టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ఘనంగా విడ్కోలు పలికారు. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి వారు తమ టీ20 ప్రయణాన్ని ముగించారు.
టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ లెజెండరీ క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేసాడు. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంస్ ధోని మాదిరిగానే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల జెర్సీలను సైతం రిటైర్ చేయాలని రైనా బీసీసీఐని కోరాడు. కాగా విరాట్ కోహ్లి జెర్సీ నెం. 18 కాగా.. రోహిత్ జెర్సీ నంబర్ 45.
"బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేయాలనకుంటున్నాను. వరల్డ్‌కప్‌ను అందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యేక గౌరవం దక్కాలి. కాబట్టి జెర్సీ నెం.18 నెం. 45ని రిటైర్ చేయమని భారత క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాను.
ఈ రెండు జెర్సీలను బీసీసీఐ తమ కార్యాలయంలో గౌరవంగా ఉంచుకోవాలి. ఇప్పటికే జెర్సీ నెం 10(సచిన్), నెం 7(ధోని)లకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆవిధంగానే ఇప్పుడు విరాట్, రోహిత్ జెర్సీ నెంలను ఎవరికీ కేటాయించకూడదు.
ఆ జెర్సీ నంబర్‌లను చూస్తే ప్రతీ ఒక్కరికి స్పూర్తి కలగాలి. నెం.18, నెం. 45ల జెర్సీ ధరించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించారు. ఏ ఆటగాడు జట్టులోకి వచ్చినా ఈ జెర్సీ నంబర్లను ఆదర్శంగా తీసుకోవాలని" జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment