వన్డేలకు గుడ్ బై చెప్పిన మరో క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. టెస్టులపై మరింత శ్రద్ధ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు మీడియాకు తెలిపాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ గెలుచుకున్నతర్వాత.. టెస్టుల నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించినా.. చివరికు వన్డేల నుంచి మాత్రమే తప్పుకున్నట్టు బెల్ ప్రకటించాడు.
యాషెస్ సిరీస్ ముగిశాక కోచ్ ట్రెవర్ బేలిస్, కెప్టెన్ అలెస్టర్ కుక్తో సంప్రదించిన అనంతరం టెస్టులకు గుడ్ బై చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని తెలిపాడు. వన్డే కెరీర్లో 161 మ్యాచ్ల్లో 5416 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బెల్ కావడం విశేషం. వన్డేల్లో 37.87 సగటుతో నాలుగు సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు చేశాడు. 115 టెస్టులు ఆడిన బెల్ 43 సగటుతో 22 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు.