ఎస్ఆర్‌హెచ్‌కు షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్‌ | Pat Cummins flies home suddenly in middle of IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఎస్ఆర్‌హెచ్‌కు షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్‌

Apr 4 2026 4:43 PM | Updated on Apr 4 2026 4:52 PM

Pat Cummins flies home suddenly in middle of IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ జట్టుతో చేరినప్పటికి.. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితయ్యాడు. అయితే ఇప్పుడు కమ్మిన్స్ తుది స్కాన్ల కోసం తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినట్లు సమాచారం.

అక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా  పర్యవేక్షణలో అతడికి టెస్ట్‌లు నిర్వహించనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం నుంచి కమ్మిన్స్‌కు సిగ్నల్ వస్తే ఏప్రిల్ 17న ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో కలిసే అవకాశముంది. అంటే సన్‌రైజర్స్ ఆడే కనీసం మూడు మ్యాచ్‌లకు కమ్మిన్స్ అందుబాటులో ఉండడు. అప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు.

ఇక ఈ ఏడాది సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా తిరిగి పుంజుకుంది. కేకేఆర్‌పై 65 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ ఎస్‌ఆర్‌హెచ్ దుమ్ములేపింది. హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ముందు ఊహించినట్టుగానే కమ్మిన్స్ సెకెండ్ హాఫ్ సీజన్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఈషాన్ మలింగ, శివమ్ మావి, స్మరన్ రవిచంద్రన్, కమ్మిన్స్‌,  జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, క్రెయిన్స్ ఫులేట్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మలే, శివంగ్ కుమార్
చదవండి: అతడు నాకంటే ఎంతో బెట‌ర్‌: యువరాజ్‌ సింగ్‌
 

Advertisement
 
Advertisement
Advertisement