ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) మాత్రం తన పేలవ ఫామ్‌తో తీవ్ర నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలమైన సూర్య.. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరిచాడు.
ఐదు మ్యాచ్‌ల్లో మిస్టర్ 360 కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అతడి చివరి ఐదు ఇన్నింగ్స్‌లో రెండు డకౌట్లు కూడా ఉండటం గమనార్హం. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నప్పటికి.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పూర్తిగా ఈ ముంబైకర్ తేలిపోతున్నాడు. తన ఫేవరేట్ షాట్ల ఆడటంలో కూడా సూర్య విఫలమవుతున్నాడు.
ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ సూర్య ఒకేలా ఔటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కూడా ఇదే పరిస్థితి. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగిన శాంసన్.. ఇంగ్లండ్‌పై మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో శాంసన్ కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు.
తొలి మూడు మ్యాచ్‌ల్లో జోఫ్రా అర్చర్ చేతికే సంజూ చిక్కాడు. అయితే ఆఖరి టీ20లో శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఐపీఎల్-2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్, సంజూను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అశ్విన్ అన్నాడు.
"సిరీస్ గెలిచినప్పటికి సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం భారత్‌కు ప్రధాన సమస్యగా మారింది. ఈ సిరీస్‌లో అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో ఎటువంటి లోపాలు లేవు. కానీ బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు సంజూ శాంసన్ కూడా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు.
వీరిద్దిరూ ఒకే రకమైన బంతి, ఒకే ఫీల్డ్ పొజిషేన్‌లో ఔట్ అవ్వుతున్నారు. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో ఇలా జరిగితే ఫర్వాలేదు. కానీ వీరిద్దరూ ప్రతీ మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో తమ వికెట్లను కోల్పోతున్నారు. ఆటగాళ్లు స్వేఛ్చతో ఆడాలన్న విషయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఒకే తరహాలో ఔట్ అవుతున్నప్పుడు దానికి కొత్త సమాధానం కనుగొనాల్సిన బాధ్యత మీపై ఉంది. సూర్యకుమార్ యాదవ్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు.
బ్యాటింగ్‌లో భారత క్రికెట్ అప్రోచ్‌ను మార్చడంలో సూర్య భాగమయ్యాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తన బ్యాటింగ్ విధానాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: CT 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు
Comments
Please login to add a commentAdd a comment