ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ నిషేధాన్ని ఎదుర్కోనున్నాడు. 2017-2019 మధ్యలో బెట్టింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో కార్స్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 16 నెలల నిషేధాన్ని విధించింది. దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల కార్స్ తాను పాల్గొన్న మ్యాచ్‌ల్లో కాకుండా మిగతా మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసాడని క్రికెట్ రెగ్యులేటర్ ఏసీబీ విచారణలో తేలింది.
బెట్టింగ్ కాసిన విషయాన్ని కార్స్ కూడా అంగీకరించాడు. 16 నెలల్లో 13 నెలల నిషేధం రెండేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంటుందని ఈసీబీ తెలిపింది. ప్రస్తుతానికి కార్స్‌పై మూడు నెలల నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్ 28 వరకు కార్స్ క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో అయినా పాల్గొనేందుకు అనర్హుడు.
రాబోయే రెండేళ్లలో అతను అవినీతి నిరోధక నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే మిగిలిన 13 నెలల నిషేధం అమల్లోకి రాదు. కార్స్‌పై 303 బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. 2016లో డర్హమ్ కౌంటీలో అరంగేట్రం చేసిన కార్స్.. 2021 నుంచి ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కార్స్ ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడి మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కార్స్ ఇటీవలికాలంలో ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. కార్స్ బ్యాటింగ్‌లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగల సమర్ధుడు.
ఇదిలా ఉంటే, నేటి నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్.. ఆసీస్‌తో కలిసి గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఇతర జట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment