అశ్విన్ విజృంభణ | Ravichandran Ashwin bags maiden five-wicket haul in winning debut for Worcestershire in County Championship | Sakshi
Sakshi News home page

అశ్విన్ విజృంభణ

Published Fri, Sep 1 2017 12:56 PM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

అశ్విన్ విజృంభణ

అశ్విన్ విజృంభణ

లండన్: కౌంటీ క్రికెట్‌ బరిలోకి దిగిన భారత టాప్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విజృంభించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. వార్సెష్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌... గ్లూసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లతో సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లతో శుభారంభం అందించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో మెరిశాడు. దాంతో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను సాధించిన అరుదైన ఘనతను అశ్విన్ సొంతం చేసుకున్నారు.

గ్లూసెస్టర్‌షైర్‌ కు 400 విజయలక్ష్యాన్ని నిర్దేశించిన క్రమంలో వార్సెష్టర్‌షైర్‌ కెప్టెన్ జో లీచ్ తో పాటు అశ్విన్ చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి ప్రత్యర్థి టాపార్డర్ వికెట్లను పేకమేడలా కూల్చడంతో వార్సెష్టర్‌షైర్‌ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది. అశ్విన్ దెబ్బకు . గ్లూసెస్టర్‌షైర్‌ 211 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే  గ్లూసెస్టర్‌షైర్‌ రెండు వికెట్లను వరుసగా తీసిన అశ్విన్.. ఓవరాల్ గా ఐదు వికెట్లను సాధించారు.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 34 ఓవర్లపాటు బౌలింగ్ వేసి ఎనిమిది మెయిడిన్లు  వేసి 68 పరుగులిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement