IPL 2023 Auction: BCCI confirms Cameron Green, Ben Stokes available - Sakshi
Sakshi News home page

IPL 2023 Auction: ఫ్రాంఛైజీలకు బీసీసీఐ శుభవార్త! అయితే, ప్లే ఆఫ్స్‌లో మాత్రం..

Published Fri, Dec 23 2022 12:36 PM | Last Updated on Fri, Dec 23 2022 1:06 PM

IPL 2023 Auction: BCCI Says Cameron Green Stokes Available But - Sakshi

ఐపీఎల్‌ మినీ వేలం (PC: IPL)

IPL 2023 Mini Auction-Players Availability: ఐపీఎల్‌- 2023 మినీ వేలానికి ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఫ్రాంఛైజీలకు గుడ్‌న్యూస్‌ అందించింది. కామెరూన్‌ గ్రీన్‌, బెన్‌ స్టోక్స్‌  వంటి స్టార్లు సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు చెందిన ఇతర ఆటగాళ్లు టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు ధ్రువీకరించినట్లు వెల్లడించింది.

‘‘మా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు మార్చి 30 నుంచి జట్లతో చేరగలరు’’ అని సీఏ పేర్కొనగా.. ఈసీబీ సైతం తమ ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటారని తెలిపింది. 

అయితే, ఐపీఎల్‌ వేలంలో హాట్‌ ఫేవరెట్‌గా భావిస్తున్న కామెరూన్‌ గ్రీన్‌ అందుబాటులోకి రావడంతో అతడి కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటీ తీవ్రతరం కావడం ఖాయం. అదే విధంగా స్టోక్స్‌ విషయంలోనూ పోటీ తప్పకపోవచ్చు. కానీ ఆయా జట్ల టెస్టు సిరీస్‌ల నేపథ్యంలో వీరిద్దరు ప్లే ఆఫ్స్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.

వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు 
హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, సామ్ కరన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, టామ్ బాంటన్, ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, విల్ స్మీడ్, జాసన్ రాయ్, జార్జ్ గార్టన్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, రిచర్డ్ గ్లీసన్, ల్యూక్ వుడ్, టామ్ కరన్, టైమల్ మిల్స్, డేవిడ్ పేన్, రెహాన్ అహ్మద్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్టోఫర్ బెంజమిన్, థామస్ హెల్మ్, జేమ్స్ ఫుల్లర్, బెన్నీ హోవెల్

ఆస్ట్రేలియా ఆటగాళ్లు
కామెరూన్ గ్రీన్, పీటర్ హాట్జోగ్లో, లాన్స్ మోరిస్, జాషువా ఫిలిప్, జై రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, హేడెన్ కెర్, జాక్ ప్రెస్‌విడ్జ్, బెన్ మెక్‌డెర్మోట్, బెన్ డ్వార్షూయిస్, బిల్లీ స్టాన్‌లేక్, ట్రావిస్ హెడ్, నాథన్ మెక్‌అంపాస్ , సీన్ అబాట్, క్రిస్ లిన్, డార్సీ షార్ట్, నాథన్ కౌల్టర్-నైల్, ఆండ్రూ టై, మోయిసెస్ హెన్రిక్స్

వాళ్లు ఏప్రిల్‌ 8 తర్వాతే
ఇక సౌతాఫ్రికా క్రికెట్‌, వెస్టిండీస్‌ బోర్డులు తమ క్రికెటర్లు మార్చి 29 నుంచి అందుబాటులో ఉంటారని చెప్పగా.. శ్రీలంక బోర్డు మాత్రం ఏప్రిల్‌ 8 తర్వాతే తమ ఆటగాళ్లు జట్లతో కలవగలరని పేర్కొంది. 

ఎవరెవరు ఎప్పుడు అందుబాటులోకి..
బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు- ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వాళ్లు ఏప్రిల్‌ 8- మే 1 నుంచి
న్యూజిలాండ్‌ క్రికెటర్లు- అందరూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి
అఫ్గనిస్తాన్‌- ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన వాళ్లు మార్చి 30 తర్వాత
ఐర్లాండ్‌- - మే 5- 15 మధ్య అందుబాటులో ఉండరు
జింబాబ్వే- పూర్తి స్థాయిలో అందరూ అందుబాటులో ఉంటారు
కాగా మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్‌ ఆరంభంలో ఐపీఎల్‌- 2023 ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరకు మినీ వేలం మొదలుకానుంది.

చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్‌ యువ బౌలర్‌ సూపర్‌స్టార్‌! స్టోక్స్‌, ఉనాద్కట్‌ కోసం పోటీ: మిస్టర్‌ ఐపీఎల్‌
Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్‌!? ద్రవిడ్‌, నువ్వూ కలిసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement