IND Vs USA: విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డక్‌.. రోహిత్‌ షాకింగ్‌ రియాక్షన్! వీడియో వైరల్‌ | T20 World Cup 2024: Virat Kohli's Golden Duck Leaves Rohit Sharma In Shock Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

T20 WC IND Vs USA: విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డక్‌.. రోహిత్‌ షాకింగ్‌ రియాక్షన్! వీడియో వైరల్‌

Published Wed, Jun 12 2024 11:00 PM | Last Updated on Thu, Jun 13 2024 11:10 AM

Virat Kohlis Golden Duck Leaves Rohit Sharma In Shock

ఐపీఎల్‌-2024లో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విరాట్‌ నిరాశపరిచాడు.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా న్యూయర్క్‌ వేదికగా అమెరికాతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన నేత్రవల్కర్ బౌలింగ్‌లో రెండో బంతికి కోహ్లి.. వికెట్‌ కీపర్‌ గౌస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా సింగిల్‌ డిజిట్‌ మార్క్‌ను దాటలేకపోయాడు. దీంతో ఏమైంది విరాట్‌ అంటూ నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement