చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్‌ రికార్డు | T20 WC 2026 IND Vs ENG Semi Final Highlights, India Creates History Becomes 1st Team in World To Create This Record, Watch Video Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG Semis Highlights: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్‌ రికార్డు

Mar 5 2026 10:05 PM | Updated on Mar 6 2026 11:35 AM

T20 WC 2026: India Creates History Becomes 1st Team in World To

టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

జింబాబ్వేపై 256 పరుగులు
భారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.

పొట్టి క్రికెట్లో తొలి జట్టుగా
ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.

ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్‌ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు
👉టీమిండియా- ఆరు సార్లు
👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఐదు సార్లు
👉వెస్టిండీస్‌- మూడు సార్లు
👉జింబాబ్వే- మూడు సార్లు
👉సర్రే- మూడు సార్లు.

చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement