T20 World Cup 2026
-
టీ20 వరల్డ్ కప్ కేసులో ముంబై క్రికెటర్ అరెస్ట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్ 2026కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతగాడు సాధారణ టికెట్‌ను రూ. 25000కి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2026 భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను, ఓవరాల్‌గా మూడో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.ఈ టోర్నీ గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. సూపర్-8లో సౌతాఫ్రికా మినహా జింబాబ్వే, వెస్టిండీస్‌పై అద్భుత విజయాలు సాధించి, సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడోసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. -
నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్ శర్మపై యువీ తండ్రి ఫైర్
గత రెండేళ్లుగా టీ20 ఓపెనర్‌గా టీమిండియాలో పాతుకుపోయాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ప్రియ శిష్యుడిగా పేరొందాడు ఈ విధ్వంసకర బ్యాటర్.క్రమశిక్షణ అత్యంత ముఖ్యంఅయితే, యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మాత్రం అభిషేక్ శర్మ ఆట తీరు తనకు నచ్చడం లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఈ పంజాబీ ప్లేయర్ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే తొందరలో మూల్యం చెల్లిస్తున్నాడని యోగ్రాజ్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులకు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. అయితే, ఇప్పటి ఆటగాళ్లలో అది కొరవడిందని పేర్కొన్నాడు.ఒకే సర్ అంటాడు కానీ..ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మకు చెప్పీ చెప్పీ నేను విసిగిపోయాను. ఆటను తేలికగా తీసుకోవద్దని అతడికి ఎన్నోసార్లు మెసేజ్‌లు పెట్టాను. అందుకు బదులుగా.. ‘ఒకే సర్’ అని సమాధానమిస్తాడు.అలా అయితే ఫెయిలై పోతావుమైదానంలో అడుగుపెట్టిన తర్వాత షరా మమూలే. అతడి తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. సింగిల్, డబుల్, బౌండరీ అని ఉంటాయి. కానీ ప్రతిసారి బంతిని గాల్లోకి లేపి సిక్సరే బాదుతానంటే ఎలా?.. మైదానంలో ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు ప్రతిసారి సిక్స్ బాదితే నువ్వు విఫలమైపోతావు’’ అంటూ యోగ్రాజ్ సింగ్ అభిషేక్ శర్మను ఘాటుగా విమర్శించాడు.కాగా ఇటీవల సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్ల తర్వాత రెండు హాఫ్ సెంచరీలతో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో అర్ధ శతకం బాదడంతో అతడిపై విమర్శల జడి కాస్త తగ్గింది. మొత్తానికి భారీ అంచనాలతో తొలిసారి వరల్డ్‌కప్ బరిలో దిగిన అభిషేక్ శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 141 పరుగులు చేయగలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్-2026 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ బరిలోకి దిగాడు.చదవండి: IPL 2026: బంగ్లాదేశ్ యూటర్న్.. కీలక ప్రకటన -
IPL 2026: బంగ్లాదేశ్ యూటర్న్.. కీలక ప్రకటన
బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై తమ దేశంలో ఎలాంటి నిషేధం లేదని ప్రకటించింది. బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖా మంత్రి జాహిర్ ఉద్దీన్ స్వపన్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించాలని భారత్‌లో డిమాండ్లు రాగా.. బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్‌ను తొలగించాల్సిందిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆదేశించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) టీ20 ప్రపంచకప్-2026 వేదికపై అభ్యంతరం లేవనెత్తింది. భారత్‌లో కాకుండా.. పాకిస్తాన్ కోసం ఏర్పాటు చేసిన తటస్థ వేదికైన శ్రీలంకలోనే తాము కూడా మ్యాచ్‌లు ఆడతామని పట్టుబట్టింది.భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ గగ్గోలు పెట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో బంగ్లా వరల్డ్‌కప్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాలో నిషేధిస్తూ అప్పటి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే, తాజాగా ఎన్నికైన ప్రభుత్వం మాత్రం భారత్‌తో స్నేహం కావాలని.. బీసీసీఐతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ మాట్లాడుతూ..‘‘ఐపీఎల్ ప్రసారాల కోసం ఇంత వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. మేము రాజకీయాలు, క్రీడలను కలపాలని అనుకోవడం లేదు. వాణిజ్యపరంగా మాకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై దృష్టి సారిస్తాము.ఏదేని చానెల్ ఐపీఎల్ ప్రసారాల కోసం అనుమతి కోరితే తప్పక సానుకూలాంగా స్పందిస్తాం. ఎవరికీ మేము అడ్డుచెప్పము. ఒకవేళ స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్‌ను ఇక్కడ ప్రసారం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఏ చానెల్‌కైనా మేము అనుమతినిస్తాం’’ అని తెలిపాడు.కాగా బీసీసీఐతో సంబంధాలు తెంచుకుంటే బంగ్లాదేశ్ బోర్డు, ఆటగాళ్లు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగి భారీ మూల్యం చెల్లించిన బంగ్లా క్రికెట్.. ఇకపై సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఆర్థికంగా లబ్ది పొందాలనే యోచనలో ఉంది. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందేమోనన్న భయంతో ఇలా యూటర్న్లు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
T20 WC Semis: నరాలు తెగే ఉత్కంఠ.. నాకు వాళ్ల మద్దతు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేకబ్ బెతెల్ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ తనకు ఊహించని విధంగా మద్దతు లభించిందన్నాడు. భారత్ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ రెండో సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) తలపడిన విషయం తెలిసిందే.253 పరుగుల భారీ స్కోరుముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.టాపార్డర్‌లో ఫిల్ సాల్ట్ (5), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook- 7) పూర్తిగా విఫలం కాగా.. జోస్ బట్లర్ 25 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ జేకబ్ బెతెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేపాడు.బెతెల్ విధ్వంసకర సెంచరీకేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 105 పరుగలతో బెతెల్ సత్తా చాటాడు. అయితే, అతడు రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు అడియాసలయ్యాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ నాలుగు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచినా.. విజయానికి ఇంగ్లండ్ ఏడు పరుగుల దూరంలో నిలిచింది. ఫలితంగా గెలుపు జెండా ఎగురవేసిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే.. వాంఖడేలో తాను విధ్వంసకర రీతిలో విరుచుకుపడుతున్న వేళ ఎదురైన అనుభవాన్ని జేకబ్ బెతెల్ తాజాగా పంచుకున్నాడు. అతడు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ను తిప్పేస్తాడనే భయంతో మైదానం నిశ్శబ్దంగా మారిన వేళ.. కొంతమంది మాత్రం ఆర్సీబీ నామస్మరణ చేశారట.వాళ్లు నాకు మద్దతుగా నిలిచారుఈ విషయం గురించి బెతెల్ మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవరించిన తరుణంలో కొంతమంది ఆర్సీబీ అని అరవడం నా చెవిన పడింది. అలా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తనపై ప్రేమ చూపించారంటూ పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా 22 ఏళ్ల బెతెల్ గతేడాది ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 67 పరుగులు చేశాడు. మినీ వేలానికి ముందు ఆర్సీబీ బెతెల్‌ను అట్టిపెట్టుకోగా ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు -
భవిష్య కెప్టెన్‌గా రింకూ సింగ్.. ప్రకటన విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్, టీ20 ప్రపంచకప్ విజేత రింకూ సింగ్‌ను నియమించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేకేఆర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐపీఎల్-2024లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. ట్రోఫీ అందించిన కెప్టెన్ అయినప్పటికీ కేకేఆర్ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి. కెప్టెన్‌గా రహానేఇక మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు శ్రేయస్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌ను చేసింది. ప్రతిగా 2025లో జట్టును ఫైనల్‌కు చేర్చి అతడు సత్తా చాటాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది.గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్‌గా కొనసాగించనుంది.భవిష్య కెప్టెన్ రింకూనేనిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి కేకేఆర్ భవిష్య కెప్టెన్ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.కాగా 2018 నుంచి రింకూ సింగ్ కేకేఆర్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్‌లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఇటీవల ముగిసిన పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ 2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. పేద కుటుంబంఉత్తరప్రదేశ్కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్‌గా ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.లోక్‌సభ ఎంపీతో నిశ్చితార్థంవరల్డ్కప్ సమయంలో తండ్రి కన్నుమూసినా బాధను దిగమింగి.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. మరోవైపు.. త్వరలోనే రింకూ పెళ్లి బంధంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎంపీ, సుప్రీంకోర్టు లాయర్ ప్రియా సరోజ్‌తో గతేడాది అతడి నిశ్చితార్థం జరిగింది.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?God’s plan has a new chapter ✨ pic.twitter.com/2Gsy55mipi— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026 -
రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్ విన్నర్, టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (RSO)గా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం లక్నోలోని లోక్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాన్ని రింకూకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందజేశారు.కాగా వరల్డ్‌కప్ సమయంలో రింకూ తండ్రి మరణించినప్పటికి.. అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకూ ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లో 24 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చాలా మ్యాచ్‌లలో అతడు ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చాడు. పాక్‌పై కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు.ఓ వైపు గుండె నిండా బాధ ఉన్నప్పటికి.. భారత్ సాధించిన చారిత్రత్మక విజయంలో రింకూ భాగమయ్యాడు. దీంతో అతడి అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగంతో సత్కరించింది. ఉత్తరప్రదేశ్‌లో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది. ఇక రింకూ సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది.నియమాక పత్రాలు అందుకున్న వారు వీరేరింకూ సింగ్: రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్రాజ్కుమార్ పాల్ (హాకీ): పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టు సభ్యుడు రాజ్‌కుమార్ పాల్‌ను డీఎస్పీ గా నియమించారు.ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్): పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కూడా డీఎస్పీ హోదా కల్పించారు.అజిత్ సింగ్, సిమ్రాన్: పారాలింపిక్స్ పతక విజేతలు అజిత్ సింగ్, సిమ్రాన్‌లను జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్లుగా నియమించారు.లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి పురస్కారాలు:ఉద్యోగాలతో పాటు 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే కొత్త పథకంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన -
న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్..!
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్లో లుకలుకలు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో అతడు తన పదవి నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కొత్త ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్‌ను ప్రారంభించాలని సోమవారం నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్‌లో న్యూజిలాండ్ ఆధారిత ఓ జట్టును చేర్చాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయం సభ్యుల మధ్య విభేదాలకు దారితీసింది.ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే నాష్ తన పదవి నుంచి వైదొలగి అందరికి షాకిచ్చాడు. "బోర్డు తీసుకున్న నిర్ణయాలకు నేను మద్దతు ఇవ్వలేను. అందుకే నా పోస్ట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను" అని నాష్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.మొన్న స్కాట్.. నేడు నాష్కాగా ఇదే టీ20 లీగ్ వివాదం కారణంగా గత ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ కూడా పదవి నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు నాష్ ఈ జాబితాలోకి చేరాడు. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయానికి సోఫీ డివైన్, అమీలియా కేర్ వంటి స్టార్ ఉమెన్స్ క్రికెటర్లు మాత్రం మద్దతు తెలుపుతున్నారు.కాగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఐసీసీ నుంచి న్యూజిలాండ్‌కు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ లోటును పూడ్చుకోవడానికే కొత్త లీగ్ ప్రారంభించాలని న్యూజిలాండ్ క్రికెట్ యోచిస్తోంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు -
పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
టీ20 ప్రపంచకప్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌లను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్‌కు చేరడంలో విఫలమైనప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం దుమ్ములేపాడు. ఒక్క భారత్‌పై తప్ప ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలతో అతడు చెలరేగాడు.తద్వారా ఒకే టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 383 పరుగులు సాధించి, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లిని అతడు అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.ఫర్హాన్ కంటే ముందు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, నోమన్ అలీ, హసన్ అలీ వంటి పాక్ ఆటగాళ్లు ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నారు. బాబర్‌కు అయితే అత్యధికంగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంగాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి ఈ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అరుంధతి మొత్తం 8 వికెట్లు పడగొట్టింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో అరుంధతిది కీలక పాత్ర.చదవండి: వైభవ్‌పై డివిలియర్స్ ప్రశంసలు!.. ఆర్సీబీ స్టార్ షాకింగ్ కామెంట్స్ -
భారత్‌తో స్నేహం కావాలి: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన భారత్ చాంపియన్‌గా నిలిచింది. స్వదేశంలో తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీ ముద్దాడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.టోర్నీ నుంచి అవుట్మరోవైపు.. భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెంచుకున్న బంగ్లాదేశ్.. భద్రతా కారణాలు చూపి భారత్‌లో ఆడేందుకు నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకు మార్చాలని కోరగా.. ఐసీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది.ఐపీఎల్ ప్రసారాలపై నిషేధంఐపీఎల్-2026 నుంచి తమ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను తప్పించిన తర్వాతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు కుంటిసాకులతో ఐసీసీ టోర్నీ నుంచి వైదొలిగింది. అంతేకాదు తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఒకానొక సందర్భంలో ప్రకటించింది కూడా!!అయితే, బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం భారత్‌తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐపీఎల్ ప్రసారాల విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ క్రిక్‌బజ్‌తో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్‌తో స్నేహం కావాలి‘‘బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాల గురించి మేము ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. అయితే, రంజాన్ ముగిసిన వెంటనే క్రికెట్ బోర్డుతో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతాము. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాము.ఇండియాతో స్నేహ పూర్వక సంబంధాలనే మేము కోరుకుంటున్నాము. వారితో విభేదాలు, వివాదాలను పరిష్కరించుకుంటాము. క్రీడలలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది మా ఆలోచన. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకుంటాము. ఆ తర్వాతే ఐపీఎల్ ప్రసారాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటాము’’ అని అమినుల్ హక్ పేర్కొన్నారు.పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా షాక్కాగా టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ప్రభుత్వం ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు అన్యాయం చేస్తున్నారని.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ నుంచి తప్పుకొంటామని నాటకాలు ఆడింది. తర్వాత యథావిధిగా మాట మార్చి టోర్నీ ఆడి.. సెమీస్ చేరుకుండానే నిష్క్రమించింది. పీసీబీ ఇలా ఓవరాక్షన్ చేయగా.. బంగ్లాదేశ్ తాజాగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. మరోవైపు.. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలోనూ బంగ్లా బోర్డు సానుకూల వైఖరితో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. చదవండి: హక్కుగా భావిస్తున్నారు.. వాళ్లపై వేటు వేయండి: గావస్కర్ ఫైర్ -
అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు తానే చీఫ్ సెలక్టర్‌గా ఉంటానని అగార్కర్ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.అతడికి ఆ అవసరం లేదుఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ ప్యానెల్‌లోని సబ్ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.అజిత్ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్ వన్డే వరల్డ్‌కప్-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్‌లో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.సాహసోపేత నిర్ణయాలు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్ అగార్కర్ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఆసియా టీ20 కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను భారత్ గెలుచుకుంది.ఇక అజిత్ అగార్కర్‌కు తోడుగా హెడ్‌కోచ్‌గా మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్‌కప్ గెలిచాడు. సీనియర్ల రిటైర్మెంట్ఇక వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక 2024లో వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్ చేసిన బీసీసీఐ? -
వరల్డ్ కప్‌లో జట్టు ఫెయిల్.. కెప్టెన్ సంచలన నిర్ణయం!
ఐర్లాండ్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐరీష్ జట్టు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్టిర్లింగ్ ప్రకటించాడు. జట్టు దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనప్పటికి వన్డేల్లో మాత్రం సారథిగా స్టిర్లింగ్ కొనసాగనున్నాడు.అతడు చివరగా టీ20 ప్రపంచకప్-2026లో ఐరీష్ జట్టును నడిపించాడు. 35 ఏళ్ల స్టిర్లింగ్ ఈ మెగా టోర్నీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురైన స్టిర్లింగ్.. టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు టక్కర్ లేదా హ్యారీ టెక్టర్ ఐర్లాండ్ టీ20 జట్టు బాధ్యతలను చేపట్టే అవకాశముంది. కాగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కేవలం ఒకే ఒక్క విజయం సాధించి టోర్నీని ముగించింది. స్టిర్లింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నప్పటికి ఐర్లాండ్ టీ20 జట్టులో సభ్యునిగా మాత్రం కొనసాగనున్నాడు."టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించడం నాకెంతో గర్వకారణం. నాపై నమ్మకం ఉంచిన క్రికెట్ ఐర్లాండ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. కెప్టెన్సీ వదిలినా, ఒక ఆటగాడిగా జట్టుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది" అని స్టిర్లింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్ -
వాళ్ల ముందు మోకరిల్లారు: పీసీబీపై మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రస్తుత యాజమాన్యం తీరుపై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకరిల్లిందని.. అందుకే పాక్ క్రికెట్ నాశనమైపోయిందని మండిపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో 2023 నుంచి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ కూడా చేరకుండా ఇంటిబాట పట్టిన పాక్.. టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సూపర్-8 చేరకుండానే నిష్క్రమించింది.తాజాగా 2026 టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశ దాటినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. ఇక ఈ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. వన్డే సిరీస్‌లో 2-1తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తద్వారా పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఈ మేరకు బంగ్లా చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది.ఐదారు మందిపైనే ఫోకస్ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ వెటరన్ బ్యాటర్ అహ్మద్ షెబాజ్ పీసీబీ తీరును ఘాటుగా విమర్శించాడు. ‘‘మీ ఆటగాళ్ల స్థాయి మీరు ఊహించిన స్థాయిలో లేదు. పాకిస్తాన్ జట్టు, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వేదికగా మీరు గత 5-7 ఏళ్ల నుంచి 6-8 మందినే ప్రధానంగా చూపిస్తూ హైలైట్ చేస్తున్నారు.పీఎస్ఎల్, పాక్ జట్టు ముఖచిత్రంగా వారిని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం మీ రాత మార్చలేకపోతున్నారు. వాళ్లకు స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్మెంట్ల రూపంలో డబ్బులే డబ్బులు. వాళ్లకు పీఎస్ఎల్లో కెప్టెన్సీలు కూడా మీరే ఇప్పిస్తారు. పాక్ క్రికెట్ అంటే వాళ్లే అనేంతలా ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు.కనక వర్షంకానీ వాళ్లు పాక్ క్రికెట్ వ్యవస్థలోని లోపాలు అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల జేబులు నిండుతున్నాయి. కానీ పాక్ జట్టు ఘోరమైన ఓటములు చవిచూస్తోంది. అయినా సరే అందులో ఒక్క ఆటగాడు కూడా బాధ్యత వహించేందుకు ముందుకు రాడు.జట్టు ఓటమికి ఏవేవో కుంటిసాకులు చెబుతూ తప్పు తమది కాదని పక్క వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీబీ చరిత్రలో ఇంతటి బలహీనమైన యాజమాన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకర్లింది. మీరే దిక్కు అంటూ వారిని నెత్తినపెట్టుకుంది.కొత్త వాళ్లను ప్రోత్సహించే బదులు పాత వాళ్లను అందలం ఎక్కించింది. వాళ్లేమో ప్రతీ టోర్నీలో ఓడటం.. దానికి ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది’’ అని పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీని ఉద్దేశించి అహ్మద్ షెబాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.చదవండి: T20 WC 2026: జోస్ బట్లర్ రిటైర్మెంట్..? -
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచింది.ఇక దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్-2026లో సూర్య (Suryakumar Yadav) కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.సాహసోపేత నిర్ణయాలుఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు.ఫలితంగా జూన్, 2023లో అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు ఈ మాజీ క్రికెటర్. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో పాటు అగార్కర్‌పై కూడా విమర్శలు వచ్చాయి.రో-కో ఆడటం కష్టమంటూఅంతేకాదు వన్డే వరల్డ్‌కప్-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్‌పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్ గిల్‌ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగడం అగార్కర్‌పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరకపోవడం ఇందుకు నిదర్శనం.మరోసారి..ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.వన్డే వరల్డ్‌కప్-2027 ముగిసే వరకు తనను చీఫ్ సెలక్టర్‌గా కొనసాగించాలని అగార్కర్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెస్ట్‌జోన్ నుంచి ఓ మాజీ క్రికెటర్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్ -
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
-
జోస్ బట్లర్ రిటైర్మెంట్..?
జోస్ బట్లర్.. ప్రస్తుత తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. బట్లర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.మొత్తం 8 మ్యాచ్‌లలో అతడు కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 30 పరుగులు సాధించలేకపోయాడు. ఈ క్రమంలో బట్లర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకునున్నట్లు ప్రాచారం జరిగింది. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై బట్లర్ స్పందించాడు. ఇప్పటిలో తనకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని బట్లర్ స్పష్టం చేశాడు. బట్లర్ ఇటీవల ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ తదుపరి వైట్-బాల్ సిరీస్‌లో ఆడతారా? అన్న ప్రశ్న జోస్‌కు ఎదురైంది."ఇంగ్లండ్ తదుపరి సిరీస్‌లో ఆడాలనుకుంటున్నాను. నిజంగానే టీ20 వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన కనబరిచాను. ఇలా ఆడుతానని అస్సలు ఊహించలేదు. అది తీవ్ర నిరాశ కలిగించింది. అయితే గత కొన్నేళ్లుగా నా కెరీర్లోనే అత్యుత్తమ క్రికెట్ ఆడాను. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాననే నమ్మకం నాకు ఉంది. ఇంగ్లండ్ తరపున మరి కొంత కాలం ఆడాలనుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు కెప్టెన్‌ని కాను కేవలం ప్లేయర్ మాత్రమే. జట్టులో కొనసాగడం లేకపోవడం అనేది సెలెక్టర్ల చేతుల్లో ఉంటుంది. ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రపంచకప్ తర్వాత ఫ్యామిలీతో గడిపిన సమయం నాకు ఉపశమనం కలిగించింది" అని బట్లర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ వైఫల్యం తర్వాత బట్లర్ తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్ ట్రిప్‌నకు వెళ్లాడు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్-2026 సీజన్ కోసం భారత్‌కు రానున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున బట్లర్ బరిలోకి దిగనున్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్‌గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే -
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్‌గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్.. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్ దశలో వరుసగా హాఫ్ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్ మ్యాచ్‌లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్ టీ20 వరల్డ్‌కప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్ రూమ్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్ , కెప్టెన్ డ్రెసింగ్‌రూమ్‌లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’ -
డీఎస్పీగా సంజూ శాంసన్!?
టీ20 వరల్డ్‌కప్-2026ను గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. కీలకమైన సూపర్-8 మ్యాచ్‌తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.సంజూ కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 80.25 సగటు 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంజూను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో సత్కరించిందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై కేరళ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇవన్ని అసత్య ప్రచారాలని, కేరళ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా సృష్టించినవి మాత్రమే. కాగా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం తిరువనంతపురంలో శాంసన్‌ను కేరళ సర్కార్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గోన్నారు. అంతేతప్ప అతడికి నగదు బహుమతి కానీ, ఉద్యోగం కానీ ప్రకటించలేదు. చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
’అర్ష్‌దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ వ్యవహరించిన తీరుపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో తాను న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పానని తెలిపాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న జరిగిన ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడ్డ సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో భారత్ కివీస్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని గెలుచుకుంది. ఇదిలా ఉంటే.. టైటిల్ పోరులో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అర్ష్ బౌలింగ్‌లో మిచెల్ అతడి వైపే బంతిని ఆడాడు.బాల్‌తో కొట్టిన అర్ష్‌దీప్ బాల్ అందుకున్న అర్ష్‌దీప్ దానిని మిచెల్ వైపు విసిరి కొట్టగా.. అతడికి బలంగా తాకింది. దీంతో మిచెల్ ఆగ్రహంతో అర్ష్ వైపు దూసుకురాగా.. అంపైర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చి సముదాయించడంతో పరిస్థితి చల్లబడింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం నిబంధనల ప్రకారం.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది.అర్ష్‌దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పానుఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డారిల్ మిచెల్‌పైకి అర్ష్‌దీప్ సింగ్ బంతి విసిరిన సందర్భంలో నేను కివీస్ ప్లేయర్‌కు క్షమాపణలు చెప్పా. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది. అర్ష్ దీప్ కూడా క్షణికావేశంలో జరిగిపోయిందని అన్నాడు. వెంటనే మిచెల్‌కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్ అనంతరం అర్ష్ దీప్ బహిరంగంగా సైతం ఇదే పనిచేశాడు. సారథిగా ప్రత్యర్థి ప్లేయర్లను సైతం గౌరవించడం నా బాధ్యత’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఈ విషయంలో అర్ష్దీప్నుకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. దేశం కోసం ఆడే సమయంలో ఆ మాత్రం దూకుడు అవసరమని.. తన దృష్టిలో అర్ష్ క్షమాపణ చెపాల్సిన అవసరం లేదని సమర్థించాడు.చదవండి: సన్‌రైజర్స్‌పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్! -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచి టీమిండియా సరికొత్త రికార్డు సాధించింది. మొత్తంగా మూడోసారి, సొంతగడ్డపై తొలిసారి పొట్టి క్రికెట్ కప్ ట్రోఫీని ముద్దాడిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.ఇక ఈ విజయంతో భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో చేరాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, ఈ టోర్నీ అనంతరం అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతాడని.. ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి.ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంఅయితే, న్యూజిలాండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత ఒలింపిక్స్-2028లో ఆడటమే తన లక్ష్యమని చెబుతూ సూర్య.. ఈ రూమర్లకు చెక్ పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎవరూ ఊహించని పేరును అతడు ప్రతిపాదించాడు. జట్టులో చోటే లేని ఆటగాడు సారథి కాగలడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడటం గమనార్హం.ఐపీఎల్లో సారథిగా సత్తాకాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు మారిన ఈ ముంబైకర్.. ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సారథిగా, బ్యాటర్ అదరగొట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్‌ను సెలక్టర్లు కనికరించలేదు.శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ... జట్టులో స్థానం లేనందునే అతడికి చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా వెల్లడించాడు. ఆసియా టీ20 కప్-2025 టోర్నీకి జట్టు ప్రకటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2026 జట్టులోనూ శ్రేయస్‌కు స్థానం దక్కలేదు.టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదు?దేశీ టీ20 క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటినప్పటికీ శ్రేయస్ అయ్యర్ వేచిచూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆకాశ్ చోప్రా మాత్రం అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణిస్తే శ్రేయస్‌కు మరో అవకాశం దక్కుతుంది. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని నేను భావించాను. మిడిలార్డర్లో ఒకవేళ చోటు ఖాళీ అయితే కచ్చితంగా అది అతడికే దక్కుతుంది.కాబట్టి త్వరలోనే శ్రేయస్ భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.. టీమిండియా తదుపరి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఉండకూడదు? అందుకు అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. -
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్ సాధించిన తర్వాత తిలక్ వర్మ సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా తిలక్‌ను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కలుసుకున్న సీఎం రేవంత్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఇదే కార్యక్రమంలో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్‌ను కూడా సీఎం సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు. -
‘పీసీబీవన్నీ దిక్కుమాలిన నిర్ణయాలు’!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్ ఓటమి అనంతరం షాహిద్ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్టును షేర్ చేసుకున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్ కమిటీదే. ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షహీన్ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలి. బాబర్ ఆజమ్ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారు. కెప్టెన్‌గా అతనికి మంచి రికార్డు ఉంది. కనీసం ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీస్ చేరడంలో విఫలమైంది. తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో కోల్పోవడం చూస్తుంటే ఇదంతా సెలక్షన్ కమిటీ తప్పిదమేని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలన్న విషయం కూడా పీసీబీ అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. జాతీయ జట్టుకు సర్జరీ అనే పేరుతో మార్పులు అంటూ ఇప్పటికే చాలా చేశారు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. దేశవాలీ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా తయారవుతుంది. పాక్ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే స్థాయి ఎప్పుడో కనుమరుగైంది. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టించింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రతీ టోర్నీలో అపజయాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ASports (@asportstv.pk)చదవండి: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త! -
అవకాశమొస్తే ఆడకుండా ఉంటానా?
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా సూర్యకుమార్ అరుదైన ఘనత సాధించాడు.క్రికెట్లో మూడు ఫార్మాట్లు ఆడాలనే కల ఏ క్రికెటర్‌కైనా ఉంటుంది. సూర్య జట్టులోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం టీ20లకే పరిమితం కావడం కొంతమేర ఆశ్చర్యం కలిగిస్తుంది. కెరీర్ ఆరంభంలో వన్డేలతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ ఆ తర్వాత టీ20 స్పెషలిస్ట్‌గానే ముద్ర వేసుకున్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ తాను వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘ఏది రాసిపెట్టి ఉంటే జీవితంలో అదే జరుగుతుంది. తొలుత నేను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు రెడ్‌బాల్ క్రికెట్ ఆడా. దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైకి ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ రెడ్‌బాల్ క్రికెట్‌తోనే మొదలుపెడతారు. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆట వైపు వచ్చినప్పుడు ఇక్కడే సౌకర్యంగా అనిపించింది. మరీ ముఖ్యంగా టీ20లకు బాగా సెట్ అయ్యా. వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాకు టెస్టు క్రికెట్‌పై ప్రేమ లేదని చెప్పను. ఎందుకంటే 2010 నుంచి 2020 వరకూ రంజీల్లో ఆడా. ఆ ఫార్మాట్‌ను ఆస్వాదించా. ఎవరైనా సరే టెస్టు క్రికెట్ ఆడే అవకాశం వస్తే వద్దంటారా చెప్పండి? అయితే నాకున్న క్రికెట్ అనుభవం ప్రకారం ఈ ఫార్మాట్లో మూడు భిన్నమైన మార్గాల్లో ఆడాల్సి ఉంటుంది.కొన్నిసార్లు త్వరగా వికెట్లు పడి ముందుగా క్రీజులోకి వెళ్తే టెస్టుల్లో మాదిరిగా నెమ్మదిగా ఆడాలి. మధ్య ఓవర్లలో స్ట్రైక్ట్ పెంచుకుంటూ పోవాలి. ఇక ఆఖర్లో టీ20ల మాదిరిగా చెలరేగాలి. అందుకేనేమో నాకు ఈ వన్డే ఫార్మాట్ సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. నేను వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆడాను.అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. మూడు ఫార్మాట్లకు ఉన్న ఆకర్షణ పూర్తిగా భిన్నమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ ఆడి 8 పరుగులు, 37 వన్డేల్లో 773 పరుగులు సాధించాడు. ఇక 113 టీ20ల్లో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రెండు ముక్కల్లో విషెస్.. ట్రోల్‌కు గురైన బుమ్రా! -
రెండు ముక్కల్లో విషెస్.. ట్రోల్‌కు గురైన బుమ్రా!
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. అయితే బుమ్రా తన పెళ్లి రోజు వేడుకను పురస్కరించుకొని తన భార్యకు పంపిన రెండు ముక్కల సందేశం అతన్ని ట్రోల్‌కు గురయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సంజనా గణేశన్‌కు ‘హ్యాపీ యానివర్సరీ’ అని రెండు ముక్కల్లోనే విషెస్ తెలిపాడు. బుమ్రా పోస్ట్‌పై సంజనా గణేశన్ స్పందిస్తూ.. ‘కిడ్నీ టచ్చింగ్ క్యాప్షన్ యార్’ అని పేర్కొంది. ఆ తర్వాత బుమ్రాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న సంజనా గణేశన్.. ‘జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, ప్రపంచం ఎంతదూరం తీసుకెళ్లినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నా ప్రాణ స్నేహితుడితో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నీ కౌగిలిలో నన్ను బంధించి నన్ను మైమరపించావు. కానీ నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది మన ప్రేమకథే అని బలంగా చెప్పగలను. లవ్ యూ బుమ్రా’ అంటూ మరో పోస్టును షేర్ చేసుకుంది. ఇక స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో బుమ్రాకు 2013లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. రెండేళ్లు డేటింగ్ చేసిన అనంతరం మార్చి 15, 2021న ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ దంపతులకు 2023లో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: ‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’ View this post on Instagram A post shared by S A N J A N A G A N E S A N (@sanjanaganesan) -
టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోని రావాలి: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నవ్వడం అరుదు. ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపించే ఈ ఢిల్లీ స్టార్ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూడగలం. ఇటీవల భారత్ టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన సందర్భంగా గౌతీ నవ్వులు చిందించడం అభిమానులకు కనువిందు చేసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్, భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన వీరుడు మహేంద్ర సింగ్ ధోని సైతం గౌతీ నవ్వు గురించి కామెంట్ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఒకప్పటి సహచర ఆటగాడు గంభీర్‌ను ఉద్దేశించి ధోని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.గంభీరమైన ముఖంలో ఆ నవ్వు..‘‘కోచ్ సాహెబ్.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు’’ అంటూ ధోని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఉంటుందా!.. నిన్ను చూడటం సంతోషంగా ఉంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ధోని ఈసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మరోసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్‌ను ముద్దాడిన దృశ్యాలను ధోని ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ నేపథ్యంలో గంభీర్ ధోనిని కలుసుకోవడం సంతోషమంటూ కామెంట్ చేశాడు.అతడు నా స్థానంలో ఉండాలిఇక తాజాగా రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్‌కు ధోని ‘స్మైల్ కామెంట్’ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రపంచకప్ ఫైనల్ చూసేందుకు ధోని అక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. తను నన్ను నవ్వమని అడగటం కూడా నచ్చింది.ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్ రాస్తాను. అతడు కూడా డగౌట్లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు. తనలాగే ధోని టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. కోచ్ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు.ధోని సారథ్యంలో గౌతీకాగా 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్సీలోనే సొంతగడ్డపై శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.ఈ రెండు సందర్భాల్లోనూ గౌతం గంభీర్ భారత జట్టులో సభ్యుడు. ఇక ధోని 2013లో కెప్టెన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. మరోవైపు.. 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది.ఇక తాజా విజయంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. చదవండి: T20 WC: ఆ ఒక్క ఎంపిక విషయంలోనే మా మధ్య విభేదాలు: సూర్య -
ఆ ఒక్క ఎంపిక విషయంలోనే గౌతీ భాయ్‌తో విభేదాలు: సూర్య
టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చేరాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ గెలవడంతో సూర్యకు ఈ అరుదైన గౌరవం దక్కింది.మరోవైపు.. ఈ విజయంతో హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిపించిన గౌతీ.. తాజాగా సూర్యతో కలిసి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు.ఒకటీ రెండు విషయాల్లో విభేదాలుఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఆలోచనలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని తెలిపాడు. అయితే, ఒకటీ రెండు విషయాల్లో తమ మధ్య విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అయినా.. అవి అంతగా పట్టించుకోదగ్గ విషయాలు కావని పేర్కొన్నాడు.వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. ‘‘జట్టును ఎంపిక చేసే సమయంలో 15 మంది పేర్లలో పద్నాలుగు మేమిద్దరం కలిసి చెప్పినవే ఉంటాయి. మేము ఒకే విధంగా ఆలోచిస్తున్నామనడానికి ఇది నిదర్శనం.చర్చ మాత్రమే ఉంటుందిమా లక్ష్యాలు కూడా ఒక్కటే. అందుకే ఆ ఒక్క పేరు విషయంలో మా మధ్య వాదనలు కాకుండా చర్చ మాత్రమే ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇప్పటికీ తాను గంభీర్‌ను గౌతీ భాయ్ అనే పిలుస్తానని.. తమది అన్నాదమ్ముల అనుబంధం అని తెలిపాడు.పరిస్థితికి తగినట్లేఇక వరల్డ్‌కప్‌లో తాము ఆడిన విధానంపై స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఆడటానికి, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు హై రిస్కీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి అలాగే చేయలేము. పరిస్థితికి తగినట్లే ఆడి అనుకున్న ఫలితం రాబట్టడమే మా ప్రధాన లక్ష్యం’’ అని సూర్య చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ -
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
-
అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్ ప్రశంసలు
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. సూర్యకుమార్, గంభీర్ బృందంపై ప్రశంసలు‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్‌లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను చూస్తే మన జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. అతడి ఆట అసాధారణంసామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్‌లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్‌లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు. చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’ -
‘ఇది ఆరంభం మాత్రమే’
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్‌ను అందించాలని అనుకున్నా.నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్‌లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు. -
‘అభిషేక్‌ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్‌కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్‌ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ఫేస్ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్‌ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్‌గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అభిషేక్‌ను చూసి అసూయపడేవారు! -
12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్
టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కారుతో దర్శనమిచ్చాడు. 12 కోట్ల విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ కారును తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు. నలుపు రంగులో ఉన్న ఫెరారీ కారును తానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. కారులో అతడి పక్కనే తన గర్ల్‌ఫ్రెండ్ మిహికా శర్మ కూడా ఉండడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ అభిమాని తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా హార్దిక్ పాండ్యా వద్ద ఇప్పటికే రోల్స్ రాయ్స్ ఫాంటమ్, లంబోర్గిని హురాకాన్ ఈవీవో, లంబోర్గిని యూరస్, మెర్సిడెస్ -ఏజీఎం జీ63, రేంజ్ రోవర్., ఆడీ ఏ6 కార్లు ఉన్నాయి.తాజాగా వీటి సరసన ఫెరారీ కారు వచ్చి చేరింది. ఇక హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 160 స్ట్రైక్‌రేట్ 217 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లోనూ తన ప్రతిభ చూపిన హార్దిక్ 9 వికెట్లు పడగొట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో హార్దిక్ పాండ్యా జాతీయజెండాను శరీరానికి కప్పుకొని ఉన్న సమయంలోనే అతడి ప్రేయసి మిహికా శర్మ అతని చెంపపై ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చదవండి: తంజిద్ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు! Hardik Pandya’s new Ferrari 12Cilindri worth 12cr. pic.twitter.com/QovLNVB8kY— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2026 -
అభిషేక్‌ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్‌తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్‌స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్‌పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో భద్రతా కారణాల రీత్యా తమ ఆటగాళ్లను పంపలేమంటూ సాకులు చెప్పి వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండిపోయింది. వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఐసీసీ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముప్పు లేదని, తాము భరోసా కల్పిస్తామని పేర్కొంది. అయినా కూడా బంగ్లాదేశ్ జట్టు మాట వినకుండా టోర్నీ నుంచి వైదొలిగింది అయితే బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు అప్పట్లో కొత్త డ్రామాకు తెరతీసింది. అయితే ఐసీసీ హెచ్చరికలు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఆడిన డ్రామాల గురించి ఐసీసీ చైర్మన్ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్‌కప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసీసీ ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగాటోర్నీని నిర్వహించాం. పాక్, బంగ్లాదేశ్ నాటకాలు ఫలించలేదు.ఐసీసీ చైర్మన్‌గా నేను ఒకటే మాట చెప్పదలచుకున్నా.. ఐసీసీ కంటే కూడా ఏ జట్టూ గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. ఇక ఈసారి ప్రపంచకప్ వ్యూయర్షిప్ పరంగానూ కొత్త రికార్డులకు నాంది పలికింది. ఓవరాల్ వీక్షణలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. భారత్‌కు అమెరికా, పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్ గట్టిపోటీనిస్తే, పటిష్ఠమైన ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టికరిపించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు నేపాల్ ఓటమి భయం చూపించింది. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రత్యేక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఉన్నతస్థాయి నుంచి అథమ స్థాయికి పడిపోవడానికి నెలల సమయం చాలు. కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. శ్రమిస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం -
బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పాక్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్. అతని బౌలింగ్ యాక్షన్ కూడా భిన్నంగానే ఉంటుంది. బుమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బుమ్రా వేగంతో బంతిని విసరడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. స్మిన్నర్ తారిఖ్ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్ దొరకడు’ అని పేర్కొన్నాడు. కాగా ఆకిబ్ జావేద్ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్ తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.Jasprit Bumrah Is The Usman Tariq Of Fast Bowling. Aqib Javed #pakistancricketteam pic.twitter.com/eEotIXvyt5— Shreyas Iyer Fan Page (@IyerFanPage) March 14, 2026చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్ -
ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్!
క్రికెట్ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్ ఏ యాంగిల్లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్ తన క్రికెట్ కెరీర్లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్‌గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు.టీ20 క్రికెట్లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా సూర్య తన కెరీర్లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్‌లు ఆడి 162.94 స్ట్రైక్‌రేట్‌తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.ప్రస్తుతం సూర్యకుమార్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్ ఆ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో బౌండరీ వద్ద క్యాచ్ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ భారత్‌వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్ గెలవడం చకచకా జరిగిపోయాయి.రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్) రావడం విశేషం. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టీమిండియా తరఫున 31 మ్యాచ్‌ల్లో 187 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. చదవండి: తూచ్.. అదంతా ఉత్తిదే!5 years ago, a dream turned into reality. Wearing the India jersey is a feeling I can still never fully put into words 🇮🇳Here’s to many more memories that we’re going to create, for team 🇮🇳 pic.twitter.com/qhis2f44tQ— Surya Kumar Yadav (@surya_14kumar) March 14, 2026 -
తూచ్.. అదంతా ఉత్తిదే!
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ఆటతీరుతో సూపర్-8లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పాక్ జట్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక్కో ఆటగాడికి పీకేఆర్ 50 లక్షలు (భారత కరెన్సీలో సుమారు రూ.16.5 లక్షలు) జరిమానా విధిస్తున్నట్లు కొన్ని రోజుల కిందట ఆ దేశ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ కఠిన నిర్ణయం స్వయంగా పీసీబీ చైర్మన్ మొహసీన్ నఖ్వీనే తీసుకున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా పాక్ ఆటగాళ్లకు విధించిన జరిమానాల్లో నిజమెంత అనే దానిపై పీసీబీ ప్రతినిధి ఆమిర్‌మిర్ స్పందించారు. ‘టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన కనబరిచినందుకు పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న గాసిఫ్ మాత్రమే. అలాంటి నిర్ణయాలు పీసీబీ ఎప్పుడూ తీసుకోదు. ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనకుగానూ పాకిస్థాన్ ఆటగాళ్లను, కోచ్, సిబ్బందిని హెచ్చరించిన మాట నిజమే కావొచ్చు. కానీ ఆటగాళ్లపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు గానీ జరిమానా కానీ విధించలేదు.’ అని చెప్పుకొచ్చారు.ఇక సల్మాన్ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై తడబడి గెలిచింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ ఎలాగోలా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. కానీ కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2024లోనూ పాక్ జట్టు సెమీస్ చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా నాసిరకం ఆటతీరుతో నాకౌట్‌కు చేరకుండానే పాకిస్థాన్ వరుసగా రెండోసారి సూపర్-8 దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం కారణంగా ఆటగాళ్లకు జరిమానా విధించారన్న విషయంపై వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. పాక్ ఆటగాళ్లకు విధించిన జరిమానా మొత్తాన్ని తాను కడుతానని, కానీ ఆ డబ్బులు జట్టును మళ్లీ మంచి ట్రాక్‌లోకి తెచ్చేందుకు ఉపయోగించాలని కోరడం గమనార్హం. ఇటీవలే బంగ్లాదేశ్‌లో మొదలైన వన్డే సిరీస్‌ను కూడా పాక్ ఓటమితోనే ప్రారంభించింది. తొలి వన్డేలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో వన్డేలో మాత్రం బంగ్లాపై డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.చదవండి: ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు! -
ఇది కాదు.. గంభీర్‌కు ముందుంది అసలైన సవాల్: గంగూలీ
గౌతమ్ గంభీర్.. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్లేయర్‌గా, హెడ్‌కోచ్‌గా ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు. సభ్యునిగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలుచుకున్న గంభీర్.. ఇప్పుడు కోచ్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు వన్డే ప్రపంచకప్-2027 అసలైన సవాల్ ఎదురుకానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.వైట్వాల్ క్రికెట్లో గంభీర్‌కు అసలైన పరీక్షకు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో ఎదురుకానుంది. అక్కడి పరిస్థితులు జట్టును, కోచ్‌ను తీవ్రంగా పరీక్షిస్తాయి. అయితే గంభీర్ వద్ద ఉన్న జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు కోచ్‌గా మరోసారి ఖచ్చితంగా సాధిస్తాడని గంగూలీ పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్‌ను తృటిలో కోల్పోయిన భారత జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ కానుండడంతో భారత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. "టెస్టుల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా పిచ్ ఎలా ఉంటుందనే ఆలోచనను పక్కన పెట్టాలి. పిచ్‌ను ఒక భూతంలా చూడటం మానేయాలి. స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదు.మంచి వికెట్లపై ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లండ్ సిరీస్ ఫలితాలే అందుకు నిదర్శనమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ నేతృత్వంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోయింది.చదవండి: BAN vs PAK: ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్ -
WC: ఫీల్డింగ్‌లో ‘వరస్ట్’!.. భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కానీ.. లీగ్ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.చాంపియన్గాఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్ దిశగా అడుగులు వేసి చాంపియన్‌గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ఫీల్డింగ్‌లో ‘వరస్ట్’!ముఖ్యంగా సూపర్-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.భారత మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలుఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. క్యాచ్‌లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్‌లు వదిలేశారు.ఫీల్డింగ్ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చింది.టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 జట్ల క్యాచింగ్ సామర్థ్యంఇంగ్లండ్- 87.2%జింబాబ్వే- 85.4%వెస్టిండీస్- 84.6%న్యూజిలాండ్- 83.9%పాకిస్తాన్- 83.3%సౌతాఫ్రికా- 81.1%శ్రీలంక- 77.8%ఇండియా- 72.7%.చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన చిన్ననాటి స్నేహితురాలు వనిష్కను శనివారం ఉత్తరాఖండ్‌లోని మస్సూరి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పెళ్లికి కూడా కొద్ది మంది సెలబ్రెటీలకు మాత్రమే ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సహా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలలతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ నుంచి పెళ్లి ఆహ్వానం అందుకున్న టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ శుక్రవారమే డెహ్రాడూన్‌లో అడుగుపెట్టాడు.కుల్దీప్ యాదవ్ పెళ్లి పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, మా అన్న పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ధూంధాంగా ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. కాగా గతేడాది జూన్‌లోనే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లక్నో వేదికగా తన స్నేహితురాలు వనిష్కతో కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి పెళ్లి గతేడాది నవంబర్లోనే కావాల్సి ఉండగా.. ఈలోగా టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల కావడం, కుల్దీప్ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో కుల్దీప్ యాదవ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకుంది. ప్రపంచకప్ గెలిచిన ఆనందానికి తోడు ఇప్పుడు కుల్దీప్ పెళ్లి కూడా తోడవ్వడంతో ఆ సంతోషం రెట్టింపుగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. తుదిజట్టు పటిష్టంగా ఉండడంతో కుల్దీప్కు జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు యజ్వేంద్ర చాహల్ 2023 తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.చదవండి: IPL 2026: ధోనికిదే చివరి సీజన్! -
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా.. మూడుసార్లు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక టీమ్‌గా.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డులు సాధించింది.సెమీస్ దాకా వైఫల్యాలునిజానికి లీగ్ దశలో భారత్ అజేయంగా నిలిచినా.. ఆయా మ్యాచ్‌లలో తమ ప్రదర్శన కోచ్ గౌతం గంభీర్‌కు సైతం సంతృప్తినివ్వలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్వయంగా చెప్పాడు. ఇక భారీ అంచనాలతో తొలిసారి బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సెమీస్ దాకా వైఫల్యాలు కొనసాగించాడు.మరోవైపు.. సంజూ శాంసన్‌కు ఆది నుంచి తుదిజట్టులో చోటులేని పరిస్థితి. అయితే, నాకౌట్ మ్యాచ్‌లలో అంటే వెస్టిండీస్‌తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 నాటౌట్, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో రాణించి దుమ్ములేపాడు.టైటిల్ పోరులో విధ్వంసకర అర్ద శతకంఇక అభిషేక్ శర్మ సైతం అసలైన టైటిల్ పోరులో విధ్వంసకర అర్ద శతకం (21 బంతుల్లో 52)తో సత్తా చాటాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జట్టులోని ప్రతి సభ్యుడూ కీలక సమయాల్లో రాణించి తమ వంతు పాత్ర పోషించారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘గేమ్‌ను టీమిండియా బాగా అర్థం చేసుకుంది. ముఖ్యంగా ఫైనల్లో వారు అద్భుతం చేశారు. బుమ్రా ఆడిన తీరు చూస్తే.. సూపర్స్టార్ల నుంచి ఏ జట్టైనా కోరుకునేది ఇదే కదా అనిపిస్తుంది.రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటంఅభిషేక్ శర్మ ఆటకు నేను వీరాభిమానిని. అయితే, టోర్నీ ఆరంభంలో అతడు డకౌట్లు కావడం.. ఆ తర్వాత కూడా విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఒత్తిడిలోకి కూరుకుపోయాడు.అయితే, తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించాడు. కొంతమంది రాస్కెల్స్ ఉంటారు.. నిప్పుతో చెలగాటం ఆడటం వారికి సరదా! ఫైనల్లో అభిషేక్ శర్మ విజృంభించిన తీరు చూస్తే మీకే ఇది అర్థమవుతుంది. అందరూ అతడే ఒత్తిడిలో ఉంటాడనుకుంటే.. అతడు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు’’ అని బ్రాడ్ హాడిన్ ప్రశంలస వర్షం కురిపించాడు. చదవండి: ‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’ -
‘సౌతాఫ్రికా ఒక తెలివితక్కువ టీమ్’
టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా కంటే తెలివితక్కువ జట్టు మరొకటి లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే బలమైన టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టి ఉండేది కాదని, టైటిల్ గెలిచేది కాదని పేర్కొన్నాడు.‘మీకో విషయం చెప్పదలచుకున్నా. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) తెలివితక్కువ జట్టు కచ్చితంగా దక్షిణాఫ్రికానే. ఎందుకంటే సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే భారత్ టోర్నీ నుంచే నిష్క్రమించేది. కానీ విండీస్‌తో మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా ఒక రకంగా భారత్‌కు వరల్డ్‌కప్‌లో కొనసాగేందుకు అవకాశం కల్పించింది. కానీ సఫారీల చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా వరుసగా వెస్టిండీస్, జింబాబ్వేలను మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. నాకౌట్ పోరులో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. కానీ సౌతాఫ్రికా ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది. వాస్తవానికి ఇలాంటివి జరగకూడదు. మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఉత్తమ జట్టును తొందరగానే టోర్నీ నుంచి బయటకు పంపాలి’ అని వాన్ చెప్పుకొచ్చాడు.అయితే ఇంగ్లండ్ మాజీపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం.. స్వలాభం కోసం ఓడిపోవడం సరైన చర్య కాదు’.. ‘సౌతాఫ్రికాకు ఈసారి వరల్డ్‌కప్ గెలిచే అవకాశం చేజార్చుకుంది. ఒకవేళ సెమీస్ చేరినా ఆ జట్టు ఫైనల్ చేరకపోయి ఉండేదేమో’ అని కామెంట్స్ చేశారు. ఇక సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో నెట్ రన్‌రేట్ మైనస్‌కు పడిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెమీస్ అవకాశాలు కష్టంగా ఉన్నప్పటికీ వెస్టిండీస్, జింబాబ్వేలపై అద్భుతంగా ఆడిన భారత్ విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడింది. కానీ ఛేదనలో ఇంగ్లండ్ వణుకు పుట్టించినప్పటికీ చివరకు గట్టెక్కిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరు మాత్రం వన్‌సైడ్‌గా మారిపోయింది. మొదట బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, ఆ తర్వాత బౌలింగ్‌లో బుమ్రాల రాణింపుతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్కప్ను, మొత్తంగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.చదవండి: లార్డ్స్ స్టేడియంలో బీర్లు బంద్! -
‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’
జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్‌గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూను రీప్లేస్ చేశాడు. వరుస మ్యాచ్‌లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.అలా వచ్చిఇక సంజూ ఈసారి కూడా వరల్డ్‌కప్ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌తో పాటు సంజూ ఓపెనర్‌గా బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచ్‌లలో ఆకాశమే హద్దుగాఅనంతరం సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. జట్టును సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవిఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్‌కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్‌లలో శాంసన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్‌లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.చదవండి: రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త -
బాహుబలి పాటతో స్ఫూర్తి పొందాం
ముుంబై: భారత్‌కు టి20 వరల్డ్ కప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఘనత సాధించాడు. ఫైనల్ ముగిసిన రోజునుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. విశేషాలు సూర్యకుమార్ మాటల్లోనే... కెప్టెన్సీ, వరల్డ్ కప్ గెలిపించడంపై... రోహిత్ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్‌ను చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నిన్ను కెప్టెన్‌గా నియమిస్తున్నామని జై షా చెప్పారు. అప్పుడే కోచ్ గంభీర్‌తో మాట్లాడి వరల్డ్ కప్ గెలవాలనే ఏకైక లక్ష్యంతో రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం. ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా ప్రపంచ కప్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉంది. 2024 ప్రపంచకప్‌తో పోలిక...అప్పటికంటే మా బ్రాండ్ క్రికెట్‌కు మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుగా గెలవడం ముఖ్యం అని అందరికీ చెప్పాం. సెమీస్ చేరే వరకు కూడా అత్యధిక పరుగుల, వికెట్ల జాబితాలో మన ఆటగాళ్లెవరూ లేరు. ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించడంతో వరుసగా విజయాలు వచ్చాయి. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడుతుంది. ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుంది అని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చాలని, ఇక్కడా అదే ధాటిని కొనసాగించాలని భావించాం.మర్చిపోలేని క్షణాలు... వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్‌గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా నా చెంపపై రెండు సార్లు దెబ్బ వేసి మరీ ముందుకు సాగాను. మైదానంలో చూస్తే అక్షర్ పట్టిన క్యాచ్ అద్భుతం. నేను 2024 ఫైనల్లో అందుకున్న క్యాచ్ లాంటిదే ఇది కూడా. దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత ‘సాహోరే...బాహుబలి’ పాటతో ప్రత్యేకంగా పది నిమిషాల రీల్ చేసి మా వీడియో అనలిస్ట్ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. -
టీ20 ప్రపంచకప్ 2026 హీరోకు ఘోర అవమానం
తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చడంతో పాటు టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర బ్యాటర్ టిమ్ సీఫర్ట్‌కు ఘోర అవమానం జరిగింది. ఇవాళ (మార్చి 12) జరుగుతున్న హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఈ వేలంలో టిమ్ టైర్-1 బ్యాటర్‌గా లక్షల పౌండ్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నా, టిమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. టిమ్ పేరు వేలంలో మరోసారి వచ్చే అవకాశం ఉంది.టిమ్ తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 166.33 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించాడు. ఈ టోర్నీలో టిమ్‌వే అత్యధిక హాఫ్ సెంచరీలు (4). టిమ్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్-2026 వేలంలో కేకేఆర్ రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలానికి సరిగ్గా ముందు రోజు టిమ్ బిగ్‌బాష్ లీగ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజాగా భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మిగతా న్యూజిలాండ్ బ్యాటర్లంతా విఫలమైనా టిమ్ ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లోనూ టిమ్ అర్ద సెంచరీతో (58) సత్తా చాటాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన టిమ్‌ను హండ్రెడ్ లీగ్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.ఇదిలా ఉంటే, ప్రస్తుతం లండన్‌లో పురుషుల హండ్రెడ్ లీగ్ వేలం జోరుగా సాగుతోంది. దేశ, విదేశాల ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. హండ్రెడ్ లీగ్ చరిత్రలో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ పద్దతిలో జరిగేది. నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్ లీగ్ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్, బెత్ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్ లాంటి స్టార్ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్ ఫాతిమా సనా కూడా అన్ సోల్డ్‌గా మిగిలిపోయింది. -
T20 WC: రోహిత్, ద్రవిడ్‌పై సూర్యకుమార్ విమర్శలు?!
టీమిండియా ఇప్పటికి మూడు టీ20 ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచింది. ఐసీసీ తొలిసారి 2007లో ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్‌లో ధోని సారథ్యంలో విజేతగా నిలిచిన భారత్.. 2024లో రోహిత్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.2024 మాదిరి కాదుఅయితే, 2024లో నాటి కెప్టెన్ రోహిత్- హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rohit Sharma- Rahul Dravid) అనుసరించిన విధానాలకు, 2026లో సూర్య- గంభీర్ వ్యూహాలకు చాలా తేడా ఉందని యాజమాన్యం చెబుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్వయంగా స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదనే నియమం పెట్టుకున్నామని.. అదే తమకు సత్ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నాడు.వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి..‘‘2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఎలా ఆడామో మాకు తెలుసు. అయితే, అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌తో కొనసాగితే కష్టమని అర్థమైంది. అందుకే.. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి మ్యాచ్‌లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.ఈసారి సెమీ ఫైనల్ వరకు అందరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు.. మా జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరూ టాప్ రన్ స్కోరర్ లేదంటే లీడింగ్ వికెట్ టేకర్‌గా లేరు. అయినా సరే మేము గెలుస్తూనే ఉన్నాం.ప్రతి మ్యాచ్‌లో ప్రతి ఒక్క ఆటగాడు తనవంతు సహకారం అందించాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఇలా జట్టుగా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని ఓ వైరస్లాగా వ్యాప్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పద్దెనిమిది నెలల క్రితమే ఈ సంప్రదాయాన్ని జట్టులో ప్రవేశ పెట్టాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.కోహ్లిపై విమర్శలుఇక టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ సైతం సూర్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘‘గత వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో రోహిత్, విరాట్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.ఈసారి బుమ్రా, హార్దిక్ తప్ప పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. అయితే, అప్పటికి ఇప్పటికి మేము ఇన్నింగ్స్ ప్లాన్ చేసిన విధానం వేరుగా ఉంది. మా ఆలోచనకు తగినట్లు అప్పుడు రోహిత్ శర్మ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు.కానీ విరాట్ కోహ్లి యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం, కాస్త నెమ్మదిగా ఆడటం వంటి వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. హార్దిక్, అభిషేక్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో కొత్త జోష్ తీసుకువచ్చారు. 2024, 2026 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
శాంసన్ కాదు.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ చారిత్రత్మక విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర.వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేకపోయిన శాంసన్.. ఆ తర్వాత వరుస మ్యాచ్‌లలో సంచలన ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ కేరళ వికెట్ కీపర్ కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 321 పరుగులు చేశాడు.ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐసీసీ శాంసన్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డుకు సంజూ కంటే జస్ప్రీత్ బుమ్రా మరింత అర్హుడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.ఈ మెగా ఈవెంట్లో బుమ్రా కూడా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని ఏబీడీ అన్నాడు."సంజూ శాంసన్, బుమ్రాలో ఎవరు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అన్నది నిర్ణయించడం చాలా కష్టం. ఈ టోర్నీలో బుమ్రా అత్యధిక వికెట్లు తీశాడు. కాబట్టి అతడు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వరకు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అతడు వేసిన కొన్ని కీలకమైన స్పెల్‌లు భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాయి.సెమీఫైనల్, ఫైనల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అతడొక్కడే వేరే గ్రహంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. అతడు భారత క్రికెట్‌కు అతడొక విలువైన ఆస్తి" అని డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ.. -
T20 WC: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా ఆదివారం సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ ట్రోఫీ ముద్దాడిన ఏకైక జట్టుగా రికార్డు సాధించింది.లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించిన భారత్.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో మాత్రం 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌లో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్ (Axar Patel) స్థానంలో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు.అతడి కోపం చల్లారలేదు‘‘అక్షర్ పటేల్ ఆరోజు చాలా చాలా కోపంగా ఉన్నాడు. ఆ స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారు. అతడొక అనుభవజ్ఞుడైన ప్లేయర్. ఐపీఎల్లో ఓ జట్టు కెప్టెన్‌గానూ ఉన్నాడు. కాబట్టి అతడి కోపంలో అర్థం ఉంది.నా వల్లే తప్పు జరిగిందని.. నన్ను క్షమించమని కోరాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయం తీసుకున్నానని అతడికి వివరించాను. కానీ అతడి కోపం చల్లారలేదు. మరుసటి రోజు వరకు కూడా అతడు నాపై కోపంగానే ఉన్నాడు’’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. అక్షర్‌ను తప్పించి..కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు అక్షర్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు అతడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా వాషీని తుదిజట్టుకు ఎంపిక చేయడంతో అక్షర్ పటేల్ తీవ్ర నిరాశకు గురైనట్లు సూర్య మాటల ద్వారా తెలుస్తోంది. అక్షర్‌ను తప్పించి.. వాషీని ఆడించాలనేది తన నిర్ణయమేనని సూర్య స్పష్టం చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచి సెమీస్ చేరింది టీమిండియా. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ఈ టోర్నీలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల వల్లే ఉత్కంఠ పోరులో టీమిండియాకు విజయం సాధ్యమైందని చెప్పవచ్చు.చదవండి: T20 WC: 'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి' -
'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మోహన్ శర్మ ఫిబ్రవరి 1వ తేదీన అనారోగ్యంతో కన్ను మూశారు. ఈ విషయాన్ని జితేష్ శర్మ ధ్రువీకరించాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో జితీశ్ తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం కంటే, తన తండ్రిని కోల్పోవడం తనను ఎంతగానే కలచివేసిందని జితేశ్ తెలిపాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ముందు వరకు జితీశ్ భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉన్నాడు. అయితే ఇషాన్ కిషన్ రీ ఎంట్రీతో భారత టీ20 జట్టులో జితీశ్ స్ధానం గల్లంతైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచకప్ జట్టులోనూ జితీశ్ శర్మకు చోటు దక్కలేదు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను వికెట్ కీపర్లగా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో జితీశ్ జట్టు నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ జట్టులోకి వచ్చిన కిషన్ మాత్రం తన ఎంపికకు న్యాయం చేశాడు.నేను మనిషినే.. "వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదని తెలిసినప్పుడు కొంత బాధ కలిగింది. ఎందుకంటే నేను కూడా మనిషినే. కానీ కొంత సమయం గడిచాక ఆ బాధ తగ్గిపోయింది. ఆ తర్వాత మా నాన్న అనారోగ్యం పాలయ్యారు. ఫ్రిబవరి 1న ఆయన మరణించారు. నేను మా నాన్నతో పాటు ఏడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఆ సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది.. ప్రపంచకప్ కంటే మా నాన్నకు నేనే ఎక్కువ అవసరం అన్పించింది. ఆ తర్వాత వరల్డ్‌కప్‌లో చోటు దక్కపోయినందుకు ఎలాంటి బాధ అనిపించలేదు. ఎవరిపైనా కోపం కలగలేదు. దేవుడు ఆ ఏడు రోజులు నాన్నతో గడిపే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని. ఆ సమయంలో అతడిని నేను దగ్గరుండి చూసుకోగలిగాను. ఇంట్లో టీవీలో ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసి ఆనందించాను. బయట కూర్చొని మ్యాచ్ చూడడం కూడా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఏదైమైనప్పటికి భారత జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.నా కెరీర్‌ను కొనసాగిస్తామా నాన్న లేని లోటు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. దాన్ని ఎవరూ పూడ్చలేరు. ఇలాంటి సమయంలో మా నాన్న ఉంటే'బాధను పక్కన పెట్టి వెళ్లి ప్రాక్టీస్ చెయ్' చెప్పేవారు. కాబట్టి ఆబాధను దిగమింగుతూ నా క్రీడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా జితీశ్ మళ్లీ ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. మరో భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కూడా వరల్డ్‌కప్ సమయంలోనే ప్రాణాలు విడిచారు.చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం' -
మైదానంలో అతి.. హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీ20 ప్రపంచకప్ విజయోత్సవాలలో భాగంగా హార్దిక్ జాతీయ పతాకాన్ని తన శరీరానికి చుట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వాజిద్ పేర్కొన్నారు.శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జాతీయ జెండాను ఆ గౌరవ పరచడం చట్టరీత్యా నేరమని, ప్రతి పౌరుడు జెండాను గౌరవించడం బాధ్యత అని అడ్వకేట్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు సమాచారం.ఏమి జరిగిందంటే?ఫైనల్లో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేసిన తర్వాత తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించారు. భారత ప్లేయర్ల కుటంబ సభ్యులను కూడా మైదానంలో అనుమతించారు. ఈ సమయంలో పాండ్యా హద్దులు మీరి ప్రవర్తించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మను హగ్ చేసుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు.ఆ సమయంలో అతడి ఒంటిపై భారత జెండా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అతడిపై పోలీసులకు వాజిద్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. హార్దిక్ ప్రవర్తనపై నెటిజన్లు సైతం తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ టోర్నీలో పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు అర్ధ సెంచరీలు, 9 వికెట్లతో భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం -
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్
టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సమర్థించాడు. డారిల్ మిచెల్ విషయంలో అర్ష్‌దీప్ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.మిచెల్‌కు గట్టిగా తగిలిన బంతిఅహ్మదాబాద్‌లో జరిగిన టైటిల్ పోరులో క్రీజులో ఉన్న కివీస్ స్టార్ డారిల్ మిచెల్‌కు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్‌కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్ కోపంగా అర్ష్‌దీప్ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ సముదాయించడంతో చల్లబడ్డాడు.అనంతరం అర్ష్‌దీప్ కూడా మిచెల్ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్‌తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ అర్ష్‌దీప్‌నకు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో అర్ష్‌దీప్ తప్పేమీ లేదుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ANI పాడ్‌కాస్ట్‌కు హాజరు కాగా అర్ష్‌దీప్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్‌లో బాదితే ఏ బౌలర్‌కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్ అర్ష్‌దీప్‌ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. -
T20 WC 2026: కెప్టెన్‌గా సాంట్నర్.. అక్షర్‌కు దక్కని చోటు!
జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా వరల్డ్‌కప్ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్ (Sanju Samson), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్ పటేల్ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్ హీరోలను కూడా ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు.ఓపెనింగ్ జోడీ ఇదేఓపెనర్లుగా టీమిండియా స్టార్ సంజూ శాంసన్, న్యూజిలాండ్ పవర్ హిట్టర్ టిమ్ సీఫర్ట్‌ను ఎంచుకున్న చిక్కా.. వన్‌డౌన్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్ వీరుడు షిమ్రన్ హెట్‌మైర్, భారత ఆల్‌రౌండర్ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్.. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా, ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్ విల్ జాక్స్‌కు స్థానం ఇచ్చాడు.పన్నెండో ఆటగాడిగాఇక ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను కాదని.. న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్‌ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్ విభాగంలో ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్ వీరుడు జేసన్ హోల్డర్‌ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్ చక్రవర్తితో కలిసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టిమ్ సీఫర్ట్ (326 పరుగులు) ఉన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 చిక్కా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్సంజూ శాంసన్, టిమ్ సీఫర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రన్ హెట్‌మైర్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో లోయర్ ఆర్డర్లో వచ్చి మెరుపు బ్యాటింగ్‌తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్ ఖాన్‌తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.3rd ఏసీ టికెట్లు దొరికాయి‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నాం.నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్ స్లీవ్స్ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.పోలీసులకు ముందుగానే సమాచారంఅందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్‌లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.నాలుగేళ్ల కుమారుడు అయాన్, రెండేళ్ల కుమార్తె మెవిష్‌లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్ హీరో ట్రైన్లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
-
ఇషాన్ కెరీర్ బెస్ట్.. శాంసన్ అదరహో
భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో భారత్ తరఫున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మిగతా బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్లో బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్‌గా టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్ పటేల్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్ -
టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్
భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌కు టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కొంతమంది జట్టు విజయాన్ని కించపరిచేలా మాట్లాడతారని.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవడంలో అర్థం లేదన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ట్రోఫీ కైవసం చేసుకుంది. తద్వారా మూడోసారి పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ చైర్మన్ జై షా స్టేడియానికి సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని దర్శించారు.కీర్తి ఆజాద్ వివాదాస్పద ట్వీట్ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ‘‘టీమిండియా సిగ్గుపడు!.. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచినపుడు.. ఆ జట్టులో హిందు, ముస్లిం, సిక్కు ఉన్నారు. నాడు మేము ఆ ట్రోఫీని మాతృభూమి భారత్=హిందుస్థాన్= ఇండియాకు తీసుకువచ్చాము.కానీ ఇప్పటి క్రికెట్ జట్టు ట్రోఫీని ఎందుకిలా చేస్తోంది. మసీదు లేదంటే చర్చి లేదంటే గురుద్వారకు తీసుకువెళ్లవచ్చు కదా!.. ఈ జట్టు ఇండియా మొత్తానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇదేమీ సూర్యకుమార్ యాదవ్ లేదంటే జై షా కుటుంబానికి చెందినది కాదు.సిరాజ్ ఎప్పుడూ ట్రోఫీని మసీదుకు తీసుకువెళ్లలేదు. విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ చర్చికి తీసుకువెళ్లలేదు. ఇది 140 కోట్ల భారతీయులకు చెందినది. అంతేగానీ ఓ మతానికి చెందినది కాదు’’ అని కీర్తి ఆజాద్ పోస్టు చేశాడు. ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చుఈ విషయంపై స్పందించాల్సిందిగా ANI గంభీర్‌ను కోరగా.. ‘‘అలాంటి వాళ్ల మాటలకు స్పందించడం కూడా దండగే. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. అతి పెద్ద సంబరం ఇది. వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన జట్టును అందరూ అభినందిస్తున్నారు.కానీ ఇలాంటి వ్యక్తులు కొందరు ఆ విజయాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడతారు. రేపు ఇంకొకరు ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా జట్టులోని ఆటగాళ్లు వీటిని సీరియస్‌గా తీసుకోరు.సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత మా వాళ్లు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజేతలుగా నిలిచారు. అయితే, కొంతమంది మాత్రం సొంత దేశ ఆటగాళ్లను, జట్టును కించపరుస్తున్నారు. ఇది సరికాదు’’ అని గంభీర్ కీర్తి ఆజాద్‌కు చురకలు అంటించాడు.#WATCH | On TMC MP & former cricketer Kirti Azad's statement, Head Coach of Team India, Gautam Gambhir says in an interview with ANI, "...It is not even worth answering this question...These kinds of statements just degrade the players and team, which should not be done."Watch… pic.twitter.com/gIWtMpIbm8— ANI (@ANI) March 11, 2026 -
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులుకానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లయిట్లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ, ప్లేయర్ ఆకీల్ హొసేన్ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.మేము అర్థం చేసుకోగలంఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.మా ఆధీనంలో లేవుఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.ఇక ఐసీసీ వర్గాలు మైకేల్ వాన్ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.వారు మాత్రం ఇక్కడేఇదిలా ఉంటే.. ఐపీఎల్ సీజన్ కోసం పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్మన్ పావెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), రూథర్‌ఫర్డ్ (ముంబై ఇండియన్స్), హెట్‌మైర్ (రాజస్తాన్ రాయల్స్), రొమారియో షెఫర్డ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
గంభీర్‌కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్‌కోచ్‌గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్‌గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్‌పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్‌దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్‌లో ఆడతాడు.మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్‌కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్‌కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!
జస్ప్రీత్ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్‌గా తయారయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలవడమే గాక జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ సందర్భంగా డెత్ ఓవర్లలో తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడమే గాక వికెట్లు పడగొట్టడంలోనూ విజయ వంతమయ్యాడు. మరి బుమ్రా స్లో బంతుల వెనుక దాగున్న కథాకమీషును ఒకసారి పరిశీలిద్దాం. బుమ్రా స్లో డెలివరీ కథ తెలియాలంటే 16 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరముంది.అహ్మదాబాద్ వేదికగా కిషోర్ త్రివేదీ క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో బుమ్రా తొలిసారి త్రివేదీ కోచింగ్ సెంటర్‌కు వచ్చాడు. అయితే ఆ సమయంలో బుమ్రాకు క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ చూపేవాడు కాదు. కానీ అతని బౌలింగ్‌లో ఏదో తెలియని వైవిధ్యాన్ని కిశోర్ త్రివేదీ ఆనాడే కనిపెట్టాడు. బుమ్రా బంతులు వేయడానికి ముందు రనప్‌కు కొంత దూరమే తీసుకోవడం.. కొంత పరిగెత్తడం, కొంత నడవడం చేయడం వింతగా అనిపించింది. అంతేకాదు బంతిని బాగా బౌన్స్ వేసేవాడు. దీంతో కిశోర్ త్రివేది కోచింగ్ సెంటర్లో ఉన్న మిగతా పిల్లలు బుమ్రా బౌలింగ్ చూసి భయపడిపోయేవారు. బంతిని విడుదల చేసే పాయింట్ క్లిష్టంగా ఉండడంతో ఇతర పేసర్ల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండడంతో బ్యాటర్లు తరచూ ఇబ్బంది పడేవారు. కోచ్ మాటలు పాటించి..బౌన్సర్లు తగ్గించి స్వింగ్, యార్కర్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి బౌలర్‌గా ఎదిగే అవకాశముంటుందని కోచ్ కిశోర్ బుమ్రాకు సలహా ఇచ్చాడు. కోచ్ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన బుమ్రా కాలక్రమంలో తన బౌలింగ్‌లో బౌన్సర్లు తగ్గించుకొని యార్కర్లు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంతిని స్వింగ్ చేసే కళను కూడా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బుమ్రా తన మీడియం స్లో బౌలింగ్‌తో చేస్తున్న అద్భుతాలను కళ్లారా చూస్తూనే ఉన్నాం.తొలి పరిచయం!బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌పై అతని చిన్ననాటి కోచ్ కిశోర్ త్రివేది స్పందించారు. ‘16 ఏళ్ల వయసులో బుమ్రాను తొలిసారి చూశాను. చూసినప్పుడే బుమ్రా బౌలింగ్‌లో ఒక వైవిధ్యత కనిపించింది. బౌలింగ్ యాక్షన్ మార్చుకోమని ఆనాడే చెప్పి ఉంటే బుమ్రా ఇవాళ ఒక సాధారణ స్థాయి బౌలర్‌గా మిగిలిపోయేవాడు. బుమ్రాది ఒక యూనిక్ బౌలింగ్ యాక్షన్. స్లో ఆర్థడాక్స్‌ను మీడియం బౌలింగ్‌కు మిక్స్ చేస్తూ బంతులను విడుదల చేయడం కాస్త కఠినతరంగా ఉంటుంది. కానీ బుమ్రా దీనిని చక్కగా ఒంటబట్టించుకున్నాడు. బుమ్రాకు అది సహజత్వంగా రావడంతో బౌన్స్‌ను తగ్గించుకొని యార్కర్లపై దృష్టి సారించాలని చెప్పాను. ఇవాళ బుమ్రా స్థాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా 8మ్యాచ్‌లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్లో 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 95 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ బుమ్రా సభ్యుడిగా ఉన్నాడు. -
'భారత్ గొప్ప జట్టేమి కాదు'.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అక్కసు
టీ20 వరల్డ్‌కప్-2026 ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు."న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్‌ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్‌లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్‌కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్‌కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్-8లో భారత్‌ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు' -
వివాదంలో సంజయ్ మంజ్రేకర్!
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ తాను సంతోషంగా లేనంటూ పేర్కొన్నాడు. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, తన దృష్టిలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచినప్పుడే అన్ని ఫార్మాట్లలో చాంపియన్‌గా భారత్ పరిపూర్ణమవుతుందని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.ఇదే విషయమై సంజయ్ మంజ్రేకర్ తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు.‘క్రికెట్ అభిమానులు అన్ని ఐసీసీ ట్రోఫీలను ఒకలా చూడలేరు. నా దృష్టిలో టీ20 వరల్డ్ కప్ కంటే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌కు ఎక్కువ ప్రాధానత్య ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్ గెలవడం కంటే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ గెలిస్తే వచ్చే మజా వేరుగా ఉంటుంది. ఐసీసీ టైటిల్స్ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే మొదట వన్డే వరల్డ్‌కప్, రెండో స్థానంలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్, మూడో స్థానంలో టీ20 ప్రపంచకప్, నాలుగో స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ ఉంటాయి. కనీసం వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపాడు.మీ తలకు తుపాకీ పెట్టారా?అయితే సంజయ్ మంజ్రేకర్ మాటలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్ ఐసీసీ ట్రోఫీలు గెలవడం సంజయ్‌కు ఇష్టం లేదేమో’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఇక కమెడియన్ అబిజిత్ గంగూలీ సంజయ్ మంజ్రేకర్‌కు ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ గెలిచిందని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీ తలకు తుపాకీ పెట్టి ఎవరు ఇలా చెప్పమని అడగరు. సానియా మీర్జా నంబర్ వన్ ర్యాంక్ అందుకుంది.. కానీ అది సింగిల్స్‌లో కాదు డబుల్స్‌లో అన్నట్లుగా మీరు చెప్పిన విషయముంది. ఫార్మాట్ ముఖ్యం కాదు ఆమె నంబర్‌వన్ ర్యాంకు అందుకోవడం గొప్ప విషయం. అలాగే భారత్ కూడా ఏ ఫార్మాట్లో కప్పు కొట్టాలన్నది ముఖ్యం కాదు.’ అని ట్వీట్ చేశాడు.ఇదేమీ కొత్త కాదు..కాగా సంజయ్ మంజ్రేకర్ వివాదంలో చిక్కుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2024లో బోర్డర్ గావస్కర్ సిరస్ సందర్భంగ ‘కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కానఫఫరెన్స్‌కు దూరంగా ఉంటే మంచిదేమో. మీడియ సమావేశాల కంటే కోచ్‌గా తన పని తాను సక్రమంగా చేస్తే మంచిదనుకుంటా’ అని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. మొత్తం మీద తన చర్యలతో సంజయ్ మంజ్రేకర్ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.చదవండి: టాప్ ర్యాంక్‌లోనే స్మృతి -
'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు'
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత తుది జట్టులోనే లేని శాంసన్ ఏకంగా ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలకమైన చివరి మూడు మ్యాచ్‌లో సంజూ (97, 89, 89) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు.ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శాంసన్.. స్ట్రైక్ రేట్ 199.37 321 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకున్నప్పటికి.. సంజూను సరిగ్గా ఉపయోగించుకోవడంలో గంభీర్ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్మెంట్ "తీవ్రమైన తప్పిదాలు" చేసిందని మంజ్రేకర్ విమర్శించాడు. టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్‌లలో శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడాన్ని అతడు తప్పుబట్టాడు."సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తీవ్రమైన తప్పిదాలు చేసింది. దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై ఓపెనర్‌గా వచ్చి సంజూ వరుస సెంచరీలతో సత్తాచాటాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ కేవలం టెస్టుల్లో బాగా ఆడాడని అతడిని మళ్ళీ టీ20ల్లోకి తీసుకొచ్చి సంజూను లోయార్డర్కు డిమోట్ చేశారు.దీంతో శాంసన్ తన రిథమ్‌ను కోల్పోయాడు. ఈ కారణంతో అతడిని తుది జట్టు నుంచి సైతం తప్పించారు. అయితే ఒక మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం కావడంతో సంజూ మళ్లీ అవకాశం దక్కింది. మూడో స్ధానంలో ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి నెట్టి ఆ స్ధానంలో కిషన్‌ను బ్యాటింగ్‌కు పంపారు. కిషన్ స్దానంలో సంజూ మళ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. ఈసారి అతడు దుమ్ములేపాడు. ఏకంగా తన అద్భుత ప్రదర్శనలతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అనుకోకుండా జట్టులోకి వచ్చిన సంజూ చరిత్రను తిరగరాశాడు. అతడికి ఓపెనింగ్ స్ధానమే సరైనది" అని మంజ్రేకర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'
టీ20 వరల్డ్‌కప్-2026 విజేత టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌కు అనుకూలంగా బ్యాటింగ్ పిచ్‌లు సిద్ధం చేశారనే ఆరోపణలను వసీం కొట్టిపారేశాడు. భారత్ ఒక అద్భుతమైన జట్టు అని అతడు కొనియాడాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఓవరాల్‌గా మూడు సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది.అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. కొంతమంది మాత్రం భారత్ 'పిచ్‌ల రిగ్గింగ్' చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్లో వసీం భారత్‌కు మద్దతుగా నిలిచాడు."పాకిస్తాన్ కంటే భారత్ చాలా పెద్ద జట్టు. ఈ విజయానికి వారు అన్ని రకాల అర్హులు. అంపైర్లు భారత్‌కు సహకరిస్తారని లేదా వారు స్పిన్ అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకుంటారని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఈ టోర్నీలో పిచ్‌లు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా లేనప్పటికి వారు అద్భుతంగా ఆడారు. తప్పులు వెతకడం మానేసి, ఒక క్రికెట్ జట్టు ఉన్న దేశంగా మనం వారిని అభినందించాలి. పాక్ కంటే భారత్ అద్భుతమైన జట్టు అన్న విషయాన్ని మనం అంగీకరించాలి"అని వసీం పేర్కొన్నాడు. కాగా కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
రూ. 6 కోట్లు ఒక్కో ప్లేయర్‌కు...
న్యూఢిల్లీ: టి20 వరల్డ్ కప్ విజేతలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు పురస్కారంతో ఘనంగా గౌరవించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని చాంపియన్ టీమ్‌కు మొత్తం రూ.131 కోట్ల నగదు పురస్కారాన్ని అందిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘వరల్డ్ కప్ సొంతం చేసుకున్న ఆటగాళ్లను, వారికి అండగా నిలిచిన సహాయక సిబ్బంది, సరైన జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లకు అభినందనలు. మున్ముందూ జట్టు ఇలాంటి మరెన్నో విజయాలు అందుకోవాలి’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. బోర్డు ప్రకటించిన మొత్తంలో ఆటగాళ్లకు ఎంత ఇస్తారనేది అధికారికంగా ప్రకటించకపోయినా... ఇందులో రూ. 90 కోట్లను 15 మంది జట్టు సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఒక్కో క్రికెటర్‌కు రూ. 6 కోట్లు చొప్పున లభిస్తాయి. మిగతా రూ.41 కోట్లను హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌లతో పాటు సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యులకు వారి హోదాల ప్రకారం పంచుతారు. 2024లో భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా బోర్డు భారీ మొత్తాన్ని (రూ. 125 కోట్లు) బహుమతిగా అందించింది. వారి సరసన చేరడం గౌరవం: సూర్యకుమార్ భారత్‌కు టి20 వరల్డ్ కప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ధోని, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత అతనికే దక్కింది. అలాంటి క్రికెటర్ల సరసన తన పేరు కూడా చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సూర్యకుమార్ అన్నాడు. ‘వరుసగా రెండు వరల్డ్ కప్‌లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం గెలిచినప్పుడే మేం దానిని పునరావృతం చేయాలని భావించాం. జట్టు మంచి జోరు మీదుంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో పాటు పాటు అదే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్‌లో మళ్లీ గెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధోని, రోహిత్లవంటి గొప్ప కెప్టెన్లతో నన్ను పోల్చడం చాలా గర్వంగా ఉంది. మున్ముందు కూడా మరిన్ని విజయాలు జట్టుకు అందించాలని కోరుకుంటున్నా. టోర్నీ ఆరంభానికి ముందు ధోనితో మాట్లాడా. సన్నాహాలకు సంబంధించి అతను ఇచ్చిన సూచనలు చాలా బాగా పని చేశాయి’ అని సూర్యకుమార్ అన్నాడు. ఫైనల్ ముగిశాక మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు తమ సంబరాలు కొనసాగాయని అతను వెల్లడించాడు.ఆటగాళ్లకు ఘనస్వాగతం...వరల్డ్ కప్ విజయంలో భాగమైన క్రికెటర్లు అహ్మదాబాద్ నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. సోమవారమే సంజు సామ్సన్‌కు తిరువనంతపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించగా... మంగళవారం పట్నా ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఇషాన్ కిషన్‌కు భారీ స్థాయిలో వెల్కమ్ చెప్పారు. టోర్నీలో 317 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘భారత జట్టు గెలుపు, నేను అందులో సభ్యుడిని కావడం చాలా గొప్పగా ఉంది. దేశం మొత్తం గర్వించే క్షణమిది. నేను నా ఆటతోనే అందరికీ స్ఫూర్తిగా నిలవాలని భావిస్తున్నా’ అని విమానాశ్రయంలో కిషన్ చెప్పాడు. -
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.2007 పొట్టి ప్రపంచకప్ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్‌కు రూ. 1 కోటి అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇచ్చింది.అదే 2026 ప్రపంచకప్‌కు వచ్చేసరికి.. సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..- 2007లో రూ. 12 కోట్లు- 2024లో రూ. 125 కోట్లు- 2026లో రూ. 131 కోట్లుఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. -
అర్షదీప్ సింగ్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ
భారత నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ సింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అర్షదీప్ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అర్షదీప్ డారిల్ మిచెల్‌పైకి ప్రమాదకర రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ అర్షదీప్‌పై కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి అర్షదీప్ మిచెల్‌పై అంత ఆగ్రహంగా బంతిని విసరాల్సిన అవసరం లేదు. ఫాలో అప్‌లో భాగంగా బంతిని వికెట్లపై విసరడంతో ప్రమాదవశాత్తు మిచెల్‌ను బలంగా తాకింది. Final Hungama : Daryl Mitchell 🆚 Arshdeep Singh Surya ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲವೂ ಶಾಂತ... SKY Handle ಮಾಡಿದ ರೀತಿ ನಿಜಕ್ಕೂ ಅದ್ಬುತ!👏🏻🤝🏻ವೀಕ್ಷಿಸಿ | ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#T20WorldCup2026Final pic.twitter.com/K4ECnGh9ra— Star Sports Kannada (@StarSportsKan) March 8, 2026ఆ సమయంలో మిచెల్ సైతం సహనాన్ని కోల్పోయాడు. అయితే అర్షదీప్ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత అర్షదీప్-మిచెల్ కరచాలనం చేసుకున్నారు.అయితే ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం విరుద్ధం. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్ చెల్లించుకున్నాడు.కాగా, ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. -
కోహ్లీ అందుకే రాలేకపోయాడా!
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌కు అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ హాజరైన సంగతి తెలిసిందే. అయితే కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాకపోవడం వెనుక సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతున్నది. కోహ్లీ రాకపోవడం వెనుక అభిమానులు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. ధోనీ, రోహిత్‌లు కెప్టెన్లుగా ఐసీసీ ట్రోఫీలు సాధించారని, కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్‌గా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడని, అందుకే తాజా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా 2007 తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ధోనీ సారథ్యం వహించగా, అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన టీమిండియాకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్, 2021 టీ20 ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీల్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ టైటిల్ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడినంత కాలం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు. తాజాగా ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావడంతో కుటుంబంతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని, అందుకే టీ20 ప్రపంచకప్ ఫైనల్ వీక్షించేందుకు అహ్మదాబాద్‌కు రాలేకపోయాడని పలువురు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు అంతకముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు తమ కుటుంబాలతో కలిసి వీక్షించేందుకు వచ్చారు. కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే ఆడుతున్న కోహ్లీ గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ సెంచరీ సహా అర్థసెంచరీ సాధించి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి తన ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు.చదవండి: ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్ -
ఇంగ్లండ్ యువ కెరటానికి జాక్‌పాట్
టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్‌పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్ యువ కెరటం జేకబ్ బేతెల్‌కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్ కోసం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో బేతెల్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్ యాజమాన్యం ప్రకటించింది. 22 ఏళ్ల బేతెల్‌కు గతంలో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన రికార్డు బేతెల్ వశమైంది.ఫీనిక్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బేతెల్ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. బేతెల్ తాజాగా భారత్‌తో జరిగిన పొట్టి ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో బేతెల్ 8 ఇన్నింగ్స్‌ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.ఐపీఎల్లో సవాలుహండ్రెడ్ లీగ్‌లో బేతెల్‌కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్‌లో బేతెల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి. -
‘అడాలజ్ స్టెప్‌వెల్’ చరిత్ర తెలుసా?
అహ్మదాబాద్: ప్రపంచకప్‌తో భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాంధీనగర్ సమీపంలోని మోనుమెంట్ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్ వారసత్వ కట్టడం ‘అడాలజ్ స్టెప్‌వెల్’ వద్ద అధికారిక ఫొటో సెషన్ నిర్వహించగా.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రపంచకప్‌తో సందడి చేశాడు. అతను కప్‌తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్ కట్టడం వద్ద కప్ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్... కిస్సిక్...’ మోత మోగాయి.సుప్రసిద్ధ ‘అడాలజ్ స్టెప్‌వెల్’ (Adalaj Stepwell) 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్‌ను నిర్మించింది. ఆమె వాఘెలా సంస్థానధీశుడు రాణా వీర్ సింగ్ భార్య. రాణా వీర్ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్ స్టెప్‌వెల్‌ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా విన్నర్స్ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫొటోలు దిగారు.𝐄𝐭𝐜𝐡𝐞𝐝 𝐈𝐧 𝐆𝐥𝐨𝐫𝐲 🏆📸 Captain Surya Kumar Yadav with the prestigious ICC Men’s T20 World Cup Trophy 😍💙#TeamIndia | #T20WorldCup | #MenInBlue | @surya_14kumar pic.twitter.com/oxK2VVPMYe— BCCI (@BCCI) March 9, 2026 ట్రోఫీతో ఆలయంలో పూజలు అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్ ఆలయానికి ప్రపంచకప్‌ను తీసుకువెళ్లి పూజలు చేశారు. పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, వరుణ్ చక్రవర్తి తదితరులు ప్రపంచకప్‌తో దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.#WATCH | Gujarat | Team India Skipper Surya Kumar Yadav, offered prayers at the Hanuman Temple in Ahmedabad after winning the #icct20worldcup2026 pic.twitter.com/QoCBEa6vPm— ANI (@ANI) March 8, 2026 -
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం రెండు ఫార్మాట్లకే పరిమితమై ఉండేది. ఒకటి టెస్టు క్రికెట్, మరొకటి వన్డే ఫార్మాట్. ఈ రెండు ఫార్మాట్లను తలదన్నేలా 20 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది టీ20 ఫార్మాట్. దనాధన్ ఆటతో కొద్దికాలంలోనే క్రికెట్ అభిమానుల ఆదరణ చూరగొన్న ఈ పొట్టి ఫార్మాట్ ఇవాళ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 20 ఓవర్ల ఆటలో క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే తాయత్రయంతోనే ఉంటారు. కానీ ఇన్నింగ్స్‌లో చివరి 5 ఓవర్లను డెత్ ఓవర్లుగా పిలవడం ఆనవాయితీ. ఈ ఓవర్లలో నిఖార్సైన ఇన్నింగ్స్‌లు ఆడే బ్యాటర్‌ను ఫినిషర్‌గా పిలుస్తుంటారు. టీమిండియాకు ప్రస్తుతం శివమ్ దూబే రూపంలో మంచి హిట్టర్ దొరికాడు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శివమ్ దూబే 9 మ్యాచ్‌ల్లో 169 స్ట్రైక్‌రేట్ 235 పరుగులు చేసి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దూబే ప్రదర్శనను ఇప్పటి అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు కానీ నిజమైన దూబే 30 ఏళ్ల ముందే ప్రపంచానికి పరిచయమయ్యాడంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం.పాక్‌ను చీల్చిచెండాడి..1990ల్లో 50 ఓవర్ల ఆటలో 250 పరుగులు చేయడం కష్టంగా ఉండేది. టాపార్డర్, మిడిలార్డర్ రాణిస్తే తప్ప స్కోరుబోర్డు పరిగెత్తకపోయేది. అయితే 1996 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్వార్టర్‌ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ నవ్‌జ్యోత్ సిద్ధూ 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో యాంకర్ పాత్రను పోషించాడు. సచిన్, కాంబ్లీ, మంజ్రేకర్, అజారుద్దీన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజయ్ జడేజా (25 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిఖార్సైన ఆటతీరుతో పాక్‌ను హడలెత్తించాడు. అప్పట్లో జడేజా ఆడిన ఆట ఇవాళ దూబే ఆట కంటే రెట్టింపు అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి పాక్ జట్టులో వకార్ యూనిస్, ముస్తాక్ అహ్మద్, సలీమ్ మాలిక్ వంటి బలమైన బౌలింగ్ లైనప్‌ను చీల్చిచెండాడమే ఇందుకు కారణం. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 248 పరుగులకు ఆలౌటైంది. 1996 ప్రపంచకప్‌లో సెమీస్ చేరినప్పటికీ ఆనాటి చాంపియన్స్ శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.నిఖార్సైన ఆల్‌రౌండర్..ఇక 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా భారత జట్టు తరఫున 196 వన్డేల్లో 5,359 పరుగులు, 15 టెస్టుల్లో 576 పరుగులు చేశాడు. అయితే 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలడంతో అజయ్ జడేజాపై ఐదేళ్ల నిషేధం పడింది. కానీ జట్టులో కొనసాగినన్ని రోజులు అజయ్ జడేజా నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు గడించాడు. ఆ తర్వాత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అజయ్ జడేజా స్థానాన్ని భర్తీ చేయడంలో విజయవంతమయ్యాడు.చదవండి: అందరూ మ్యాచ్ విన్నర్లే! -
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
-
బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?
టీ20 వరల్డ్‌కప్-2026 విజేత భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ.131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది. "టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్‌ను రిటైన్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచిన టీమిండియాకు రూ. 131 కోట్ల రూపాయల క్యాష్ రివార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ అద్భుత విజయానికి కారకులైన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లకు అభినందనలు" అని బీసీసీఐ ఓ ప్రకటలో పేర్కొంది.కాగా గతంలో టీ20 ప్రపంచకప్-2024ను రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్లు ప్రకటించింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్లుగా నిలిచినందుకు ఆ మొత్తాన్ని పెంచి రూ. 131 కోట్లు ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తం అందింది. ఛాంపియన్‌గా నిలిచినందుకు భారత్‌కు సుమారు రూ. 27.48 కోట్ల ప్రైజ్‌మనీనీ ఐసీసీ అందజేసింది. అంతేకాకుండా గ్రూపు స్టేజి, సూపర్-8 దశల్లో గెలిచి ప్రతీ మ్యాచ్‌కు అదనంగా సుమారు రూ. 28.6 లక్షల చొప్పున భారత్‌కు బోనస్ లభించనుంది.అహ్మదాబాద్‌లో అదుర్స్ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేసింది. దీంతో ముచ్చటగా మూడో పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ అవతరించింది.ఈ తుది పోరులో మెన్ ఇన్ బ్లూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కివీస్ 159 పరుగులకే కుప్పకూలింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ -
అందరూ మ్యాచ్ విన్నర్లే!
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ముగిసింది. టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లు కావడమే భారత్ టైటిల్ గెలిచేందుకు కారణమైందని అఫ్రిది తెలిపాడు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ ముగిసింది. టైటిల్ గెలవడంలో టీమిండియాకు అర్హత ఉంది. జట్టు కాంబినేషన్ అద్భుతం. అంతేకాదు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లే కాదు బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా మ్యాచ్ విన్నర్లే. ఒకవేళ ఫైనల్‌కు ముందు తుది జట్టులో మార్పులు చేసి బెంచ్ నుంచి ఆడించినా భారత్ కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉండేది. నిజానికి టోర్నీమొత్తం చాంపియన్ ఆటతీరును ప్రదర్శించారు.సంజూ శాంసన్ ఒక అద్భుతం. తనదైన హిట్టింగ్తో ఇన్నింగ్స్‌లను నిర్మించడంలో కీలకపాత్ర పోషించేవాడు. అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టోర్నీ ఆసాంతం విఫలమైనా కెప్టెన్ సూర్యకుమార్‌కు అభిషేక్‌పై ఉన్న నమ్మకం అతన్ని ఫైనల్ వరకు ఆడించింది. కీలకమైన ఫైనల్లో అభిషేక్ తనలోని అసలైన ఆటతీరును పరిచయం చేశాడు. ఇషాన్ కిషన్ కూడా తనదైన శైలిలో చెలరేగడం, ఆఖర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే హిట్టింగ్ జట్టుకు అదనపు ఆకర్షణ. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం బౌలింగ్ టీమ్‌ను తన భుజస్కందాలపై నడిపించాడు. కొత్త బంతి, పాత బంతి అనే తేడా లేకుండా, పదునైన యార్కర్లు సంధించి అతని బౌలింగ్ విలువను చాటిచెప్పాడు’ అని తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడీ సూపర్-8కు చేరినప్పటికీ మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్ -
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ఒక్కరు కూడా!
టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో టైటిల్‌ను ముద్దాడింది. ఇది భారత్‌కు మూడో టీ20 వరల్డ్‌కప్ విజయం కావడం గమనార్హం. మూడు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా మెన్ బ్లూ చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్, ఫిన్ అలెన్‌లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు."శాంసన్ నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్రమ్లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్‌కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదేసంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీచదవండి: ఇండియా క్రికెట్‌ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్ -
ఇండియా క్రికెట్‌ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2026 టైటిల్‌ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్‌ను పూర్తి నాశనం చేసిందంటూ అక్తర్ ఆరోపించాడు."ఓ ధనిక పిల్లాడు.. పక్కవీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ చేస్తుంది కూడా అదే. ఇలా క్రికెట్‌ను భారత్ పూర్తిగా నాశనం చేసింది" అని ఓ ఛానల్ డిబేట్లో అక్తర్ పేర్కొన్నాడు.కాగా ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు అక్తర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు భారత్‌ను విమర్శిస్తునే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై షోయబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అక్తర్ కొనియాడాడు. మరో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్ సైతం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.చదవండి: మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్ -
మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్
టీ20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. వరుసగా రెండో టి20 ప్రపంచకప్ విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉందని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ మెగా టోర్నీలో రెండు అర్ధ సెంచరీలు సహా పేస్ బౌలింగ్‌తో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన హార్దిక్ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో మెరుపులు మెరిపించాడు. అతని నిలకడను గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ జట్టులో ఆల్‌రౌండర్‌గా స్థానం కల్పించింది.పాండ్యాతో పాటు శాంసన్, ఇషాన్, బుమ్రా ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. 32 ఏళ్ల పాండ్యా 18 నెలల క్రితం బార్బడోస్ (2024)లో రోహిత్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందబాష్పాలతో విజయోత్సంలో పాల్గొన్న ఈ ఆల్‌రౌండర్ అప్పుడు ఆత్మ ప్రమాణం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.‘నాడు దక్షిణాఫ్రికాపై (2024లో) కప్ గెలవగానే... ఇకమీదట భారత్ తరఫున ఏ టోర్నీలో బరిలోకి దిగినా... జట్టు గెలవడానికే ఆడతాను. ట్రోఫీని సగర్వంగా ఎత్తుతాను అని నా మనసుకు నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు కివీస్‌పై విజయంతో నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు.నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ఐసీసీ టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. నిన్నటి నుంచే మేమే ఛాంపియన్లమని నాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే నాకు లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఆ ప్రపంచకప్ (2024) సమయంలో తాను ఎన్నో వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యానని చెప్పాడు. అందుకే ఇతరత్రా విషయాల్ని పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెట్టేందుకు స్వీయ వాగ్దానం చేసుకున్నట్లు చెప్పాడు.చదవండి: T20 WC 2026: పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్ -
ముగిసిన నిరీక్షణ.. భారత్‌ను వీడనున్న సౌతాఫ్రికా, విండీస్ జట్లు
భారత్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు వచ్చింది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఎట్టకేలకు స్వదేశాలకు పయనం అవుతున్నాయి. టీమిండియా నెగ్గిన ఈ మెగా ఈవెంట్లో కరీబియన్ సూపర్–8లోనే నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా సెమీస్ ఓడింది. సూపర్–8 మ్యాచ్‌లు ముగిసి వారం రోజులవుతున్నా... పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో విదేశీ జట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడులతో మొదలైన కుంపటి పశ్చిమాసియాకు పాకింది. తమపై యుద్ధం చేస్తున్న అమెరికా స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియా గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో కరీబియన్ జట్టు చిక్కుకుంది. కొందరు ఐపీఎల్ కోసం ఉండిపోగా, మరికొందరు ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో చుట్టూ తిరిగి విండీస్ దీవులకు చేరుకోనున్నారు. మిగిలిపోయిన 12 మంది విండీస్ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దక్షిణాఫ్రికా జట్టు సభ్యులతో కలిసి జొహన్నెస్‌బర్గ్ మీదుగా అంటిగ్వా చేరుకోనుంది. -
పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్
ప్రపంచకప్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాందీనగర్ సమీపంలోని మోనుమెంట్ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్ వారసత్వ కట్టడం ‘అడాలజ్ స్టెప్‌వెల్’ వద్ద అధికారిక ఫొటో సెషన్ నిర్వహించగా... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రపంచకప్‌తో సందడి చేశాడు.పాక్‌ను ట్రోల్ చేసిన వరుణ్కాగా విజయోత్సవాల సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌ను వరుణ్ మరోసారి ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే తరహా ఫోటోను ఆసియాకప్-2025 విజయనంతరం కూడా అతడు షేర్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టు.. ఏసీసీ చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ట్రోఫీ లేకపోయినా, తన బెడ్ పక్కన ఒక 'టీ కప్పు' పెట్టుకుని పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ట్రోఫీని లాక్కోవచ్చు కానీ, ఛాంపియన్ ట్యాగ్‌ను కాదు" అని పరోక్షంగా పాక్‌కు చురకలు అంటించాడు. ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీతో మళ్ళీ అదే విధంగా కాఫీ తాగుతూ ఫోటోను షేర్ చేస్తూ పాక్‌ను ట్రోల్ చేశాడు.చదవండి: ఐసీసీ ప్రపంచకప్ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్‌గా మార్క్రమ్ -
ఈ విజయం వారిద్దరికీ అంకితం: గంభీర్
టీమిండియా సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్నటి వరకు అతడిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేనని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజయాల వెనుక వీరిద్దరూ ఉన్నారని మీడియా ముఖంగా ప్రకటించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్. టీమిండియా టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు. ఎవరూ ఊహించని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్. టీమిండియా విజయాల్లో వీరిద్దరి పాత్ర ఎంతో ఉందని గంభీర్ గుర్తు చేసుకున్నాడు."టి20 ప్రపంచకప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను లక్ష్మణ్ క్రమపద్ధతిలో నడిపిస్తూ జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నార"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వారిద్దరికీ కృతజ్ఞతలుఐసీసీ ప్రస్తుత చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా తనకు కష్టకాలంలో అండగా నిలిచారని వెల్లడించారు. గతేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు జైషా దన్నుగా నిలిచారని తెలిపాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను పొగిడారు. వీరిద్దరికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.భయాన్ని వదులుకోవాలితాను తన జట్టుకు జవాబుదారిగా ఉంటానని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ వల్లే తాను కోచ్ కాగలిగానని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయపడ్డాడు. సెమీస్, ఫైనల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేనన్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలు గెలవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తానేప్పుడు నమ్మకం ఆధారంగానే జట్టు సభ్యులను ఎంపిక చేస్తానని చెప్పాడు. చదవండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే! -
T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..!
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు.వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్‌లో అభిషేక్ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అతను సహచరుడు శివమ్ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడినట్లు పేర్కొన్నాడు.అభిషేక్ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్‌తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి భారత్ భారీ స్కోర్ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ దశనే మార్చేసింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్‌ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడటం విశేషం. అభిషేక్‌కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్‌లో సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్‌గా ఫైనల్లో అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించి, భారత్ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. -
వరల్డ్‌కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
టీ20 వరల్డ్‌కప్ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్ తర్వాత (మార్చి 28) ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్ మొదలవుతుంది.జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.ఆతర్వాత భారత్ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్‌లు, 2 టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి. -
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్ సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు. -
T20 WC 2026: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్ పటేల్ (3-0-27-3), హార్దికా పాండ్యా (4-0-26-1), వరుణ్ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ సీఫర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సూపర్-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించాయి.ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్ రజా ఎంపికయ్యాడు. భారత్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్ పాండ్యా) కావడం విశేషం.ఐసీసీ టీమ్ ఆఫ్ టీ20 వరల్డ్‌కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్‌మైర్, సికందర్ రజా (c), శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా -
సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్ ప్లేయర్: గంభీర్
టీమిండియా దాదాపు 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వన్డే ప్రపంచకప్-2023లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. టీ20 వరల్డ్‌కప్-2026లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే ఊహించని పరాభవం చవిచూసిందో.. ఇప్పుడు అదే వేదికలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని.. మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్లో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే చారిత్రత్మక విజయంలో స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర.టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేని సంజూ.. ఆ తర్వాత అనుహ్యంగా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వరుసగా మూడు కీలక మ్యాచ్‌లలోనూ హాఫ్ సెంచరీలు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు.అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లోనూ 97 పరుగులతో సత్తాచాటాడు. దీంతో సంజూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్‌తో పోలుస్తున్నారు. యువరాజ్ కూడా అప్పుడు తన అద్బుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే యువీతో సంజూ పోలుస్తున్నారు.అయితే ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "యువరాజ్ సింగ్‌తో సంజూను పోల్చడం సరికాదు. కానీ సంజూ ఏమి చేశాడో మనందరికి తెలుసు. నిజంగా అతడు అద్భుతాలు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కు పైగా పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు.ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమై, టోర్నీ ప్రారంభంలో బెంచ్‌కే పరిమితమై, ఆ తర్వాత ఈ తరహా ఇన్నింగ్స్‌లు ఆడడం నిజంగా గ్రేట్. ఇది అతడిలోని ధైర్యానికి నిదర్శనం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. సంజూ ఒక స్పెషల్ ప్లేయర్" అని గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.చదవండి: T20 WC 2026: ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్ -
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
-
వారు లేకుండా భారత్ ప్రపంచకప్ ఎప్పుడూ గెలవలేదు..!
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్‌లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్ (రెండు వన్డే, మూడు టీ20). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించింది.కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్‌కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్‌ను కొనసాగించారు. రాకింగ్ సంజూ 2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్‌లో సంజూ పూర్తిగా బెంచ్‌పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది. షేకింగ్ సర్దార్2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్ సర్దార్ అనిపించుకున్నాడు. అర్షదీప్ తన నిలకడ ప్రదర్శనలతో భారత్‌కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. -
ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర. అభిషేక్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు.ఏమి జరిగిందంటే?ఫైనల్‌కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిషన్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిషన్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతాలో ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించని సంఘటన జరిగింది. వారిద్దరి మరణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విషయంపై కిషన్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జరిగిపోయింది. మేము చాలా బాధలో ఉన్నాము అని అన్నారు. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు హాజరావ్వాల్సి ఉండేది. కానీ తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కారణంగా ప్రణవ్ కోల్‌కతాలో ఉండిపోయారు. మ్యాచ్ అనంతరం కిషన్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇప్పుడు నన్ను ఛాంపియన్‌గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధగా ఉందని కిషన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే -
‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. అహ్మదాబాద్‌లో కివీస్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్పాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తుదిజట్టులో లేకపోయి ఉంటే..‘‘ఈ ప్రపంచకప్ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్‌తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్వర్క్కు లభించిన స్వీటెస్ట్ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపంకాగా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఆడాడు.అయితే, నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్All yours, Sanju! You’ve earned every bit of it! ❤️#T20WorldCup #INDvNZ pic.twitter.com/Ya4aJeeyyL— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
-
సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ త్రయం గురించే మాట్లాడుకుంటున్నారు. టీ20 వరల్డ్‌కప్-2026 వీరివల్లే భారత్ గెలిచిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవును నిజమే. కానీ వీరితో పాటు మరో ఇద్దరు సైలెంట్ హీరోలు కూడా ఉన్నారు. భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో వారిద్దరూ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో వికెట్లు తీయడం, బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం వారి స్పెషాలిటీ. ఒకరెమో తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగా.. మరొకరు తన స్పిన్ మయాజాలంతో కివీస్ అగ్రశ్రేణి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. వారే ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్.సిక్సర్ల దూబేఈ టోర్నీ అసాంతం దూబే అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు ఆరంభంలో దూకుడుగా ఆడితే, దూబే చివరిలో బ్యాటింగ్‌కు వచ్చి తనపని తాను చేసుకోపోయేవాడు. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం విఫలమైనా.. దూబే మాత్రం రాణించాడు. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్లోనూ తన మార్క్‌ను చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో సెకెండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ముంబై ఆటగాడు తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా దూబే బ్యాట్ ఝూలిపించాడు. భారత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా నీషమ్ వేసిన చివరి ఓవర్లో అతడు ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 255 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. దూబే మొత్తంగా 9 మ్యాచ్‌లలో 235 పరుగులు చేశాడు. దూబే ఆడిన చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఈ రోజు భారత్‌ను విశ్వవిజేతగా నిలిపింది.అక్షర్ అదుర్స్భారత్ ఫైనల్‌కు చేరి కప్ కొట్టడంలో అక్షర్ది కీలక పాత్ర. వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో పటేల్ బంతితో రాణించకపోయినప్పటికి ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్షర్ సంచలన క్యాచ్‌లతో హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ప్లేయర్లను పెవిలియన్‌కు పంపాడు.ఒకవేళ అక్షర్ ఆ క్యాచ్‌లను అందుకోపోయింటే కథ మరోలా ఉండేది. అప్పటికే ఇంగ్లండ్ భారత్‌ను ఓడించే అంత పనిచేసింది. ఫైనల్ మ్యాచ్‌లోనూ అక్షర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ వంటి డేంజరస్ ప్లేయర్లను ఔట్ చేసి భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్‌లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?Crowd started chanting "Dube !! Show us your muscles" when they saw Shivam Dube😅❤ Then Shivam Dube finally started flexing his muscles😂🔥pic.twitter.com/hOLNZDv7uy— Gillfied⁷ (@Gill_Iss) March 9, 2026 -
T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ కామెంటేటర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి పేరుంది. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఛలోక్తులు, చణుకులు విసరడంలో అతడు దిట్ట. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, అద్భుతమైన క్షణాలను తన వ్యాఖ్యానంతో మరింత గుర్తుండిపోయేలా చేసిన ఘనత అతడిది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్లో.. నాటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్.. ధోని సిక్స్ బాది విజయాన్ని ఖరారు చేయగానే.. ‘‘ఎంఎస్ ధోని తనదైన శైలిలో ముగింపు ఇచ్చాడు( "MS Dhoni finishes off in style" )’’ అన్న రవిశాస్త్రి మాటలు ఇప్పటికీ.. క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమ్రోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.అంతటి రవిశాస్త్రి కామెంట్రీలోనూఅయితే, అంతటి రవిశాస్త్రి కామెంట్రీలో కూడా కొన్నిసార్లు తప్పులు దొర్లడం సహజం. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అతడు చేసిన పొరపాటు నెట్టింట ట్రోలింగ్‌కు కారణమైంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ దుమ్ములేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు సాధించింది. తద్వారా పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను.. భారత్ 159 పరుగులకే ఆలౌట్ చేసింది.తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతోకివీస్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లోనే.. అక్షర్ పటేల్ తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో జేకబ్ డఫీ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ వర్మ పట్టడంతో న్యూజిలాండ్ కథ ముగిసింది. అయితే, తిలక్ క్యాచ్ అందుకున్న సమయంలో రవిశాస్త్రి.. న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది అని కామెంట్రీలో చెప్పాడు.అద్భుతమైన ప్రదర్శనఆ వెంటనే తప్పును గ్రహించి.. ‘‘నిజానికి అంతా అయిపోయింది.. టీమిండియా మూడోసారి ప్రపంచకప్ గెలిచింది. వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన’’ అని రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాకు టైటిల్ కోల్పోయిన వేదికపైనే.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ గెలిచి సత్తా చాటిందని కొనియాడాడు. రవిశాస్త్రి కామెంట్రీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్Let the celebrations begin 🤩India are #T20WorldCup 2026 champions 🏆 pic.twitter.com/zGgQtwODwH— ICC (@ICC) March 8, 2026 -
అర్ష్‌దీప్.. ఇదేనా నీ సంస్కారం? ఫ్యాన్స్ ఫైర్
టీ20 వరల్డ్‌కప్-2026 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత్ మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ తుది పోరులో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్రీడా స్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడు. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌తో అర్ష్‌దీప్ గొడవపడ్డాడు.అసలేమి జరిగిందంటే?న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను మిచెల్ భారీ సిక్సర్లగా మలిచాడు. అదే ఓవర్లో ఐదో బంతికి నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు మిచెల్ ఆడాడు. అయితే ఫాలో త్రులో బంతిని అందుకున్న అర్ష్‌దీప్ కోపంతో వికెట్ల వైపు త్రో చేశాడు.అయితే బంతి నేరుగా వెళ్లి మిచెల్‌కు బలంగా తాకింది. క్రీజులో ఉన్నప్పటికి తనపైకి బంతి విసిరడంతో మిచెల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. అర్ష్‌దీప్ వైపు కోపంగా చూస్తూ, గట్టిగా అరుస్తూ అతని వైపు వెళ్లాడు. ఆ సమయంలో అర్ష్‌దీప్ మొదట క్షమాపణ చెప్పకుండా వెనక్కి నడవడంతో మిచెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్‌కు సర్దిచెప్పాడు. అంపైర్ కూడా అర్ష్‌దీప్‌ను పిలిచి హెచ్చరించాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ స్వయంగా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది.కానీ అర్ష్‌దీప్ ప్రవర్తనను భారత అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. సారి చెప్పినా, అర్ష్‌దీప్ అలా చేయడం సరికాదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన 4 ఓవర్లలో కోటాలో32 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.చదవండి: T20 WC 2026: టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?Rohit Sharma to Arshdeep Singh regarding Daryl Mitchell incident🎙;Paaji !! Since when do you start doing so much sledging😭❤🔥pic.twitter.com/5l49estQO4— Gillfied⁷ (@Gill_Iss) March 8, 2026 -
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
పొట్టి ఫార్మాట్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి చాటి చెప్పింది. టీ20 ప్రపంచకప్-2026 విజేతగా సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నిలిచింది. గతంలో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన చోట మన జట్టు అద్భుతాలు సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ తుది పోరులో భారత జట్టు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. ఈ చారిత్రత్మక విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఓసారి పరిశీలిద్దాం.ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?విజేత టీమిండియాకు రూ.27.48 కోట్ల నగదు బహుమతి లభించింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధికం . అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ.14.65 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనలిస్ట్స్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సుమారు రూ. 7.24 కోట్లు అందుకోనున్నాయి. గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 2.29 కోట్లు లభించనుంది. 2024 టీ20 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం వరకు భారీగా పెంచారు. ఐసీసీ ఏకంగా ఈ ఏడాది వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని రూ.123 కోట్లగా నిర్ణయించింది. బీసీసీఐ సైతం భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డును ప్రకటించనుంది.చదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్ -
అబ్బా.. అదొక కిల్లర్ కాంబో: ధోని పోస్ట్ వైరల్
టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. బార్బడోస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. తాజాగా ఆదివారం నాటి ఫైనల్లోనూ జయభేరి మోగించింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌ను ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది.ఈ నేపథ్యంలో యావత్ భారతావని సూర్య సేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్, టీమిండియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు.. ఒకప్పటి సహచర ఆటగాడు, ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ఆసక్తికర పోస్టు చేశాడు.కన్నులపండుగ‘‘అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు అభినందనలు. ఈరోజు టీమిండియా ఆట కన్నులపండుగగా సాగింది.అబ్బా అదొక కిల్లర్ కాంబోకోచ్ సాహెబ్.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి బాయ్స్. ఇక బుమ్రా గురించి కూడా ఒక మాట చెప్పాలిగా.. అతడొక చాంపియన్ బౌలర్’’ అని ధోని ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫొటో జతచేశాడు. ధోని షేర్ చేసిన ఈ పోస్టు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆరు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఏకైక కెప్టెన్గాకాగా ఐసీసీ 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్‌ను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గంభీర్ సభ్యుడు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్‌కప్ (ఇందులోనూ గంభీర్ సభ్యుడే), 2013లో చాంపియన్స్ ట్రోఫీని ధోని అందించాడు. తద్వారా భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 255/5(20)👉న్యూజిలాండ్ స్కోరు: 159(19)👉ఫలితం: 96 పరుగుల తేడాతో భారత్ జయభేరిచదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్The ICC Men's #T20WorldCup 2026 Champions, everyone! ⭐️ ⭐️ ⭐️#INDvNZ #TeamIndia #Champions pic.twitter.com/5FFrQvYcww— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
-
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
-
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్‌లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్‌గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది.ప్రశంసల వర్షం ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.‘‘పాకిస్తాన్లో క్రికెట్ టాలెంట్‌కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్‌లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాంకానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్‌ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్
మరోసారి దురదృష్టం.. స్వయంకృతాపరాధానికి మూల్యం.. 2015. 2019, 2021, 2026.. నాలుగు సందర్భాల్లోనూ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కీలక సమయంలో ఒత్తిడికి గురై.. మరోసారి ‘చోకర్స్’గా మిగిలిపోయింది.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన కివీస్.. ‘రెండోస్థానం’ అనే చేదు ముద్రను పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విచారం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు ఆట పట్ల మాత్రం తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము‘‘అవును.. ఇది జరిగిపోయింది. అయినా మా జట్టు ప్రయాణం ఇక్కడిదాకా సాగినందుకు గర్వంగా ఉంది. మా వాళ్లు గొప్పగా ఆడారు. టోర్నీ ఆసాంతం మేము సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రతీ దశలోనూ ఆటంకాన్ని అధిగమించి ఇక్కడిదాకా వచ్చాము.ఈరోజు కూడా గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము. స్టేడియం మొత్తం నీలి వర్ణమే. వారి సాక్షిగానే ఓటమిని ఆహ్వానించాము. మేము ఇక్కడ ఫేవరెట్ జట్టు కాదు.ఏదేమైనా సొంతగడ్డపై సూర్యకుమార్ సేన అద్భుతం చేసింది. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మా జట్టులోని ఒక్కో సభ్యుడు ఒక్కో సందర్భంలో ముందుకు వచ్చి జట్టును గెలిపించాడు. సూపర్-8, సెమీ ఫైనల్లో మేము గొప్పగా ఆడాము.ముందుగా చెప్పినట్లు గొప్ప జట్టు చేతిలోనే ఫైనల్ ఓడిపోయాము. మా వాళ్లు నాకు గర్వకారణం’’ అని సాంట్నర్ కివీస్ జట్టును ప్రశంసించాడు. ఇక తమ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ..అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి‘‘పవర్ ప్లేలో వాళ్లు ఒక్క వికెట్ కోల్పోకుండా ఏకంగా 90 పరుగుల మేర అసాధారణ స్కోరు నమోదు చేశారు. మేము మాత్రం పవర్‌ప్లేలో సుమారుగా 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అక్కడే చాలా వెనుకబడి పోయాము. 256 పరుగుల మేర భారీ స్కోరు ఛేదనలో ఇలాంటి పరిస్థితి రావడం అతి పెద్ద సవాలు’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.భారత ఓపెనర్ల విధ్వంసంకాగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో టీమిండియా పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధిస్తే.. న్యూజిలాండ్ 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ విధ్వంసం కారణంగా భారత్‌కు పవర్ ప్లేలో ఈ మేర స్కోరు సాధ్యమైంది. పవర్ ప్లే ముగిసేసరికి సంజూ 17 బంతుల్లో 33, అభిషేక్ 19 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఓవరాల్‌గా సంజూ 89 పరుగులు సాధించగా.. అభిషేక్ 52 పరుగులు చేశాడు. చదవండి: Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డులక్కీ కెప్టెన్!CHAK DE, INDIAAAAA! 🇮🇳Ladies & gentlemen, presenting the three-time ICC Men's T20 World Cup champions 🏆🏆🏆#T20WorldCup #INDvNZ pic.twitter.com/0hb7APCcD2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
వాళ్లు అద్భుతం.. తదుపరి లక్ష్యం గోల్డ్ మెడల్: సూర్యకుమార్
టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. తమ ఖాతాలో మూడో పొట్టి వరల్డ్‌కప్ ట్రోఫీని జమచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ ఘనత సాధించింది.చరిత్ర పుటల్లోకి ఈ అద్వితీయ గెలుపుతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో పాటు సూర్య పేరు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సూర్య రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడమేనని పేర్కొన్నాడు. తద్వారా ఇప్పుడే తాను రిటైర్ కాబోనని 35 ఏళ్ల సూర్య సంకేతాలు ఇచ్చాడు.గోల్డ్ మెడల్ లక్ష్యంకాగా 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ తదుపరి ఎడిషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘తదుపరి ఒకే ఏడాదిలో టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో.. ‘‘ఈ సంతోషం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.వాళ్లు అద్భుతంసంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. ఫైనల్లో ఆ పని చేసి చూపించారు. ఇక మా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. తరానికొక్క అరుదైన బౌలర్. అతడిని జాతీయ సొత్తు అని పిలవవచ్చు. జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. జట్టులోని ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను చక్కగా నెరవేర్చారు’’ అని సూర్య ప్రశంసలు కురిపించాడు.చదవండి: లక్కీ కెప్టెన్!From World Cup glory to the next challenge, #SuryakumarYadav opens up about what lies ahead for #TeamIndia.🇮🇳❤️#T20WorldCup #INDVNZ pic.twitter.com/5NPw2aNK5X— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
చరిత్ర సృష్టించిన భారత్
-
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
-
రఫ్పాడించిన భారత్.. టీ20 ఛాంపియన్స్ 2026
-
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం
-
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్‌లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్‌లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్‌లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్‌లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్‌ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్‌తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్‌కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్‌తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్‌లో డఫీ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్‌తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్‌లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్‌ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్‌ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్‌లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్‌లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్‌ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్‌కోన్‌కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
లక్కీ కెప్టెన్!
‘సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా’... దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియా ప్రతినిధి ఒకరు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రశ్న వేశాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15 మందీ సమర్థులే. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అని సమాధానం ఇస్తారు. కానీ సూర్యకుమార్ వ్యంగ్యంగా ఒకింత అహంకారంగా నవ్వుతూ... ‘అభిషేక్‌ను తీసి ఆడించమంటారా...తిలక్‌ను తీసి ఆడించమంటారా’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాతి మ్యాచ్ జింబాబ్వేపై సామ్సన్ను ఆడించాల్సి వచ్చింది. ఆపై వరుసగా సామ్సన్ అద్భుత ప్రదర్శనలే జట్టును చాంపియన్‌గా నిలిపాయి. ఫైనల్‌కు ముందు కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో బ్యాటర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ... ‘120 స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతూ కూడా ఫైనల్‌కు వచ్చామంటే అలాగే ఆడతాం’ అంటూ అర్థం లేని సమాధానం ఒకటి ఇచ్చాడు. ఒక నాయకుడిగా అతని అపరిపక్వతకు ఇవి ఒక సూచన. కానీ ఇవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోతాయి.వరల్డ్ కప్ అందించిన నాయకుడిగానే అతను గుర్తుండిపోతాడు. కెప్టెన్‌గా 52 మ్యాచ్‌లలో 40 విజయాలు చూస్తే రికార్డుపరంగా ఇది చాలా మంచి సారథ్య ప్రదర్శనే. వరల్డ్ కప్‌కు కొద్ది రోజుల ముందు పరిస్థితి చూస్తే వరుసగా 23 టి20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు... సిరీస్‌పై సిరీస్ గెలుస్తూ వస్తున్నా కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర లేదు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో కేవలం అతని సూచనలను మైదానంలో అమలు చేసేవాడిగానే కనిపిస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అతనికి లేదు... సూర్యకుమార్ యాదవ్ సారథ్యంపై గత రెండేళ్లుగా వినిపించిన విమర్శలు.తాజాగా వరల్డ్ కప్‌లోనూ ‘ఇదీ కెప్టెన్ క్షణం’ అనిపించే వ్యూహాలు ఏమీ అతడి నుంచి రాలేదు. అంతా సానుకూలంగా సాగిపోయింది, జట్టులో అందరూ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వెళుతున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూనే వచ్చాయి. అయితేనేమి భారత్‌కు ప్రపంచ కప్ అందించిన దిగ్గజాలు కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ సరసన ఇప్పుడు సూర్యకుమార్ కూడా నిలిచాడు. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టి20ల్లో సూర్య ఆటోమెటిక్ ప్రత్యామ్నాయం ఏమీ కాదు.బ్యాటర్‌గా మంచి గుర్తింపు ఉన్నా నాయకుడిగా అతనికి ఎలాంటి రికార్డు లేదు. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత అప్పటి ఫామ్, సారథిగా అనుభవాన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు దక్కుతాయని అనిపించింది. అయితే క్రికెటేతర కారణాలు కావచ్చు పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా పెట్టారు. అయితే బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలు సూర్య కెప్టెన్సీ స్థానాన్ని పటిష్టం చేశాయి.శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... ఇలా ప్రతీ జట్టుపై సిరీస్ సాధించడంతో పాటు ఆసియా కప్ కూడా మన ఖాతాలో చేరింది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చ వచ్చినా వరల్డ్ కప్‌కు మరీ తక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ అలాంటి సాహసం చేయలేదు. వరల్డ్ కప్‌లోనూ టీమిండియా ప్రదర్శన ముందు అన్ని జట్లూ తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడంలో సూర్య సఫలమయ్యాడు. –సాక్షి క్రీడా విభాగం -
ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగి
భయం లేదు, బెదురు లేదు... మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన మాత్రమే ఉంది. ఒక వికెట్ పడితే నెమ్మదించిపోయే తత్వం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకడు పోతే మరొకడు అన్నట్లుగా అవుటైన బ్యాటర్ తర్వాత వచ్చే ఆటగాడు అంతకంటే ఎక్కువ కసితో చెలరేగిపోయేందుకు సిద్ధం... గత రెండేళ్ళలో భారత టి20 జట్టు బ్యాటింగ్ ప్రతాపం ఇదే తరహాలో సాగింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కానీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఐపీఎల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్న వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిని ప్రదర్శించారు. ఓపెనర్‌గా ప్రతీ మ్యాచ్‌కు కొత్త రికార్డు నెలకొల్పుతూ వచ్చిన అభిషేక్ ఇచ్చిన ఆరంభాలు టీమిండియా విజయాలు సులువు చేస్తే, మిడిలార్డర్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కీలకంగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ జట్టులో తిలక్ విలువను చూపించింది. ఇక అనూహ్యంగా టీమ్‌కు దూరమై తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ మరింత చెలరేగిపోయాడు. అసాధారణ ఫామ్‌తో అతను వరల్డ్ కప్‌లోకి అడుగు పెట్టాడు. టోర్నీలో కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్‌తోపాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కీలక సమయంలో భారత జట్టు వ్యూహం మార్చిన తీరు టోర్నీలో మన రాతను మార్చింది. టాప్–3లో అభిషేక్, కిషన్, తిలక్లవంటి ముగ్గురు ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో ప్రత్యర్థులు ఆఫ్‌స్పిన్నర్‌ను ప్రయోగించి జట్టును దెబ్బ తీస్తూ వచ్చారు. దీనిని గుర్తించిన యాజమాన్యం సామ్సన్ను మళ్లీ ఆడించి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అంతే... ఆ తర్వాత టీమ్ ప్రదర్శన ఒక్కసారిగా మారిపోయింది. జింబాబ్వేపై 256 పరుగులు, విండీస్‌పై 196 పరుగుల అలవోక ఛేదన, ఇంగ్లండ్‌పై 253, న్యూజిలాండ్‌పై 255... ఇలా పరుగుల వరద పారింది. ఒక్క అమెరికాపై మ్యాచ్ మినహా బ్యాటర్‌గా సూర్యకుమార్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. కానీ సహచరుల ప్రదర్శనలతో భారత్ వరుస విజయాలు సాధించడం సారథిగా అతనిపై ఒత్తిడిని తగ్గించింది. ఇక అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా విలువ వెలకట్టలేనిది. బ్యాటింగ్‌లో భారీ హిట్టింగ్తో పరుగులు రాబట్టిన అతను బౌలర్‌గా అటు కొత్త బంతితో, ఇటు చివరి ఓవర్లలో కూడా సత్తా చూపించాడు. ఇంగ్లండ్‌పై సెమీస్‌లో అతను వేసిన 19వ ఓవర్ ఎంత కీలకంగా మారిందో చెప్పనవసరం లేదు. ఈసారి జట్టు విజయంలో శివమ్ దూబే కూడా తోడయ్యాడు. స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్లతో దూబే చూపించిన దూకుడు జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. బౌలింగ్‌లో బుమ్రా ఒంటి చేత్తో జట్టుతో నడిపించిన తీరు అతను ‘ఆల్‌టైమ్ గ్రేట్’ ఎందుకో చెబుతుంది. 2024 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన బుమ్రా ఈసారి కూడా వన్నె తగ్గకుండా తన పదునును చూపించాడు. ఏడుకంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం కోలుకోకుండా చేసింది. ఫైనల్లో తీసిన 4 వికెట్లు బుమ్రా స్పెషల్. తనదైన శైలిలో బ్యాటర్లను నిలువరించడంలో అర్‡్షదీప్ కూడా పూర్తిగా సఫలమయ్యాడు. వరుణ్ చక్రవర్తి టోర్నీ ద్వితీయార్ధంతో కొంత తడబడినా... ఓవరాల్‌గా అతని స్పిన్ ప్రభావం బాగానే కనిపించింది. టీమ్ కూర్పు కారణంగా సిరాజ్, కుల్దీప్ ఒకే ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాగా, రింకూ సింగ్‌కు కూడా ఎక్కువ అవకాశం రాలేదు. 2024 ఆరంభం నుంచి భారత జట్టు ఆరుసార్లు 250కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపడింది. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత 50 మ్యాచ్‌లలో 41 విజయాలు మన స్థాయిని, అసాధారణ ప్రదర్శనను చూపించాయి. ఈ టోర్నీలో కూడా ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మినహా మిగతా ఎనిమిది మ్యాచ్‌లలో టీమిండియా అసలు స్థాయిని ప్రదర్శించాయి. గత రెండేళ్లుగా సాగించిన సన్నాహాలు, వరుస సిరీస్‌లలో విజయాలు, ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు వరుసగా రెండో వరల్డ్ కప్‌ను అందించాయి. –సాక్షి క్రీడా విభాగం సక్సెస్ఫుల్ కోచ్ భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్‌స్వీప్‌నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్‌గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సంబంధించి మాత్రం గంభీర్‌ను విజయవంతమైన కోచ్‌గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్‌గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్‌కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్‌లను గెలిపించిన కెప్టెన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్‌కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్‌గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
‘రెండో స్థానం’ ముద్ర మారలేదు!
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2026 టి20 వరల్డ్ కప్ ఫైనల్... గత ఆరేళ్లలో నాలుగు ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు నాలుగు సార్లూ రన్నరప్‌కే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడటం, అసలు సమయంలో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. వారిని చూస్తే ఇకపై కూడా ఇంతే అనిపించడం మాత్రమే కాదు... ఆ జట్టుపై జాలి పడటం కూడా అనవసరం అనిపిస్తుంది. 2019 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో దురదృష్టం వెంటాడి ఓడినప్పుడు అంతా అయ్యో కివీస్ అనుకున్నారు. కానీ మిగతా మూడు ఫైనల్ మ్యాచ్‌లలో మాత్రం వారిదే స్వయంకృతం. కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక జట్టు పూర్తిగా చేతులెత్తేస్తూ వచ్చింది. సుమారు 50 లక్షల జనాభాతో చిన్న దేశంగా, తక్కువ సౌకర్యాలతో ఉన్న తాము భారత్‌లాంటి జట్టుతో ఫైనల్లో ఆడటమే మహద్భాగ్యం అన్నట్లుగా జట్టు ఆల్‌రౌండర్ ఫిలిప్స్ చేసిన వ్యాఖ్యలు ఆటకు ముందే ఓటమికి సిద్ధమైనట్లుగా అనిపించాయి. మంచివాళ్లుగా మాకు పేరున్నా సరే... భారత అభిమానులు గుండె పగిలేలా చేయడానికి వెనుకాడం అంటూ ఫైనల్‌కు ముందు ప్రకటించిన కెప్టెన్ సాంట్నర్‌తో పాటు పూర్తిగా టీమ్ తలవంచింది. ఇక్కడ ఓటమి మాత్రం పూర్తిగా స్వయంకృతంలా కనిపించింది. నిజానికి టోర్నీలో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా కివీస్ అద్భుతంగా ఏమీ ఆడలేదు. లీగ్ దశలో కివీస్ చేతిలో చిత్తు కావడం, సూపర్ ఎయిట్స్తో ఇంగ్లండ్ చేతిలో ఓడటం ఆ జట్టును బలహీనతలను బాగా చూపించాయి. కోల్‌కతాలో జరిగిన సెమీస్‌లో మాత్రం చిన్న గ్రౌండ్, మంచు మధ్య సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. అది వారిలో అతి విశ్వాసానికి దారి తీసినట్లుంది. భారత్‌తో వారి సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ అంటే గెలుపు ఎంత కష్టమో ప్రతీ జట్టుకు తెలుసు. కానీ ఈ మ్యాచ్‌కు సంబంధించి కివీస్ ఎలాంటి హోం వర్క్ చేసినట్లుగా లేదు. భారత్‌తో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేసిన తప్పులు తాము చేయకుండా ఎలాంటి వ్యూహంతో ఆడాలో కివీస్ గుర్తించినట్లు లేదు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకొని భంగపడింది. వారి ఆట చూస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్ గెలిచేదేమో అనిపించింది. మంచు ప్రభావం ఎలా ఉన్నా, మైదానంలో ఛేదన సులువు అని రికార్డులు చెబుతున్నా...ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో ఉండే తీవ్ర ఒత్తిడి వేరు. బలమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొని తాము లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో లక్ష్యాన్ని ఛేదించగలమని కివీస్ అసలు ఎలా భావించింది! టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆ జట్టు చేసిన మొదటి తప్పు. టోర్నీ ఆసాంతం టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ల బౌలింగ్‌లో బాగా తడబడింది. సెమీస్‌లో సత్తా చాటిన రెగ్యులర్ ఆఫ్‌స్పిన్నర్ మెక్కోన్కీని తుది జట్టునుంచి తప్పించడం పెద్ద తప్పు కాగా, అదనపు పేసర్ డఫీనుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశించడం కూడా అంతే తప్పు. సీనియర్ కావడం తప్ప నీషమ్ బౌలింగ్ ఏమాత్రం ప్రభావవంతం కాకపోయినా అతడిని తప్పించే ఆలోచన చేయలేదు. పైగా ఫెర్గూసన్‌లాంటి రెగ్యులర్ పేసర్‌కు ఓవర్లు మిగిలి ఉండగా నీషమ్‌తో ఆఖరి ఓవర్ వేయించింది. తొలి ఓవర్లో హెన్రీ కాస్త స్వింగ్ రాబట్టగా అతడిని ఒక ఓవర్‌కే పరిమితం చేసి డఫీకి బంతినివ్వడంతో అంతా కథ మారిపోయింది. ఏదో భారత్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బంతులు విసిరినట్లుగానే వారి ఆట సాగింది. టీమిండియా స్కోరు చూడగానే సహజంగానే కివీస్ బెంబేలెత్తిపోయింది. అలెన్ తొందరగా అవుట్ కావడంతో ఇక చేసేదేమీ లేదనే పరిస్థితి కనిపించింది. ఇంగ్లండ్ తరహాలో పోరాడటంలో టీమ్ విఫలమైంది. న్యూజిలాండ్ ఇదే తరహాలో మున్ముందూ ఆడితే ఎప్పటికీ రన్నరప్ స్థానమే తప్ప వరల్డ్ కప్ ఆ జట్టు ఖాతాలో చేరడం సందేహమే. చివరగా... 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికాకు ఆ సమయంలో హెడ్ కోచ్‌గా ఉన్న రాబ్ వాల్టర్ ఇప్పుడు ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా హెడ్ కోచ్ కావడం విశేషం! – సాక్షి క్రీడా విభాగం -
సలాం సామ్సన్...
‘ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా. సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం కచ్చితంగా లభిస్తుంది’... వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్‌కు ముందు సంజు సామ్సన్‌కు తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్‌లో నమీబియాతో అభిషేక్ అనారోగ్య కారణంగా సామ్సన్‌కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమ్‌లో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై చాన్స్ లభించినా 24 పరుగులకే పరిమితం! దాంతో సామ్సన్ టీమ్‌కు భారం, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ సామ్సన్ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ లభించింది. అంతే... అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్‌తో కీలకపోరులో 50 బంతుల్లో 97 నాటౌట్... సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 42 బంతుల్లో 89... ఫైనల్లో న్యూజిలాండ్‌పై 46 బంతుల్లో 89... వరుసగా మూడు ముఖ్యమైన మ్యాచ్‌లలో మూడు అర్ధసెంచరీలతో తిరుగులేని ప్రదర్శన. మూడుసార్లూ త్రుటిలో సెంచరీ చేజారింది.చివర్లో కాస్త ప్రయత్ని స్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతీ బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్ని ంచలేదు. కానీ ఈ మూడు మ్యాచ్‌లలో సామ్సన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. సామ్సన్‌కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని, అతనికి చోటు దండగ అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది. సామ్సన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాకుండా ‘నామ్‌కే వాస్తే’గానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 321 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా గెల్చుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం వెల్డన్... టీమిండియా న్యూఢిల్లీ: మూడోసారి టి20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషికి భారత జట్టు విజయం నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా మోదీ ప్రశంసించారు. ‘టోర్నీ ఆద్యంతం అత్యద్భుత ఆటతీరుతో అలరించారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వెల్డన్... టీమిండియా’ అంటూ మోదీ కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ సూర్యకుమార్ బృందం సాధించిన టి20 ప్రపంచకప్ విజయం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి టీమిండియాను అభినందించారు. భవిష్యత్‌లో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
తొమ్మిది మంది ‘డబుల్’
2024 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల్లో 9 మంది ఈసారీ విన్నింగ్ టీమ్‌లో భాగంగా ఉండి కెరీర్లో రెండు టి20 వరల్డ్ కప్‌లు గెలుచుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరారు. సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లకు ఇది రెండో టి20 వరల్డ్ కప్ విక్టరీ. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలకు ఇది తొలి తీపి వరల్డ్ కప్. 2024లో కెప్టెన్ అయిన రోహిత్ శర్మ 2007లో గెలిచిన జట్టులో సభ్యుడిగా ‘డబుల్’ ఆనందాన్ని పొందాడు. పురుషుల దినోత్సవాన చేజారింది... మహిళల దినోత్సవాన దక్కింది... 2023 నవంబర్ 19న భారత జట్టు ఇదే అహ్మదాబాద్ మైదానంలో ఆ్రస్టేలియాతో చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడి తీవ్ర నిరాశకు గురైంది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘మెన్స్ డే’గా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ‘ఉమెన్స్ డే’ (మార్చి 8న) రోజు టీమిండియా అదే మైదానంలో మరో వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో సత్తా చాటి విశ్వవిజేతగా నిలవడం విశేషం. ఎట్టకేలకు ఆదివారం ‘గెలిచాం’ గతంలో ఆదివారం రోజు జరిగిన మూడు వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత జట్టు ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. నాలుగోసారి మాత్రం ‘సండే ఫైనల్ సెంటిమెంట్’ను బద్దలు కొట్టింది. ఆదివారం రోజు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో తొలిసారి భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం రోజు జరిగిన 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో... 2014 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో... 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా... ఈసారి మాత్రం ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించి ఆదివారం అద్భుతం సాధించింది. గతంలో భారత్ గెలిచిన 1983, 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ శనివారం రోజున, 2007 టి20 వరల్డ్‌కప్ టైటిల్ సోమవారం రోజున... 2024 టి20 వరల్డ్‌కప్ టైటిల్ శనివారం రోజున వచ్చాయి. -
టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్‌లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.Champions! Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup! This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament. This victory has filled every Indian heart with…— Narendra Modi (@narendramodi) March 8, 2026ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు.. విశ్వవిజేతగా భారత్
అహ్మదాబాద్‌లో భారత పురుషల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే అభిమానులకు గుండె కోత మిగిల్చిందో.. ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 వరల్డ్‌కప్-2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది.తద్వారా అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన జట్టుగా మెన్ బ్లూ నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టు కూడా టీమిండియానే కావడం విశేషం. భారత్ 2007,2024లో విశ్వవిజేతలగా నిలవగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరోసారి కప్ కొట్టి సత్తాచాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.దంచి కొట్టిన భారత బ్యాటర్లుఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. అయితే శాంట్నర్ తీసుకున్న నిర్ణయం మిస్ ఫైర్ అయింది. భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.సంజూ, అభిషేక్ తొలి వికెట్‌కు 98 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఓ దశలో భారత్ 300 పరుగుల మార్క్ అందుకునేలా కన్పించింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికల పడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పేస్ గుర్రం జస్ప్రీత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ మూడు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (52) టాప్ స్కోరర్ నిలిచాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలవగా.. సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు లభించింది. Make it THREEEEEEE! 🏆🏆🏆#TeamIndia have repeated & defeated history by becoming the first team to 👇▪️ Win back-to-back titles▪️Three titles▪️Win the title at home#T20WorldCup #INDvNZ pic.twitter.com/bQlm5t0D3k— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ భారత టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. కివీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.అభిషేక్. సంజూ ధనాధన్గత మ్యాచ్‌లలో విఫలమై విమర్శలు మూటగట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ.. టైటిల్ పోరులో బ్యాట్ ఝులిపించాడు. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 52 పరుగులు సాధించాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026ఇక మరో ఓపెనర్ సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరోసారి విజృంభించాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 89 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెమీస్ మాదిరే సెంచరీకి మరోసారి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026ఇషాన్ సైతంవన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 54 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 18) నిరాశపరిచాడు. తిలక్ వర్మ 6 బంతుల్లో 8 పరుగులతో అజేయంగా నిలవగా.. శివం దూబే 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన టీమిండియాటీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో 255/5 స్కోరు నమోదు చేసిన టీమిండియా.. గత ఎడిషన్‌లో తాను సృష్టించిన రికార్డును.. తాజాగా బద్దలు కొట్టింది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో సౌతాఫ్రికాతో ఫైనల్లో టీమిండియా 176/7 నమోదు చేసింది.టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్లు👉టీమిండియా- 2026లో న్యూజిలాండ్‌పై 255/5👉టీమిండియా- 2024లో సౌతాఫ్రికాపై 176/7👉ఆస్ట్రేలియా- 2021లో న్యూజిలాండ్‌పై 173/2👉న్యూజిలాండ్- 2021లో ఆస్ట్రేలియాపై 172/4👉వెస్టిండీస్- 2016లో ఇంగ్లండ్‌పై 161/6👉టీమిండియా- 2007లో పాకిస్తాన్ 157/5.చదవండి: టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు -
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2026ను టీమిండియా స్టార్ ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో శాంసన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్లో ఇప్పటివరకు 4 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, గుర్బాన్, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదారు.👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్(21)ను సంజూ అధిగమించాడు.👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. శాంసన్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక మ్యాచ్‌లో తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్‌కు చెక్ పెడుతూ కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ నాకౌట్స్ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని అభిషేక్ అధిగమించాడు.ఓవరాల్‌గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ స్కోర్ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది.🚨 ABHISHEK SHARMA SELECTION UNDER QUESTION 🚨Fans said – “Why is GG wasting a spot for this blind slogger?”Management said – Abhishek has only 89 runs in 7 matches with 3 ducks, but we won’t change the winning combination for the Final! 🤯pic.twitter.com/05OFSZf4PT— Sam (@Cricsam01) March 7, 2026 -
T20 WC Final: అదృష్టం!.. భయపెడుతున్న మరో సెంటిమెంట్
న్యూజిలాండ్‌తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఊహాగానాలకు తెరదించుతూ సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టునే టైటిల్ పోరులోనూ కొనసాగించింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. నంబర్ వన్ బౌలర్ వరుణు చక్రవర్తికి తుదిజట్టులో చోటు ఇచ్చింది.అదే వేదిక.. అదే అంపైర్ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్లకు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఇదే వేదికపై టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. తాజా ఫైనల్‌కు కూడా అంపైర్ కావడం గమనార్హం.అదృష్టం ఏమిటంటేఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 14 టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో పదకొండు లక్ష్య ఛేదనకు దిగిన జట్లే గెలవడం ఇందుకు కారణం. అయితే, అదృష్టం ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన సందర్భాలలో.. మూడు విజయాలూ టీమిండియా ఖాతాలోనే ఉండటం. కాగా టీమిండియా కివీస్‌తో ఫైనల్లో ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ కోల్ మెకాంచీ స్థానంలో జేకబ్ డఫీని తీసుకువచ్చింది. Classic Ravi Shastri energy at the toss! 😍🚨 The coin toss goes Mitchell Santner's way & New Zealand will bowl first in the final! ✌️ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/g8UkcXpNKo— Star Sports (@StarSportsIndia) March 8, 2026తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ . -
గతం గురించి ఆలోచించడం లేదు.. ఇది మాకు చాలా స్పెషల్: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో తుది పోరుకు తేర లేచింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్-భారత్ తలపడతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. న్యూజిలాండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. మెక్కాంచీ స్ధానంలో పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన టీమ్‌నే కొనసాగించింది. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్‌లుగా మేము మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాము. సెమీస్ లేదా ఫైనల్ వంటి మెగా మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్ధి ముందు ఉంచిగల్గితే ఉత్తమంగా ఉంటుంది.2023 వరల్డ్‌కప్ ఓటమి గురుంచి మేము ఆలోచించడం లేదు. అది గతం మాత్రమే. ఇది డిఫెరెంట్ ఫార్మాట్. మా కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. 1,20,000 మంది ప్రేక్షకుల ముందు ఇటువంటి మ్యాచ్ ఆడడం నిజంగా చాలా స్పెషల్. టాస్ వేసే సమయానికే స్టేడియం నిండిపోయింది. మా ఆట తీరుతో వారిని అలరిస్తామని" సూర్య పేర్కొన్నాడు.తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ -
టీ20 వరల్డ్‌కప్-2026 ఛాంపియన్స్‌గా భారత్
వరల్డ్ ఛాంపియన్‌గా భారత్టీ20 వరల్డ్‌కప్-2026 ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడోసారి పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికలపడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.UPDATESన్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన శాంట్నర్.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.బుమ్ బుమ్ బుమ్రా..16వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కివీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి నీషమ్, నాలుగో బంతికి హెన్రీ క్లీన్ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 143/8ఆరో వికెట్ డౌన్.. మిచెల్ ఔట్124 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డారిల్ మిచెల్.. అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.న్యూజిలాండ్ ఐదో వికెట్ డౌన్52 పరుగులు చేసిన టిమ్ సీఫర్ట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు కివీస్ స్కోర్: 80-5కివీస్ నాలుగో వికెట్ డౌన్న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన చాప్మన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.సీఫర్ట్ హాఫ్ సెంచరీఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి టిమ్ సీఫర్ట్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 7 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.న్యూజిలాండ్ మూడో వికెట్ డౌన్న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.కివీస్ రెండో వికెట్ డౌన్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రవీంద్ర.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.కివీస్ తొలి వికెట్ డౌన్256 పరుగుల భారీ లక్ష్యంంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు కివీస్ స్కోర్: 32/1న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?టీ20 వరల్డ్‌కప్-2026లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-4హార్దిక్ 12, తిలక్ 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్15.6: సూర్యకుమార్ డకౌట్. నీషమ్ బౌలింగ్‌లో రచిన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్. స్కోరు: 204-4(16). క్రీజులోకి తిలక్ వర్మ. హార్దిక్ ఒక పరుగుతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన భారత్15.5: నీషమ్ బౌలింగ్‌లో మార్క్ చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇషాన్ (25 బంతుల్లో 54).రెండో వికెట్ కోల్పోయిన భారత్15.1: జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో సంజూ మెకాంచీ (సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించాడు.ఇషాన్ హాఫ్ సెంచరీ23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ హాఫ్ సెంచరీ14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-1సంజూ 44 బంతుల్లో 88, ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీసంజూ శాంసన్ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన భారత్‌అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లలో విఫలమైన అభిషేక్ ఈసారి 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు.పవర్ ప్లేలో టీమిండియా రికార్డు స్కోరు: 92-0(6)అభిషేక్ 19 బంతుల్లో 51, సంజూ శాంసన్ 17 బంతుల్లో 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్ధ శతకం బాదాడు. రికార్డు అలర్ట్టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లుగా చరిత్ర సృష్టించిన భారత జోడీ సంజూ- అభిషేక్దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లుఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(23), సంజూ శాంసన్(24) దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీటీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షురూ కానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఊర్రూతలూగేలా..పాప్ స్టార్ రికీ మార్టిన్ క్లోజింగ్ సెర్మనీలో మారియా సాంగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. డాన్సులతో ఉర్రూతలూగించాడు. అంతకుముందు సుఖ్బీర్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.#WATCH | Gujarat: Team India leaves from their hotel in Ahmedabad for Narendra Modi Stadium where they will face New Zealand in #ICCT20WorldCupfinal this evening. pic.twitter.com/X2sjnwXyTb— ANI (@ANI) March 8, 2026ధోని సైతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.#WATCH | Gujarat | Former Captain of the Indian Cricket Team Mahendra Singh Dhoni arrives at Ahmedabad ICC Men's T20 World Cup 2026 final between India and New Zealand, to be played today at the Narendra Modi Stadium. pic.twitter.com/5Q6gNuIcsQ— ANI (@ANI) March 8, 2026 సతీ సమేతంగా రోహిత్సతీ సమేతంగా భారత మాజీ కెప్టెన్, టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ అహ్మదాబాద్‌కు విచ్చేశాడు.#WATCH | Gujarat: Former Captain of the Indian Cricket Team, Rohit Sharma and his wife Ritika Sajdeh arrive in Ahmedabad to watch the India vs New Zealand #ICCT20WorldCup final at Narendra Modi Stadium this evening. pic.twitter.com/iXVibFowWH— ANI (@ANI) March 8, 2026 -
మరి కొన్ని గంటల్లో ఫైనల్.. టీమిండియా సంచలన నిర్ణయం!?
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు మరి కొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా తెరలేవనుంది.ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి మూడో సారి టైటిల్‌ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. కివీస్ సైతం తొలి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.వరుణ్‌పై వేటు..?‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఫైనల్ మ్యాచ్‌కు ముందు కుల్దీప్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వరుణ్ చక్రవర్తి మాత్రం నామమాత్రపు ప్రాక్టీస్‌కే పరిమితం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్‌గా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ తమిళనాడు స్పిన్నర్ లీగ్ స్టేజ్‌లో రాణించినప్పటికి.. కీలకమైన సూపర్-8 దశలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.సెమీఫైనల్లో కూడా ఓ వికెట్ పడగొట్టినప్పటికి పరుగులు మాత్రం ధారాళంగా సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తుందంట. వరుణ్ కంటే కుల్దీప్కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఫ్లాట్ పిచ్‌పై కూడా బంతిని తిప్పగలిగే సత్తా కుల్దీప్ యాదవ్‌కు ఉంది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు. మరి టీమ్ మెనెజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా ఈ టోర్నీలో కుల్దీప్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు.భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC Final: మారవా?.. నీ అంచనా తప్పుతుంది!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై నోరు పారేసుకున్నాడు. సూర్యకుమార్ సేనపై మిచెల్ సాంట్నర్ బృందానిదే పైచేయి అవుతుందని పేర్కొన్నాడు. కివీస్ జట్టు సమిష్టిగా రాణిస్తుంటే.. టీమిండియా ఇంకా ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడటమే ఇందుకు కారణమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్‌కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే.. పాక్ మాజీ పేసర్ ఆమిర్ టోర్నీ ఆరంభం నుంచి టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.పదే పదే అదే మాటలీగ్ దశలో సూర్య సేన అజేయంగా నిలిచినప్పటికీ.. అది అదృష్టం వల్లేనని ఆమిర్ (Mohammad Amir) అన్నాడు. ఇక సూపర్-8 దశలోనూ టీమిండియా రాణించలేదని సెమీస్‌కు చేరలేదని వాదించాడు. అయితే, భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టడమే కాకుండా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది.న్యూజిలాండ్ గెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు సమిష్టి ప్రదర్శతో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించింది. కానీ టీమిండియా.. జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ వంటి ఇద్దరు ఆటగాళ్ల కారణంగా ఈరోజు ఫైనల్లో ఉంది. వాళ్లిద్దరు లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది.నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్‌కు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా వాళ్ల బౌలింగ్ విభాగం టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. భారత జట్టులో బుమ్రా తప్ప ఎవరూ ఫామ్‌లో లేరు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా వికెట్లు తీసేందుకు కష్టపడుతున్నారు.నీ అంచనా తప్పుతుందిఅయితే, బ్యాటింగ్ పరంగా ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. ముందుగా చెప్పినట్లు న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టీమిండియా ఎక్కువగా బుమ్రా మీదే ఆధారపడుతోంది. కాబట్టి న్యూజిలాండ్‌దే గెలుపు అని విశ్వసిస్తున్నాను’’ అని మొహమ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆమిర్‌కు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. సూర్య సేన ఈసారి సమిష్టిగా రాణించి గెలిచి తీరుతుందని.. మరోసారి నీ అంచనా తప్పని నిరూపిస్తుందని పేర్కొంటున్నారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్‌కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.టైటిల్ పోరుతో తెరఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్‌తో ముగియనుంది. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడే!ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు భారత్‌లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్‌లో ఓడి ఎలిమినేట్ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది. మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదని సమాచారం.దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.ఇంగ్లండ్‌కి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికిందిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్ గురువారమే నాకౌట్ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది. వెస్టిండీస్ గత ఆదివారం నుంచి కోల్‌కతాలోనే చిక్కుకుపోయింది.సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.ఓవరాక్షన్ వద్దుఅయితే, వాన్ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ యూరోప్ గుండా విండీస్ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC Final: సాంట్నర్‌కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ -
T20 WC 2026: ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ బూస్టప్
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య అంతిమ సమరం జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్‌ను, ఓవరాల్‌గా మూడో టైటిల్ సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందా అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.చర్చలు, అంచనాలు ఎలా ఉన్నా.. టీమిండియాకు మాత్రం ఓ విషయం చాలా బూస్టప్‌ను ఇస్తుంది. అదేంటంటే.. భారత్‌కు టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇప్పటివరకు ఓటమనేదే లేదు. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో 3 సార్లు ఎదురెదురుపడగా.. మూడు సార్లు టీమిండియానే పైచేయి సాధించింది.ఓవరాల్‌గా (మొత్తం టీ20ల్లో) చూసినా న్యూజిలాండ్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరగ్గా.. 16 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.ఇరు జట్లు గత రెండు సందర్భాల్లో ఎదురెదురుపడినప్పుడు కూడా టీమిండియానే ఆధిక్యత ప్రదర్శించింది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే గెలిచింది.పై అంశాలతో పాటు మరో అంశం కూడా టీమిండియాకు సానుకూలంగా ఉంది. అదే హోం అడ్వాంటేజ్. భారత్ సహజంగానే స్వదేశంలో చెలరేగిపోతూ ఉంటుంది. అభిమానుల నుంచి లభించే విపరీతమైన ప్రోత్సాహం టీమిండియాను ఎంతటి ఒత్తిడినైనా అధిగమించేలా చేస్తుంది. ఈ విషయం పలు సార్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఈసారి అలా జరగదని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు. -
ఇండియా VS న్యూజిలాండ్ మ్యాచ్ పై వరంగల్ లో పబ్లిక్ టాక్
-
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 8) తుది సమరం జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్‌ను సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.మండుటెండల్లో ఈ హీట్‌కు తోడు మరో సంచలన విషయం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. అదేంటంటే.. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేటి ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా సూర్య నిర్ణయం మారదని పలు కథనాలు వెలువడుతున్నాయి.వయసు పైబడటం (35), మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) అవకాశాలు లేకపోవడం చేత స్కై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తరహాలోనే స్కై కూడా కెరీర్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి టీ20 ప్రపంచకప్ 2024 గెలుపు తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన సూర్య.. ఈ ప్రపంచకప్‌కు ముందే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఫామ్‌లో ఉన్నప్పుడే కెరీర్‌కు పుల్‌స్టాప్ పెడితే గౌరవంగా ఉంటుందన్న మరో భావన కూడా సూర్య రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. నేటి ఫైనల్లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపుకు దోహదపడితే స్కై భారత కెప్టెన్‌గా తన కెరీర్‌కు న్యాయం చేసినట్లవుతుంది.రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య.. కెప్టెన్‌గా అసమానమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి మేటి జట్ట భారీ సిరీస్ విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీ సక్సెస్ రేట్ 80 శాతానికి పైగా ఉందంటే, అతను ఏ రేంజ్లో విజయాలు సాధించాడో అర్దమవుతుంది. వ్యక్తిగతంగా విఫలమైనా, స్కై కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.స్కై రిటైర్మెంట్పై ఊహాగానాలు తప్పిస్తే.. ఇప్పటివరకు అతని నుంచి కానీ, బీసీసీఐ నుంచి కాని ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. ఈ విషయంపై సందిగ్దత వీడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
ఘనంగా వరల్డ్‌కప్ క్లోజింగ్ సెర్మనీ.. ప్రత్యేక ఆకర్షణగా రికీ మార్టిన్
టీ20 ప్రపంచకప్ 2026 క్లోజింగ్ సెర్మనీ ఘనంగా జరుగనుంది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగబోయే భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ గ్రాండ్ ఈవెంట్ షెడ్యూలైంది. ఈ ఈవెంట్లో అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ నృత్య, గాన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. Livin’ La Vida Loca, She Bangs వంటి హిట్ పాటలతో అతను అభిమానులను ఉర్రూతళూగించనున్నాడు.ఈ ఈవెంట్లో ప్రముఖ పంజాబీ సింగర్ సుఖ్బీర్, ఫేమస్ గాయని ఫాల్గుని పాఠక్ కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ వేడుకలో గ్లోబల్ హిట్స్‌తో పాటు దేశీ అంథమ్స్ కూడా వినిపించనున్నాయి. రికీ మార్టిన్ అంతర్జాతీయ ధమాకా ప్రదర్శన ఇస్తే, సుఖ్బీర్, ఫాల్గుని భారతీయ రుచిని జోడించనున్నారు. ఈ కార్యక్రమం నరేంద్ర మోడి స్టేడియంలోనే మ్యాచ్ ప్రారంభానికి (7 గంటలకు) గంటన్నర ముందు (సాయంత్రం 5:30) మొదలవుతుంది. ఈ ఈవెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే JioHotstar యాప్ మరియు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ టోర్నీకి సబంధించి ప్రారంభ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్లో నోరా ఫతేహి తన వైవిధ్యభరితమైన డాన్స్‌తో అలరించగా, రిషభ్ రిఖిరామ్ శర్మ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. -
T20 World Cup Final: వార్ వన్ సైడ్..! ఆ టీమ్ దే పైచేయి
-
ట్రిపుల్ టైటిల్ వేటలో...
భారత జట్టు 2024 టి20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లు ఆడితే 40 గెలిచింది. 2023 ఆగస్టు నుంచి మన టీమ్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో పలు మార్పులు చేసుకున్నా, ఆఖరి క్షణాల్లో ఆటగాళ్లను చేర్చినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. ఎలాంటి నిర్ణయం, వ్యూహమైనా అద్భుతంగా పని చేశాయి. ఇలాంటి విజయాల తర్వాత, ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20 క్రికెట్లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయి. అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి, వరుసగా రెండోసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించగలదా?అవతలి వైపు ఉన్న జట్టు మనతో పోలిస్తే చిన్నదే కావచ్చు... బలాబలాల్లో, అనుభవంతో భారత్‌కు పోటీ కాకపోవచ్చు. కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్‌ను ఒక్కసారిగా బలంగా మార్చేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం... కానీ నేటి ఫైనల్లో కివీస్ ఓడితే తర్వాతి వారంలో ఆ దేశంలో అంతా మరచిపోతారు. వారి రోజూవారీ సంవాదనల్లో అది ఒక విషయమే కాదు. ఆ టీమ్‌లో స్టార్ పేసర్ లేకపోయినా, మిస్టరీ స్పిన్నర్ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉంది. ఇప్పుడు అలాంటిదే వారికి మొదటి టి20 వరల్డ్ కప్ అందించాలి. ప్రపంచకప్‌లలో పడిన ‘రన్నరప్’ ముద్రను ఆ జట్టు మార్చగలదా?వ్యూహ ప్రతివ్యూహాలు, భావోద్వేగాలు, ప్రతిభ మాత్రమే సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి...చివరకు రోజు ముగిసేసరికి ఒక్క జట్టుకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కితే మరో జట్టుకు తీవ్ర నిరాశ ఖాయం. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి మినహా టోర్నీ ఆసాంతం టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చగా... పడుతూ, లేస్తూ ప్రయాణం సాగించిన కివీస్ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో పదో టి20 వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్‌లో రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్‌పై గురి పెట్టిన జట్టు ఒకవైపు...తొమ్మిది ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు... ఒక టీమ్ టోర్నీ గెలిస్తే తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టు కావడంతో పాటు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్‌గా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మరో టీమ్ గెలిస్తే సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ కల నెరవేరుతుంది. ఇలాంటి అంచనాల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ చాంపియన్ భారత్, న్యూజిలాండ్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండగా... కివీస్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాలని పట్టుదలగా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టి20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది. వరుణ్ స్థానంలో కుల్దీప్! ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన చూస్తే ఇప్పడు ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ ‘సూపర్ ఎయిట్స్’ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎంత ఘనంగా బౌలింగ్ చేసినా టి20ల్లో తాజా ఫామ్ కీలకం. దాదాపు 12 పరుగుల ఎకానమీతో అతను 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వరుణ్ మిస్టరీని ప్రత్యర్థులు ఛేదించినట్లుగా కనిపిస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై కూడా కాస్త సందేహం ఉన్నా... ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడిని పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు. సంజు సామ్సన్ గత రెండు మ్యాచ్‌లలో చెలరేగిన విధంగా మరో నాకౌట్ మ్యాచ్‌లోనూ ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్ విసరడం ఖాయం.ముందుగా బ్యాటింగ్ చేస్తే మరోసారి 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చింతగా ఉండవచ్చు. డఫీకి చోటు! న్యూజిలాండ్ విజయావకాశాలన్నీ ఇప్పుడు ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరు మరోసారి శుభారంభం అందించగలరు. ఇన్నింగ్స్ మొదట్లోనే బుమ్రా, అర్ష్ దీప్ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్ రవీంద్ర ఆల్‌రౌండర్‌గా రాణిస్తుండగా, ఫిలిప్స్ బ్యాటింగ్ కూడా కీలకం. వరల్డ్ కప్‌కు ముందు భారత్‌పై చెలరేగిన మిచెల్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. అసలు సమరంలోనైనా అతను తన స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. చాప్మన్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కెపె్టన్ సాంట్నర్‌పై అటు ఆల్‌రౌండర్‌గా, ఇటు కెపె్టన్‌గా కూడా అదనపు భారం ఉంది. గతంలో ఏ కివీస్ సారథికి సాధ్యం కాని ఘనతను అందుకోవాలంటే అతను కూడా స్వయంగా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. పిచ్ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ ప్రమాదకారులు కాగలరు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్లను నిలువరించేందుకు ఆఫ్‌స్పిన్నర్ మెక్‌కోన్‌కీ జట్టు సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఆల్‌రౌండర్ నీషమ్ స్థానంలో పేసర్ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది. 7 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టి20 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్‌తో ఆడిన ఒక టి20 మ్యాచ్‌లో భారత జట్టే గెలిచింది. పిచ్, వాతావరణం ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్‌ను ఫైనల్ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి పేస్, బౌన్స్ ఉండి బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. స్పిన్‌కు తగిన టర్న్ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా... ఆ మ్యాచ్‌ను భారత్ మరో పిచ్‌పై ఆడింది. గత ఎనిమిది మ్యాచ్‌లలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపవచ్చు. అయితే భారత్‌పై సెమీస్‌లో ఇంగ్లండ్ ఒత్తిడిలో చిత్తయిన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మేలు. వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా రిజర్వ్ డే ఉంది. 2-2 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గత నాలుగు ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లలో ఇరు జట్లూ చెరో రెండు గెలిచి 2–2తో సమంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవగా... 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపొందింది.16 భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్‌వర్మ, పాండ్యా, దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్/కుల్దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), అలెన్, సీఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్/డఫీ. -
సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్‌గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్‌లో ఫినిషర్ రింకూ సింగ్‌నైనా టీమ్‌లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.అయితే.. అభిషేక్ ఫామ్ లేమిపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత వరల్డ్‌కప్‌లో ఇలానే వరుస ఫెయిల్యూర్లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్‌లోనూ రాణించలేకపోయాడు.ఆ సమయంలో అప్పటి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. ఆసక్తికరంగా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!! -
T20 WC Final: సాంట్నర్‌కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సాంట్నర్ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఎర్రమట్టి పిచ్!అహ్మదాబాద్‌లో ఈసారి ఎర్రమట్టి పిచ్ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.220 పరుగులకే కట్టడి చేస్తేఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్‌లో ఫ్లాట్ పిచ్ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.అబద్ధం చెబుతున్నాడుఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సాంట్నర్‌కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్‌రూమ్‌లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్ డిమాండ్‌కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
-
సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?
-
ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా
-
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్.. ఫామ్‌లో లేని బ్రాండన్ కింగ్‌కు బదులు.. రోస్టన్ ఛేజ్‌ను ఓపెనర్‌గా ఆడించింది. బ్రాండన్‌రు ఐదు- ఆరు మ్యాచ్‌లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్‌లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: హృదయాలు ముక్కలు చేస్తాం: సాంట్నర్
అహ్మదాబాద్ పిచ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్‌ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్ పిచ్‌నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- న్యూజిలాండ్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్ సాంట్నర్ పలు విషయాలపై స్పందించాడు.హై స్కోరింగ్‌కు అవకాశంపిచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్‌కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్ (Mitchell Santner) పేర్కొన్నాడు.మా లక్ష్యం అదే..అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్ వైవిధ్యంతో కూడుకున్నది.హృదయాలు ముక్కలు చేస్తాంఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్ కామెంట్ చేశాడు.కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై గెలిచి టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు భారత్.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: ఆ ఇద్దరిపై వేటు!.. అతడికి చోటు?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్ స్టార్ అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్, వరుణ్ స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.ఏకంగా 64 పరుగులుమరోవైపు.. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్‌లలో రాణించినా.. కీలక నాకౌట్ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ కూల్చాడు.ఆ ఇద్దరిపై వేటు వేయాలి!ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి వరుణ్ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా వరుణ్‌ను తప్పించి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.నలుగురు విఫలమైనా.. ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే, బౌలర్ ఒక్క ఓవర్లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్‌కు 20 శాతం బౌలింగ్ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్‌లో వరుణ్ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది.నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తాఅయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్, వరుణ్ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్ ఫైనల్ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్‌లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.ఇది అసాధ్యంఅయితే, న్యూజిలాండ్ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్‌కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.నిజానికి నాకు న్యూజిలాండ్ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్‌ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.జట్టు గెలవాలని నాకూ ఉందిఇందుకు డివిలియర్స్ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.రెండుసార్లు టీమిండియాను ఓడించిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌తో తలపడిన కివీస్‌కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్ విజేతగా అవతరించింది. అయితే, కివీస్ ఇంత వరకు ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.చదవండి: T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా? -
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్‌లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్లో భాగమైన షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రోవ్‌మన్ పావెల్, షిమ్రన్ హెట్‌మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్‌లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?
టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్ సేన.సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. సూపర్-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీస్ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.వరుసగా రెండుసార్లుతద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీ ఫైనల్‌కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తాజా ఫైనల్‌కు సంబంధించిన పిచ్ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్‌పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.టీమిండియా కోరుకుంది ఇదేఇక అహ్మదాబాద్‌లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్‌పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్–8’ మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ సేన దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్ పిచ్‌నే కోరుకుంటోంది. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..ఎర్ర మట్టితోనే‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్ లభించనుంది. స్పోర్టింగ్ పిచ్‌నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన తొలి ఐదు మ్యాచ్‌లలో పేస్ బౌలింగ్‌లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్ బౌలింగ్‌లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు
-
రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్
-
హోటల్ మారితే అదృష్టం మారేనా!
అహ్మదాబాద్: నమ్మకం లేదా సెంటిమెంట్ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్‌కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్‌కు ముందు రోజు ప్రాక్టీస్ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్‌లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్లో బస చేసింది. నాటి మ్యాచ్‌లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్ స్కైలైన్‌లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను వాడుకోవాలని కూడా టీమ్ నిర్ణయించింది. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్ పలేకర్, ఆడ్రియాన్ హోల్డ్‌స్టాక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వరల్డ్ కప్ తుది పోరు జరుగుతుంది. సామ్సన్ నామినేట్... టి20 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్‌కు చెందిన సంజు సామ్సన్ పేరు కూడా ఉంది. సామ్సన్తో పాటు విల్ జాక్స్ (ఇంగ్లండ్), సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), షాడ్లీ వాన్ షాల్విక్ (అమెరికా), మార్క్రమ్, ఎన్గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్‌కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్‌లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్ చెప్పాడు. భారత్‌తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్ వరల్డ్ కప్‌లాంటి వేదికపై భారత్‌తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు. -
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ టైటిల్ పోరుకు న్యూజిలాండ్, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లోకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్‌లో భాగంగా బుమ్రా బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్ బౌలర్. వైవిధ్యభరితంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్‌లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్‌లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. ఆరోజు అతడు విఫలం అవుతాడు. అదే, అతడి మీద మాకు మంచి రోజు అవుతుంది. ఫైనలే ఆరోజు కావాలని ఆశిస్తున్నాం?’’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్ కివీస్‌తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్‌కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్ (IND vs NZ Final) మధ్య టైటిల్ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్లలో అంపైర్‌గా పని చేసిన అనుభవం ఇల్లింగ్‌వర్త్‌కు ఉంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో ఆయనే అంపైర్.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్ (ఇల్లింగ్‌వర్త్), అదే వేదిక (అహ్మదాబాద్)పై ఫైనల్ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్‌కు అంపైర్లు వీరే👉ఆన్ ఫీల్డ్ అంపైర్లు- రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్👉థర్డ్ అంపైర్- అల్లాఉద్దీన్ పలేకర్👉ఫోర్త్ అంపైర్- అడ్రియాన్ హోల్డ్‌స్టక్👉మ్యాచ్ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్‌స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
ఇది వరల్డ్‌కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా ఫిల్ సాల్ట్ (5) రూపంలో తొలి వికెట్ దక్కించుకోగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్ బెతెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్ బూమ్ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్‌కప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్ ఫైర్ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో సూపర్-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్ మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
చూసుకోవా?.. హార్దిక్ కుమారుడి రియాక్షన్.. మహీక షాక్!
ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.రెండు వికెట్లుఇక బంతితోనూ హార్దిక్ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్ కర్రాన్ (18) వికెట్‌ను కూడా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు సహా బాలీవుడ్ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించారు.నీతా అంబానీతో కలిసిఇక హార్దిక్ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్‌లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్‌ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.ఆ మాత్రం చూసుకోవా?భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి.. విల్‌జాక్స్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్ బెతెల్ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్ కీపర్ బట్లర్ పని పూర్తిచేశాడు. దీంతో హార్దిక్ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.ఆమె చేయి పట్టుకుని ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik’s Girl Friend Mahieka with His Son Agasthya pic.twitter.com/oJwx1mxUU6— Ajit Samachar (@SamacharAj10350) March 6, 2026 Hardik Pandya's son Agastya pandya with his dad's girlfriend Mahieka Sharma 😭♥️#INDvsENG pic.twitter.com/5U5DejxvKj— Chota Don (@choga_don) March 5, 2026కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్ -
ఇండియా Vs కివీస్ సన్ డే బిగ్ ఫైట్..
-
T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్
ఇంగ్లండ్ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్ పటేల్ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్ బ్యాట్‌తో రాణించగా.. జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ..అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.ముఖ్యంగా అక్షర్ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.𝗕𝗮𝗽𝘂 𝗯𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗸𝗲 𝗹𝗶𝘆𝗲 𝗵𝗮𝗻𝗶𝗸𝗮𝗿𝗮𝗸 𝗵𝗮𝗶. 🥵ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/4e06e0SYAv— Star Sports (@StarSportsIndia) March 5, 2026అక్షర్ ఫీల్డింగ్.. భారత్ విజయానికి బాటలుకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్, డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్ బంతిని అందుకున్నాడు.అయితే, అన్నింటికంటే విల్ జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్ భాగమయ్యాడు.చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే


