ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ తిరిగి బంతిని పట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఆండర్సన్ టీ20ల్లో ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడు. తాజాగా ఓ పొడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఇంగ్లండ్ లెజండరీ క్రికెటర్ వెల్లడించాడు.
వచ్చే వేసవిలో లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు తన సిద్దంగా ఉన్నానని ఆండర్సన్ తెలిపాడు. అదేవిధంగా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా వ్యవరించాలన్న తన కోరికను ఆండర్సన్ వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు.
"నా కెరీర్‌లో టీ20 క్రికెట్‌ను చాలా కోల్పోయాను. టీ20ల్లో ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి నేను పొట్టి ఫార్మాట్‌లో ఆడాలనకుంటున్నాను. నాకు ఇంకా ఫిట్‌నెస్ ఉంది. ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్‌ను తరుచుగా చూస్తున్నాను. మొదటి 20 బంతులను బౌలర్లు అద్భుతంగా స్వింగ్ చేస్తున్నారు.
నేను కూడా ఆవిధంగా బంతిని స్వింగ్ చేయగలను. అయితే ఇప్పటివరకు రెడ్‌బాల్‌తో అలవాటపడ్డ నేను వైట్ బంతితో ఎంతవరకు స్వింగ్ చేస్తానన్నది ప్రశ్నార్ధకం. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ ఇప్పటివరకు నేను ఆడలేదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి మరి" అని ది ఫైనల్ వర్డ్ పొడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండర్సన్ పేర్కొన్నాడు.
కాగా ఆండర్సన్ తన స్వదేశంలో కాకుండా బయట ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలంటే సౌతాఫ్రికా టీ20 లీగ్, బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్ మంచి ఎంపికగా చెప్పుకోవాలి. కానీ ఐపీఎల్ వేలంలోకి వస్తే అతడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకం.
Comments
Please login to add a commentAdd a comment