England Cricket Board
-
రూ.1092 కోట్లు!.. ‘హండ్రెడ్’లో సన్‌రైజర్స్ టీమ్ ఎంట్రీ
లీడ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి చెందిన ‘హండ్రెడ్’ లీగ్‌లో మరో ఐపీఎల్ జట్టు అడుగు పెట్టింది. యార్క్‌షైర్ కౌంటీ కేంద్రంగా ఉన్న నార్తర్న్ సూపర్ చార్జర్స్ టీమ్‌లో చెన్నైకి చెందిన సన్ గ్రూప్ 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 100 మిలియన్ బ్రిటన్ పౌండ్లు (సుమారు రూ.1092 కోట్లు)గా తెలుస్తోంది. బుధవారం కొనసాగిన అమ్మకంలో సన్ గ్రూప్ అత్యధిక మొత్తానికి బిడ్ చేసింది. సన్ గ్రూప్‌నకు ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌తో పాటు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ కూడా ఉంది.ఇప్పుడు ఆ గ్రూప్ తమ జాబితాలో మూడో క్రికెట్ టీమ్‌ను చేర్చింది. ‘హండ్రెడ్’లో టీమ్ వాటాను కొనుగోలు చేసిన మూడో ఐపీఎల్ టీమ్ యాజమాన్యంగా సన్ గ్రూప్ నిలిచింది. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును, ముంబై ఇండియన్స్ (రిలయన్స్) యాజమాన్యం ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో మరో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అయిన జీఎంఆర్ గ్రూప్ కూడా చేరే అవకాశం ఉంది. హండ్రెడ్‌లోని మరో టీమ్ సదరన్ బ్రేవ్‌ను జీఎంఆర్ కొనుగోలు చేయవచ్చని సమాచారం. 2024 ‘హండ్రెడ్’ సీజన్లో నార్తర్న్ సూపర్ చార్జర్స్ పురుషుల, మహిళల జట్లు నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఈ టీమ్ టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. సూపర్ చార్జర్స్‌కు ప్రస్తుతం హ్యారీ బ్రూక్ కెపె్టన్‌గా, ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా ఉన్నారు. -
జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్‌ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్ బోర్డు వార్నింగ్!
చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా పాల్గొనకపోతే భారీ నష్టం తప్పదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చీఫ్ రిచర్డ్ థాంప్సన్ అన్నాడు. పాకిస్తాన్లో జరిగే ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన పాల్గొంటేనే ఈవెంట్ విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డాడు. లేనిపక్షంలో ప్రసార హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ మండలిని పరోక్షంగా హెచ్చరించాడు.వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుండగా.. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.హైబ్రిడ్ విధానంలో?అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ విముఖంగా ఉంది. ఇరు దేశాల మథ్య పరిస్థితుల నేపథ్యంలో 2008 తర్వాత ఇంత వరకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అందుకే.. ఆసియా వన్డే కప్-2023 టోర్నీ పాకిస్తాన్లో జరిగినప్పటికీ బీసీసీఐ తటస్థ వేదికలపై తమ జట్టు మ్యాచ్‌లు జరగాలని కోరడంతో పాటు మాట నెగ్గించుకుంది.చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానం పాటించాలని ఐసీసీని ఒప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బోర్డు చీఫ్ రిచర్డ్ థాంప్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా రాకపోతే జరిగేది ఇదే!‘‘బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఇప్పుడు ఐసీసీ చైర్మన్ అయ్యారు. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అన్న అంశాన్ని తేల్చడంలో ఆయనదే కీలక పాత్ర. ఇరువర్గాలు చర్చించి.. టోర్నీ సజావుగా సాగే మార్గం కనుగొంటారనే ఆశిస్తున్నాం.టీమిండియా లేకుండా ఈ టోర్నీ జరుగుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే.. భారత జట్టు లేకుండా ఈ ఈవెంట్ జరిగితే ప్రసార హక్కులు ఎవరూ కొనరు. ఏదేమైనా పాకిస్తాన్ మాత్రం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుకుంటోంది’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్? -
ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి.జూన్ 20-24 మధ్య లీడ్స్‌లోని హెడ్డింగ్లీలో జరగనున్న మొదటి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ముగిసిన వెంటనే ఈ రెడ్‌బాల్ సిరీస్ మొదలు కానుంది.ఈ సిరీస్ డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూన్ 20న ప్రారంభమై ఆగస్టు 4న ముగియనుంది. ఇక చివరగా టీమిండియా 2021లో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించింది. అయితే ఆ సిరీస్ 2-2 డ్రాగా ముగిసింది. భారత శిబిరంలో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత సిరీస్ నిలిపివేయబడింది. అప్పటి భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత 2022లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2 డ్రా అయింది.భారత్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్1వ టెస్ట్: 20-24 జూన్, 2025 - హెడ్లింగ్లీ, లీడ్స్2వ టెస్ట్: 2-6 జూలై, 2025 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్3వ టెస్ట్: 10-14 జూలై, 2025 - లార్డ్స్, లండన్4వ టెస్ట్: 23-27 జూలై, 2025 - ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్5వ టెస్ట్: 31 జూలై-4 ఆగస్టు, 2025 - ది ఓవల్, లండన్ -
దీప్తి సిక్సర్... లండన్ విన్నర్
లండన్: ‘హండ్రెడ్’ మహిళల క్రికెట్ టోర్నీకి అద్భుత ముగింపు లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో 2021లో హండ్రెడ్ టోర్నీ (ఇన్నింగ్స్‌కు 100 బంతులు) మొదలైంది. విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హీతెర్ నైట్ సారథ్యంలోని లండన్ స్పిరిట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో టామీ బీమోంట్ నాయకత్వంలోని వెల్ష్ ఫైర్ జట్టును ఓడించింది. లండన్ స్పిరిట్ జట్టుకు టైటిల్ దక్కడంలో భారత క్రికెటర్ దీప్తి శర్మ (16 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) కీలకపాత్ర పోషించింది. లండన్ జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. వెల్ష్ ఫైర్ జట్టు బౌలర్, విండీస్ ఆల్‌రౌండర్ హీలీ మాథ్యూస్ చివరి ఐదు బంతులు వేయడానికి వచ్చింది. తొలి బంతికి దీప్తి... రెండో బంతికి చార్లీ డీన్ చెరో సింగిల్ తీశారు. దాంతో లండన్ విజయ సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులుగా మారింది. ఈ దశలో హీలీ వేసిన మూడో బంతిని దీప్తి శర్మ సిక్సర్‌గా మలిచి లండన్ విజయాన్ని ఖరారు చేసింది. రెండు బంతులు మిగిలి ఉండగా లండన్ స్పిరిట్ చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు వెల్ష్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్లకు 115 పరుగులు సాధించింది. జెస్ జొనాసెన్ (41 బంతుల్లో 54; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... టామీ బీమోంట్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు), హీలీ మాథ్యూస్ (26 బంతుల్లో 22; 3 ఫోర్లు) రాణించారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో ఇవా గ్రే, సారా గ్లెన్ రెండు వికెట్ల చొప్పున తీయగా... దీప్తి శర్మ, తారా నోరిస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం లండన్ స్పిరిట్ జట్టు 98 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. జార్జియా రెడ్మెన్ (32 బంతుల్లో 34; 3 ఫోర్లు), హీతెర్ నైట్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు), డానియెలా గిబ్సన్ (9 బంతుల్లో 22; 5 ఫోర్లు) దూకుడుగా ఆడారు. వెల్ష్ ఫైర్ జట్టు బౌలర్లలో షబ్నిమ్ మూడు వికెట్లు పడగొట్టింది. గత ఏడాది విజేతగా నిలిచిన సదరన్ బ్రేవ్జట్టులో భారత జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన సభ్యురాలిగా ఉండటం విశేషం. -
లంకతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
ఈ నెల (ఆగస్ట్) 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జోర్డన్ కాక్స్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్ కొత్తగా ఎంపికయ్యారు. లంకతో సిరీస్‌లో తొలి టెస్ట్ ఆగస్ట్ 21న (ఓల్డ్ ట్రాఫోర్డ్).. రెండో టెస్ట్ ఆగస్ట్ 29న (లార్డ్స్).. మూడో టెస్ట్ సెప్టంబర్ 6న (కెన్నింగ్స్టన్ ఓవల్) మొదలుకానున్నాయి. ఇంగ్లండ్ ఇటీవలే స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జోర్డన్ కాక్స్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌పై వేటు.. తాత్కాలిక కోచ్‌గా అతడే
అంతా అనుకున్నట్లే జరిగింది. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఆధికారికంగా ధ్రువీకరించింది. వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కారణంగా మాథ్యూ మోట్పై ఈసీబీ వేటు వేసింది.గతేడాది వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన ఇంగ్లీష్ జట్టు.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. "ఇంగ్లండ్ క్రికెట్ తరపున మాథ్యూ మాట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంగ్లండ్ పురుషుల జట్టుకు వరల్డ్‌కప్‌ను అందించిన ముగ్గురు కోచ్‌లలో ఒకడిగా మాట్ నిలిచాడు.అతడి జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అతడు అతి తక్కువ సమయంలోనే మూడు వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేశాడు. రాబోయే సవాళ్లను స్వీకరించేందుకు మా కోచింగ్ స్టాప్‌లో మార్పులు చేయాలని భావించాము. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వైట్ బాల్ సిరీస్‌లపై ప్రస్తుతం మా దృష్టి అంతా ఉంది. త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేస్తాము. అప్పటివరకు మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో కలిసి పనిచేయనున్నాడు. మార్కస్, జోస్ మధ్య మంచి అనుబంధం ఉంది. జట్టు విజయాలు కోసం వీరిద్దరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాని" ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్, రాబ్ కీ మోట్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా మోట్ ఆధ్వర్యంలోనే టీ20 వరల్డ్‌కప్-2022ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. -
బెట్టింగ్ కేసులో ఇంగ్లండ్ బౌలర్‌పై నిషేధం
ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ నిషేధాన్ని ఎదుర్కోనున్నాడు. 2017-2019 మధ్యలో బెట్టింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో కార్స్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 16 నెలల నిషేధాన్ని విధించింది. దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల కార్స్ తాను పాల్గొన్న మ్యాచ్‌ల్లో కాకుండా మిగతా మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసాడని క్రికెట్ రెగ్యులేటర్ ఏసీబీ విచారణలో తేలింది. బెట్టింగ్ కాసిన విషయాన్ని కార్స్ కూడా అంగీకరించాడు. 16 నెలల్లో 13 నెలల నిషేధం రెండేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంటుందని ఈసీబీ తెలిపింది. ప్రస్తుతానికి కార్స్‌పై మూడు నెలల నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్ 28 వరకు కార్స్ క్రికెట్లోని ఏ ఫార్మాట్లో అయినా పాల్గొనేందుకు అనర్హుడు.రాబోయే రెండేళ్లలో అతను అవినీతి నిరోధక నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే మిగిలిన 13 నెలల నిషేధం అమల్లోకి రాదు. కార్స్‌పై 303 బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. 2016లో డర్హమ్ కౌంటీలో అరంగేట్రం చేసిన కార్స్.. 2021 నుంచి ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కార్స్ ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడి మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కార్స్ ఇటీవలికాలంలో ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. కార్స్ బ్యాటింగ్‌లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగల సమర్ధుడు.ఇదిలా ఉంటే, నేటి నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్.. ఆసీస్‌తో కలిసి గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఇతర జట్లుగా ఉన్నాయి. -
'పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే రండి.. లేదంటే వద్దు'
టీ20 వరల్డ్‌కప్-2024కు సమయం దగ్గరపడుతుండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్-2024 నుంచి వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టోప్లీ (ఆర్సీబీ) సామ్ కుర్రాన్ (పంజాబ్ కింగ్స్) స్వదేశానికి పయనమయ్యారు.టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు మే 22 నుంచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 10 రోజుల ముందే స్వదేశానికి రావాలని తమ ఆటగాళ్లను ఈసీబీ ఆదేశించింది. అయితే ప్లే ఆఫ్స్‌కు ముందు స్టార్ ప్లేయర్లు ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడం ఆ జట్లకు పెద్ద ఎదరుదెబ్బగానే చెప్పుకోవాలి. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టులో బట్లర్ లేని స్పష్టంగా కన్పించింది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే మే 17న సీఎస్కేతో డూ ఆర్‌డై మ్యాచ్‌లో తలపడనుంది. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విల్ జాక్స్.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం కావడం కచ్చితంగా ఆర్సీబీపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్ పూర్తికాకుండానే మధ్యలోనే వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ‘‘ఉంటే పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ ఫైరయ్యాడు. -
జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ!
యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెటర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించారు. కాగా క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని రిషి సునాక్ 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల(GBP- British pound sterling ) ప్యాకేజీని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రోత్సాహం అందించేందుకు ఈ భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రణాళికలు రచించినట్లు రిషి సునాక్ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్‌లో ఆయన.. ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను కలిశారు. ఈ సందర్భంగా.. ఆండర్సన్‌తో ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను సునాక్ షేర్ చేసుకోవడం ఆయన హుందాతనానికి నిదర్శనంగా నిలిచింది. అదే విధంగా.. యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు సునాక్. కాగా ఆండర్సన్‌ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్ సెషన్లో పాల్గొన్నానంటూ రిషి సునాక్ వెల్లడించడం విశేషం. ఇందుకు బదులిచ్చిన ఆండర్సన్ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక ఈ విశేషాలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రిషి సునాక్.. ‘‘ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపునకు సిద్ధంగా ఉన్నా’’ అని తన సెలక్షన్ గురించి ఈసీబీకి సరదాగా రిక్వెస్ట్ పెట్టారు. ఇందుకు బదులిచ్చిన ఈసీబీ.. ‘‘బాగానే ఆడారు. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని అంతే సరదాగా స్పందించింది. కాగా 2026లో మహిళా టీ20 ప్రపంచకప్, 2030లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈసీబీకి మరింత బూస్ట్ ఇచ్చేలా ప్రధాని రిషి సునాక్ ఈమేరకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆండర్సన్ సహా పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. Not bad, perhaps a few more net sessions first 😉 https://t.co/u7AHCOMO08 — England Cricket (@englandcricket) April 5, 2024 -
టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ టీమ్‌కు బ్యాడ్ న్యూస్
వచ్చే ఏడాది భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్ జట్టుకు ఓ చేదు వార్త తెలిసింది. ఆ జట్టు సారధి, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో సిరీస్‌లో బౌలింగ్ చేయడని ఇంగ్లండ్ డైరక్టర్ ఆఫ్ క్రికెట్ రాబ్ కీ స్పష్టం చేశాడు. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. భారత్‌తో సిరీస్‌లో స్టోక్స్ చేత బౌలింగ్ చేయించడం మొదటి నుంచి తమ ప్రణాళికల్లో లేదని కీ వివరణ ఇచ్చాడు. స్టోక్స్ ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని.. ప్రస్తుతం అతను రీహ్యాబ్‌లో ఉన్నాడని.. భారత్‌తో సిరీస్ సమయానికంతా అతను పూర్తిగా కోలుకుంటాడని కీ తెలిపాడు. భారత్‌లో స్టోక్స్ బౌలింగ్ చేయడన్న విషయం తెలిసి ఇంగ్లండ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. స్టోక్స్ బంతితో రాణిస్తే తమ విజయావకాశాలు మరింత మెరుగుపడేవని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2024 జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిన్న (డిసెంబర్ 11) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసిన ఈసీబీ.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (గస్ అట్కిన్సన్ (పేస్ బౌలర్), టామ్ హార్ట్లీ (ఆఫ్ స్పిన్నర్), షోయబ్ బషీర్ (ఆఫ్ స్పిన్నర్)) అవకాశం కల్పించింది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 25-29 (హైదరాబాద్) రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-6 (వైజాగ్) మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్) నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27 (రాంచీ) ఐదో టెస్ట్: మార్చి 7-11 (ధర్మశాల) -
టీమిండియాతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
వచ్చే ఏడాది (2024) జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (డిసెంబర్ 11) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసిన ఈసీబీ.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (గస్ అట్కిన్సన్ (పేస్ బౌలర్), టామ్ హార్ట్లీ (ఆఫ్ స్పిన్నర్), షోయబ్ బషీర్ (ఆఫ్ స్పిన్నర్)) అవకాశం కల్పించింది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జాక్ లీచ్ భారత్‌తో సిరీస్‌తో టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 25-29 (హైదరాబాద్) రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-6 (వైజాగ్) మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్) నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27 (రాంచీ) ఐదో టెస్ట్: మార్చి 7-11 (ధర్మశాల) -
IPL 2024: క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్న స్టార్ పేసర్.. కారణం?
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విషయంలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావొద్దని అతడికి ఈసీబీ సూచించినట్లు తెలుస్తోంది. కాగా బార్బడోస్‌కు చెందిన 28 ఏళ్ల రైటార్మ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్-2023 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది అతడిని ఎనిమిది కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది ముంబై ఫ్రాంఛైజీ. గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరమవుతాడని తెలిసినా పెద్ద మొత్తం అతడి కోసం పక్కకు పెట్టింది. అయితే, ఐపీఎల్-2023కి అతడు అందుబాటులోకి వచ్చినా.. ఆశించిన మేర ఆర్చర్ సేవలను వినియోగించుకోలేకపోయింది. గాయాల బెడద కారణంగా అతడు సింహభాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా ఎడిషన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. తనపై ఖర్చు పెట్టిన మొత్తానికి న్యాయం చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలానికి ముందు ముంబై అతడిని విడుదల చేసింది. అయితే, ఆర్చర్ వేలంలో పాల్గొనాలని భావించినా ఈసీబీ అందుకు అడ్డు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు..‘‘ఆర్చర్ పునరాగమనం చేయాలని కోరుకుంటున్న ఈసీబీ.. అతడిని ఏప్రిల్, మే మొత్తం తమ పర్యవేక్షణలోనే ఉండాలని భావిస్తోంది. ఒకవేళ అతడు వేలంలో పాల్గొంటే కచ్చితంగా ఏదో ఒక ఐపీఎల్ జట్టు అతడిని కొనుగోలు చేయడమే కాకుండా ఖర్చు తగ్గ ఫలితం పొందాలని ఆశిస్తుంది. కాబట్టి.. వరల్డ్‌కప్-2024 జూన్‌లోనే ప్రారంభమవుతున్న కారణంగా పని భారాన్ని తగ్గించుకునే వీలు ఉండకపోవచ్చు. అందుకే అతడు ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండనున్నాడు’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. కాగా జోఫ్రా ఆర్చర్ టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ఈసీబీతో రెండేళ్లకు గానూ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆర్చర్‌కు ఈసీబీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 కోసం భారత్‌కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ మోచేయి గాయం కారణంగా..వారంలోపే తిరిగి యూకేకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి తమ పేసర్ ఫిట్నెస్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
తూచ్! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్ ఒక్కడేనా?
Who Reversed Retirement Decision: వరల్డ్ కప్ ఫైనల్-2019 హీరో బెన్ స్టోక్స్ తమ బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ వన్డేలు ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సఫలమైంది. దాంతో న్యూజిలాండ్‌తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. 15 మందితో కూడిన టీమ్‌ను ఈ సిరీస్ కోసం ఈసీబీ ప్రకటించింది. వరల్డ్ కప్ కోసం టీమ్‌ను ప్రకటించేందుకు మరింత సమయం ఉన్నా... సెలక్టర్ ల్యూక్ రైట్ చెప్పిన దాని ప్రకారం మార్పుల్లేకుండా ఇదే బృందం వరల్డ్ కప్‌కూ కొనసాగే అవకాశం ఉంది. మరి దేశం కోసం.. స్టోక్స్ మాదిరే తమ రిటైర్మెంట్ నిర్ణయాలు వెనక్కి తీసుకున్న ఆటగాళ్ల గురించి తెలుసా? షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన కెరీర్లో ఏకంగా ఐదుసార్లు రిటైర్మెంట్ ప్రకటనలు ఇచ్చాడు. 2006లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. అయితే, రెండు వారాల్లోనే తన నిర్ణయం మార్చుకున్నాడు మరోసారి సంప్రదాయ క్రికెట్లో పాక్ తరఫున బరిలోకి దిగాడు. ఎట్టకేలకు 2010లో టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అదే విధంగా.. 2011, మేలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆఫ్రిది.. నెలల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకొన్న ఆఫ్రిది.. 2017లో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కూ స్వస్తి పలికాడు. మొయిన్ అలీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2021 సెప్టెంబరులో టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సొంతగడ్డపై ఆసీస్‌తో పోరులో జట్టుకు అండగా నిలిచే క్రమంలో బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ మైదానంలో దిగాడు. బజ్‌బాల్ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ డ్రాతో గట్టెక్కడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మరోసారి తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇంగ్లండ్ తరఫున సంప్రదాయ క్రికెట్ ఆడబోవడం లేదని స్పష్టం చేశాడు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్‌కప్-2023 వంటి మెగా ఈవెంట్లకు ముందు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించి బంగ్లాను సందిగ్దంలో పడేశాడు. అయితే, ప్రధాని షేక్ హసీనా జోక్యంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇకపై కూడా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని తమీమ్ చెప్పుకొచ్చాడు. డ్వేన్ బ్రావో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 2018, అక్టోబరులో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆ మరుసటి ఏడాది డిసెంబరులో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బ్రావో తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్వయంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2021లో విండీస్ తరఫున బరిలోకి దిగిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. చదవండి: జట్టులో చోటు లేకున్నా పర్లేదు.. వాటి కారణంగా రిటైర్ అవ్వను: టీమిండియా స్టార్ -
Ashes 5th Test: మొండిగా వెళ్తున్న టీమ్ ఇంగ్లండ్.. కీలక ప్రకటన
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో చివరి టెస్ట్‌కు ముందు టీమ్ ఇంగ్లండ్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో టెస్ట్‌లో ఆడిన 14 మంది సభ్యుల జట్టునే ఐదో టెస్ట్‌లోనూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. సిరీస్‌లో 1-2తో వెనుపడినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండా మొండిగా ముందుకెళ్తుంది. గత మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన జేమ్స్ ఆండర్సన్‌ను సైతం కొనసాగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వయసు మీద పడి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేకపోతున్న ఆండర్సన్‌ను అయినా తప్పిస్తారని అంతా ఊహించినప్పటికీ.. ఇంగ్లీష్ మేనేజ్మెంట్ మాత్రం అనుభవజ్ఞుడైన ఆండర్సన్‌ను జట్టులో కొనసాగించేందుకు మొగ్గు చూపింది. తుది జట్టులో ఆండర్సన్‌కు అవకాశం ఇస్తుందో లేదో తెలీదు కానీ, 14 మంది సభ్యుల జట్టులో అతన్ని కొనసాగించి సంచలన నిర్ణయమే తీసుకుంది. ఎలాగూ యాషెస్ చేజారింది కాబట్టి, ఆండర్సన్‌ను ఆఖరి టెస్ట్ బరిలోకి దించి అతనిచే బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటన చేయించాలని అనుకుంటుదేమో కాని, మొత్తానికి ఆండర్సన్‌ను కొనసాగించి ఇంగ్లండ్ టీమ్ పెద్ద సాహసమే చేసింది. కాగా, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతి దాకా వచ్చిన గెలుపు వరుణుడి కారణంగా చేజారింది. ఆఖరి రోజు ఇంగ్లండ్ బౌలర్లు మరో 5 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలిచే అవకాశంతో పాటు సిరీస్ అవకాశాలు కూడా సజీవంగా ఉండేవి. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రా గా ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకుంది. అంతకుముందు తొలి రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడో టెస్ట్‌ల్లో విజయం సాధించి, నాలుగో టెస్ట్‌లో గెలుపు అంచుల వరకు వచ్చింది. నాలుగో టెస్ట్‌లో వరుణుడి పుణ్యమా అని ఆసీస్ ఓటమి బారి నుంచి తప్పించుకుని యాషెస్‌ను నిలబెట్టుకుంది. చివరిదైన ఐదో యాషెస్ టెస్ట్ కియా ఓవల్ వేదికగా జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. ఐదో యాషెస్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు.. బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణ
క్రికెట్ ప్రపంచాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) క్షమాపణ కోరడం ఆసక్తి కలిగించింది. ఇంగ్లండ్ క్రికెట్లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతీ బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతూ సోమవారం రాత్రి ఈసీబీ లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్ కమీషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్(ICEC) నివేదికను ఈసీబీకి సమర్పించింది. ఈ రిపోర్టులో వివక్ష వల్ల ఎదుర్కొన్న దుష్ప్రవర్తనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మార్పులకు సంబంధించి 44 ప్రతిపాదనలను ఐసీఈసీ రిపోర్టులో పొందుపరిచింది. నివేదిక ప్రకారం.. '' ఇంగ్లండ్ క్రికెట్లో వివక్ష జరిగిన మాట నిజమే. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్, మీటూ తరహాలో ఇక్కడా నల్లవారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 85 శాతం భారత సంతతికి చెందిన బాధితులే ఉండడం గమనార్హం. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. నిర్మాణాత్మక, సంస్థాగత జాత్యహంకారం, లింగవివక్ష-వర్గ-ఆధారిత వివక్ష నుంచి విముక్తి పొందలేకపోయారు.'' అంటూ ఐసీఈసీ తన రిపోర్టులో పేర్కొంది. కాగా రిపోర్టును పరిశీలించిన ఈసీబీ తప్పుకు క్షమాపణ కోరుతూ తక్షణమే మార్పులు చేపడతామని తెలిపింది. ''క్రికెట్ అనేది అందరి గేమ్. ఇక్కడ వివక్షకు తావులేదు. ఇలాంటివి మళ్లీ జరగకుండా త్వరలోనే కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఐసీఈసీ పేర్కొన్న విధంగా జాతి వివక్ష పేరుతో మహిళలకు, నల్ల జాతీయులకు జరిగిన అవమానాలను పట్టించుకోలేదు. అందుకు క్షమాపణ కోరుతున్నాం. ఇలాంటివి ఉపేక్షించం. ఐసీఈసీ పేర్కొన్న 44 రికమెండేషన్స్‌ను పరిశీలించాం. వచ్చే మూడు నెలల్లో ICEC ప్రతిపాదించిన 44 సిఫార్సులకు ఒక బలమైన ప్రణాళికను రూపొందించడానికి ప్రయత్నిస్తాం.'' అంటూ ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు. Read our response to the Independent Commission for Equity in Cricket which finds evidence of discrimination across the game. We apologise unreservedly for the experiences of those who have faced discrimination in cricket. https://t.co/vOpqMLmuoK — England and Wales Cricket Board (@ECB_cricket) June 26, 2023 చదవండి: #RohitSharma: 'పోటీ తీవ్రంగా ఉంది.. అంత సులభం కాదు; కష్టపడతాం' -
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్‌ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్‌కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్‌లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్‌కప్‌లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్‌కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్‌కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్‌కు భారత్, పాక్‌లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్‌ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ను జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్‌ను రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరగా, అందుకు అతను అంగీకరించాడు. కాగా, మొయిన్ 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక రెడ్ బాల్‌తో కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడలేదు. అయినా ఈసీబీ ఇతనిపై నమ్మకంతో రిటైర్మెంట్ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది. మొయిన్ రాకతో ఇంగ్లండ్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఈసీబీని లోలోపల కలవరపెడుతుంది. అదేంటంటే.. మొయిన్‌కు ఆస్ట్రేలియాపై చెత్త రికార్డు ఉండటం. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇది అతని కెరీర్ యావరేజ్‌కు రెండింతలు. కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలే, డేనియల్ లారెన్స్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్ స్టో, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్‌బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
ఐసీసీ ఆదాయంలో మన వాటా 38.5 శాతం!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఆదాయం, వాటాలపరంగా ‘బిగ్ 3’ శాసిస్తూ వచ్చాయి. ఐసీసీ ఆర్జన నుంచి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దాదాపు సమాన వాటా పొందాయి. అయితే ఇకపై ఇది ‘బిగ్ 1’గా మాత్రమే ఉండనుంది! తాజాగా ప్రతిపాదించిన కొత్త లెక్క ప్రకారం వచ్చే నాలుగేళ్ల కాలానికి (2024–27) ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38.5 శాతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖాతాలోకే చేరనుంది. ప్రసార హక్కులు, వాణిజ్యపరమైన ఒప్పందాల ద్వారా సంవత్సర కాలానికి ఐసీసీ 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,917 కోట్ల) ఆర్జించే అవకాశం ఉండగా... ప్రతీ ఏటా భారత్‌కు 231 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,893 కోట్లు) లభిస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్ 6.89 శాతం (సుమారు రూ. 339 కోట్లు), మూడో స్థానంలో ఉన్న ఆ్రస్టేలియాకు 6.25 శాతం (సుమారు రూ. 308 కోట్లు) మాత్రమే దక్కనున్నాయి. ఓవరాల్‌గా 88.81 శాతం ఆదాయం ఐసీసీ పూర్తి స్థాయి సభ్యులైన 12 జట్లకు చేరనుండగా, అసోసియేట్ జట్ల కోసం 11.19 శాతం మొత్తం కేటాయించనున్నారు. -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
లండన్: ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ ‘22బెట్ ఇండియా’కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటనలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్‌లో రిజిస్టర్ అయిన బెట్22తో గత నవంబర్‌లో మెకల్లమ్ ఒప్పందం కుదర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దీనిపై దృష్టి సారించింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్‌లో పాల్గొనడం, పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు’. టీమ్ హెడ్ కోచ్‌గా మెకల్లమ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్‌లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో ‘22బెట్ ఇండియా’పై ఆ దేశం నిషేధం విధించింది కూడా. ఆ దేశానికి చెందిన ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్’ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్‌గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టులు గెలిచింది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా -
పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్ వచ్చాయి. గుడ్‌న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్‌లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్‌స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్‌వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
IPL 2023: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా లేకపోయినా..!
Jofra Archer: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. 2022 మెగా వేలంలో 8 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ అయ్యింది. రానున్న సీజన్‌కు మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్చర్‌కు సంబంధించిన ఈ వార్త ముంబై ఇండియన్స్ యజమాన్యానికి, ఫ్యాన్స్‌కు భారీ ఊరట కలిగిస్తుంది. ఆర్చర్ పూర్తి సీజన్నుకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో పాటు ముంబై ఇండియన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఈసీబీ, ఎంఐ యాజమాన్యం సంయుక్తంగా ఆర్చర్ వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేస్తాయని వెల్లడించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో పాటు ఉన్న ఆర్చర్.. అక్కడ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ తర్వాత నేరుగా భారత్‌కు చేరుకుంటాడని స్పష్టం చేశాయి. కాగా, జోఫ్రా ఆర్చర్ గాయాల కారణంగా దాదాపు 18 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది తెలిసి కూడా ఎంఐ యాజమాన్యం ఆర్చర్‌ను 2022 ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. గాయం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆర్చర్.. అంతకుముందు కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రీఎంట్రీలో సౌతాఫ్రికాతో జరిగిన ఓ వన్డేలో ఆర్చర్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఆర్చర్ అద్భుతంగా రాణించాడు. ఎస్ఏ20 ఇనాగురల్ లీగ్‌లో ఆర్చర్ ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
IPL 2023: సీఎస్కేకు గుడ్‌న్యూస్.. బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2023 సీజన్ చివరి అంకం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జరుగుతున్న ప్రచారంపై చెన్నై సూపర్ కింగ్స్ ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో పరుగు తేడాతో ఓటమి అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తాను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన ప్రస్తుత శారీరక పరిస్థితిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో తరుచూ మాట్లాడుతున్నాని, ఐపీఎల్ కోసం ఫిట్‌గా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తానని తెలిపాడు. అలాగే, తన మోకాలి సమస్యలపై కూడా స్టోక్స్ వివరణ ఇచ్చాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. ఫిజియోలు, డాక్టర్ల సాయంతో దానిపై పైచేయి సాధించి, పదేళ్ల కెరీర్లో వంద శాతం తన పాత్రకు న్యాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ తర్వాత తన దృష్టంతా యాషెస్ సిరీస్పైనేనని, ప్రతిష్టాత్మక సిరీస్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. కాగా, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే తేదీకి (మే 28) సరిగ్గా నాలుగు రోజుల తర్వాత (జూన్ 1) ఇంగ్లండ్.. ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ వెంటనే (జూన్ 16) ఇంగ్లండ్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ఆడనుంది. యాషెస్ సిరీస్‌కు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈసీబీ స్టోక్స్‌ను ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉందిగా ఫోర్స్ చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్.. ఐపీఎల్లో ఆఖరి మ్యాచ్‌లకు డుమ్మా కొట్టి, ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడతాడని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్టోక్స్ వివరణ ఇవ్వడంతో సందేహాలన్నీ తొలిగిపోయాయి. మరోవైపు ఈసీబీ.. స్టోక్స్ ఐపీఎల్ 2023లో ఆడేందుకు ఎన్ఓసీ కూడా ఇచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో సీఎస్కే స్టోక్స్‌ను 16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్
పాకిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 13) జరుగనున్న టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు గాడ్ ఫాదర్‌గా చెప్పుకునే డేవిడ్ ఇంగ్లిష్ (76) గుండెపోటు కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఇంగ్లిష్ మరణవార్త తెలిసి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దిగ్భ్రాంతికి గురైంది. కెప్టెన్ జోస్ బట్లర్ సహా జట్టులోని ఆటగాళ్లంతా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జోస్ బట్లర్.. ఇంగ్లిష్తో ఉండిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాదా తప్త హృదయంతో ట్వీట్ చేశాడు. So sad to hear the news of David English passing away. One of life’s great characters, so fun to spend time with and producer of some of the best English cricketers through his wonderful Bunbury Festivals. RIP ❤️ pic.twitter.com/RK3SXUOfSr — Jos Buttler (@josbuttler) November 12, 2022 ఇంగ్లిష్ మరణవార్త కలచి వేసిందని, తాను చూసిన గొప్ప వ్యక్తిత్వం గల మనుషుల్లో ఇంగ్లిష్ ఒకరని, ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంతో మంది ఉత్తమ క్రికెటర్లను అందించిన ఇంగ్లిష్తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేనని, ఇంగ్లిష్ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశం పంపాడు. కాగా, డేవిడ్ ఇంగ్లిష్.. బన్‌బరీ స్కూల్స్ ఫెస్టివల్స్ ద్వారా వేల సంఖ్యలో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లను, వందల సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను ఇంగ్లండ్ జట్టుకు అందించాడు. చదవండి: Jos Buttler: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకుమార్‌కే.. -
జాసన్ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 2022-23 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ ఫోక్స్ తొలి సారి సెంట్రల్ కాంట్రాక్ట్(ఫుల్‌టైమ్)ను పొందారు. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ తొలిసారి తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే, అతడికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కింది. కాగా రాయ్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందిలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని డిమోట్ చేయడం గమనార్హం. ఇక ఈ సీజన్‌కు గానూ మొత్తం 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కింది. అందులో 18 మందికి ఫుల్ టైమ్కాంట్రాక్ట్ , ఆరుగురికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్, మరో ఆరుగురుకి పేస్ బౌలింగ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లభించింది. కాగా జాసన్ రాయ్‌తో పాటు డోమ్ బెస్, రోరీ బర్న్స్, క్రిస్ జోర్డాన్, టామ్ కర్రాన్ కూడా తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్: మొయిన్ అలీ (వార్విక్షైర్), జేమ్స్ ఆండర్సన్ (లంకాషైర్), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), జోనాథన్ బెయిర్‌స్టో (యార్క్‌షైర్) స్టువర్ట్ బ్రాడ్ (నాటింగ్‌హామ్‌షైర్) జోస్ బట్లర్ (లంకాషైర్) జాక్ క్రాలే (కెంట్) సామ్ కర్రాన్ (సర్రే) బెన్ ఫోక్స్ (సర్రే) జాక్ లీచ్ (సోమర్సెట్) లియామ్ లివింగ్‌స్టోన్ (లంకాషైర్) ఒల్లీ పోప్ (సర్రే) ఆదిల్ రషీద్ (యార్క్‌షైర్) ఆలీ రాబిన్సన్ (ససెక్స్) జో రూట్ (యార్క్‌షైర్) బెన్ స్టోక్స్ (డర్హామ్) క్రిస్ వోక్స్ (వార్విక్షైర్) మార్క్ వుడ్ (డర్హామ్). ఇంక్రిమెంట్ కాంట్రాక్టులు హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), డేవిడ్ మలన్ (యార్క్‌షైర్) ,మాథ్యూ పాట్స్ (డర్హామ్), జాసన్ రాయ్ (సర్రే), రీస్ టోప్లీ (సర్రే) ,డేవిడ్ విల్లీ (నార్థాంప్టన్షైర్ 1 నవంబర్ 22 నుండి). ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ కాంట్రాక్టులు: బ్రైడన్ కార్సే (డర్హామ్) మాథ్యూ ఫిషర్ (యార్క్‌షైర్) సాకిబ్ మహమూద్ (లంకాషైర్) క్రెయిగ్ ఓవర్టన్ (సోమర్సెట్) జామీ ఓవర్టన్ (సర్రే) ఒల్లీ స్టోన్ (1 నవంబర్ 22 నుండి నాటింగ్‌హామ్‌షైర్) చదవండి: T20 World Cup 2022: ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్ -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రావల్పిండి వేదికగా డిసెంబర్ 1న ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే బ్రాడ్ భార్య మోలీ కింగ్ నవంబర్ మధ్యలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. అతడు ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రాడ్ ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో కీలక సభ్యుడుగా ఉన్నాడు. న్యూజిలాండ్, దక్షాణాఫ్రికా, భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ విజయంలో బ్రాడ్ ముఖ్య భూమిక పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ చివరసారిగా 2005లో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో తలపడింది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో కోల్పోయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడింది. ఈ సిరీస్‌ను 4-3 ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. చదవండి: T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్ షమీ? దీపక్ చాహర్? -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెటర్ గదిలో చోరీ
ఇంగ్లండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్‌లో ఆమె బస చేసిన మారియట్ హోటల్లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. కాగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’ -
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్!
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో అడుగు పెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా 7 టీ20లు, మూడు టెస్టుల సిరీస్‌లో అతిథ్య జట్టుతో ఇంగ్లండ్ తలపడనుంది. కాగా ఇప్పటికే టీ20 సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. తాజాగా టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఇరు జట్లు మధ్య చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. తొలి టెస్టుకు రావల్పిండి, రెండో టెస్టుకు మూల్తాన్ అతిథ్యం ఇవ్వనుండగా.. అఖరి టెస్టు కరాచీ వేదికగా జరగనుంది. అదే విధంగా పాకిస్తాన్ ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. అయితే టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్‌లో సమావేశమయ్యారు. 2022 ఏడాదిలో ఇంగండ్ జట్టు పాక్‌లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చేలరేగిన శుబ్‌మన్ గిల్ -
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్!
దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్ ఓలీ రాబిన్సన్ను ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. రాబిన్సన్ చివరగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై ఆడాడు. అదే విధంగా కొవిడ్ కారణంగా న్యూజిలాండ్‌తో అఖరి రెండు టెస్టులకు దూరమైన వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వేటు పడింది. ఇక ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం, విండీస్ పర్యటనలో ఓటమి చవిచూసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తోంది. నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులోను తమ జోరును కొనసాగించింది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య లార్డ్స్ వేదికగా ఆగస్టు17 జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్. చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్ -
పాక్‌పై నమ్మకం లేదు.. అందుకే ఇలా: ఈసీబీ
పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు నిరాకరించడానికి ప్రధాన కారణం అక్కడి అభద్రతా భావం. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని భయపడే సంఘటనలు చాలానే ఉన్నాయి. 2009లో పాకిస్తాన్ లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ద్వారా పాక్ గడ్డపై క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. ఇక భారత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఒప్పుకుంది. మూడు వన్డేలు.. మూడు టి20 మ్యాచ్‌లు లాహోర్ వేదికగా నిర్వహించారు. అలా పాక్‌లో మొదలైన క్రికెట్ సందడిని ఆ తర్వాత ఆస్ట్రేలియా కంటిన్యూ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే మసీదులో బాంబు పేలడం ఆశ్చర్యపరిచినప్పటికి.. సెక్యూరిటీ భద్రత మధ్య మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ విషయంలో పాకిస్తాన్ భద్రతా చర్యలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రశంసించింది. ఇక ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టు సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్తాన్ పర్యటనకు రానుంది. అయితే అంతకముందే ఈసీబీ పాక్‌లో భద్రతా ఏ మేరకు ఉందో తెలుసుకోవాలని ఐదుగురితో కూడిన బృందాన్ని జూలై 17న పాకిస్తాన్‌కు పంపనున్నారు. ఆటగాళ్ల కంటే ముందే వెళ్లనున్న బృందం అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నది. ఈ మేరకు పాకిస్తాన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..? భద్రతా లోపాలు తలెత్తకుండా పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకుంది..? టీమ్ హోటల్స్ వంటి తదితర విషయాలను ఈసీబీ బృందం పరిశీలించనుంది. జులై 17న రానున్న బృందంలో ఇద్దరు క్రికెట్ ఆపరేషన్స్ అధికారులు, ఇద్దరు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఒక అధికార ప్రతినిధి ఉంటారు. వీళ్లు కరాచీ, ముల్తాన్, రావాల్పిండి, లాహోర్ (మ్యాచుల వేదికలు) లలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. దీంతో ఈసీబీ బృందం ఇచ్చే నివేదికపై పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆధారపడి ఉంది. ఇక దాదాపు ఏడేండ్లు(2015) తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నది. ఈ పర్యటనలో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు మూడు టెస్టులు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ గతేడాదే పాకిస్తాన్ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ గతేడాది సెప్టెంబర్ లో న్యూజిలాండ్ జట్టు రావల్పిండిలో జరగాల్సి ఉన్న వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ పర్యటనను రద్దు చేసుకుని కివీస్ కు వెళ్లిపోయింది. భద్రతా కారణాలను చూపి కివీస్ ఆ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కూడా షాకిచ్చింది. తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పిన ఈసీబీ.. ఈ సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకుంది. కానీ తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులు ఈసీబీని ఒప్పించి.. పర్యటనకు రావాలని మెప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. పాకిస్తాన్ శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు లంకకు వెళ్లింది. ఆసియాకప్-2022 ముగిసిన తర్వాత పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Sachin Tendulkar: అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం Ind Vs Eng: బ్యాజ్‌బాల్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
India Vs England 5th Test Day 4: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రీషెడ్యూల్డ్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. ఈ మేరకు ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్ అభిమానులు తమను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపించారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమతో పాటు అక్కడున్న మహిళలు, చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని, సిబ్బందిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలిని ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ‘‘టెస్టు మ్యాచ్ సందర్భంగా కొంతమంది జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకు మేము చింతిస్తున్నాం. ఎడ్జ్‌బాస్టన్ అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం. క్రికెట్లో జాతి వివక్షకు తావు లేదు’’ అని ట్వీట్ చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Dutee Chand: మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్ Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz — Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022 We are very concerned to hear reports of racist abuse at today's Test match. We are in contact with colleagues at Edgbaston who will investigate. There is no place for racism in cricket — England and Wales Cricket Board (@ECB_cricket) July 4, 2022 -
వారెవ్వా... కెప్టెన్ బుమ్రా
రెండో రోజు ఆటలో భారత సారథి బుమ్రా బ్యాటింగ్‌లో మెరుపులతో, బౌలింగ్‌లో వికెట్లతో అదరగొట్టాడు. మూడో రోజు అద్భుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ బోర్డు ప్రశంసలందుకున్నాడు. ఓవర్‌నైట్ బ్యాటర్స్ బెయిర్‌స్టో–స్టోక్స్ పాతుకుపోతున్న దశలో శార్దుల్ వేసిన ఓవర్లో కెప్టెన్ స్టోక్స్ బౌండరీ కోసం మిడాఫ్‌లో షాట్ ఆడాడు. సమీపంలో ఉన్న బుమ్రా మెరుపువేగంతో ఎడమవైపు వెనక్కి డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. నోరెళ్లబెడుతూ స్టోక్స్ నిష్క్రమించాడు. ఇంగ్లండ్ బోర్డు బుమ్రాను అభినందిస్తూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రేయస్ అయ్యర్ పట్టిన ఆఖరి వికెట్ సందేహాస్పద క్యాచ్ ‘సాఫ్ట్ సిగ్నల్’ ద్వారా భారత్‌కు అనుకూలమైంది. పాట్స్ ఇచ్చిన ఈ క్యాచ్ రిప్లేలో నేలకు తాకుతున్నట్లు కనిపించింది. -
ఇంగ్లండ్ కొత్త కెప్టెన్‌గా జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్ 30) బట్లర్‌ను కొత్త సారధిగా ప్రకటించింది. గత పదేళ్లుగా ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న బట్లర్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ నూతన కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బట్లర్.. ఈసీబీకి, మాజీ సారధి మోర్గాన్‌ను ధన్యవాదాలు తెలిపాడు. గత ఏడేళ్లుగా ఇంగ్లండ్ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించిన మోర్గాన్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. మోర్గాన్ నుంచి బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవమని అన్నాడు. ఇంగ్లండ్ తరఫున 57 టెస్ట్‌లు, 151 వన్డేలు, 88 టీ20 ఆడిన బట్లర్ తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించాడు. బట్లర్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 13 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు సాధించాడు. చదవండి: రోహిత్ ఔట్, టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ అధికారిక ప్రకటన -
మెక్కల్లమ్ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇంగ్లండ్ నూతన టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కోచ్ సిల్వర్‌వుడ్ స్థానంలో కొత్త కోచ్‌గా వచ్చిన మెక్కల్లమ్ జట్టును గాడిలో పెడతాడేమో చూడాలి. అసలే వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు ఇంగ్లండ్‌ను దెబ్బతీశాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నాయకత్వ పగ్గాలు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అప్పగించింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ కలయికలో సరికొత్తగా కనిపిస్తున్న ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ను గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మెక్కల్లమ్ నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేయనున్నాడు. అందుకు సంబంధించి నాలుగేళ్ల కాలానికి గానూ మెక్‌కల్లమ్‌కు ఈసీబీ భారీగా చెల్లించనుంది. టెలిగ్రాఫ్.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్కల్లమ్తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్‌కోచ్‌కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్ ప్రకటించే క్రికెట్ బోర్డులు కోచ్‌లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్కల్లమ్పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన మెక్కల్లమ్ స్పందించాడు. ''ఇంగ్లండ్ క్రికెట్‌కు సేవలందించడానికి ఉవ్విళ్లూరుతున్నా. నాపై నమ్మకంతో బోర్డు నాకు అప్పగించిన బాధ్యతలను పాజిటివ్ ధోరణితో నిలబెట్టుకుంటా. ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టును గాడిలోపెట్టడానికి ప్రయత్నిసా. బెన్ స్టోక్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఒక ఆటగాడిగా అతను నాకు పరిచయం.. ఇకపై ఇద్దరి సమన్వయంతో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి: IPL 2022: క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్ వేరు RCB Play-Off Chances: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు పడినప్పటి నుంచి అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరనే దానిపై ఈసీబీలో పెద్ద చర్చ నడిచింది. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవలే జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) టెస్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక టెస్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంపిక చేసింది. 2011లో వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో కిర్‌స్టన్ పాత్ర మరువలేనిది. ఇక టెస్టు కోచ్‌తో పాటు.. వైట్‌బాల్ క్రికెట్ కోచ్‌ను ఈసీబీ ఎంపికచేయనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌కు ఆడిన సమయంలో బెస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మెక్కల్లమ్.. మంచి వ్యూహాలు పన్నగల కెప్టెన్‌గా రాణించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మెక్కల్లమ్ ఇంగ్లండ్‌ను గాడిలో పెడతాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు మెక్కల్లమ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఇక కిర్‌స్టన్ లాగే మెక్కల్లమ్ కూడా సక్సెస్ఫుల్ కోచ్. ప్రస్తుతం ఐపీఎల్లో మెక్కల్లమ్ రెండుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక 2012లో న్యూజిలాండ్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో కివీస్ 2015 వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడి రన్నరప్‌గా నిలిచింది. చదవండి: IPL 2022: నైట్‌షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్ కార్తికేయ? Ajaz Patel: భారత్‌పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి.. -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇంగ్లండ్ మహిళా స్టార్ బౌలర్ అన్య ష్రుబ్సోల్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ష్రూబ్సోల్ 2009,2017లో ప్రపంచకప్‌లు గెలిచిన ఇంగ్లండ్‌లో జట్టులో భాగమైంది. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లండ్ తరపున అన్ని ఫార్మాట్లలో 173 మ్యాచ్‌లు ఆడిన అన్య ష్రుబ్సోల్.. 227 వికెట్లు పడగొట్టింది. ఇక టీ20ల్లో 102 వికెట్లు పడగొట్టిన ఆమె.. టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డును కలిగి ఉంది. ష్రూబ్సోల్ చివరగా మహిళల ప్రపంచ కప్-2022 ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మంట్ ప్రకటించిన ఆమె రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ, షార్లెట్ ఎడ్వర్డ్స్ కప్, ది హండ్రెడ్ వంటి దేశవాళీ టోర్నీలో మాత్రం ఆడనుంది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా! -
అండర్సన్, బ్రాడ్లపై వేటు
లండన్: అండర్సన్ 640 వికెట్లు... స్టువర్ట్ బ్రాడ్ 537 వికెట్లు... టెస్టుల్లో వీరిద్దరు కలిసి ఏకంగా 1,177 వికెట్లు పడగొట్టి సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే యాషెస్ సిరీస్‌లో 0–4తో చిత్తయిన ప్రభావం ఈ ఇద్దరు దిగ్గజ బౌలర్లపై కూడా పడింది. వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అండర్సన్, బ్రాడ్‌లకు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లను తప్పించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠిన నిర్ణయం తీసుకుంది. యాషెస్ పరాజయం తర్వాత హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, మేనేజింగ్ డైరెక్టర్లను తప్పించిన బోర్డు ఇప్పుడు ఆటగాళ్లపై వేటు వేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమ్ నుంచి మొత్తం ఎనిమిది మందిని తప్పించడం గమనార్హం. బట్లర్, రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, మలాన్, స్యామ్ బిల్లింగ్స్, డామ్ బెస్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు. -
సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి
ఐపీఎల్ 2022 సీజన్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మధ్యలోనే వైదొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి అంచె పోటీలకు అందుబాటులో ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండో అంచె పోటీలకు మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ 15వ సీజన్‌ను మార్చి 27 నుంచి మే చివరివారం వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా అంతకముందు ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్నారు. ఈసారి మెగావేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు చాలా మందే తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన జానీ బెయిర్ స్టో, మార్క్‌వుడ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ బిల్లింగ్స్, డాన్ లారెన్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా యాషెస్ సిరీస్‌లో పాల్గొన్నారు. ఇక రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న జాస్ బట్లర్ కూడా టెస్టు జట్టులో సభ్యుడే. చదవండి: మెగా వేలంలో నాకోసం లక్నో బడ్జెట్ ఎంత? బేస్ ప్రైస్ ఇక జూన్ 2 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. టెస్టు జట్టులోని ఆటగాళ్లు కనీసం 15 రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్ చేసుకుంటుంది. అందుకోసం ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను సీజన్ మధ్యలోనే వెనక్కి పిలిపించే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కీలకం కావడంతో ఈసీబీ ఆటగాళ్లను రప్పించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఐపీఎల్ సీజన్లో కీలకమైన రెండో దశ పోటీలు జరగనున్న సమయంలోనే వాళ్లు వెనక్కి రావాల్సి ఉంటుంది. అసలే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0తో దారుణ పరాభవం చూసిన ఇంగ్లండ్.. మళ్లీ టెస్టుల్లో పునర్వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈసీబీ తీరుపై ఐపీఎల్ అభిమానులు మాత్రం మండిపడ్డారు. వేలంలో కోట్టు కుమ్మరించి ఆటగాళ్లను తీసుకుంటారు. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండాలని ఆయా ఫ్రాంచైజీలు కోరుకుంటాయి. ఇలా సగం సీజన్ ఆడి.. మిగతా మ్యాచ్‌లు ఆడకుండా వెళ్లిపోవడం బాగుండదు. సగం సీజన్ ఆడే బదులు అక్కడే ఉండిపోండి.. మీకు ఖర్చులు దండగా అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోయిన్ అలీ.. మోర్గాన్ దూరం
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగితా రెండు టీ20ల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా ధృవీకరించింది. "తొడ కండరాల గాయం కారణంగా మిగిలిన సిరీస్‌కు మోర్గాన్ దూరం కానున్నాడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇక మోర్గాన్ దూరం కావడంతో మోయిన్ అలీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా మూడో టీ20 మ్యాచ్‌కు కూడా మోర్గాన్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరజాయం చెందిన ఇంగ్లండ్.. రెండో టీ20లో అనూహ్యంగా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక మూడో టీ20లో ఇంగ్లండ్ ఓటమి చెందింది. కగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మోర్గాన్ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే సాధించాడు. చదవండి: తెర మీదే అయినా... తగ్గేదే లే! -
యార్క్‌షైర్ కౌంటీపై వేటు
లండన్: జాతి వివక్షపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కన్నెర్ర చేసింది. కుప్పలుతెప్పలుగా ఆరోపణలు వస్తున్నా... చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించిన యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆ జట్టు కౌంటీలకు దూరమవడంతో పాటు క్లబ్‌కు చెందిన హెడింగ్లీ స్టేడియంలో ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. వచ్చే ఏడాది లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో పలు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు, దక్షిణాఫ్రికాతో వన్డే, యాషెస్ సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను అక్కడి నుంచి తప్పిస్తారు. వైసీసీసీకి చెందిన మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ (2008–2018) ఏళ్ల తరబడి వర్ణ వివక్షకు గురయ్యాడు. ఇస్లాం మతానికి చెందిన తను పదేపదే వివక్షకు గురయ్యానని, సహచరులు తనను బయటివాడిగానే చూసేవారని, దీనిపై క్లబ్‌కు 43 సార్లు ఫిర్యాదు చేశానని రఫిక్ గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈసీబీ రంగంలోకి దిగింది. కమిటీ విచారణలో యార్క్‌షైర్ ఉదాసీనత వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
India Vs England 5th Test To Be Held In July 2022: ఐపీఎల్-2021 రెండో దశకు ముందు ఇంగ్లండ్ పర్యటనలో రద్దైన ఐదో టెస్ట్(మాంచెస్టర్) మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)లు క్లారిటీ ఇచ్చాయి. భారత శిబిరంలో కరోనా కేసు వెలుగు చూడడంతో రద్దైన ఆ మ్యాచ్‌ను వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించాయి. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుండగా.. అందులో భాగంగా జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రద్దైన టెస్ట్ జరుగుతుందని ఇరు దేశాల బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య 3 టీ20లు (జులై 7, 9, 10), 3 వన్డేలు(జులై 12, 14, 17) జరగనున్నాయి. కాగా, భారత్- ఇంగ్లండ్‌ల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా నిర్దారణ కావడంతో రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ట్రోఫితో పాటు ఆ రెండు రికార్డులు టీమిండియా క్రికెటర్లవే.. -
యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్...
England Announce Squad for Ashes: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రఖ్యాత సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. కాగా 17 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను ఈసీబీ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. కాగా స్టోక్స్.. ఐపీఎల్లో గాయం తర్వాత మానసిక సమస్యల కారణంగా భారత్‌తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ సెకెండ్ ఫేజ్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే క్వారంటైన్ నిబంధనలు సడలించాలని కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును అభ్యర్ధించారు. అయితే వాళ్ల అభ్యర్ధను ఆస్ట్రేలియా తిరష్కరించంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా లో పర్యటించేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యాషెస్ సీరీస్‌పై సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఆసీస్ బోర్డుతో చర్చలు జరిపింది. క్వారంటైన్ నిబంధనలను సడలించేందకు ఆస్ట్రేలియా అంగీకరించడంతో యాషెస్ సిరీస్ యాదా విధంగా జరగనుంది ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్, రోరీ బర్న్స్, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
T20 World Cup 2021: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Sam Curran Ruled Out T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కాగా రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ తాజాగా సామ్ కరన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను కోల్పోవడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సామ్ కరన్ ఇంగ్లండ్ తరపున 24 టెస్టుల్లో 815 పరుగులు.. 47 వికెట్లు, 11 వన్డేల్లో 141 పరుగులు.. 12 వికెట్లు, 16 టి20ల్లో 91 పరుగులు.. 16 వికెట్లు తీశాడు. చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్,టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్ -
రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?
ముంబై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న జరగాల్సిన చివరి టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే రద్దైన ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసేందుకు తాజాగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ, ఈసీబీలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. అయితే, రీ షెడ్యూల్ అయ్యే ఆ మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు సంబంధం ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నోరుమెదపలేదు. రీ షెడ్యూల్ మ్యాచ్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగానే జరగాలని ఈసీబీ పట్టుబడుతుంటే.. బీసీసీఐ మాత్రం అది స్టాండ్ అలోన్ మ్యాచ్(సెపరేట్ మ్యాచ్) అవుతుందని సూచన ప్రాయంగా పేర్కొంది. 4 టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సిరీస్ ఫలితం ఎటూ తేలలేదు. ఈ విషయమై ఐసీసీ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు తొలుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లకు వైరస్ సోకింది. అనంతరం ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమంటూ చేతులెత్తేసింది. చదవండి: అతన్ని వదులుకోవడం కేకేఆర్ చేసిన అతి పెద్ద తప్పిదం.. -
గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ?
England Tour Of Pakistan In Doubt : పాకిస్థాన్ క్రికెట్‌కు గంటల వ్యవధిలో మరో షాక్ తగిలింది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించగా, త్వరలో పాక్‌లో పర్యటించాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సైతం కివీస్ బాటలోనే పయనించాలని నిర్ణయించుకుంది. పాకిస్థాన్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశాక పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ జట్టు చివరిసారి 2005లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే, న్యూజిలాండ్ తాజా నిర్ణయంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కూడా పునరాలోచనలో పడింది. న్యూజిలాండ్ నిర్ణయం గురించి తమకు తెలిసిందని, ఆ జట్టు అక్కడే ఉంది కాబట్టి అక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని ఈసీబీ పేర్కొంది. ఇదిలా ఉంటే, పాక్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా తొలి వన్డే జరగాల్సింది. చదవండి: మరికాసేపట్లో వన్డే మొదలు.. పాక్ సిరీస్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్ -
ఐదో టెస్టు భవితవ్యం మీరే తేల్చండి
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం ఐసీసీ వరకు చేరింది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), బీసీసీఐల మధ్య ఈ టెస్టుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో సిరీస్ విజేతను నిర్ణయించే మాంచెస్టర్ టెస్టుపై తుది నిర్ణయం మీరే తీసుకోవాలంటూ ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్సీ)కి ఈసీబీ లేఖ రాసింది. తమ జట్టు ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడటంతో ఐదో టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆడలేమంటూ టీమిండియా తప్పుకుంది. అయితే ఈ విషయం లో ఈసీబీ వాదన మరోలా ఉంది. భారత ఆటగాళ్లకు చేసిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చినా టెస్టులో ఆడటానికి వారు ఇష్టపడలేదని, అది వారి తప్పు కాబట్టి టెస్టులో టీమిండియా ఓడినట్లు అంగీకరించాలని పట్టుబడుతోంది. ఐసీసీ కూడా ఇదే తీర్పు ఇవ్వాలని కోరుకుంటుంది. -
అదే జరిగితే ఇంగ్లండ్‌తో సిరీస్ సమం అయినట్టే..
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దైన నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఆశ్రయించింది. సందిగ్ధత నెలకొన్న ఈ విషయంలో ఎదో ఒక పరిష్కారం చూపాలని ఐసీసీని కోరింది. మ్యాచ్‌తో పాటు సిరీస్ ఫలితంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కరోనా కేసుల వల్ల మ్యాచ్ రద్దైందని ప్రకటిస్తే.. తమకు 40 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుంటుందని ఇంగ్లీష్ బోర్డు పేర్కొంది. కాగా, ఈ విషయమై పరిష్కారం చూపేందుకు ఐసీసీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ ఐదో టెస్ట్‌ను పూర్తిగా రద్దు(రీషెడ్యూల్ చేయకుండా) చేస్తే.. భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్ట్‌ల సిరీస్‌గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనకు ఈసీబీ ఒప్పుకోకపోవచ్చు. రెండోది.. టీమిండియానే ఈ మ్యాచ్ ఆడటానికి విముఖత చూపినందున ఇంగ్లండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. మ్యాచ్ ఆడటానికి ఇంగ్లండ్ జట్టు సిద్ధంగా ఉన్నా.. కరోనా కారణంగా భారత్ ఒప్పుకోలేదు కాబట్టి ఫలితాన్ని ఇంగ్లండ్‌కు అనుకూలంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే 2-2తో సిరీస్ సమం అవుతుంది. అప్పుడు ఇంగ్లండ్ బోర్డు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్‌కు, ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్‌గా తేలింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది. రీషెడ్యూల్ కోసం రంగంలోకి గంగూలీ.. ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు 40 మిలియన్ పౌండ్ల నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈలోపు ఐసీసీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాదా పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది. చదవండి: కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..! -
ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
మాంచెస్టర్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్
మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసుల కారణంగా టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి(forfeit the match) సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. మాట మార్చిన ఈసీబీ -
'టీమిండియా ఓడిపోయింది'.. వెంటనే మాట మార్చిన ఈసీబీ
మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్ సమయానికి మూడు గంటల ముందు రద్దైంది. మ్యాచ్‌కు ముందు రోజు భారత శిబిరంలో కరోనా కేసు వెలుగుచూడడం కారణంగా టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు సుముఖంగా లేరని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనలో తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకుంటుందని(forfeit the match) ప్రకటించిన ఈసీబీ.. ఆ వెంటనే మాట మార్చి ఆ పదాన్ని తొలగించి మరో ప్రకటన విడుదల చేసింది. కాగా, జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు నిన్న కరోనా నిర్దారణ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేటి మ్యాచ్ బరిలోకి దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయాన్ని ఈసీబీ మరో విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరోనా కేసులు అధికమవుతాయన్న కారణంగా టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లు మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సిరీస్ ఫలితంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ అంశం ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ తెలిపారు. చదవండి: టీమిండియా ఫిజియోకు కరోనా.. ఆఖరి టెస్ట్ అనుమానమే..? -
ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్..
లండన్: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69ను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్ చేశారు. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 'జార్వో 69' పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్, లీడ్స్ టెస్ట్, ఓవల్ టెస్ట్) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్ టెస్ట్ రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. Jarvo is at the crease #engvsindia pic.twitter.com/XlATed4vGg — JJK (@72jjk) August 27, 2021 ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ పోప్ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు. India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
జార్వో... దూసుకొచ్చాడు మళ్లీ!
ఇంగ్లండ్‌కు చెందిన తుంటరి అభిమాని జార్వో మళ్లీ హద్దు మీరాడు. టీమిండియా డ్రెస్ వేసుకొని హల్చల్ చేస్తున్నాడు. ఇది ఒకసారైతే సరదాగా అనిపించినా... పదేపదే మైదానంలోకి దూసుకొస్తుండటం, ఆటగాళ్లను చేరుకోవడం, తాకటం క్రికెటర్ల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. లార్డ్స్, లీడ్స్ వేదికల్లో జార్వో భారత ఆటగాడి వేషంతో మైదానంలోకి దిగాడు. అతని చేష్టలెంతగా ఉన్నాయంటే జట్టు సభ్యుడే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఇక ‘ది ఓవల్’లో అయితే అతని తుంటరితనం పరాకాష్టకు చేరింది. ఈసారి ఏకంగా బౌలింగ్ చేయడానికే వచ్చాడు. భౌతిక దూరం పాటించాల్సిన కరోనా కాలంలో ఇలా బయటి వ్యక్తులు ఆటగాళ్లను తాకడం ఏంటని పలువురు క్రికెటర్లు భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జార్వో చర్యను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. అతనిపై ఫిర్యాదు చేయడంతో సౌత్ లండన్ పోలీసులు జార్వోను అరెస్టు చేసినట్లు సమాచారం. -
ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్దే 'హండ్రెడ్ మెన్స్'
లార్డ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2021 టైటిల్‌ను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకుంది. బర్మింగ్హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్లో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సదరన్ బ్రేవ్ తొలి చాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్.. ఐర్లాండ్ ఆటగాడు.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్( 36 బంతుల్లో 61;6 సిక్సర్లు, 2 ఫోర్లు) సిక్సర్ల వర్షానికి తోడూ.. చివర్లో రాస్ విట్లీ(19 బంతుల్లో 44 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చదవండి: మహిళల ‘హండ్రెడ్’ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్ అనంతరం బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్ హీరో లియామ్ లివింగ్స్టన్(19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి మెరుపులు మెరిపించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. చివర్లో బెంజమిన్ 23, బెన్నీ హౌవెల్ 20 నాటౌట్‌గా నిలిచారు. ఇక సదరన్ బ్రేవ్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్, క్రెగ్ ఓవర్టన్, టైమెల్ మిల్స్, జేక్ లిన్టోట్ తలా ఒక వికెట్ తీశారు. అద్భుత ఇన్నింగ్స్‌తో సదరన్ బ్రేవ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టిర్లింగ్‌కు ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'' వరించగా.. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన లియాయ్ లివింగ్స్టన్ ''ప్లేయర్ ఆఫ్ ది సిరీస్''గా నిలిచాడు. చదవండి: Manan Sharma: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్ -
మహిళల ‘హండ్రెడ్’ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తొలిసారి నిర్వహించిన ‘ది హండ్రెడ్’ టోర్నీ మహిళల టైటిల్‌ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఓవల్ 48 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇన్విన్సిబుల్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (26), వాన్ నికెర్క్ (26), ఫ్రాన్ విల్సన్ (25) రాణించారు. అనంతరం బ్రేవ్ టీమ్ 100 బంతుల్లో 73 పరుగులకే కుప్పకూలింది. 29 పరుగులకే ఆ జట్టు 7 వికెట్లు కోల్పోగా, ఫి మోరిస్ (23) పోరాడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. -
టీమిండియాతో సిరీస్: ఇంగ్లండ్ జట్టు సభ్యులు వీరే!
లండన్: టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆగష్టు 4 నుంచి నాటింగ్‌హాంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఈసీబీ బుధవారం వెల్లడించింది. సుదీర్ఘ విరామం తర్వాత హసీబ్ హమీద్ ఇంగ్లండ్ జట్టుతో చేరనున్నాడు. తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ జట్టు ఇదే: జో రూట్(కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ చావ్లే, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్. -
స్టోక్స్ సారధ్యంలో కొత్త జట్టును ప్రకటించిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ క్యాంపులో ఏడుగురు సభ్యులు కరోనా బారినపడ్డ నేపథ్యంలో పాకిస్తాన్‌తో సిరీస్ నిమిత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించిన ఈసీబీ.. పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా, ముందుగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు సభ్యులకు సోమవారం బ్రిస్టల్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు మేనేజ్మెంట్ సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు మొత్తాం ఐసోలేషన్‌లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. మరోవైపు కొత్తగా ఎంపికైన యువకులకు ఇది సువర్ణావకాశమని, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వారికి సరైన ప్లాట్‌ఫామ్ దొరికిందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, లూయిస్ గ్రెగరి, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డేనియల్ లారెన్స్, సకీబ్ మహమూద్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఒవర్టన్, మాట్ పార్కిన్సన్, డేవిడ్ పెయిన్, ఫిల్ సాల్ట్, జాన్ సింప్సన్, జేమ్స్ విన్స్ -
జాతివివక్ష వ్యాఖ్యలు.. ఇంగ్లీష్ క్రికెటర్‌కు భారీ ఊరట
లండన్: జాతివివక్ష వ్యాఖ్యలు, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు చేసి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్కు భారీ ఊరట లభించింది. తాజాగా ఈ అంశంపై విచారణ పూర్తి చేసిన ఈసీబీ రాబిన్సన్పై మొత్తంగా 8 మ్యాచ్‌ల నిషేధం, 3,200 పౌండ్ల జరిమానా విధించింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన రాబిన్సన్.. మరో ఐదు మ్యాచ్‌లను రెండేళ్ల కాలవ్యవధిలో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో అతను వెంటనే ఇంగ్లండ్ జట్టులో కలిసే అవకాశం లభించనుంది. త్వరలో భారత్‌తో జరుగబోయే ఐదు టెస్ట్ సిరీస్ కోసం అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఈసీబీ అధికరి ఒకరు వెల్లడించారు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో రాబిన్సన్ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2012-13 కాలంలో అతడు చేసిన జాతివివక్ష, విద్వేషపూరిత ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఈసీబీ అతనిపై చర్యలు చేపట్టింది. లార్డ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో రాబిన్సన్ అదిరిపోయే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. కానీ, ఆ మ్యాచ్ పూర్తవ్వగానే ఈసీబీ అతడిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై అతను బహిరంగ క్షమాపణలు కోరినప్పటికీ ఈసీబీ కనికరించకపోవడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. -
జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్‌పై వేటు పడనుందా!
లండన్: జాతి వివక్ష, విద్వేష, లైంగిక వ్యాఖ్యలకు సంబంధించి ట్వీట్లు చేశాడన్న కారణంతో క్రికెటర్ ఓలీ రాబిన్సన్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం అంతర్జాతీ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం తెలియక చేసిన పని రాబిన్సన్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన ఈసీబీ మరో ఇంగ్లండ్ ఆటగాడిని విచారించినట్లు సమాచారం. అయితే ఆ ఆటగాడు ఎవరనేది మాత్రం ఈసీబీ వెల్లడించలేదని ప్రముఖ స్పోర్ట్స్ పత్రిక విజ్డెన్ తెలిపింది. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఆ క్రికెటర్ అండర్ 16 కేటగిరిలో ఉన్నాడని విజ్డెన్ పేర్కొంది. ఇదే అంశంపై ఈసీబీ అధికార ప్రతినిధి స్పందిస్తూ..'' ఓలి రాబిన్సన్పై చర్య అనంతరం జాతి వివక్ష, లైంగిక పరమైన ట్వీట్స్ చేసిన మరో ఆటగాడికి సంబంధించి మాకు సమాచారం అందింది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టి సదరు ఆటగాడిని విచారిస్తున్నాం. నిజానిజాలు తెలియనందున ఇప్పుడే ఏం చెప్పలేం. త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తాం '' అని తెలిపారు. ఇక రాబిన్సన్ 2012-13లో 19 ఏళ్ల వయసులో జాతి వివక్ష, లైంగిక పరమైన ట్వీట్స్ చేసినట్లు తేలడంతో ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. కాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన మొదటి టెస్టులోనే రాబిన్సన్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్ ఆటగాడు డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: తొమ్మిదేళ్ల కిందట ట్వీట్లు.. ఇప్పుడు శిక్ష! -
ఐపీఎల్ కోసం మా షెడ్యూల్ మార్చుకోం!
లండన్: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్–2021ను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుండగా... తమ ఆటగాళ్లను మాత్రం రెండో దశ పోటీలకు అనుమతించేది లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఇరు బోర్డుల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నా... లీగ్ కోసం తమ జాతీయ జట్టు షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయలేమని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ చెప్పారు. సెప్టెంబర్ 18నుంచి ఐపీఎల్ మళ్లీ జరిగే అవకాశం ఉండగా, అదే సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఇంగ్లండ్ తలపడనుంది. ‘ఐపీఎల్ కోసం టెస్టు సిరీస్ తేదీల్లో మార్పులు చేయమని మాకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తీ రాలేదు. భారత్‌తో చివరి టెస్టు ఆడగానే ఆటగాళ్లు బంగ్లాదేశ్ బయల్దేరతారు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్, ఆపై టి20 ప్రపంచ కప్ ఉన్నాయి. మున్ముందు యాషెస్ సిరీస్ కూడా ఉంది కాబట్టి కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మేం విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం. దానర్థం వారికి విరామం ఇచ్చిన సమయంలో ఎక్కడికైనా వెళ్లి క్రికెట్ ఆడుకోమని కాదు’ అని ఐపీఎల్‌నుద్దేశించి గైల్స్ వ్యాఖ్యలు చేశారు. -
టెస్టు సిరీస్ షెడ్యూల్లో మార్పులేదు: ఈసీబీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించేందుకుగాను... ఇంగ్లండ్–భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తమకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ‘బీసీసీఐతో పలు అంశాలపై మేము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లను సర్దుబాటు చేసేందుకు ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని వారు మమ్మల్ని కోరలేదు. ఇప్పటికైతే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే టెస్టు సిరీస్ జరుగుతుంది’ అని ఈసీబీ వర్గాలు తెలిపాయి. భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ఆగస్టు 4న మొదలవుతుంది. -
500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం..
లండన్: 146 టెస్టుల్లో 517 వికెట్లు పడగొట్టినా ఇంగ్లండ్ అండ్ వేల్స్(ఈసీబీ) మాజీ సెలెక్టర్ ఎడ్ స్మిత్ మాత్రం తనను ఓ ఆటగాడిగా గుర్తించలేదని ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వాపోయాడు. ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరుగనున్న వరుస టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సెలెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో తన పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, అతరువాత దానికి కారణాలు తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించాడు. టెస్టు ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడల్లా(రొటేషన్ పద్ధతి కారణంగా) రాణిస్తున్న నేను సహజంగానే ఉత్తమ జట్టులో ఉంటానని ఆశించానని, కానీ సెలెక్టర్ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో తన పేరు లేకపోవడం బాధించిదని ఎడ్ స్మిత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో రొటేషన్ పద్ధతిని చూపిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని ఆరోపించాడు. త్వరలో జరుగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేసవిలో ఇంగ్లండ్.. న్యూజిలాండ్, భారత్ జట్లతో మొత్తం ఏడు టెస్టులు ఆడనుంది. జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనుండగా.. జూన్ 10న బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత భారత్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది. కాగా, ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌కే పరిమితమైన 34 ఏళ్ల బ్రాడ్.. 146 టెస్టులు, 121 వన్డేలు, 56 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో అతను సాధించిన మొత్తం వికెట్లలో 10 వికెట్ల మార్క్‌ను 3 సార్లు, ఐదు వికెట్ల మైలురాయిని 18 సార్లు అందుకున్నాడు. అతను టెస్టుల్లో బ్యాట్‌తో కూడా రాణించాడు. అతని కెరీర్లో సెంచరీతో పాటు13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్‌కు చివాట్లు -
సకుటుంబ సమేతంగా...
ముంబై: సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు జూన్ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు ‘హార్డ్ క్వారంటైన్’లో ఉంటారు. ఇంగ్లండ్ చేరిన తర్వాత పది రోజులు తమను ‘సాఫ్ట్ క్వారంటైన్’కు అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ... దీనిపై ఇంకా చర్చలు కొనసాగిస్తోంది. హార్డ్ క్వారంటైన్లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు. సాఫ్ట్ క్వారంటైన్లో ఆటగాళ్లంతా కలిసి సాధన చేసుకునేందుకు (ఆస్ట్రేలియా సిరీస్ తరహాలో) అవకాశం ఉంటుంది. ‘భారత్‌లోనే మనవాళ్లు హార్డ్ క్వారంటైన్లో ఉండబోతున్నారు. రెండో, నాలుగో, ఏడో రోజుల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలితేనే వారిని విమానం ఎక్కనిస్తాం. ఇలా అయితే బబుల్లోంచి మరో బబుల్‌లోకి ప్రవేశిస్తాం కాబట్టి క్వారంటైన్ రోజులను తగ్గించే విషయంపై కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలాగూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదిక అయిన ఏజియన్ బౌల్లో భాగంగానే హోటల్ హిల్టన్ ఉంది కాబట్టి సమస్య లేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. క్వారంటైన్ ముగిసిన తర్వాతే జూన్ 13 నుంచి క్రికెటర్లు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు సుదీర్ఘ పర్యటన కాబట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. అయితే జూన్ 18 నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందునుంచే ఆటగాళ్ల భార్యాపిల్లలను అనుమతిస్తారా లేక ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు మాత్రమే వారిని అనుమతిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ఈసీబీతో వీరిద్దరు చర్చించే అవకాశం కూడా ఉంది. శ్రీలంకలో అవకాశం ఉందా? ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు గత ఏడాది కూడా తీవ్రంగా ప్రయత్నించి శ్రీలంక క్రికెట్ బోర్డు విఫలమైంది. ఈసారైనా మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని ఆసక్తిగా ఉంది. అధికారికంగా బీసీసీఐకి ఇంకా ఎలాంటి విజ్ఞప్తి చేయకపోయినా... బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ అర్జున డిసిల్వా మాత్రం తాము సెప్టెంబర్‌లో నిర్వహించగలమని నమ్మకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో లీగ్ టోర్నీ నిర్వహణకు అవసరమైన ఫ్లడ్‌లైటింగ్‌తో నాలుగు మైదానాలు (ఖెట్టరమా, పల్లెకెలె, సూర్యవేవా, దంబుల్లా) అందుబాటులో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇటీవలే లంకలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూలాంశం. నెలరోజుల క్రితం అక్కడ రోజుకు 300 కేసులు రాగా... ఇప్పుడు రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇంగ్లండ్‌లో నిర్వహించండి: పీటర్సన్ ఐపీఎల్–2021లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడంకంటే ఇంగ్లండ్ సరైన వేదిక అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ‘సెప్టెంబర్ చివర్లో ఐపీఎల్ నిర్వహించేందుకు యూఏఈ సరైన వేదిక అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లండ్‌లో వాతావరణం చాలా బాగుంటుంది. మాంచెస్టర్, లీడ్స్, బర్మింగ్‌హామ్, లార్డ్స్, ఓవల్ మైదానాలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులను కూడా అనుమతిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్ ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికాలలో జరిగింది కాబట్టి ఈసారి ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుంది. ఒక్కసారి భారత్, ఇంగ్లండ్ సిరీస్ ముగిసిందంటే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అక్కడే అందుబాటులో ఉంటారు కూడా’ అని పీటర్సన్ విశ్లేషించాడు. -
మీరు చేయలేనిది మేం చేసి చూపించాం: పీటర్సన్
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈసీబీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పీటర్సన్ మెరుపులతో ఇంగ్లండ్ లెజెండ్స్ విజయాన్ని అందుకుంది. పీటర్సన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ఇంగ్లండ్ లెజెండ్స్ టీమ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈసీబీని ట్యాగ్ చేశాడు. ''ఎట్టకేలకు ఇంగ్లండ్ జ్టటు భారత్‌ను తన సొంతగడ్డపై ఓడించింది.. ఎంత కూల్‌గా సాగిపోయిందో గేమ్ చెప్పండి ఇంగ్లండ్ సెలెక్టర్స్ .. ఇంకా మేము బరిలోనే ఉన్నాం'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మీరు చేయలేకపోయారు.. మేం చూసి చూపించాం అన్నట్లుగా భారత్‌ను సొంతగడ్డపై ఓడించామని పీటర్సన్ మాటలు బట్టి అర్థమవుతుంది. పీటర్సన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియాను సొంతగడ్డపై ఇంగ్లండ్ ఓడించకపోడంతో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇంగ్లండ్, భారత్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం(మార్చి 12న) జరగనుంది. చదవండి: యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్.. గుణతిలక ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ View this post on Instagram A post shared by Kevin Pietersen 🦏 (@kp24) -
రాబర్ట్.. నీ అభిమానానికి థ్యాంక్స్ : రూట్
గాలే: ఇంగ్లండ్- శ్రీలంకల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సోమవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అంటే పడిచచ్చే ఒక అభిమానికి ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఈసీబీ ఇంగ్లండ్ క్రికెట్ డై హార్డ్ ఫ్యాన్‌కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. చదవండి: వీరాభిమాని నం.1 వివరాలు.. రాబర్ట్ లుయీస్ అనే వ్యక్తి క్రికెట్ అంటే అమితమై ప్రేమ.. అందునా ఇంగ్లండ్ జట్టు అంటే విపరీతమైన ప్రేమను చూపించేవాడు. కరోనాకు ముందు ఇంగ్లండ్ జట్టు ఎక్కడా పర్యటించినా రాబర్ట్ అక్కడికి వెళ్లి లైవ్‌లో మ్యాచ్‌లను ఆస్వాధించేవాడు.. అంతేగాక వీలు చిక్కినప్పుడల్లా క్రికెటర్లను కలిసేవాడు. కానీ కరోనా సంక్షోభంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. లాక్డౌన్ తర్వాత క్రికెట్ ప్రారంభమైనా.. మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఇంగ్లండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలుసుకున్న రాబర్ట్ లుయీస్ 10 నెలల ముందే శ్రీలంక చేరుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్- శ్రీలంక టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. అయితే మైదానంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో అతన్ని అనుమతించలేదు. ఎలాగైనా మ్యాచ్‌ను చూడాలని భావించిన రాబర్డ్ ఈసీబీ అధికారులతో మాట్లాడి ఒప్పించాడు. గాలే మైదానానికి ఆనుకొని ఉన్న ఒక కోటపై కూర్చొని టెస్టు మ్యాచ్‌ను చూశాడు. కాగా తొలి టెస్టు మ్యాచ్‌లో లంకపై విజయం సాధించిన అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఇంగ్లండ్ జట్టును కోటపై నుంచే చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇది గమనించిన ఈసీబీ అధికారులు రాబర్ట్‌కు ఒక సువర్ణవకాశం కల్పించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్వయంగా ఫోన్ చేసి రాబర్ట్‌తో మాట్లాడాడు. 'హాయ్ రాబర్ట్.. 10 నెలల విరామం తర్వాత నిన్ను ఈ కోటపై చూడడం ఆనందంగా ఉంది. ఇంతకాలం మేం ఎక్కడ పర్యటించినా మా వెంటే ఉండి ప్రోత్సహించావు. మీ అభిమానానికి థ్యాంక్స్ రాబర్ట్. ఇంగ్లండ్ జట్టుతో ఇంతకాలం నువ్వు సాగించిన జర్నీ మాకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలోనూ ఇంత కష్టపడి మా ఆటను చూడడానికి వచ్చిన నీకు కృతజ్ఞతలు తప్ప ఇంకేమి ఇవ్వలేము. బయో బబూల్ వాతావరణం నేపథ్యంలో నిన్ను మా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం లేదు. అందుకే ఈరోజును రాండీ కాడిక్ డ్రింక్‌తో ఎంజాయ్ చేయ్.. మిస్ యూ లాట్.. రాబర్డ్ లుయీస్ అంటూ రూట్ ఫోన్‌కాల్ ముగించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది.చదవండి: 'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 421 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో లంక జట్టు 359 పరుగులకు ఆలౌట్ కావడంతో 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. We massively missed @TheBarmyArmy here and thank you for all your support back home. But a special thanks to @elitebandwagon up on the Fort! Incredible effort and the whole team really appreciated it 👏 https://t.co/5XAVTVGIWn — Joe Root (@root66) January 18, 2021 -
మా ఆటగాళ్లకు వైరస్ లేదు: ఈసీబీ
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు లేవని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ వీరితో పాటు బస చేసిన హోటల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఈ గందరగోళంలోనే మూడు వన్డేల సిరీస్ పూర్తిగా రద్దయింది. అయితే కరోనా అనుమానితుల్ని మిగతా ఆటగాళ్లకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈసీబీ వైద్యబృందం వారి నమూనాల్ని మరోసారి స్వతంత్ర వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. అయితే వైరస్ జాడ లేదని తెలియడంతో ఈసీబీ, దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు ఐసోలేషన్ నుంచి విడుదలయ్యారు. జట్టుతో కలిసి గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. -
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత్
లండన్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆగస్టు–సెప్టెంబర్ 2021లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ తేదీలను వేదికలతో సహా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 ఆగస్టులో ఈ గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన కోహ్లి సేన మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుంది. దీంతో పాటు స్వదేశంలో శ్రీలంకతో జరిగే 3 వన్డేలు... పాకిస్తాన్‌తో జరిగే 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ఈసీబీ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఏడాది భారీగా నష్టపోయిన ఇంగ్లండ్ బోర్డు వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. అన్నింటికంటే ఎక్కువగా భారత్–ఇంగ్లండ్ మధ్య పోరునే ‘సెంటర్ పీస్ ఈవెంట్’గా భావిస్తూ ఎక్కువ ఆదాయాన్ని ఈసీబీ ఆశిస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు (ఆగస్టు 4–8), లార్డ్స్‌లో రెండో టెస్టు (ఆగస్టు 12–16), లీడ్స్‌లో మూడో టెస్టు (ఆగస్టు 25–29), ఓవల్‌లో నాలుగో టెస్టు (సెప్టెంబర్ 2–6), మాంచెస్టర్‌లో ఐదో టెస్టు (సెప్టెంబర్ 10–14) జరుగుతాయి. పాకిస్తాన్‌లోనూ...: 16 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ టీమ్ పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 14, 15 తేదీల్లో పాక్‌తో (కరాచీ వేదిక) రెండు టి20ల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ సిరీస్ అనంతరం రెండు జట్లు కలిసి భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు బయల్దేరతాయి. 2005లో చివరిసారి ఇంగ్లండ్ జట్టు 3 టెస్టులు, 5 వన్డేల కోసం పాకిస్తాన్లో పర్యటించింది. -
జీతాల కోతకు ఇంగ్లండ్ క్రికెటర్లు ఓకే
లండన్: కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు, సిరీస్‌లు జరగక... పర్యటనలు లేక చాలా క్రికెట్ బోర్డులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. దీంతో పలు బోర్డులు జీతాల కోత విధిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదనకు ఆ దేశ క్రికెటర్లు సమ్మతించారు. కోవిడ్ వల్ల ఇప్పటికే ఈసీబీ 100 మిలియన్ యూరోల (రూ. 874 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టం వచ్చే ఏడాదికి రెట్టింపు (రూ. 1,748 కోట్లు) కానుందని ఈసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ అనివార్యమని భావించిన బోర్డు ఇప్పటికే 62 మంది ఉద్యోగులకు బైబై చెప్పింది. అలాగే ఆటగాళ్ల కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజుల కోతకు సిద్ధపడింది. ఈ మేరకు ఆటగాళ్ల సంఘం ముందు ప్రతిపాదన పెట్టగా తాజాగా ఆటగాళ్లు 15 శాతం కోతకు అంగీకరించారు. దీంతో ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తమ టీమ్ ఇంగ్లండ్ ప్లేయర్ల పార్ట్నర్షిప్ (టీఈపీపీ–ఇది ప్లేయర్ల అసోసియేషన్)కు అభినందనలు తెలిపారు. ‘ఆటగాళ్లతో బోర్డు బంధం ఎంతో ధృడమైనది. మా ఆటగాళ్ల సేవలకు గుర్తింపు ఇస్తాం. ఈ కష్టకాలంలో ఆటగాళ్లు కనబరిచిన పరిణతికి మా అభినందనలు, టెస్టు, వన్డే కెప్టెన్లు రూట్, మోర్గాన్, ఆటగాళ్లు అందరూ సవాళ్లను స్వీకరిస్తూనే బాధ్యతల్ని పంచుకుంటున్నారు’ అని గైల్స్ కొనియాడారు. టీఈపీపీ చైర్మన్ రిచర్డ్ బెవాన్ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో ఆటగాళ్లంతా బోర్డుకు అండగా నిలవాలనుకోవడం గొప్ప విషయమని అన్నారు. -
600 బుల్లెట్...
టెస్టు క్రికెట్‌కు ముందు వన్డేలతోనే అండర్సన్ అంతర్జాతీయ అరంగేట్రం జరిగింది. తొలి ఆరేళ్లు అతని కెరీర్ రెండు పార్శా్వలుగా సాగింది. ఒక్కసారి తనదైన జోరు మొదలైతే అద్భుతమైన బౌలర్‌గా కొన్ని సార్లు కనిపిస్తే... గతి తప్పాడంటే అతనికంటే చెత్త బౌలర్ మరెవరూ లేరన్నంతగా అనిపించేది. ప్రపంచంలో ప్రతీ బ్యాట్స్‌మెన్ అండర్సన్ బౌలింగ్‌ను అంతగా చితక్కొట్టారు. దాంతో జట్టులో చోటు కోల్పోవడం, వీటికి తోడు అదనంగా గాయాలు కలగలిసి అతడిని ఇబ్బందుల్లో పడేశాయి. ఎట్టకేలకు కొందరు సీనియర్ బౌలర్ల వరుస వైఫల్యాల తర్వాత 2007–08 న్యూజిలాండ్ పర్యటనతో పునరాగమనం చేసిన అండర్సన్ ఆ తర్వాత తన స్థాయిని పెంచుకుంటూ కీలకంగా మారాడు. కొద్ది రోజులకే సొంతగడ్డపై అదే జట్టుపై 7 వికెట్లు తీసి సత్తా చాటిన తర్వాత జిమ్మీకి తిరుగు లేకుండా పోయింది. ► పేస్ దళాన్ని నడిపిస్తూ... 2010నుంచి అండర్సన్ బౌలింగ్ మరింత పదునెక్కింది. జట్టు పేస్ బృందానికి నాయకుడిగా ఎదిగిన అతను దానికి తగినట్లుగా అద్భుత ప్రదర్శనలతో జట్టును గెలిపించాడు. సాంప్రదాయ స్వింగ్, సీమ్ కలగలిపి అతను అద్భుతాలు చేశాడు. ఇక పాతబడిన బంతి రివర్స్ స్వింగ్‌లో అతను చెప్పినట్లుగా ఆడింది. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, వరుసగా మెయిడిన్ ఓవర్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి వికెట్లు రాబట్టడం అతను తన శైలిగా మార్చుకున్నాడు. ఎలాంటి లోపాలు కనిపించకుండా సంపూర్ణ పేస్ బౌలర్ అనిపించుకున్న అండర్సన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దృష్టిలో ప్రమాదకారిగా మారాడు. 2011లో ఇంగ్లండ్ గడ్డపై 0–4తో చిత్తుగా ఓడిన తర్వాత ధోని మాట్లాడుతూ... ‘మా రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అండర్సన్’ అని వ్యాఖ్యానించాడు. 2014 సిరీస్‌లో కూడా అతను విరాట్ కోహ్లిని ఎంతగా ఇబ్బంది పెట్టాడో అభిమానులెవరూ మరచిపోలేరు. ► తిరుగు లేని ప్రదర్శనలతో... టెస్టు క్రికెట్లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మెల్లగా దూరం కావడం ఇంగ్లండ్ క్రికెట్లో అతి సాధారణం. ఇదే తరహాలో పూర్తి స్థాయిలో టెస్టులపై దృష్టి పెట్టేందుకు అండర్సన్ 2015లో వన్డేలనుంచి తప్పుకున్నాడు. ఆ సమయానికే పలు టెస్టు రికార్డులు అతని ఖాతాలో వచ్చి చేరాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ఇయాన్ బోథమ్ రికార్డును అధిగమించిన అనంతరం 500 వికెట్లు మైలురాయిని కూడా దాటాడు. అప్పటి వరకు పేస్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గ్లెన్ మెక్‌గ్రాత్ వికెట్ల సంఖ్యను అందుకున్న క్షణం కూడా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. పాతబడిన కొద్దీ రుచి పెరిగే వైన్ తరహాలో అండర్సన్ వయసు పెరిగిన కొద్దీ మరింత రాటుదేలాడు. అతని అద్భుతమైన గణాంకాలు అదే విషయం చెబుతాయి. అతని కెరీర్లో సగంకంటే ఎక్కువ (332) వికెట్లు 30 ఏళ్ల వయసు దాటిన తర్వాతే వచ్చాయి. 2014నుంచి ఆడిన 65 టెస్టుల్లో జిమ్మీ కేవలం 21.71 సగటుతో ఏకంగా 260 వికెట్లు పడగొట్టాడు. ఇది ఏ ప్రమాణాల ప్రకారం చూసినా అసాధారణ ప్రదర్శనే. ఇదే సమయంలో కనీసం 100 వికెట్లు తీసిన వారి జాబితా చూస్తే అతనే అగ్రస్థానంలో ఉండటం ఈతరం కుర్ర బౌలర్లతో పోలిస్తే ఎంత మెరుగో అర్థమవుతుంది. ‘వచ్చే ఏడాది చివర్లో జరిగే యాషెస్ సిరీస్‌లో నేను ఆడగలనని నమ్ముతున్నాను. నా ఆట బాగుంది. ఫిట్‌నెస్‌పై కూడా దృష్టిపెట్టాను కాబట్టి ఇది అసాధ్యమని నేను అనుకోవడం లేదు. ఇదే విషయాన్ని రూట్‌తో కూడా మాట్లాడాను. నాలో సత్తా ఉన్నంత వరకు ఆడతా. ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదు. కొందరు 700 వికెట్ల గురించి అడుగుతున్నారు. ఎందుకు సాధించలేను. అదీ చేద్దాం. అయితే యాషెస్‌కు ముందు చాలా సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో నేను పాల్గొనడం లేదా విశ్రాంతినివ్వడాన్ని ఈసీబీ నిర్దేశిస్తుంది. నా కెరీర్‌ను తిరిగి చూసుకుంటే ఇంత దూరం ప్రయాణిస్తానని అస్సలు ఊహించలేదు. తాజా ఘనత పట్ల నేను గర్వపడుతున్నాను’ –జేమ్స్ అండర్సన్ అద్వితీయం అండర్సన్ కెరీర్ ‘రివర్స్ రివర్స్ స్వింగ్’ అనే మాటను ఎప్పుడైనా విన్నారా... ఆ బౌలింగ్ ఎలా ఉంటుందో ఒక్క మాటల్లో చెప్పాలంటే జిమ్మీ అండర్సన్ బౌలింగ్ చేసినట్లుగా ఉంటుంది. సాధారణ ఇన్‌స్వింగర్ తరహాలోనే మణికట్టును ఉంచుతూ రివర్స్ అవుట్ స్వింగర్‌ను సంధించడమే ఇది... బ్యాట్స్‌మన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే ఈ శైలి ఒక్క అండర్సన్‌కు మాత్రమే సాధ్యమైంది. ఈ మాట చెప్పింది ఎవరో అల్లాటప్పా విశ్లేషకుడు కాదు. సాక్షాత్తూ సచిన్ అన్నాడంటే దాని విలువ, అండర్సన్‌పై ప్రశంస ఏమిటో అర్థమవుతుంది. కెరీర్లో అందరికంటే ఎక్కువగా 9 సార్లు మాస్టర్‌ను అవుట్ చేశాడు. ఇప్పుడు 600 టెస్టు వికెట్లు సాధించిన తొలి పేస్ బౌలర్‌గా ఘనత సృష్టించాడు. – సాక్షి క్రీడా విభాగం -
రెడ్ ఫర్ రూత్...
ఓల్డ్‌ట్రాఫోర్డ్ టెస్టును ఇంగ్లండ్ బోర్డు ‘రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ టెస్ట్’గా వ్యవహరిస్తోంది. అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ (పొగ తాగనివారిలో వస్తుంది)తో రెండేళ్ల క్రితం మరణించిన మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం నిధుల సేకరణ దీని ఉద్దేశం. ఈ మ్యాచ్‌కు ముందు ఎరుపు రంగు జెర్సీలు, క్యాప్‌లు ధరించి ‘రెడ్ ఫర్ రూత్’ అంటూ తమ సంఘీభావాన్ని ప్రకటించిన ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు ఆ తర్వాత వాటిపై తమ సంతకాలు చేసి వేలం కోసం స్ట్రాస్ కుమారులకు తిరిగి అందజేశారు. మ్యాచ్ రెండో రోజు శనివారం స్టంప్స్, బౌండరీ బోర్డులు సహా మైదానమంతా ఎరుపు రంగును ప్రదర్శిస్తారు. ‘రెడ్ ఫర్ రూత్’ అంటూ విరాళాల సేకరించడం ఇది రెండోసారి. 2019లో యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన లార్డ్స్ టెస్టు ద్వారా సుమారు 5.5 లక్షల పౌండ్లు వచ్చాయి. క్యాన్సర్‌తో మరణించిన వారి పిల్లల సంక్షేమం కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా మైదానంలో ప్రేక్షకులు లేకపోవడం వెలితిగా అనిపించినా... ఆన్లైన్ ద్వారా పెద్ద మొత్తంలో టీ షర్ట్లు, క్యాప్‌లు కొని అభిమానులు అండగా నిలిచారు. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టుల్లో 7,037 పరుగులు చేసిన స్ట్రాస్ 50 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. -
అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి
-
అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్ సహా అన్ని రకాల ఆటలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమైన ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందులో క్రికెట్‌కు కూడా మినహాయింపు లేదనే చెప్పొచ్చు. ఇంతకుముందులా బ్యాట్స్‌మన్ ఔట్ ఐతే ఆటగాళ్లంతా ఒకదగ్గర చేరి అభినందించుకునేది కూడా చూడకపోవచ్చు. తాజాగా అలాంటి సన్నివేశాలే ఇంగ్లండ్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్నాయి. ('ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు') కరోనా విరామం తర్వాత జూలై 8 నుంచి ఇంగ్లండ్- విండీస్‌ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. సౌతాంప్టన్ వేదికగా జూలై 8న ఇరు జట్ల మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు టీమ్ బట్లర్, టీమ్ స్టోక్స్‌గా విడిపోయి అగాస్ బౌల్ మైదానంలో మూడు రోజలు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. డే 1 ఆటలో భాగంగా టీమ్ స్టోక్స్ తరపున ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ హైలట్‌గా నిలిచాడు. మొదటిరోజు ఆటలో భాగంగా ఎక్కువ ఓవర్లు వేసిన అండర్సన్ ఓవర్‌కు 3 పరుగులు మాత్రమే ఇస్తూ రెండు కీలక వికెట్లు కూడా తీశాడు. అండర్సన్ మ్యాచ్ మధ్యలోనూ తన చర్యలతో ఆకట్టుకున్నాడు. అండర్సన్ తన బౌలింగ్‌లో వికెట్ పడినప్పుడు సహచర ఆటగాళ్ల వద్దకు వెళ్లి ఎలాంటి హగ్స్, చేతులు కలపడం వంటివి లేకుండా కేవలం భుజాలతోనే అభినందించుకున్నారు. అంతేగాక ఆటగాళ్లంతా భౌతిక దూరం పాటించడం విశేషం. మ్యాచ్ మధ్యలో అప్పుడప్పుడు మైదానం నలువైపులా ఏర్పాటు చేసిన సానిటైజర్స్‌ను ఉపయోగిస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వీడియోతో పాటు ఫోటలోను రిలీజ్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ విధించిన గైడ్‌లైన్స్ పాటిస్తూనే ప్రాక్టీస్ మ్యాచ్‌ను కొనసాగించినట్లు ట్విటర్లో ఈసీబీ తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ బట్లర్ జట్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 287 పరుగులు చేసింది. కాగా విండీస్‌తో ఈ నెల 8న మొదలయ్యే మొదటి టెస్ట్‌కు రెగుల్యర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇంగ్లండ్ బోర్డు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీని అప్పగించింది. జోస్ బట్లర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రూట్ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్ నేడు నేడు ట్రైనింగ్ క్యాంప్ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ తమలో తాము ఆడే వామప్‌తో పాటు ఫస్ట్ టెస్ట్‌కు దూరం కానున్నాడు. సెకండ్ టెస్ట్‌కు తిరిగి జట్టుతో కలుస్తాడు. -
50 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు
ఇంగ్లండ్‌కు చెందిన 82 ఏళ్ల మాజీ క్రికెటర్ అలాన్ జోన్స్ కోరికను ఈసీబీ 50 ఏళ్ల తర్వాత తీర్చింది. 1970లో జోన్స్ తన కెరీర్లో ఏకైక టెస్టును ఇంగ్లండ్ తరఫున రెస్టాఫ్ ది వరల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఐసీసీ ఆ మ్యాచ్‌కు టెస్టు హోదాను తీసేసింది. దాంతో ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్‌ను అనిపించుకోలేకపోయాననే బాధ అతడిని వెంటాడింది. ఆ మ్యాచ్ జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా జోన్స్‌ను టెస్టు ఆటగాడిగా గుర్తిస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వరుస ప్రకారం అతనికి ‘696’ నంబర్ క్యాప్‌ను అందించడంతో జోన్స్ సంబరపడిపోయాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చక్కటి రికార్డు ఉన్న జోన్స్ 645 మ్యాచ్‌లలో 56 సెంచరీలు సహా 36,049 పరుగులు చేశాడు. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
లండన్ : కరోనా కారణంగా క్రికెట్ మిస్సవుతామనుకుంటున్న అభిమానులకు తీపివార్త. త్వరలోనే మైదానంలో క్రికెట్ సందడి మొదలు కానుంది. క్రికెట్ పునరుద్దరణ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. జులైలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో జూన్‌లోనే జరగాల్సినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడటంతో క్రికెట్ పునరుద్దరణకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా జీవ రక్షణ వాతావరణంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జూలైలో సిరీస్‌లను నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లకు పాకిస్తాన్ ఇప్పటికే ఆమోదముద్ర వేయగా తాజాగా వెస్టిండీస్ సైతం అంగీకారం తెలిపింది. (రోహిత్ విజయ రహస్యమదే: లక్ష్మణ్) ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించిన వెస్టిండీస్ బోర్డు సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి ఆటగాళ్లను, సిబ్బందిని రప్పించడం, వారికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక/ప్రయివేట్ విమానాలను ఏర్పాటు చేయడం వంటి తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. అనంతరం ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఈసీబీ అనేక చర్యలు చేపడుతుందనే విశ్వాసాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసింది. ఇక వెస్టిండీస్‌తో మూడు టెస్టుల ముగిసిన వెంటనే పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ మరో సిరీస్ ఆడనుంది. దీంతో క్రికెట్ పునరుద్దరణకు మార్గం సుగమమైందని, ఈ సిరీస్‌లు విజవంతంగా జరిగితే మరికొన్ని దేశాలు ఆడేందుకు ముందుకు వస్తాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (వాటే ప్లాన్ చైనా: భజ్జీ) -
జీవరక్షణ వలయంలో ఆడటం కష్టమే: ద్రవిడ్
న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవ రక్షణకు యోగ్యమైన వాతావరణంలో క్రికెట్ పునరుద్ధరణ కష్టమని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇలా ఆడించాలనుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విధానం ఆచరణలో సాధ్యం కాదన్నాడు. జీవ రక్షణ వాతావరణంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జూలైలో సిరీస్‌లను నిర్వహిస్తామని ఇటీవల ఈసీబీ ప్రకటించింది. దీనిపై స్పందించిన ద్రవిడ్ ఇది సాధ్యం కాదన్నాడు. ‘నాకైతే ఈసీబీ చెప్పింది మిథ్యగా అనిపిస్తోంది. ఎందుకంటే మన క్రికెట్ క్యాలెండర్ ప్రకారం నిత్యం ప్రయాణాలు చేయాలి. చాలా మంది ఇందులో పాల్గొనాల్సి వస్తుంది. వైరస్ పరీక్షలు, క్వారంటైన్, వలయాన్ని ఏర్పాటు చేశాక కూడా టెస్టు రెండో రోజు ఎవరైనా కరోనా బారిన పడితే ఏం చేస్తారు? ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అందర్నీ క్వారంటైన్ చేయాల్సిందేగా. అప్పుడు మ్యాచ్ రద్దేగా! ఇలా కాకుండా ఆటగాడికి కరోనా సోకితే ఎలా ముందడుగు వేయాలని ప్రభుత్వ వర్గాలతో కలిసి పనిచేయాలి’ అని వివరించాడు. -
డీఎల్ఎస్ సూత్రధారి లూయిస్ ఇక లేరు!
లండన్: టోనీ లూయిస్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ క్రికెట్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి అంటే తెలియని వారుండరు. క్రికెట్‌కు బాగా అక్కరకొచ్చే ‘డక్‌వర్త్ లూయిస్ పద్ధతి’ (డీఎల్ఎస్) సూత్రధారుల్లో టోనీ ఒకరు. మ్యాచ్ ప్రతికూల పరిస్థితుల్లో ఆగిపోతే ఈ డక్‌వర్త్ లూయిస్ పద్ధతినే అనుసరించి విజేతను తేలుస్తారు. వర్షంతో ఆగి... సాగే మ్యాచ్‌లకు విజేతను తేల్చే పద్ధతిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన ఇప్పుడు లూయిస్ కన్నుమూశారు. 78 ఏళ్ల టోనీ లూయిస్ అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఓ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్ అయిన టోనీ లూయిస్, మరో గణాంక నిపుణుడు ఫ్రాంక్ డక్‌వర్త్‌తో కలిసి ఓ లెక్క తెచ్చారు. ఓవర్లు, పరుగులు, వికెట్లు, రన్‌రేట్, తాజా పరిస్థితి అన్నింటిని లెక్కలోకి తీసుకొని ఓ సారుప్య నిష్పత్తితో గణాంకాలను ఆవిష్కరించారు. ఇది వర్షంతో మధ్యలోనే ఆగిపోయిన, ఆగి సాగిన ఎన్నో మ్యాచ్‌లకు ఫలితాన్నిచ్చింది. లూయిస్ సాగించిన శోధనలకు, సాధించిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఎంబీఈ’ (మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్) పురస్కారంతో సత్కరించింది. డీఎల్ఎస్ రాకముందు అర్ధంతరంగా ఆగే మ్యాచ్‌ల కోసం ఓ మూస పద్ధతిని అవలంభించేవారు. అప్పటి దాకా ఆడిన ఓవర్లలో అత్యధిక సగటు పరుగుల లెక్కతో విజేతను తేల్చడమో... లక్ష్యాన్ని నిర్దేశించడమో జరిగేది. 1992లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన అప్పటి విధానం పెను విమర్శలకు దారితీసింది. దీంతో మెరుగైన కొత్త పద్ధతి కోసం ఐసీసీ అన్వేషించగా... డక్‌వర్త్, లూయిస్ ఇద్దరు కలిసి రూపొందించిన పద్ధతి ఐసీసీని మెప్పించింది. దీంతో వారిద్దరి పేర్లతోనే డీఎల్ సిస్టమ్‌గా 1997 జనవరి 1నుంచి అమలు చేశారు. నిజానికి ఇదేమీ తేలిగ్గా అర్థమవదు. అయితే పాత పద్ధతి కంటే మేలైనది కావడంతో ఐసీసీకి డీఎల్ఎస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనపడలేదు. తదనంతర కాలంలో ఈ పద్ధతికి ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్ మెరుగులు దిద్దడంతో అతని పేరు కూడా కలిపి 2014నుంచి డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (డీఎల్ఎస్)గా వ్యవహరిస్తున్నారు. -
స్మార్ట్ వాచ్‌లపై నిషేధం
లండన్: తమ దేశ క్రికెట్లో ఏమాత్రం అవినీతికి తావులేకుండా ఉండేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అవినీతి నిరోధక నిబంధనలను మరింత కఠినం చేస్తూ మరింత పారదర్శకత క్రికెట్‌ను అభిమానులకు అందించేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా దేశవాళీ క్రికెట్లో స్మార్ట్ వాచ్‌లను నిషేధించింది. ఇక నుంచి దేశవాళీ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో స్మార్ట్ వాచ్‌లు వాడకూడదని ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లు ఉపయోగించడం వలన సమాచార మార్పిడి జరిగే అవకాశం ఉండటంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈసీబీ పరిధిలో జరిగే ప్రతి ప్రత్యక్ష ప్రసారం జరిగే మ్యాచ్‌ల్లో ఈ నిషేధం ఉంటున్నట్లు తెలిపింది. అయితే లైవ్ టెలీకాస్ట్ కానీ మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్ రూమ్, డగౌట్లలో ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లు ధరించవచ్చని పేర్కొంది. కౌంటీ చాంపియన్ షిప్-2019లో భాగంగా మైదానంలో ఉండగానే స్మార్ట్ వాచ్‌తో తాను ఇంగ్లండ్‌కు ఎంపికైన విషయం తెలిసిందని లాంక్షైర్ స్పిన్నర్ పార్కిన్సన్ పేర్కొన్నాడు. దీంతో అన్ని ప్రధాన మ్యాచ్‌ల్లో స్మార్ట్ వాచ్‌లను ఈసీబీ నిషేధించగా.. తాజాగా అన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు పొడిగించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్మార్ట్ వాచ్‌ల నిషేధం ఉన్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్‌లోనూ క్రికెట్ టోర్నీలు రద్దు
లండన్: కరోనా ప్రభావం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. మే 28 వరకు ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్‌ను తాము నిర్వహించడం లేదని ఈసీబీ ప్రకటించింది. తాజా సీజన్‌ను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఈసీబీ వెల్లడించింది. శ్రీలంకలో కూడా: శ్రీలంకలోనూ అన్ని రకాల దేశవాళీ క్రికెట్‌ను రద్దు చేస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. గత మంగళవారం శ్రీలంకలో ప్రతిష్టాత్మక వార్షిక స్కూల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీనికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరిలో ఒకరికి కరోనా ఉన్నట్లు బయటపడింది. దాంతో అందరిలో ఆందోళన నెలకొంది. నిజానికి ఈ మ్యాచ్‌ను ఆపేయాలని స్వయంగా దేశాధ్యక్షుడు గొటబాయ ఆదేశించినా నిర్వాహకులు దీనిని పట్టించుకోలేదు. తాజా ఘటన కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ పూర్తిగా రద్దయింది. -
నేడు ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు
వన్డే ప్రపంచ కప్ ఆరంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఐసీసీ–ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమయ్యాయి. టోర్నీలో రేపు తొలి మ్యాచ్ జరగనుండగా, నేడు (బుధవారం) వేడుకలు జరుగుతాయి. లండన్‌లోని ప్రఖ్యాత ‘మాల్’ రోడ్ దీనికి వేదిక కానుంది. ఈ రోడ్‌కు అతి సమీపంలోనే ఉన్న చారిత్రక బకింగ్‌హామ్ ప్యాలెస్ నేపథ్యంలో వేడుకలు నిర్వహిస్తారు. క్రికెట్, సంగీతం, వినోదం కలగలిసి సంబరాలు ఉంటాయి. ఇందులోని ప్రదర్శనల గురించి పూర్తి వివరాలు వెల్లడించకపోయినా... సుమారు గంటసేపు కార్యక్రమం సాగుతుందని సమాచారం. ఇందులో పాల్గొనేందుకు 4 వేల మంది అభిమానులను బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు. ఈ వేడుకలకు ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లెవరూ హాజరు కావడం లేదు. మాజీ ఆటగాళ్లు, మరికొందరు ప్రత్యేక అతిథులు ఇందులో పాల్గొంటారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా నిర్వహిస్తామని టోర్నీ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తీ హామీ ఇచ్చారు. 1999 వరల్డ్ కప్ ఆరంభోత్సవ కార్యక్రమం వర్షంతో పాటు ప్రధాని ప్రసంగం సమయంలో మైక్ సరిగా పని చేయకపోవడం, పేలని టపాసులతో అంతా రసాభాసగా సాగింది! -
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్
-
క్రికెట్లో కొత్త ఫార్మాట్.. ఐపీఎల్‌కు దెబ్బ..!
లండన్: క్రికెట్లో ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు, టీ20 అనే మూడు ఫార్మాట్లు మనకు సుపరిచితం. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు 10 ఓవర్ల మ్యాచులు కూడా నిర్వహిస్తారు. అయితే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చేసిన ప్రతిపాదన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది నగరాల మధ్య పోటీ ఏర్పాటు చేసి, 100 బంతులతో కూడిన కొత్త రకం ఫార్మాట్‌ను తమ దేశీయ క్రికెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంతో పాటు, గందరగోళానికి గురి చేసింది. ఈ ఫార్మాట్లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు.. 10 బంతులతో కూడిన ఓ ఓవర్‌తో మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నామని బోర్డు తెలిపింది. ఈ ప్లాన్ గనుక కార్యరూపం దాల్చితే 2020 ఏడాది నుంచి నూతన ఫార్మాట్‌ను చూడొచ్చని పేర్కొంది. ఈసీబీ ప్రకటనపై ఇప్పుడు ట్విటర్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ స్పందిస్తూ.. ‘క్రికెట్లో ఇప్పుడు 5, 4, 3, 2 రోజుల క్రికెట్, 50, 40, 20, 10 ఓవర్లు, హాంగ్ సిక్సెస్ల క్రికెట్ ఉంది. ఇప్పుడు 100 బంతుల క్రికెట్.. గుడ్‌లక్.. ఈ గొప్పనైన ఆటను అర్థం చేసుకుంటున్నా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ‘ఈసీబీ కొత్త ఫార్మాట్ ఐపీఎల్‌ను పాతిపెడుతుంది’ అంటూ గార్డియన్ రైటర్ బెర్నే భిన్నంగా స్పందించాడు. ‘క్రికెట్లో ఇప్పటికే మూడు ఫార్మాట్లు ఉన్నాయి. నాలుగోది అవసరం లేదనుకుంటా. టీ20 మంచి ఫార్మాట్. దానిని మరింత కుదించడం సరైంది కాదంటూ’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘క్రికెట్ మొత్తాన్ని డెసిమలైజ్ చేయొచ్చుగా.. 10 బంతులు, 10 ఓవర్లు, 10 మంది ఆటగాళ్లు, 10 నిమిషాలు అంటూ’ మరో నెటిజన్ చురకలు అంటించడం గమనార్హం. Cricket now has 5 day,4 day,3 day,2 day,50 overs,40 overs,20 overs,T10 league,Hong sixes & 100 ball comp ...... Good luck understanding our great game !!!!!!! #OnOn — Michael Vaughan (@MichaelVaughan) April 19, 2018 The ECB's new Ginsters 100 Smash is going to bury the IPL — Barney Ronay (@barneyronay) April 19, 2018 Cricket has three really great formats. It really, really doesn't need a fourth. T20 is brilliant, it doesn't need shortening — Tim (@timwig) April 19, 2018