ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్తను వోర్సెస్టర్‌షైర్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.
అయితే బేకర్ మరణానికి గల కారమైతే ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్‌షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు.
అతడు చివరగా వోర్సెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున గత నెలలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన బేకర్.. తన కెరీర్‌లో 47 మ్యాచ్‌లు ఆడి 525 పరుగులతో పాటు 70 వికెట్లు పడగొట్టాడు.
అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేకర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment