేరున్న ఆటగాళ్లను యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్. వీరిలో డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. క్రిస్ జోర్డాన్‌పై వేటు పడింది. -
IPL 2023: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా: కేన్ మామ భావోద్వేగం
IPL 2023: ‘‘నా సహచర ఆటగాళ్లు, ఫ్రాంఛైజీ, సహాయక సిబ్బంది.. ముఖ్యంగా అద్బుతమైన ఆరెంజ్ ఆర్మీ... అందరికీ ధన్యవాదాలు. నా ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని మీరంతా కలిసి పూరిపూర్ణం చేశారు. ఈ జట్టు.. ముఖ్యంగా హైదరాబాద్ నాకెల్లప్పుడూ ప్రత్యేకమే’’ అంటూ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ కేన్ మామ ఉద్వేగానికి లోనయ్యాడు. కేన్‌కు గుడ్ బై ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మంగళవారం ఆయా ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, వదిలేసే ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా సేవలు అందించిన కేన్ విలియమ్సన్కు ఉద్వాసన పలికింది యాజమాన్యం. గత వేలంలో 14 కోట్ల భారీ ధరకు ఈ కివీస్ సారథిని సొంతం చేసుకుంది ఫ్రాంఛైజీ. అయితే, కేన్ మామ సారథ్యంలోనూ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఇందుకు తోడు గత కొంతకాలంలో పొట్టి ఫార్మాట్లో విలియమ్సన్ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ప్రపంచకప్-2022 టోర్నీలోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. బ్యాటర్‌గానూ, కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించినా అసలైన సెమీస్ పోరులో కేన్ బృందం పాకిస్తాన్ చేతిలో ఓడి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అతడిని రిలీజ్ చేయడం గమనార్హం. నాకు ముందే తెలుసు ఈ విషయంపై స్పందించిన కేన్ విలియమ్సన్.. సన్‌రైజర్స్ తనను విడిచిపెడుతుందని తనకు ముందే తెలుసునన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో చాలా లీగ్‌లు ఉన్నాయి. అయితే వాటిలో ఐపీఎల్ ప్రత్యేకమైనది. అందులో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆటగాళ్లు ఉంటారు. కావాల్సినన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నావరకైతే నేను అన్ని ఫార్మాట్లలో ఆడటానికి ఇష్టపడతాను. రిలీజ్ విషయం గురించి యాజమాన్యం నాతో ముందే మాట్లాడింది. కాబట్టి ఫ్రాంఛైజీ తమ రిటెన్షన్ జాబితా అధికారికంగా ప్రకటించినపుడు నేను ఆశ్చర్యపడలేదు’’ అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా కేన్‌ను రిలీజ్ చేస్తూ.. ‘‘ఎల్లప్పుడూ మా కేన్ మామ’’ అంటూ సన్‌రైజర్స్ ట్విటర్ వేదికగా అతడి సేవలకు ధన్యవాదాలు చెప్పగా.. విలియమ్సన్ సైతం హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకోవడం విశేషం. ఇక వచ్చే నెల 23న కొచ్చిలో ఐపీఎల్ మినీ వేలం జరుగనుంది. ఇదిలా ఉంటే కేన్ విలియమ్సన్ సారథ్యంలో కివీస్ టీమిండియాతో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Michael Vaughan: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెటా..? నాన్సెన్స్..! India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) Always our Kane Mama! 🧡#SunRisersHyderabad #OrangeArmy pic.twitter.com/UkieccM3yP — SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022 -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్‌కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
Kieron Pollard: రిటైర్మెంట్ ప్రకటించినా వదలని ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (189) ఆడిన విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టుకు (ముంబై ఇండియన్స్) ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో ఒకడిగా, 13 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌లో భాగమై, ఆ జట్టు 5 ఐపీఎల్ టైటిల్స్, 2 ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడిగా పలు అరుదైన ఘనతలు సాధించిన కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న (నవంబర్ 15) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ సేవలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం వేరే రూపంలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. పోలార్డ్ ఎంఐకి చేసిన సేవలను గుర్తిస్తూ.. అతన్ని ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకొవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు పోలీ కూడా అంగీకారం తెలిపాడు. దీంతో అతను వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో ఫ్రాంచైజీ అయిన ముంబై ఎమిరేట్స్‌లో ఆటగాడిగా కొనసాగుతానని పోలీ ప్రకటించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ కెరీర్లో మొత్తంలో 189 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్.. 147.3 స్ట్రయిక్ రేట్‌తో 3412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్ధశతాకలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 8.79 ఎకానమీతో 69 వికెట్లు పడగొట్టాడు. పోలార్డ్ తన ఐపీఎల్ కెరీర్లో రికార్డు స్థాయిలో 218 ఫోర్లు, 223 సిక్సర్లు బాదాడు. చదవండి: 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్.. -
స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. మంగళవారంతో రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించే గడువు ముగియడంతో ఆయా ప్రాంఛైజీలు తమ తుది జాబితాలను ప్రకటించాయి. ఏ ప్రాంఛైజీ ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయో, ఎవరని వేలంలో పెట్టాయో ఓ లూక్కేద్దాం. గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా ఆరుగురిని విడిచిపెట్టింది. ఇక ఓవరాల్‌గా మినీవేలంకు ముందు గుజరాత్ పర్స్‌లో 19.25 కోట్లు ఉన్నాయి. గుజరాత్ రిటైన్ లిస్ట్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్ గుజరాత్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా ఐదుగురుని విడిచిపెట్టింది. ఇక ఓవరాల్‌గా మినీ వేలంకు ముందు ఢిల్లీ పర్స్‌లో 19.45 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్ రెహ్మన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్ ఢిల్లీ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్ రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు రాజస్తాన్ రాయల్స్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం రాజస్తాన్ పర్స్‌లో రూ. 13.2 కోట్లు ఉన్నాయి. రాజస్తాన్ రిటైన్ లిస్ట్ సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రాజస్తాన్ విడిచిపెట్టిన జాబితా అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్ శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్ పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు పంజాబ్ 16 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 9 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం పంజాబ్ పర్స్‌లో రూ. 32.2 కోట్లు ఉన్నాయి. పంజాబ్ రిటైన్ లిస్ట్ శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బిఆర్ పంజాబ్ విడుదలచేసిన జాబితా మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు ఆర్సీబీ 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 5 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం ఆర్సీబీ పర్స్‌లో రూ. 8.75 కోట్లు ఉన్నాయి. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్ ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్లు: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ. సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్ విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.55 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ విడుదలైన ఆటగాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ మిగిలిన పర్స్ బ్యాలన్స్: రూ. 20.45 కోట్లు -
IPL: ముంబై విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం! మిస్ యూ.. ట్విస్ట్ ఇచ్చాడిలా
IPL 2023- Kieron Pollard- Mumbai Indians: వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా వెలుగొందిన కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాడిగా కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 మినీ వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పోలీ సంచలన ప్రకటన చేశాడు. అపురూప విజయాల్లో భాగమై 2010 నుంచి ముంబై ఫ్రాంఛైజీతో అనుబంధం కొనసాగిస్తున్న 35 ఏళ్ల పొలార్డ్.. ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆటగాడిగా 13 ఏళ్ల తన విజయవంతమైన కెరీర్‌కు గుడ్ బై చెబుతూ మంగళవారం ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు ఈ మేరకు ట్విటర్లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఆటగాడిగా ఐపీఎల్‌ను మిస్ అవుతానని.. 2013, 2015, 2017, 2019, 2020తో పాటు 2011 నాటి చాంపియన్స్ లీగ్ గెలవడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన ముంబై యాజమాన్యానికి పొలార్డ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన భార్య జెనా, తన ముగ్గురు పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్ తనకు సహకరించిన ముకేశ్, నీత, ఆకాశ్ అంబానీల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్న పొలార్డ్... ముంబైతో తన బంధం ముగిసిపోలేదంటూ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త కూడా చెప్పాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు పొలీ ఈ సందర్భంగా వెల్లడించాడు. అదే విధంగా ముంబై ఎమిరేట్స్ తరఫున ఆటగాడిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. తన నోట్‌ను ముగిస్తూ సిన్సియర్లీ కీరన్ పొలార్డ్.. ది ముంబై వెస్ట్ ఇండియన్ అంటూ అభిమానం చాటుకున్నాడు. తనని అభిమానిస్తున్న వాళ్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా పొలార్డ్‌ను ఇక ఐపీఎల్ ఆటగాడిగా చూడలేమా అంటూ ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. మిస్ యూ పోలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత సీజన్లో పొలార్డ్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6 — Kieron Pollard (@KieronPollard55) November 15, 2022 🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH — Mumbai Indians (@mipaltan) November 15, 2022 -
IPL 2023: అతడు పూర్తిగా విఫలం.. 14 కోట్లు ఖర్చుపెట్టడం అంటే!
IPL 2023 Mini Auction - Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఆక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ హెడ్‌కోచ్ టామ్ మూడీ.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్ వంటి సమర్థుడైన ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు జట్టు రిటైన్ చేసుకుందంటే.. యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ఈ పని చేసిందని అర్థం. అయితే, గత నాలుగు నెలలుగా టీ20 క్రికెట్లో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తను గొప్ప నాయకుడు అని తెలుసు. ఆటలో తన శక్తిసామర్థ్యాల గురించి కూడా మాకు తెలుసు. కెప్టెన్‌గా ఐపీఎల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది. 14 కోట్లు అంటే చాలా ఎక్కువ అందుకే కేన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ అతడిని ఫ్రాంఛైజీ రిలీజ్ చేసినా చేయకపోయినా.. నా దృష్టిలో ఒక ఆటగాడి మీద 14 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టామ్ మూడీకి గుడ్ బై చెప్పిన ఎస్ఆర్ హెచ్.. విండీస్ లెజెండ్ బ్రియన్ లారాను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా.. కెప్టెన్‌గా కేన్ విఫలం ఇదిలా ఉంటే.. గత సీజన్లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక గత టీ20 వరల్డ్‌కప్‌లో కేన్ బృందం రన్నరప్‌గా నిలవగా.. ఈసారి సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గానూ కేన్ ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: IPL 2023: వేలంలో స్టోక్స్, సామ్ కర్రన్.. రికార్డు ధర ఖాయం..! IPL 2023: కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. మరో ఇద్దరు ఔట్ -
IPL 2023: వేలంలో స్టోక్స్, కర్రన్.. ఆ రెండు జట్ల కన్ను వీరిపైనే..!
Ben Stokes, Sam Curran Available For IPL 2023 Auction: టీ20 వరల్డ్‌కప్-2022 హీరోలు, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రన్లు.. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో, ముఖ్యంగా పాక్‌తో జరిగిన ఫైనల్లో సంచలన ప్రదర్శన నేపథ్యంలో ఈ ఇద్దరు మ్యాచ్ విన్నర్లపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరిని సొంతం చేసుకోవడం కోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. వివిధ కారణాల చేత గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న వీరిని దక్కించేందుకు, ఎంత ధర అయినా వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తమ పర్స్ నుంచి ఏకంగా 20 కోట్లు వెచ్చించేందుకైనా రెడీ అన్న సంకేతాలు పంపాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్-2023 సీజన్ పూర్తయిన వెంటనే (జూన్) ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో వీరు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా, కర్రన్ ఆ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న నేపథ్యంలో వీరు ఐపీఎల్-2023పై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐపీఎల్లో స్టోక్స్ ప్రస్తానం.. 2017 సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్.. స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో 14.5 కోట్లకు సొంతం చేసుకోగా, ఆతర్వాతి సీజనే (2018) రాజస్తాన్ రాయల్స్ అతన్ని 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వరుసగా రెండు సీజన్ల పాటు (2019, 2020) ఆర్ఆర్ తరఫున సత్తా చాటిన స్టోక్స్.. 2021 సీజన్లో గాయపడటంతో టోర్నీ ఆరంభంలోనే జట్టును వీడాడు. ఆతర్వాత 2022 మెగా వేలంలో ఆర్ఆర్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడంతో అలకబూనిన స్టోక్స్.. మెగా వేలంలో తన పేరును సైతం రిజిస్టర్ చేసుకోలేదు. 🚨 Ben Stokes have been made available for the IPL mini auction.#IPLAuction #IPL2023 #IPL2023Auction #Ipl2023Retention #IPLretention #ipltrade #IPL #iplauction2023 #iplretentions #IPLT20 #BenStokes pic.twitter.com/V9P1Z1rrCZ — Top Edge Cricket (@topedge_cricket) November 15, 2022 ఐపీఎల్లో సామ్ కర్రన్ ప్రస్తానం.. 2019లో టీమిండియాపై సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన సామ్ కర్రన్‌ను అదే ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 7.2 కోట్ల భారీ మొత్తం వెచ్చింది కొనుగోలు చేసింది. ఆ సీజన్లో బంతితో, బ్యాట్‌తో ఓ మోస్తరుగా రాణించిన కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ 2020 వేలంలో అనూహ్యంగా వదులుకుంది. దీంతో ఆ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున 2020, 2021 సీజన్లలో పర్వాలేదనిపించిన కర్రన్.. 2022 మెగా వేలానికి ముందు గాయం బారిన పడి, ఆ సీజన్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
IPL 2023: కేకేఆర్‌కు మారిన స్టార్ ఆల్‌రౌండర్
IPL 2023 Trading: భారత ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీకి మారాడు. ఈ సీజన్లో ఢిల్లీకి ఆడిన శార్దుల్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 120 పరుగులు చేశాడు. క్యాపిటల్స్ జట్టు మెగా వేలంలో అతన్ని రూ.10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శార్దుల్‌ను ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్‌లో భాగంగా కోల్‌కతా తీసుకుంది. ఫ్రాంచైజీలకు రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం), రిలీజ్ (విడుదల) లేదంటే ట్రేడింగ్ (కొనుగోలు) గడువు మంగళవారంతో ముగియనుంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వచ్చే సీజన్ ఐపీఎల్‌కు గైర్హాజరవుతానని ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్ (టెస్టు)పై మరింత దృష్టిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉంటానన్నాడు. -
యువ ఆటగాడిని రిటైన్ చేసుకున్న లక్నో..
ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని నవంబర్ 15 వరకు బీసీసీఐ గడువు విధించింది. ఈ క్రమంలో ఆయా ఫ్రాంజైలు తాము రిటైన్, విడుదల చేసే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా యువ ఆటగాడు అయుష్ బదోని రిటైన్ చేసుకున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని లక్నో ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన బదోని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్-2022లో 11 మ్యాచ్‌లు ఆడిన బదోని 161 పరుగులు చేశాడు. అదే విధంగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా బదోని అదరగొట్టాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన అయుష్ తమ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. Never underestimate the young guns! We’re all waiting to watch Ayush Badoni perform like a boss🙌 Welcome aboard, Ayush💪🔥#AyushBadoni #YoungGuns #LucknowSuperGiants #TATAIPL pic.twitter.com/W84bClwYdV — Lucknow Super Giants (@LucknowIPL) March 12, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
IPL 2023: వచ్చే నెల 23న ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.