బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా రియాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన అనంతరం రియాద్ తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్‌కు తన సేవలను అందించాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు.
మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గతంలో బంగ్లా దేశ్ టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా మహ్మదుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతడి సారథ్యంలోని బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8 రౌండ్‌లో నిష్కమ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా జట్టు ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment