retirment
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్‌లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
నేనింకా రిటైర్ కాలేదు.. రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోమ్ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్ మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్.. గూగుల్ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది!
24 ఏళ్లకే ఉద్యోగం..29 ఏళ్లకే రిటైర్మెంట్. ఆహా! జీవితం అంటే ఇది’ అని అనుకుంటున్నారా? ఐఐటీ బాంబే పూర్వ విద్యార్ధి డేనియల్ జార్జ్ (29) ఇలాగే అనుకున్నాడు. 6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి చివరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. డేనియల్ జార్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడు. 2018లో జార్జ్ ఐఐటి బాంబే నుండి బిటెక్ పూర్తి చేశాడు. 24 ఏళ్ల వయస్సు అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఏడాదికి 265,000 డాలర్ల (సుమారు రూ. 2.20 కోట్లు) ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అంత డబ్బు ఎలా ఆదా చేశాడు అతను గూగుల్‌లో పనిచేసే సమయంలో సంపాదించిన డబ్బును ఆదా చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో లెక్కలేసుకుని తన శాలరీని ఎంత మొత్తంలో ఆదా చేసే త్వరగా రిటైర్ అవ్వచ్చు? అనంతరం తన సొంత దేశమైన భారత్‌లో ఎలా నివసించవచ్చో గుర్తించాడు. అంతే అప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం శాలరీని సేవ్ చేయడం మొదలు పెట్టాడు. గూగుల్‌లో పనిచేయడం ఓ కల గూగుల్‌లో పనిచేయడం ఒక కల. అదో ‘మాయా అద్భుత భూభాగం’లాంటిదని అభివర్ణిస్తూ డబ్బుల్ని ఎలా సేవ్ చేశాడో చెప్పుకొచ్చాడు. ముందుగా గూగుల్‌లో అపరిమిత ఆహారం, పానీయాలు, పింగ్ పాంగ్ టేబుల్స్ , వీడియో గేమ్ రూమ్‌లు, సాకర్ ఫీల్డ్‌లు, జిమ్, టెన్నిస్ కోర్ట్లు, ఫ్రీ మసాజ్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించింది. వాటిని వినియోగించుకున్నాడు. కానీ అప్పుడే జార్జ్ గూగుల్‌లో తాను సంపాదించే జీతంలో సగానికిపైగా మొత్తాన్ని ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించాడు. ట్యాక్స్ తగ్గించుకునేందుకు అప్పటి నుంచి జార్జ్ తన ట్యాక్స్‌ను తగ్గించుకోవడానికి రిటైర్మెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. ఆఫీస్‌కి నడిచి వెళ్లడం, గూగుల్‌లో పని చేసే సమయంలో మూడుపూటలా అక్కడే భోజనం చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఖర్చు చేసినట్లు చెప్పాడు. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో ఇంటి రెంట్ చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకుంది. అయినప్పటికీ, తన స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌ని షేర్ చేసుకోవడం వల్ల అద్దె తగ్గిందని అన్నాడు. ట్యాక్స్ చెల్లింపులు ఎంతంటే? జార్జ్ ప్రతి సంవత్సరం పన్ను ఆదా చేసుకునేందుకు రూ.62లక్షలు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. రిటైర్మెంట్ అయ్యేందుకు కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. గత ఏడాది జార్జ్ 29 ఏళ్ళ వయసులో థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. “ఇప్పుడు నేను జీతం సంపాదించడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నా కంపెనీని ప్రారంభించడం కోసం రిస్క్ చేయగలను. నా భార్య పిల్లల కోసం కావాల్సినంత సంపాదించాను. అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఆర్ధిక పాఠాలు చెబుతున్నాడు. -
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని తెలిపాడు. గాయాల బారిన పడకుండా కెరీర్‌ను ప్రొలాంగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. వన్డేలకు గుడ్‌బై చెప్పినా పొట్టి క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని అన్నాడు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన నవీన్ 2021లో తన చివరి వన్డే ఆడాడు. కెరీర్లో కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్.. 24 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) నవీన్ తన వన్డే కెరీర్లో 14 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. నవీన్ ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్ 2023లో కోహ్లితో గొడవతో నవీన్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నవీన్ ఫ్రాంచైజీ క్రికెట్ కోసం తన అంతర్జాతీయ కెరీర్‌ను వదులుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తమ రెండో వరల్డ్‌కప్ ఆడేందుకు నిన్ననే భారత్‌కు వచ్చింది. వార్మప్ గేమ్ కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు త్రివేండ్రంలో ల్యాండయ్యారు. తమ తొలి వరల్డ్‌కప్‌లో (2019) లీగ్ స్టేజ్ దాటలేని ఆఫ్ఘన్ టీమ్ ఈసారి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చి సంచలనాలు క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఆఫ్ఘన్ జట్టులో నవీన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ. రహ్మానుల్లా గుర్బాజ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వీరితో ఈ వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచనాలు సృష్టించే అవకాశం ఉంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో వారు బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీని ముందు వారు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. సెప్టెంబర్ 29న సౌతాఫ్రికాతో, అక్టోబర్ 3న శ్రీలంకతో ఆఫ్ఘన్లు తలపడతారు. -
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం
క్రికెట్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ సీజన్ (2023) ముగిసిన అనంతరం తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు (161 టెస్ట్‌ల్లో 45.4 సగటున 33 సెంచరీలు, 57 అర్ధసెంచరీల సాయంతో 12472 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన కుక్.. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆతర్వాత కంటిన్యూయెస్‌గా కౌంటీల్లో ఆడుతున్నాడు. కుక్ తన కౌంటీ జట్టైన ఎసెక్స్ తరఫున ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్.. 36.72 సగటున శతకం, 3 అర్ధశతకాల సాయంతో 808 పరుగులు చేశాడు. కుక్ ప్రస్తుతం హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ (0) పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌తో పాటు కుక్ మరో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సీజన్లో ఎసెక్స్కు ఇదే ఆఖరి మ్యాచ్. హ్యాంప్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతర్వాత జరిగే మరో మ్యాచ్‌లో గెలిస్తే ఎసెక్స్కు ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డివిజన్ వన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఎసెక్స్.. టాప్‌లో ఉన్న సర్రే కంటే 15 పాయింట్లు వెనుకపడి ఉంది. ఇదిలా ఉంటే, అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో టాప్ స్కోరర్‌గా నిలువడమే కాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. -
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై
పాకిస్తాన్ మహిళా స్టార్ క్రికెటర్ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయేషా నసీమ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతంకు అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆమె తన నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. తన కెరీర్లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్.. వరుసగా 369,33 పరుగులు సాధించింది. ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్ తరపున ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌పై ఆడింది. అదే విధంగా ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై నసీమ్ 45 పరుగులు సాధించింది. ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆయేషా నసీమ్ హిట్టింగ్ చేసే సత్తా కూడా ఉంది. అటువంటి ఆయేషా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. చదవండి: ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్ -
ఐపీఎల్లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్ రిటైర్మెంట్
ఐపీఎల్ 2011లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్, నాటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్లేయర్ పాల్ వాల్తాటి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల వాల్తాటి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ ద్వారా పంపాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన వాల్తాటి 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. అప్పటి వరకు క్రికెట్ ఫాలోయర్స్‌కు వాల్తాటి అంటే ఎవరో కూడా తెలీదు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వాల్తాటి 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌తో రాత్రిరాత్రి హీరో అయిపోయిన వాల్తాటి, ఆతర్వాత మరో రెండు సీజన్ల వరకు (2013) ఐపీఎల్ ఆడాడు. అనంతరం యువ ఆటగాళ్ల ఎంట్రీతో క్రమంగా ఐపీఎల్ నుంచి కనుమరుగయ్యాడు. ఐపీఎల్ కెరీర్లో 23 మ్యాచ్‌లు ఆడిన వాల్తాటి సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 505 పరుగులు చేశాడు. కెరీర్ ఆరంభంలో ఇండియా అండర్-19, ఇండియా బ్లూ, ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించిన వాల్తాటి.. 2006 తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు వలస వెళ్లి, అక్కడ ఫస్ట్‌క్లాస్ కెరీర్ ప్రారంభించాడు. కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడి.. న్యూజిలాండ్‌లో జరిగిన 2002 అండర్ వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్ వాల్తాటి కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపట్టాడు. బంగ్లా బౌలర్ సంధించిన షార్ట్ పిచ్ డెలివరీ నేరుగా వాల్తాటి కంటిపై బలంగా తాకింది. ఆ ఘటన తర్వాత వాల్తాటి చాలాకాలం పాటు కంటికి బ్యాండ్ ఎయిడ్ కట్టుకుని కనిపించాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్
ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెటర్ కేథరీన్ హెలెన్ స్కీవర్ బ్రంట్ 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగతున్నట్లు ఆమె ఇవాళ (మే 5) ప్రకటించింది. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బ్రంట్ చివరిసారిగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల బ్రంట్.. ఇంగ్లండ్ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌ల్లో, ఓ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉంది. రైట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన బ్రంట్.. 14 టెస్ట్‌ల్లో 51 వికెట్లు, 184 పరుగుల.. 141 వన్డేల్లో 170 వికెట్లు, 1090 పరుగులు.. 112 టీ20ల్లో 114 వికెట్లు, 590 పరుగులు చేసింది. బ్రంట్.. టెస్ట్‌ల్లో 3 సార్లు, వన్డేల్లో 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది. ఈమె ఖాతాలో 2 వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ అర్ధశతకం కూడా ఉన్నాయి. కెరీర్ చరమాంకం వరకు ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన బ్రంట్.. ఇంగ్లండ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నాలుగు సార్లు ఎంపికైంది. బ్రంట్.. 2009 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ ప్రదర్శన (3/6) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. బ్రంట్.. 2022 మేలో సహచర మహిళా క్రికెటర్ నాట్ స్కీవర్‌ను వివాహం చేసుకుంది. -
30 ఏళ్లకే కెరీర్ ముగించిన సౌతాఫ్రికా క్రికెటర్
Theunis De Bruyn: సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల కెరీర్లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన డి బ్రూన్.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. టెస్ట్‌ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్ .. 2018లో శ్రీలంకపై సెంచరీ చేశాడు. ఇదే అతని కెరీర్లో ఏకైక సెంచరీ. ఇది మినహా డి బ్రూన్ కెరీర్లో కనీసం అర్ధసెంచరీ కూడా లేదు. టీ20ల్లో కేవలం 2 మ్యాచ్‌లు ఆడిన డి బ్రూన్.. కేవలం 26 పరుగులు మాత్రమే సాధించాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించడాన్ని డి బ్రూన్ గౌరవంగా ఫీలవుతున్నాడని టైటాన్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డి బ్రూన్ తన ఆరాధ్య క్రికెటర్లతో డ్రెస్సింగ్ షేర్ చేసుకోవడం పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. కాగా, డి బ్రూన్ ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లీగ్‌లో క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది. SA20 ఇనాగురల్ లీగ్‌లో 238 పరుగులు చేసిన డి బ్రూన్.. ఎడిషన్ సెకెండ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇదివరకే (2022 జూన్ 28) గుడ్‌బై చెప్పిన మోర్గాన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మోర్గాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత మిడిల్సెక్స్ (ఇంగ్లండ్ కౌంటీల్లో), సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్ల తరఫున కొనసాగుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. pic.twitter.com/1x1w0unGL2 — Eoin Morgan (@Eoin16) February 13, 2023 అయితే క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. తాను విడుదల చేసిన లేఖలో మోర్గాన్ ఇలా అన్నాడు. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల చాలా నేర్చుకున్నానని, ఈ క్రమంలో చాలామంది వ్యక్తులతో జీవితకాల పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కుటుంబంతో ఎక్కువగా గడపగలుగుతున్నానని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని అన్నాడు. తన క్రికెట్ జర్నీలో తోడుగా, అండగా ఉన్న అభిమానులకు, సహచరులకు, కుటుంబానికి మోర్గాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 36 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. -
వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తే.. టీ20ల నుంచి కూడా తప్పించారు!
Ben Stokes ODI Retirement- Eng Vs SA ODI Series: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, వన్డే వరల్డ్‌కప్-2019లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు బెన్‌స్టోక్స్. ఇటీవలే అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టి స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను గెలవడంతో పాటు రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియాను ఓడించి కెప్టెన్‌గా మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. అందుకే ఇలా! అయితే, అనూహ్యంగా వన్డేలకు గుడ్‌బై చెబుతూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు 31 ఏళ్ల స్టోక్స్. అంతేకాదు.. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్ పోస్తే పరిగెత్తే కార్లు కాదని.. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లండ్ బోర్డుకు చురకలంటించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ, క్రికెట్ బోర్డుల తీరును తప్పుబడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘అప్పట్లో ఓసారి.. షెడ్యూల్ భయంకరంగా ఉంది.. నా వల్ల కాదని చెప్పాను. అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. అయితే, ఈసీబీ నన్ను టీ20లు కూడా ఆడకుండా నిషేధం విధించింది’’ అంటూ పీటర్సన్ ఇంగ్లండ్ బోర్డు తీరును ఎండగట్టాడు. I once said the schedule was horrendous and I couldn’t cope, so I retired from ODI cricket & the ECB banned me from T20s too………….🤣 — Kevin Pietersen🦏 (@KP24) July 19, 2022 కాగా ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు పీటర్సన్. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 8181, 4440, 1176 పరుగులు సాధించాడు. అయితే, ఈసీబీతో అతడికి విభేదాలు తలెత్తగా బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన పీటర్సన్ ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 2013లో తన ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్.. 2014లో చివరిసారిగా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టోక్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మంగళవారం(జూలై 18 )జరిగిన మొదటి వన్డే అతడికి చివరిది. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 5 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన రోజు వ్యవధిలోనే ఇంగ్లండ్ ప్రొటిస్‌తో పోరుకు సిద్ధమైంది. వన్డేలతో పాటు టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. 604 runs and 15 wickets on a sweltering day in Durham! Full highlights: https://t.co/AOpGzaJerX 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/VDjYwdNb0L — England Cricket (@englandcricket) July 20, 2022 -
టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్,వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామ్‌దిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. దాంతో తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రామ్‌దిన్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో మాత్రం ఆడనున్నాడు. 2005లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన దినేష్ రామ్‌దిన్.. 74 టెస్టులు, 139 వన్డేలు, 71 టీ20ల్లో తన జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు తన కెరీర్లో 6 సెంచరీలతో పాటు 5734 పరుగులు సాధించాడు. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో రామ్‌దిన్ భాగంగా ఉన్నాడు. ఇక రామ్‌దిన్ చివరగా టెస్టుల్లో 2019లో ఆడగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 2016లో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. "అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. గత 14 ఏళ్లగా విండీస్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతగా నిలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్ క్రికెట్, అభిమానులకు ధన్యవాదాలు అంటూ రామ్‌దిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. మరో వైపు భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20ల నిమిత్తం విండీస్‌లో పర్యటించనుంది. చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! View this post on Instagram A post shared by 124NotOut Sports Agency (@124notout) -
మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత..!
భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టీ20లకు మిథాలీ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 4-1తేడాతో ఓటమి చవిచూసింది. అయితే అఖరి వన్డేలో గెలిచి భారత్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో మంధానతో పాటు మిథాలీ, హర్మాన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిథాలీ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించింది. "ఈ టోర్నమెంట్ తర్వాత నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను.. నా రిటైర్మెంట్ తర్వాత జట్టు యువ క్రికెటర్లతో మరింత బలంగా మారుతుందని భావిస్తున్నాను" అని మిథాలీ పేర్కొంది. ఇప్పటి వరకు 222 వన్డేల్లో భారత తరుపున ఆడిన మిథాలీ రాజ్ 7,516 పరుగులు సాధించింది. తన కేరిర్‌లో 7 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్‌మ్యాన్ -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్
VR Vanitha Announces Retirement: టీమిండియా మహిళా క్రికెటర్ వి ఆర్ వనిత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు 31 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ ప్రకటించింది. టీమిండియాతో తన 12 ఏళ్ల ప్రయాణాన్ని వనిత తన ట్వీట్లో వివరించింది. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యావాదాలు తెలిపింది. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక, బెంగాల్ జట్లకు ఆడిన వనిత.. 2014 జనవరిలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడిన ఆమె.. ఓవరాల్‌గా 300కు పైగా పరుగులు సాధించింది. And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO — Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022 చదవండి: ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సెన్కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్
Tim Bresnan Announces Retirement: ఇంగ్లండ్‌కు తొలి టీ20 ప్రపంచకప్(2010) అందించిన జట్టులో కీలక సభ్యుడు, ఆ దేశ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ బ్రేస్నన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను 21 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్షైర్ కౌంటీ సోమవారం కన్ఫర్మ్ చేసింది. 🧢 685 appearances ☝️ 1,087 wickets 🏏 12,116 runs 🏆 2 Ashes wins Congratulations to former PCA rep Tim Bresnan on a truly outstanding professional career 👏 🤝 All the best with whatever comes next, Tim - the PCA will always be here to support you. pic.twitter.com/F1D0N2gJ3V — PCA (@PCA) January 31, 2022 ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడిన 36 ఏళ్ల బ్రేస్నన్.. దాదాపు 1700 పరుగులు, 205 వికెట్లు పడగొట్టాడు. అతని ఖాతాలో 4 అర్ధ సెంచరీలు, 2 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. జాతీయ జట్టుతో పోలిస్తే కౌంటీ జట్టు వార్విక్షైర్తో ఎక్కువ అనుబంధం కలిగిన అతను.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 213 మ్యాచ్‌ల్లో 575 వికెట్లు, 7128 పరుగులు చేశాడు. బ్రేస్నన్ ఇంగ్లండ్ యాషెస్ గెలిచిన రెండు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించాడు. Thank you for the incredible memories, @timbresnan! 🤝#OnceABearAlwaysABear 🐻#YouBears pic.twitter.com/SKHiiioix9 — Warwickshire CCC 🏏 (@WarwickshireCCC) January 31, 2022 చదవండి: Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..! -
పది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇంతలోనే..!
కొలొంబో: 30 ఏళ్ల వయసులోనే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలకు కారణమైన భానుక రాజపక్స మాట మార్చాడు. పది రోజుల క్రితం చేసిన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకున్నాడు. మున్ముందు జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్ ద్వారా వెల్లడించింది. శ్రీలంక యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స జోక్యంతో భానుక.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లంక క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఫిట్నెస్ రూల్స్‌ను నిరసిస్తూ భానుక రాజపక్సతో పాటు మరో క్రికెటర్(దనుష్క రాజపక్స) కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం లంక క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. ఈ ఇద్దరి నిర్ణయం పట్ల రాజకీయ నాయకులు, మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరిని అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వారి వేతనాల్లో కోత విధించబడుతుంది. చదవండి: ఇకపై ప్రతి ఏడాది భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌లు..! -
లంక జట్టుకు ఊహించని షాక్.. యువ క్రికెటర్ సంచలన నిర్ణయం
Bhanuka Rajapaksa Retirement: శ్రీలంక క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ యువ ఆటగాడు, స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపాడు. లంక బోర్డు ప్రవేశపెట్టిన నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల (ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు) కారణంగానే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లో ఉన్న రాజపక్స.. అనూహ్య నిర్ణయం తీసుకోవడం శ్రీలంక క్రికెట్లో సంచలనంగా మారింది. కేవలం 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడిన రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై ఆ దేశ మాజీలు స్పందించారు. రాజపక్స.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, 30 ఏళ్ల రాజపక్స.. శ్రీలంక అండర్-19 జట్టులో అద్భుతాలు సృష్టించి, సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో ధవన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డే అరంగ్రేటం చేసిన అతను.. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..! -
క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!
Chris Gayle: విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు ఘోర అవమానం జరిగింది. సొంతగడ్డపై టీ20లకు వీడ్కోలు పలకాలనుకున్న తన ఆకాంక్షను ఆ దేశ క్రికెట్ బోర్డు బేఖాతరు చేసింది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో చోటు కల్పించకుండా అతన్ని అవమానపర్చింది. ఇప్పటికే వన్డేలు, టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన గేల్.. తన సొంత మైదానమైన సబీనా పార్క్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడి క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతానని గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తాజా నిర్ణయంతో గేల్.. తన సమీప భవిష్యత్తులో టీ20లు ఆడే అవకాశం లేదు. దీంతో అతను టీ20 రిటైర్మెంట్ అంశంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్.. జనవరి 16న ఐర్లాండ్‌తో ఏకైక టీ20, ఆతర్వాత జనవరి 22 నుండి 30 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే, గేల్ తన టీ20 కెరీర్లో మొత్తం 452 మ్యాచ్‌ల్లో 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులు సాధించి, ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొట్టి క్రికెట్లో గేల్ 87 హాఫ్ సెంచరీలు, 22 సెంచరీలు బాదాడు. చదవండి: కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..! -
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
Harbhajan Singh Announces Retirement: వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. శుక్రవారం అన్ని రకాల ఫార్మాట్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కలిపి 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భజ్జీ బంతులు వికెట్లను పడగొట్టడమే కాదు... మ్యాచ్‌లనూ మలుపు తిప్పాయి. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 41 ఏళ్ల ఈ పంజాబీ స్టార్ సంప్రదాయ ఫార్మాట్లో 103 టెస్టులు ఆడి 417 వికెట్లు పడగొట్టాడు. 2 సెంచరీ లతో కలిపి 2,224 పరుగులు కూడా చేశాడు. ఇటు 236 వన్డేల్లో 269 వికెట్లను చేజిక్కించుకొని 1,237 పరుగులు సాధించాడు. 28 టి20 మ్యాచ్‌ల్లో 25 వికెట్లను తీశాడు. ‘మంచి విషయాలకు ముగింపు ఉంటుంది. నా జీవితంలో భాగమైన క్రికెట్‌కు, నాపై ఎంతగానో ప్రభావం చూపిన ఆటకు నేను గుడ్‌బై చెబుతున్నాను. నా 23 ఏళ్ల చిరస్మరణీయ కెరీర్‌కు అండదండలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని హర్భజన్ తన రిటైర్మెంట్ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అందరి క్రికెటర్లలాగే నేను కూడా భారత జెర్సీతోనే ఆటకు వీడ్కోలు పలకాలని ఆశించాను. కానీ విధి నాతో మరోలా చేయించింది’ అని తెలిపాడు. 2016లో ఢాకాలో యూఏఈతో చివరిసారిగా అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన భజ్జీ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన తొలి అంచె ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెండో అంచె ఐపీఎల్ కోసం వేదిక యూఏఈకి మారాక హర్భజన్ బరిలోకి దిగలేదు. All good things come to an end and today as I bid adieu to the game that has given me everything in life, I would like to thank everyone who made this 23-year-long journey beautiful and memorable. My heartfelt thank you 🙏 Grateful .https://t.co/iD6WHU46MU — Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021 చదవండి: భారత్‌లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం.. ఇకపై !
Is Ravindra Jadeja Taking Retirement from Test cricket?: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్వరలో టెస్ట్ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సహచర ఆటగాడు ఒకరు దైనిక్ జాగరణ్ పత్రికకు తెలిపారు. కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్లో 57 మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2195 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: India Tour Of South Africa: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్ -
సగం దక్షిణాఫ్రికావాడినైతే, సగం భారతీయుడిని: ఏబీ డివిలియర్స్
మా ఇంటి వెనక అన్నయ్యలతో కలిసి క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన నాటినుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఎప్పుడూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఆటను ఆస్వాదించాను. అయితే ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి ప్రేరణ నాలో ఉండటం లేదు. దీనిని అంగీకరించాలి కాబట్టి బాధగా అనిపిస్తున్నా సరే, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. క్రికెట్ ప్రపంచం నాకు ఎన్నో గొప్ప అవకాశాలు అందించింది. అయితే ఆట నుంచి తప్పుకొని కుటుంబంతో గడిపేందుకు ఇది సరైన సమయంగా అనిపించింది. నా దృష్టిలో ప్రత్యేక స్థానం ఉన్న బెంగళూరు అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ ఫ్రాంచైజీ నా జీవితాన్ని మార్చేసింది. నేను జీవితకాలం ఆర్సీబీవాడినే. ఇన్నేళ్లుగా ఐపీఎల్ కారణంగా భారత్‌తో నా అనుబంధం మరింత పెరిగింది. ఇక్కడ గడిపిన ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. సరిగ్గా చెప్పాలంటే నేను సగం దక్షిణాఫ్రికావాడినైతే సగం భారతీయుడిని. కాగా, మిస్టర్ 360 డిగ్రీస్‌గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ సహా అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. -
Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!
Chris Gayle Confirms That He Hasnt Retired Yet From International Cricket: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రవర్తించిన తీరును చూసి.. ఈ కరీబియన్ యోధుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడేమోనని అంతా భావించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన గేల్.. తానింకా రిటైర్ కాలేదని, మరికొద్ది రోజులు క్రికెట్ ఆటడల సత్తా తనలో ఉందని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశాడు. అయితే, ఓ రకంగా ఇది ఆటకు వీడ్కోలు పలికినట్టేనని తికమక పెట్టాడు. ‘ప్రపంచకప్‌లో తనకు చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులతో సరదాగా వ్యవహరించానని, మరో ప్రపంచకప్ ఆడాలని ఉన్నా బోర్డు అవకాశం ఇస్తుందని అనుకోవడం లేదని తెలిపాడు. స్వస్థలం అయిన జమైకాలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడేందకు బోర్డు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పందించాడు. గేల్ ఇదివరకే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలసిందే. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గేల్ 15 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. గేల్ పిచ్‌ను వీడుతున్నప్పుడు వీడ్కోలు అన్నట్టుగా బ్యాట్‌ను ప్రేక్షకులు, కెమెరా వైపు చూపిస్తూ బయటకు వస్తుండగా.. సహచరులంతా బౌండరీ రోప్ వద్ద నిల్చొని గౌరవ స్వాగతం పలికారు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావోకు మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. చదవండి: భారత టీ20 కెప్టెన్‌గా ఆ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయండి... -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్‌గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
ఇంగ్లండ్ అభిమానులకు షాకిచ్చిన మొయిన్ అలీ..
Moeen Ali Retires From Test Cricket: ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఊహించని షాకిచ్చాడు. 34 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సాంప్రదాయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకున్న విషయం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్లతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది. కాగా, 2014లో శ్రీలంకతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున 64 టెస్ట్‌ల్లో 2914 పరుగులు చేయడంతో పాటు 195 వికెట్లు పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్‌ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొయిన్ అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్కే ప్లేయర్ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 20 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఈ క్రమంలో తనకు సహకరించి తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ మంగళవారం ట్వీట్ చేశాడు. Announcement. pic.twitter.com/ZvOoeFkp8w — Dale Steyn (@DaleSteyn62) August 31, 2021 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రొటిస్ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, స్టెయిన్ ఈ ఏడాది జనవరిలో ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, విదేశీ లీగ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు