వెస్టిండీస్ మాజీ కెప్టెన్,వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామ్‌దిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. దాంతో తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రామ్‌దిన్ ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లలో మాత్రం ఆడనున్నాడు. 2005లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన దినేష్ రామ్‌దిన్.. 74 టెస్టులు, 139 వన్డేలు, 71 టీ20ల్లో తన జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు తన కెరీర్‌లో 6 సెంచరీలతో పాటు 5734 పరుగులు సాధించాడు.
రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో రామ్‌దిన్ భాగంగా ఉన్నాడు. ఇక రామ్‌దిన్ చివరగా టెస్టుల్లో 2019లో ఆడగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 2016లో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. "అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. గత 14 ఏళ్లగా విండీస్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతగా నిలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్ క్రికెట్, అభిమానులకు ధన్యవాదాలు అంటూ రామ్‌దిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. మరో వైపు భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20ల నిమిత్తం విండీస్‌లో పర్యటించనుంది.
చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..!
Comments
Please login to add a commentAdd a comment