England cricket
-
ఓ చేతిలో బీర్.. మరో చేతితో స్టన్నింగ్ క్యాచ్! ఇంగ్లండ్ కోచ్ ఫిదా
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మూడో రోజు ఆట సందర్భంగా ఓ అభిమాని ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఓ చేతిలో బీర్.. మరో చేతితో క్యాచ్ పట్టి అందరని సదరు ఫ్యాన్ ఆకట్టున్నాడు. అతడి క్యాచ్‌కు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ఫిదా అయిపోయాడు.అసలేం జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 82 ఓవర్లో అసిత్ ఫెర్నాండో తొలి బంతిని మార్క్‌వుడ్‌కు షార్ట్ బాల్‌గా సందించాడు. ఆ బంతిని వుడ్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ సిక్స్‌గా మలిచాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఓ చేతిలో బీర్ పట్టుకుని మరి ఈ క్యాచ్‌ను అతడు అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి క్యాచ్‌ను చూసి పాల్ కాలింగ్‌వుడ్ ఆశ్చర్యపోయాడు. కాలింగ్‌వుడ్‌తో తన సహచర కోచింగ్ స్టాప్‌తో కలిసి నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జామీ స్మిత్(111) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. YES, SIR! 🫡Take incredible catch ✅Don't spill a drop ✅Impress the coaches ✅ pic.twitter.com/IamoUULjmb— England Cricket (@englandcricket) August 23, 2024 -
రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆండర్సన్..?
ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ తిరిగి బంతిని పట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఆండర్సన్ టీ20ల్లో ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడు. తాజాగా ఓ పొడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఇంగ్లండ్ లెజండరీ క్రికెటర్ వెల్లడించాడు. వచ్చే వేసవిలో లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు తన సిద్దంగా ఉన్నానని ఆండర్సన్ తెలిపాడు. అదేవిధంగా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా వ్యవరించాలన్న తన కోరికను ఆండర్సన్ వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. "నా కెరీర్లో టీ20 క్రికెట్‌ను చాలా కోల్పోయాను. టీ20ల్లో ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి నేను పొట్టి ఫార్మాట్లో ఆడాలనకుంటున్నాను. నాకు ఇంకా ఫిట్నెస్ ఉంది. ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్‌ను తరుచుగా చూస్తున్నాను. మొదటి 20 బంతులను బౌలర్లు అద్భుతంగా స్వింగ్ చేస్తున్నారు. నేను కూడా ఆవిధంగా బంతిని స్వింగ్ చేయగలను. అయితే ఇప్పటివరకు రెడ్‌బాల్‌తో అలవాటపడ్డ నేను వైట్ బంతితో ఎంతవరకు స్వింగ్ చేస్తానన్నది ప్రశ్నార్ధకం. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ ఇప్పటివరకు నేను ఆడలేదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి మరి" అని ది ఫైనల్ వర్డ్ పొడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండర్సన్ పేర్కొన్నాడు. కాగా ఆండర్సన్ తన స్వదేశంలో కాకుండా బయట ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలంటే సౌతాఫ్రికా టీ20 లీగ్, బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్ మంచి ఎంపికగా చెప్పుకోవాలి. కానీ ఐపీఎల్ వేలంలోకి వస్తే అతడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకం. -
సంచలన నిర్ణయం.. ఆ స్టేడియంలో సిక్స్ కొడితే ఔట్! ఎక్కడంటే?
ప్రస్తుతంక్రికెట్లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆటగాళ్లు బౌండరీలు బాదడానికి పోటీ పడుతున్నారు. ఆటగాళ్లు సిక్స్‌లు, ఫోర్లు కొడితేనే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందుతోంది. కానీ ఓ చోట మాత్రం ఇకపై సిక్స్‌లు కొట్టడం నిషేధం. అవును మీరు విన్నది నిజమే. రూల్స్‌ను అతిక్రమించి సిక్స్ కొడితే ఔటై పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. ఈ రూల్స్ వింటుంటే గల్లీ క్రికెట్ గుర్తుస్తోంది కదా? అస్సలు విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఇంగ్లండ్‌లోని సౌత్విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్టేడియంలో ఆటగాళ్లు ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని ఈ క్లబ్ నిషేధించింది. క్రికెటర్లు కొట్టే సిక్స్‌ల వల్ల తమకు ఆస్తి నష్టం, భద్రతా సమస్యలు తలెత్తున్నాయని స్టేడియం సమీపంలోని నివాసితులు క్లబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.సౌత్విక్ అండ్ షోర్‌హామ్ స్టేడియం వద్ద వలలను ఏర్పాటు చేసినప్పటికీ కారుల అద్దాలు దెబ్బ తినడంతో పాటు చాలా మందికి గాయాలు కూడా తరుచుగా అవుతన్నాయి. ఈ క్రమంలోనే సౌత్విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ ఈ విచిత్ర నిర్ణయాన్ని తీసుకున్నాయి.కాగా సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించడంతో పాటు మరో కొత్త రూల్‌ను కూడా అమలు లోకి తీసుకు వచ్చింది. ఇకపై ఏ ఆటగాడైనా సిక్స్ కొడితే మొదటి తప్పుగా పరిగణించి పరుగులను లెక్కలోకి తీసుకోరు. అనంతరం రెండో సారి సిక్స్ కొడితే అంపైర్లు ఔట్‌గా ప్రకటిస్తారు.ఇదే విషయంపై క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోక్సప్ మాట్లాడుతూ.. "గతంలో క్రికెట్ అంటే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ట్వంటీ-ట్వంటీ క్రికెట్ పుట్టుకరావడంతో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. దాంతో మా స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల వల్ల సమీపంలోని నివాసితులకు ఇబ్బందులు తలెత్తున్నాయి. అందుకే ఇకపై సిక్స్‌లు కొట్టడాన్ని నిషేధించామని" పేర్కొన్నారు. -
‘704’తో ముగించిన అండర్సన్
లండన్: 21 సంవత్సరాల టెస్టు కెరీర్... 188 మ్యాచ్‌లు...40,007 బంతులు...704 వికెట్లు...26.45 సగటు...ఘనమైన ఆటకు ముగింపు లభించింది. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కెరీర్‌కు తెర పడింది. శుక్రవారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టుతో అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003 మే 22–24 మధ్య ఇదే లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడిన అండర్సన్ అక్కడే ఆటకు వీడ్కోలు పలికాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన 12వ ఓవర్లో జోషువా డి సిల్వాను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో అండర్సన్ ఖాతాలో చివరిదైన 704వ వికెట్ చేరింది. టెస్టుల్లో మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా... సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఈ దిగ్గజం సొంత అభిమానుల సమక్షంలో మైదానం వీడాడు. మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 79/6తో ఆట కొనసాగించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. 12.1 ఓవర్లలో ఆ జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. గుడకేశ్ మోతీ (31 నాటౌట్) మాత్రమే కొద్దిగా పోరాడగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్ (5/61) విండీస్‌ను దెబ్బ తీశాడు. రెండో టెస్టు గురువారం నుంచి నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. -
బెట్టింగ్ కేసులో ఇంగ్లండ్ బౌలర్‌పై నిషేధం
ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ నిషేధాన్ని ఎదుర్కోనున్నాడు. 2017-2019 మధ్యలో బెట్టింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో కార్స్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 16 నెలల నిషేధాన్ని విధించింది. దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల కార్స్ తాను పాల్గొన్న మ్యాచ్‌ల్లో కాకుండా మిగతా మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసాడని క్రికెట్ రెగ్యులేటర్ ఏసీబీ విచారణలో తేలింది. బెట్టింగ్ కాసిన విషయాన్ని కార్స్ కూడా అంగీకరించాడు. 16 నెలల్లో 13 నెలల నిషేధం రెండేళ్ల పాటు సస్పెన్షన్‌లో ఉంటుందని ఈసీబీ తెలిపింది. ప్రస్తుతానికి కార్స్‌పై మూడు నెలల నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్ 28 వరకు కార్స్ క్రికెట్లోని ఏ ఫార్మాట్లో అయినా పాల్గొనేందుకు అనర్హుడు.రాబోయే రెండేళ్లలో అతను అవినీతి నిరోధక నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే మిగిలిన 13 నెలల నిషేధం అమల్లోకి రాదు. కార్స్‌పై 303 బెట్టింగ్‌లకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. 2016లో డర్హమ్ కౌంటీలో అరంగేట్రం చేసిన కార్స్.. 2021 నుంచి ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కార్స్ ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడి మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కార్స్ ఇటీవలికాలంలో ఇంగ్లండ్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. కార్స్ బ్యాటింగ్‌లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగల సమర్ధుడు.ఇదిలా ఉంటే, నేటి నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్.. ఆసీస్‌తో కలిసి గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఇతర జట్లుగా ఉన్నాయి. -
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్తను వోర్సెస్టర్షైర్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.అయితే బేకర్ మరణానికి గల కారమైతే ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు. అతడు చివరగా వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ తరపున గత నెలలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన బేకర్.. తన కెరీర్లో 47 మ్యాచ్‌లు ఆడి 525 పరుగులతో పాటు 70 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేకర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. -
పాపం రూట్.. చెత్త షాట్‌కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి రూట్ ఔటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్.. ఓ నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 20 ఓవర్ వేసిన లోగాన్ వాన్ బీక్ బౌలింగ్‌లో రెండో బంతికి రూట్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. రూట్ సరైన పొజిషేషన్లో లేకపోవడంతో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అస్సలు ఆ బంతికి రూట్ ఆ షాట్ ఆడే అవసరమే లేదు. కానీ అనవసరపు షాట్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే అంతకుముందు ఓవర్లో ఆ తరహా షాటే ఆడి బౌండరీని రూట్ రాబట్టాడు. కానీ రెండో సారి మాత్రం తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2019 వరల్డ్‌కప్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన రూట్.. ఈ సారి మాత్రం తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు రూట్ కేవలం 203 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అయితే ఏకంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. చదవండి: #Maxwell-Cummins: ప్రతి ‘బ్యాట్‌మ్యాన్’కి ఇలాంటి రాబిన్ ఉండాలన్న ఐసీసీ! ఫాస్టెస్ట్ సెంచరీ చేసినపుడు కూడా. View this post on Instagram A post shared by ICC (@icc) -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్‌కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్‌గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్‌గా ఫుల్‌టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్‌గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్‌బాల్ క్రికెట్‌ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్‌కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్‌ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్‌లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్‌గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
'రెండు' దేశాల క్రికెటర్ రిటైర్మెంట్.. బ్రాడ్‌మన్‌తో పోల్చిన వైనం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో గ్యారీ బ్యాలెన్స్ ఒకడు. గ్యారీ బ్యాలెన్స్ మొదట ఇంగ్లండ్ జట్టుకు ఆడాడు. 2014 నుంచి 2017 వరకు ఇంగ్లండ్ తరపున 23 టెస్టులాడిన బ్యాలెన్స్.. ఆ తర్వాత జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో బ్యాలెన్స్ ఇంగ్లండ్ క్రికెట్‌ను వదిలి తాను పుట్టిన జింబాబ్వేకు వచ్చేశాడు. 2022లో జింబాబ్వే తరపున తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఓవరాల్‌గా గ్యారీ బ్యాలెన్స్ తన కెరీర్లో 24 టెస్టులాడి 1653 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 21 వన్డేల్లో 454 పరుగులు చేసిన బ్యాలెన్స్ ఖాతాలో మూడు వన్డే అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో పెను సంచలనం.. ఘనమైన ఆరంభం గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ అరంగేట్రం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఇంగ్లండ్ తరపున 2014లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి 10 టెస్టులు కలిపి 67.93 సగటుతో 1017 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఒక రకంగా ఇది రికార్డు అని చెప్పొచ్చు. దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత తొలి పది టెస్టుల్లో 60కి పైగా సగటుతో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా గ్యారీ బ్యాలెన్స్ చరిత్రకెక్కాడు. నిజంగా ఏ క్రికెటర్‌కు అయినా ఇది మంచి ఆరంభం అని చెప్పొచ్చు. కానీ బ్యాలెన్స్ ఇదే ప్రదర్శనను తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాతి 13 టెస్టుల్లో రెండు అర్థసెంచరీలు మాత్రమే నమోదు చేసిన బ్యాలెన్స్ 19.04 సగటుతో కేవలం 481 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్.. జింబాబ్వే తరపున అరంగేట్రం కెరీర్లో పీక్ దశలో ఉన్న సమయంలోనే గ్యారీ బ్యాలెన్స్ జాతి వివక్షపై చేసిన వ్యాఖ్యలు అతన్ని సస్పెండ్ అయ్యేలా చేశాయి. కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతున్న బ్యాలెన్స్ .. తోటి క్రికెటర్ అజామ్ రఫీక్ ఎదుర్కొన్న వివక్షను మీడియా ముందు బయటపెట్టాడు. యార్క్‌షైర్‌లో జాతి వివక్ష మాట నిజమేనని.. ఇదంతా చూస్తూ కూడా ఈసీబీ ఏం పట్టనట్లుగా ఉందని.. పైగా తాను కూడా ఒక సందర్భంలో జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈసీబీ బ్యాలెన్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గ్యారీ బ్యాలెన్స్ తాను పుట్టిన జింబాబ్వేకు వెళ్లిపోయాడు. జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న గ్యారీ బ్యాలెన్స్ 2022 డిసెంబర్లో తిరిగి జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే నాలుగు నెలల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. చదవండి: BCCI: 'భారత క్రికెట్ జట్లను చైనాకు పంపించలేం' -
ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టి20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. కెప్టెన్ బట్లర్ సహా సామ్ కరన్, డేవిడ్ మలాన్, ఫిల్ సాల్ట్, టైమల్ మిల్స్, రిచర్డ్ గ్లెసన్, క్రిస్ జోర్డాన్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్‌తో అలరించిన రిషి సునాక్ ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వలలో చిక్కుకున్నాడు. జోర్డాన్ బంతిని పుల్ చేయబోయి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో సామ్ కరన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఇక టి20 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును అభినందించడానికి ప్రధాని రిషి సునాక్ తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్ తమ దేశం పొట్టి క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించారు. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. -
'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి'
జో రూట్.. ఈతరంలో గొప్ప టెస్టు క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. కెప్టెన్‌గా ఎన్నో టెస్టుల్లో ఇంగ్లండ్‌కు విజయాలు అందించాడు. టెస్టుల్లో 10వేలకు పైగా పరుగులు చేసిన రూట్ ఖాతాలో 28 సెంచరీలు ఉన్నాయి. మధ్యలో ఇంగ్లండ్ జట్టు రూట్ కెప్టెన్సీలో పాతాళానికి పడిపోయినప్పటికి బ్యాటర్‌గా మాత్రం తాను ఎప్పుడు విఫలమవ్వలేదు. ఇంగ్లండ్ జట్టులో గత పదేళ్లలో స్థిరంగా పరుగులు సాధించిన బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది రూట్ మాత్రమే. ఒకానొక దశలో 52 ఉన్న స్ట్రైక్‌రేట్ కాస్త 81.2కు పెరగడం చూస్తే రూట్ ఏ స్థాయిలో ఆడాడన్నది అర్థమవుతుంది. అయితే కొంతకాలంగా రూట్ బ్యాట్ మూగబోయింది. ఒకప్పుడు పరుగులు వెల్లువలా వచ్చిన బ్యాట్ నుంచి ఇప్పుడు కనీసం అర్థసెంచరీ కూడా రాలేకపోతుంది. గత 11 ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు ఫిఫ్టీలు మాత్రమే కొట్టి 242 పరుగులు చేసిన రూట్ సగటు 22కు పడిపోయింది. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కొంతకాలం స్థిరంగానే ఆడాడు. అయితే క్రమంగా స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టులోనే బలంగా తయారవుతున్న వేళ రూట్ మాత్రం ఫామ్ కోల్పోయాడు. చివరగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన రూట్.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో పాటు పాకిస్తాన్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రూట్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అయితే తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా రూట్ ఫామ్‌లోకి వచ్చినట్లే అనిపిస్తున్నాడు. మ్యాచ్‌లో ఇంగ్లండ్ 267 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్టోక్స్ నేతృత్వంలో సరికొత్తగా దూసుకెళ్తున్న టెస్టు టీమ్‌లో తన రోల్ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్‌బాల్‌తో సంచలనాలు సృష్టిస్తున్న ఇంగ్లండ్.. కివీస్‌తో మ్యాచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. తొలిరోజునే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంపై విమర్శలు వచ్చినప్పటికి.. స్టోక్స్‌కు తన జట్టు బౌలర్లపై ఉన్న నమ్మకం ఏంటనేది మరుసటి రోజే తెలిసొచ్చింది. అయితే ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ వేగంగా మారుతున్న సమయంలో రూట్ ఏ స్థానంలో రావాలనేది కాస్త డైలమాలో పడింది. తన కెరీర్లో రూట్ ఎక్కువ భాగం మూడో స్థానంలో వచ్చేవాడు. మూడో స్థానంలో వచ్చి ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్.. ఇవాళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇదే అంశంపై విజ్డెన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రూట్ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టు వేగంగా మారుతోంది. కాలానికి అనుగుణంగా బజ్‌బాల్‌తో స్టోక్స్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోచ్ మెక్కల్లమ్- కెప్టెన్ స్టోక్స్‌ల ఆధ్వర్యంలో ఎలా బ్యాటింగ్ చేయాలనేది పరిశీలిస్తున్నా. కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటపడ్డాకా కాస్త రిలీఫ్ అనిపించింది. అయితే ఇప్పుడు జట్టులో నా రోల్ ఏంటనేది తెలుసుకోవాలి. వినడానికి సిల్లీగా అనిపిస్తున్నప్పటికి ఇది నిజం. గత కొన్ని మ్యాచ్‌లుగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నా. ఎంత సీనియర్ క్రికెటర్ అయినా పరుగులు చేయలేకపోతే జట్టులో స్థానం పోతుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రివర్స్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నా. ఇది గమనించిన మెక్కల్లమ్.. ఏం కాదులే మరోసారి ప్రయత్నించు.. అంటూ మద్దతిచ్చాడు. అయితే రివర్స్ స్కూప్ ఆడడంలో తాను ఒకప్పుడు సిద్ధహస్తుడిని.. ఇప్పుడు ఆ 'రూట్' దారి తప్పింది. తిరిగి దానిని అందుకోవాలి'' అంటూ ముగించాడు. చదవండి: Team India: సూర్య తప్ప.. స్వస్థలాలకు టీమిండియా క్రికెటర్లు BGT 2023 IND VS AUS: ఆసీస్‌కు బిగ్ షాక్.. మరో వికెట్ డౌన్ -
50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు
ఎనిడ్ బెక్వెల్.. ఇంగ్లీష్ మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్ బెక్వెల్ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది. ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్వెల్ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్ బెక్వెల్.. వరల్డ్‌కప్ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్ బెక్వెల్ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్ బెక్వెల్ క్రికెట్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్ బెక్వెల్ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే -
T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్
పాకిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 13) జరుగనున్న టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఇంగ్లండ్ క్రికెట్‌కు గాడ్ ఫాదర్‌గా చెప్పుకునే డేవిడ్ ఇంగ్లిష్ (76) గుండెపోటు కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఇంగ్లిష్ మరణవార్త తెలిసి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దిగ్భ్రాంతికి గురైంది. కెప్టెన్ జోస్ బట్లర్ సహా జట్టులోని ఆటగాళ్లంతా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జోస్ బట్లర్.. ఇంగ్లిష్తో ఉండిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాదా తప్త హృదయంతో ట్వీట్ చేశాడు. So sad to hear the news of David English passing away. One of life’s great characters, so fun to spend time with and producer of some of the best English cricketers through his wonderful Bunbury Festivals. RIP ❤️ pic.twitter.com/RK3SXUOfSr — Jos Buttler (@josbuttler) November 12, 2022 ఇంగ్లిష్ మరణవార్త కలచి వేసిందని, తాను చూసిన గొప్ప వ్యక్తిత్వం గల మనుషుల్లో ఇంగ్లిష్ ఒకరని, ఇంగ్లండ్ క్రికెట్‌కు ఎంతో మంది ఉత్తమ క్రికెటర్లను అందించిన ఇంగ్లిష్తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేనని, ఇంగ్లిష్ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశం పంపాడు. కాగా, డేవిడ్ ఇంగ్లిష్.. బన్‌బరీ స్కూల్స్ ఫెస్టివల్స్ ద్వారా వేల సంఖ్యలో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లను, వందల సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను ఇంగ్లండ్ జట్టుకు అందించాడు. చదవండి: Jos Buttler: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకుమార్‌కే.. -
టీ 20 వరల్డ్ కప్ గెలిచేది ఆ మూడు జట్లే...
