5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో చివరి టెస్ట్‌కు ముందు టీమ్ ఇంగ్లండ్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో టెస్ట్‌లో ఆడిన 14 మంది సభ్యుల జట్టునే ఐదో టెస్ట్‌లోనూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. సిరీస్‌లో 1-2తో వెనుపడినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండా మొండిగా ముందుకెళ్తుంది.
గత మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన జేమ్స్ ఆండర్సన్‌ను సైతం కొనసాగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వయసు మీద పడి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేకపోతున్న ఆండర్సన్‌ను అయినా తప్పిస్తారని అంతా ఊహించినప్పటికీ.. ఇంగ్లీష్ మేనేజ్‌మెంట్ మాత్రం అనుభవజ్ఞుడైన ఆండర్సన్‌ను జట్టులో కొనసాగించేందుకు మొగ్గు చూపింది.
తుది జట్టులో ఆండర్సన్‌కు అవకాశం ఇస్తుందో లేదో తెలీదు కానీ, 14 మంది సభ్యుల జట్టులో అతన్ని కొనసాగించి సంచలన నిర్ణయమే తీసుకుంది. ఎలాగూ యాషెస్ చేజారింది కాబట్టి, ఆండర్సన్‌ను ఆఖరి టెస్ట్ బరిలోకి దించి అతనిచే బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటన చేయించాలని అనుకుంటుదేమో కాని, మొత్తానికి ఆండర్సన్‌ను కొనసాగించి ఇంగ్లండ్ టీమ్ పెద్ద సాహసమే చేసింది.
కాగా, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతి దాకా వచ్చిన గెలుపు వరుణుడి కారణంగా చేజారింది. ఆఖరి రోజు ఇంగ్లండ్ బౌలర్లు మరో 5 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలిచే అవకాశంతో పాటు సిరీస్ అవకాశాలు కూడా సజీవంగా ఉండేవి. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రా గా ప్రకటించారు.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకుంది. అంతకుముందు తొలి రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడో టెస్ట్‌ల్లో విజయం సాధించి, నాలుగో టెస్ట్‌లో గెలుపు అంచుల వరకు వచ్చింది. నాలుగో టెస్ట్‌లో వరుణుడి పుణ్యమా అని ఆసీస్ ఓటమి బారి నుంచి తప్పించుకుని యాషెస్‌ను నిలబెట్టుకుంది. చివరిదైన ఐదో యాషెస్ టెస్ట్ కియా ఓవల్ వేదికగా జులై 27 నుంచి ప్రారంభమవుతుంది.
ఐదో యాషెస్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
Comments
Please login to add a commentAdd a comment