internatinal cricket
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా రియాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన అనంతరం రియాద్ తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్‌కు తన సేవలను అందించాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు. మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గతంలో బంగ్లా దేశ్ టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా మహ్మదుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతడి సారథ్యంలోని బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8 రౌండ్లో నిష్కమ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా జట్టు ఓటమి పాలైంది. -
అరంగేట్రంలో విఫలం.. కట్ చేస్తే.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా!
సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. అంటే 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్లోకి 19 ఏళ్ల భారత యువ ఆటగాడు అడుగుపెట్టాడు. ఆ రోజు ఎవరూ ఊహించలేదు.. ఆ యువకెరటం ప్రపంచక్రికెట్‌ను శాసిస్తాడని. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువ కిషోరం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడతాడని. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే విమర్శలపాలైన ఆ యువ సంచలనం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ క్రికెట్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే ఆదర్శం. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మిషన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి. కింగ్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గడిచాయి. శ్రీలంకపై డెబ్యూ.. 2008, ఆగస్ట్ 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి టీమిండియా స్టార్ ఓపెనర్ గౌతం గంభీర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తన తొలి మ్యాచ్‌లో కోహ్లి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడు ఓపెనర్‌గా పనికిరాడని కామెంట్లు చేశారు. కానీ కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోలేదు. అదే సిరీస్‌లో నాలుగో వన్డేలో తొలి హాఫ్‌సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు. ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 159 పరుగులతో పర్వాలేదనపించాడు. అలా అంచె అంచెలుగా ఎదిగి ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ , ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్లతో 'ఫ్యాబ్ ఫోర్'లో కోహ్లి భాగమయ్యాడు. ఆ మూడేళ్లు.. ఎంతటి స్టార్ క్రికెటరైనా ఏదో ఒక సమయంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొక తప్పదు. ఇటువంటి పరిస్ధితితే కింగ్ కోహ్లికి కూడా ఎదురైంది. 70 సెంచరీలు అలవోక సాధించిన కోహ్లి.. తన 71వ శతకాన్ని అందుకోవడానికి దాదాపు మూడేళ్ల పట్టింది. ఈ సమయంలో విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా అతడి పని అయిపోందని, క్రికెట్ నుంచి తప్పుకుంటే బాగుంటుందని చాలా మంది హేళన చేశారు. కానీ కోహ్లి దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ టీ20లో ఆఫ్గానిస్తాన్‌పై కోహ్లి సంచలన సెంచరీతో చెలరేగాడు. ఆ సెంచరీతో తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత కోహ్లిని అపడం ఎవరూ తరం కాలేదు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక తన 15 ఏళ్ల కెరీర్లో కోహ్లి ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఏళ్లలో కోహ్లి సాధించిన ఘనతలు.. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిది రెండో స్థానం. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ 100 సెంచరీలతో తొలి స్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు తన కెరీర్లో 76 సెంచరీలు సాధించాడు. వన్డేలలో 46, టెస్టుల్లో 29, టీ20లో ఒక సెంచరీ విరాట్ చేశాడు. ►టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లినే. ఇప్పటివరకు 115 టీ20లు ఆడిన విరాట్.. 52.73 సగటుతో 4008 పరుగులు చేశాడు. ►వన్డేల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీల రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. అతడు శ్రీలంకపై వన్డేలలో ఏకంగా 10 సెంచరీలు చేశాడు. ►వన్డేల్లో 7 నుంచి 12 వేల పరుగుల వరకు అత్యంతవేగంగా చేసిన ఆటగాడు కూడా కోహ్లినే ►వన్డేల్లో భారత తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు కోహ్లి పేరిటే ఉంది. ఇప్పటివరకు కోహ్లి మొత్తం 142 క్యాచ్‌లు అందుకున్నాడు. ►అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. కోహ్లి తన కెరీర్లో ఇప్పటి వరకు 20 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లి ఐదో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 501 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 25582 పరుగులు చేశాడు. కోహ్లి టెస్టుల్లో 8676, వన్డేల్లో 12898, టీ20ల్లో 4008 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు.. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా భారత్‌కు ఐసీసీ టైటిల్‌ను అందించికపోయినప్పటికీ ఎన్నో చారిత్రత్మక విజయాలను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 68 టెస్టులకు విరాట్ సారథ్యం వహించగా.. భారత్ అందులో 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. టెస్టుల్లో కెప్టెన్ విరాట్ విన్నింగ్ శాతం 58.82గా ఉంది. అదే విధంగా వన్డేల్లో విరాట్ సారథ్యంలో టీమిండియా 95 మ్యాచ్‌లు ఆడగా. 65 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. వన్డే క్రికెట్లో అతడి విన్నింగ్ శాతం 68 శాతంగా ఉంది. ఆసియాకప్‌తో మళ్లీ.. ఇక వెస్టిండీస్ టూర్ అనంతరం కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు ఆసియాకప్-2023తో మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: IND vs IRE: తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. మా అమ్మ కల నెరవేరింది! రింకూ భావోద్వేగం Can watch this shot whole day.#15YearsOfKingKohlipic.twitter.com/2TzQCaqNMa — RishabGarg🇮🇳 (@rishabgargalt) August 18, 2023 -
టీమిండియాతో సిరీస్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్,వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామ్‌దిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. దాంతో తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న రామ్‌దిన్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో మాత్రం ఆడనున్నాడు. 2005లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన దినేష్ రామ్‌దిన్.. 74 టెస్టులు, 139 వన్డేలు, 71 టీ20ల్లో తన జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు తన కెరీర్లో 6 సెంచరీలతో పాటు 5734 పరుగులు సాధించాడు. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో రామ్‌దిన్ భాగంగా ఉన్నాడు. ఇక రామ్‌దిన్ చివరగా టెస్టుల్లో 2019లో ఆడగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 2016లో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. "అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. గత 14 ఏళ్లగా విండీస్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతగా నిలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్ క్రికెట్, అభిమానులకు ధన్యవాదాలు అంటూ రామ్‌దిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. మరో వైపు భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20ల నిమిత్తం విండీస్‌లో పర్యటించనుంది. చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! View this post on Instagram A post shared by 124NotOut Sports Agency (@124notout) -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..!
వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. సిమన్స్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. కాగా సిమన్స్ గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా విండీస్ తరపున ఆడాడు. 2006లో పాకిస్తాన్‌తో జరగిన వన్డేలో విండీస్ తరపున సిమన్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యి నిరాశ పరిచాడు. ఇక సిమన్స్ వన్డేలు,టెస్టుల్లో కాకుండా.. టీ20ల్లో విండీస్‌కు స్పెషలిస్టు బ్యాటర్‌గా మారాడు. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో సిమన్స్ భాగంగా ఉన్నాడు. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌పై 82 పరుగులతో సిమన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 144 మ్యాచ్‌లు ఆడిన సిమన్స్.. 3763 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సిమన్స్ పలు ప్రాంఛైజీ టోర్నీల్లో కూడా ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2015 సీజన్లో 540 పరుగులతో ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: WI vs IND: భారత్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు! View this post on Instagram A post shared by 124NotOut Sports Agency (@124notout) -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్..
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గురువారం టేలర్ ప్రకటించాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు. "ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత తప్పుకుంటాను. 17 సంవత్సరాలపాటు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను" అని టేలర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా 2006లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్లో టేలర్ అరంగటేట్రం చేశాడు. ఇప్పటి వరకు 233 వన్డేల్లో 8576 పరుగులు చేశాడు. అతడి వన్డే కేరిర్‌లో 21 సెంచరీలు సాధించాడు. అతడు 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 110 టెస్టుల్లో 7585 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాకు షాక్.. నిర్ణయం మార్చుకున్న కీలక ఆటగాడు.. సిరీస్‌కు దూరం! Today I'm announcing my retirement from international cricket at the conclusion of the home summer, two more tests against Bangladesh, and six odi’s against Australia & the Netherlands. Thank you for 17 years of incredible support. It’s been an honour to represent my country #234 pic.twitter.com/OTy1rsxkYp — Ross Taylor (@RossLTaylor) December 29, 2021 -
ఐపీఎల్ మ్యాచ్‌లు చూపించడం కుదరదు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు విజయవంతమైన టోర్నీగా ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లోని పలువురు సభ్యులు ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడలేదు. ఏప్రిల్ 22 నుంచి 26 మధ్య కోల్‌కతాలో జరిగే ఐసీసీ సమావేశానికి వీరంతా హాజరవుతుండటంతో తాము ఐపీఎల్ చూడవచ్చని వారు ఆశించారు. కానీ ఆయా తేదీల్లో ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా లేదు. దాంతో తమ కోసం షెడ్యూల్‌ను కాస్త మార్చి ఒక మ్యాచ్ జరిగేలా చూడమంటూ బీసీసీఐని ఐసీసీ చిరు కోరిక కోరింది. అయితే బీసీసీఐ మాత్రం అది కుదరదంటూ తిరస్కరించేసింది. ‘ఒక మ్యాచ్‌లో మార్పులు చేస్తే మొత్తం షెడ్యూల్, దానికి సంబంధించి ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు దెబ్బ తింటాయి. కాబట్టి అది సాధ్యం కాదని మేం జవాబిచ్చాం’ అని బోర్డు ఉన్నతాధికారి వెల్లడించారు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు ఖుర్రమ్ ఖాన్ వీడ్కోలు
దుబాయ్ : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుకు కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలందించిన ఖుర్రమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐసీసీ ఇంటర్కాంటినెంటల్ కప్‌లో భాగంగా గురువారం అతడు తన చివరి మ్యాచ్ ఆడాడు. ‘యూఏఈ క్రికెట్ జెంటిల్మెన్’గా పేరు తెచ్చుకున్న 43 ఏళ్ల ఖుర్రమ్ 16 వన్డేల్లో 582 పరుగులు చేసి 12 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అత్యంత పెద్ద వయస్సు (43)లో వన్డే సెంచరీ (అఫ్ఘాన్‌పై 132) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3 టి20ల్లో 73 పరుగులు చేశాడు. గత ప్రపంచకప్‌కు ముందు పదేళ్ల పాటు జట్టు కెప్టెన్‌గా సేవలందించాడు.