Worcestershire
-
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ యువ స్పిన్నర్ జోష్ బేకర్ మృతి చెందాడు. ఈ విషాద వార్తను వోర్సెస్టర్షైర్ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల బేకర్ మరణ వార్తతో ఇంగ్లీష్ క్రికెట్ ఉలిక్కిపడింది.అయితే బేకర్ మరణానికి గల కారమైతే ఇప్పటివరకు తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ 2024లో వోర్సెస్టర్షైర్ జట్టులో బేకర్ భాగంగా ఉన్నాడు. అతడు చివరగా వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ తరపున గత నెలలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. 2021లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన బేకర్.. తన కెరీర్లో 47 మ్యాచ్‌లు ఆడి 525 పరుగులతో పాటు 70 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచ కప్- 2022 కోసం ఎంపికైన ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బేకర్ ఉన్నాడు. ఇక బేకర్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇంగ్లండ్ క్రికెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. -
పాక్ నుంచి పుట్టుకొచ్చిన బౌలర్.. మలింగను గుర్తుచేస్తూ
పాకిస్తాన్‌కు చెందిన కొత్త ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. డెర్బీషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న జమాన్ ఖాన్ లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను పోలి ఉంది. అతని శైలిలోనే పదునైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ దూకుడుగా ఆడింది. తొలి 3.4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జాక్ చాపెల్ బౌలింగ్‌లో ఒలివిరియా ఔట్ అయ్యాడు అనంతరం న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జమాన్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి అద్భుత యార్కర్ సంధించగా.. సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. బంతి సూపర్‌స్పీడ్‌తో రావడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. ఇక ఈ యంగ్ బౌలర్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మిగతా బౌలర్లు విఫలం కావడంతో వోర్సెష్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ సాంట్నర్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ మొదటి పది ఓవర్లు దూకుడు కనబరిచినప్పటికి అదే టెంపోను చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో 19.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అవడంతో వోర్సెష్టర్‌షైర్ 28 పరుగుల తేడాతో విజయం అందుకుంది. వేన్ మాడ్సన్ 63, హ్యారీ కేమ్ 43 పరుగులతో రాణించారు. Zaman Khan with an elite yorker 😍 #Blast23 pic.twitter.com/NiBPxfHK52— Vitality Blast (@VitalityBlast) July 4, 2023 చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
ఒక్క ఓవర్ 34 పరుగులు.. 64 బంతుల్లో సెంచరీ; ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ విధ్వంసం
ఇంగ్లండ్ టెస్టు జట్టు నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. ఒక ఓవర్లో 34 పరుగులు పిండుకోవడంతో పాటు 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో కోల్పోయినప్పటికి ప్రత్యర్థి బౌలర్‌కు మాత్రం చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 117వ ఓవర్‌కు ముందు స్టోక్స్ 59 బంతుల్లో 70 పరుగులతో ఆడుతున్నాడు. జోష్ బేకర్ వేసిన ఆ ఓవర్లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు రాబట్టడంతో పాటు 64 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ముగిసిపోలేదు. డర్హమ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి స్టోక్స్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. 161 పరుగుల్లో 134 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయంటే స్టోక్స్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థమయి ఉండాలి. ఇక రెండోరోజు లంచ్ విరామం తర్వాత డర్హమ్ 6 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్(161 పరుగులు), బెండిగమ్(135 పరుగులు), సీన్ డిక్సన్(104 పరుగులు) ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వోర్సెస్టర్షైర్ టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.ఇక గతేడాది కాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస సిరీస్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా నియమించింది. చదవండి: Brendon Mccullum: ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్! 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣ What. An. Over. 34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm — LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022 -
పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్
Pujara Scores Century Followed By Double Ton: పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజరా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ సీజన్లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నయా వాల్ వరుస శతకాలతో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (రెండో ఇన్నింగ్స్) సాధించిన అతను.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. వరుస ఇన్నింగ్స్‌ల్లో మూడంకెల స్కోర్‌ను రీచైన పుజారా ఎట్టకేలకు పూర్వపు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన పుజారా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేశాడు. సూపర్ ఫామ్‌కు కొనసాగింపుగా వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 206 బంతులను ఎదుర్కొన్న నయా వాల్.. 16 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. పుజారా ఒక్కడే సొగసైన సెంచరీతో రాణించడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌటైంది. ఇదే జట్టు తరఫున ఆడుతున్న పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తొలి బంతికే డకౌట్ కాగా, టామ్ క్లార్క్ (44) కాస్త పర్వాలేదనిపించాడు. అంతకుముందు వార్సెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 491 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ బ్రెట్ డిఒలివియెరా అజేయమైన 169 పరుగులతో సత్తా చాటగా, ఎడ్ పొలాక్ (77), బెర్నార్డ్ (75) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన ససెక్స్ ఫాలో ఆన్ ఆడుతుంది. చదవండి: ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్ వివాదంపై ఆసక్తికర చర్చ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత..
లండన్: ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బరిలో దిగనున్నాడు. గతంలో వర్సెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ మరోసారి ఆ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ పర్యటనలో భాగంగా విరాట్ సేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. భారత టెస్టు జట్టులో అశ్విన్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అశ్విన్ వర్సెస్టర్‌షైర్ తరపున ఆడనున్నాడు. ఈ ఒప్పందానికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటీ చాంపియన్ షిప్ -2018లో భాగంగా సెప్టెంబర్‌లో ఎసెక్స్, యార్క్‌షైర్ జట్లతో జరగనున్న కీలక మ్యాచ్‌ల్లో అశ్విన్ ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ వెయిన్ పార్నెల్ స్థానంలో అశ్విన్ ఆడనున్నాడు. గత సీజన్లో అశ్విన్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్ 20 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. ‘కచ్చితంగా అశ్విన్ రాకతో జట్టుకు భారీ లాభం చేకూరనుంది. మా జట్టు మంచి విజయాలు సాధించేందుకు గతేడాది వేసవి సీజన్లో అద్భుతంగా రాణించాడు’ అని ఆ జట్టు కోచ్ కెవిన్ షార్ప్ పేర్కొన్నాడు. -
అశ్విన్ విజృంభణ
లండన్: కౌంటీ క్రికెట్ బరిలోకి దిగిన భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విజృంభించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. వార్సెష్టర్‌షైర్ తరఫున ఆడుతున్న అశ్విన్... గ్లూసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లతో సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లతో శుభారంభం అందించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో మెరిశాడు. దాంతో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను సాధించిన అరుదైన ఘనతను అశ్విన్ సొంతం చేసుకున్నారు. గ్లూసెస్టర్‌షైర్ కు 400 విజయలక్ష్యాన్ని నిర్దేశించిన క్రమంలో వార్సెష్టర్‌షైర్ కెప్టెన్ జో లీచ్ తో పాటు అశ్విన్ చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి ప్రత్యర్థి టాపార్డర్ వికెట్లను పేకమేడలా కూల్చడంతో వార్సెష్టర్‌షైర్ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది. అశ్విన్ దెబ్బకు . గ్లూసెస్టర్‌షైర్ 211 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే గ్లూసెస్టర్‌షైర్ రెండు వికెట్లను వరుసగా తీసిన అశ్విన్.. ఓవరాల్ గా ఐదు వికెట్లను సాధించారు.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 34 ఓవర్లపాటు బౌలింగ్ వేసి ఎనిమిది మెయిడిన్లు వేసి 68 పరుగులిచ్చాడు.