-
'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై
ఇంగ్లండ్ దిగ్గజ మహిళా క్రికెటర్ కేథరిన్ బ్రంట్ టెస్టులకు గుడ్‌బై ప్రకటించింది. ఇకపై వన్డేల్లో, టి20ల్లో మాత్రమే కొనసాగనున్నట్లు బ్రంట్ తెలిపింది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కేథరిన్ బ్రంట్ నిలిచింది. 2004లో యాషెస్ సిరీస్ ద్వారా కేథరిన్ బ్రంట్ ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసింది. డెబ్యూ మ్యాచ్‌లోనే తొమ్మిది వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ 52 పరుగులు చేసిన బ్రంట్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతేగాక 42 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ యాషెస్ ట్రోపీని రిటైన్ చేసుకోవడంలో కేథరిన్ బ్రంట్‌ది ముఖ్యపాత్ర. ఇప్పటివరకు కేథరిన్ బ్రంట్ 14 టెస్టుల్లో 51 వికెట్లు పడగొట్టింది. ఇక టెస్టుల్లో రిటైర్మెంట్పై బ్రంట్ స్పందిస్తూ.. ''గత రెండేళ్ల నుంచి టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నా. ఒక ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నామంటే చెప్పలేని బాధ ఉంటుంది. టెస్టు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడం అనేది హార్ట్ బ్రేకింగ్. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.'' అంటూ ఎమోషనల్ అయింది. ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బ్రంట్ రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ''ఒక శకం ముగిసింది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్న కేథరిన్ బ్రంట్ ఆటకు గుడ్‌బై చెప్పింది.. నీ సేవలకు సలాం.. థాంక్యూ బ్రంటీ'' అంటూ లవ్ ఎమోజీతో ట్వీట్ చేసింది. The end of an era. Our third leading wicket-taker in the format, @kbrunt26 is retiring from Test cricket. Thank you Brunty ❤️ — England Cricket (@englandcricket) June 18, 2022 చదవండి: Ranji Trophy 2022: బెంగాల్‌పై ఘన విజయం.. 23 ఏళ్ల తర్వాత ఫైనల్లో మధ్యప్రదేశ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై ఆరోపణలు.. లైంగికంగా వేధించడమే గాక స్నేహితులను తీసుకొచ్చి -
చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ బౌలర్..
ఎడ్జ్‌బాస్టన్: వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్‌ల (161 టెస్ట్‌లు) రికార్డును ఆండర్సన్ అధిగమించాడు. కివీస్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మ్యాచ్ అతని కెరీర్లో 162వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ 200 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో, ఆసీస్ మాజీ కెప్టెన్లు పాంటింగ్, స్టీవ్ వా 168 మ్యాచ్‌లతో రెండో స్థానంలో, 166 మ్యాచ్‌లతో కలిస్(దక్షిణాఫ్రికా) థర్డ్ ప్లేస్‌లో, 164 టెస్ట్‌లతో చంద్రపాల్(వెస్టిండీస్), ద్రవిడ్(భారత్) నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా, ఆండర్సన్.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు(616) పడగొట్టిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (708), భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619) ఉన్నారు. 38 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా -
ఐపీఎల్లో నో చాన్స్.. అందుకే కౌంటీ క్రికెట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ కౌంటీ మ్యాచ్‌ల్లో వార్విక్షైర్ క్లబ్ తరఫున విహారి బరిలోకి దిగనున్నాడు. వార్విక్షైర్ తరఫున అతను కనీసం మూడు మ్యాచ్‌లు ఆడతాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్‌కు వెళ్లిన విహారి 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. చదవండి: ధోని బాయ్ జట్టుతో తొలి మ్యాచ్.. అది కెప్టెన్‌గా -
ఫించ్ పిచ్చకొట్టుడు!
లండన్ : ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెచ్చిపోయాడు. ఒక పరుగు వద్ద లభించిన లైఫ్‌తో విధ్వంసం సృష్టించాడు. 79 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ బ్లాస్ట్ టీ20 టోర్నీలో భాగంగా సర్రే జట్టు తరపున బరిలోకి దిగిన ఫించ్.. సస్సెక్స్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో సర్రే జట్టు 52 పరుగుల తేడాతో సస్సెక్స్‌పై విజయం సాధించింది. ఫించ్ తొలి పరుగు వద్దనే జోఫ్రా ఆర్చర్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. అతను నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకున్న ఫించ్ సెంచరీతో చెలరేగాడు. ఇది సర్రె జట్టు బ్యాట్స్‌మన్‌గా అత్యధిక స్కోర్ కాగా.. ఫించ్‌కు టీ20ల్లో ఐదో టీ20 సెంచరీ. దీంతో సర్రే జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో సస్సెక్స్ జట్టు తడబడింది. 18వ ఓవర్లోనే 140 పరుగుల వద్ద చాపచుట్టేసింది. ఇక వరల్డ్ నెం1 బౌలర్ అఫ్గాన్ సంచలనం రషీద్‌ఖాన్ బౌలింగ్‌ను సైతం ఫించ్ చీల్చిచిండాడడు. ఈ దెబ్బకు రషీద్ 40 పరుగులు సమర్పించుకున్నాడు. -
వన్డేలకు గుడ్ బై చెప్పిన మరో క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. టెస్టులపై మరింత శ్రద్ధ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు మీడియాకు తెలిపాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ గెలుచుకున్నతర్వాత.. టెస్టుల నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించినా.. చివరికు వన్డేల నుంచి మాత్రమే తప్పుకున్నట్టు బెల్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్ ముగిశాక కోచ్ ట్రెవర్ బేలిస్, కెప్టెన్ అలెస్టర్ కుక్‌తో సంప్రదించిన అనంతరం టెస్టులకు గుడ్ బై చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని తెలిపాడు. వన్డే కెరీర్లో 161 మ్యాచ్‌ల్లో 5416 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బెల్ కావడం విశేషం. వన్డేల్లో 37.87 సగటుతో నాలుగు సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. 115 టెస్టులు ఆడిన బెల్ 43 సగటుతో 22 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ట్రాట్ గుడ్ బై
లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ట్రాట్ ప్రకటించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి వచ్చిన ట్రాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించగల స్థాయిలో తన ఆటతీరులేదని, బాధాకరమైనా వైదొలగకతప్పలేదని ట్రాట్ చెప్పినట్టు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. 34 ఏళ్ల ట్రాట్ 52 టెస్టుల్లో 3835 పరుగులు చేశాడు. 68 వన్డేలాడిన ఇంగ్లండ్ క్రికెటర్ 2819 పరుగులు చేశాడు. -
నేనంటే మా క్రికెటర్లకు అసూయ
మెల్బోర్న్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి తన సహచర క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు తానంటే అసూయపడేవారని పీటర్సన్ అన్నాడు. సహచర ఆటగాళ్ల వల్ల తాను బలయ్యానని ఆరోపించాడు. ఏడాది క్రితం వివాదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పీటర్సన్.. సందర్భం వచ్చినప్పుడల్లా తన సహచరులపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కెవిన్ తన ఆత్మకథలో పలు విషయాలను ప్రస్తావించాడు. తన కెరీర్లో జరిగిన పలు సంఘటనల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ ఆరంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో కెవిన్ మాట్లాడుతూ.. ఇక్కడ అసూయ పడే ఆటగాళ్లు ఎవరూ లేరని అన్నాడు. అదే ఇంగ్లండ్‌లో అయితే అసూయ పడేవాళ్లకు కొదవేలేదని చెప్పాడు.