విరాట్ కోహ్లి బాటలోనే భారత కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సైతం నడిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్ పేర్కొన్నాడు.
ఇక టెస్టుల్లో, వన్డేల్లో మాత్రమే భారత జెర్సీలో హిట్‌మ్యాన్ కన్పించనున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలవడంలో రోహిత్ శర్మది కీలక పాత్ర. ఫైనల్లో మినహా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత్‌ను రెండో సారి విశ్వవిజేతగా నిలిపాడు.
"టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలవడం చాలా సంతోషం ఉంది. ఈ ట్రోఫీని సాధించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎంతో నిరాశకు గురయ్యాను.
ఈ రోజు నా కల నేరవేరింది. ఇక ఈ విజయంతో నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. భారత జట్టుకు టీ20 వరల్డ్‌కప్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు.
ఇక తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 4231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా రోహిత్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సైతం అంతర్జాతీ టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు.
Comments
Please login to add a commentAdd a comment