టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా- భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డును ఊరిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ మరో 6 పరుగులు సాధిస్తే టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు కోహ్లి 1,216 పరుగుల చేశాడు. రోహిత్ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో 1,211 పరుగులు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలయ్యే అవకాశముంది.
కాగా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 248 పరుగులతో మూడో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment