Mahmudullah
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా రియాద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన అనంతరం రియాద్ తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్‌కు తన సేవలను అందించాడు. మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు. మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గతంలో బంగ్లా దేశ్ టీ20 జట్టు కెప్టెన్‌గా కూడా మహ్మదుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతడి సారథ్యంలోని బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ సూపర్-8 రౌండ్లో నిష్కమ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా జట్టు ఓటమి పాలైంది. -
T20 World Cup 2024: బ్యాట్‌ను రెండుగా చీల్చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య నిన్న (జూన్ 10) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్ జాకెర్ అలీ కోపంతో బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జాకెర్ అలీ ఈ పనికి పాల్పడ్డాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడే క్రమంలో జాకెర్ అలీ బ్యాట్ డ్యామేజ్ అయ్యింది. షాట్ మిస్ టైమ్ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్ స్వల్పంగా డ్యామేజ్ అయిన బ్యాట్‌ను రెండుగా చీల్చాడు. అనంతరం జాకెర్ కొత్త బ్యాట్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌కు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc)ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి బంగ్లాదేశ్.. చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కేశవ్ మహారాజ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన క్యాచ్‌లను కెప్టెన్ మార్క్రమ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సౌతాఫ్రికా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్‌ను ఢిఫెండ్ చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలరల్లో తంజిమ్ సకీబ్ 3, తస్కిన్ అహ్మద్ 2. రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. కేశవ్ మహారాజ్ (4-0-27-3), నోర్జే (4-0-17-2), రబాడ (4-0-19-2) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హ్రిదోయ్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాంటో (14), మహ్మదుల్లా (20) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క క్యాచ్‌తో అంతా తలకిందులు.. వీడియో
టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డిలో భాగమైన ప్రొటిస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసింది.తొలుత శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన మార్క్రమ్ బృందం.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పనిపట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించి.. గ్రూప్-డి టాపర్‌గా నిలిచింది.ఇక తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. చివరికి పైచేయి సాధించింది. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నజ్ముల్ షాంటో బృందాన్ని ఓడించిన సౌతాఫ్రికా.. ఈ ఎడిషన్‌లో సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.న్యూయార్క్ వేదికగా ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(18) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(4) పూర్తిగా నిరాశపరిచారు.నాలుగో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో ఉన్న సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్ గట్టెక్కించాడు.తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో 46 పరుగులు సాధించాడు క్లాసెన్. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్(29) రాణించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఇక లక్ష్యం స్వల్పంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌కు అనుకూలించని న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. టాపార్డర్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(14) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. తౌహీద్ హృదయ్(37), మహ్మదుల్లా(20) బంగ్లా శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించారు.సౌతాఫ్రికాపై గెలవాలంటే ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. కేవలం ఆరు పరుగులే వచ్చాయి. అయితే, ఈ ఓవర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.డెత్ ఓవర్లో మార్క్రమ్ తమ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేతికి బంతినివ్వగా.. అతడు వైడ్‌తో ఆరంభించాడు. దీంతో బంగ్లా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులుగా మారింది.ఈ క్రమంలో మహ్మదుల్లా 1, జాకిర్ అలీ 2 పరుగులు తీయగా.. నాలుగు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మహరాజ్ బౌలింగ్‌లో జాకిర్ అలీ(8) ఇచ్చిన క్యాచ్‌ను మార్క్రమ్ ఒడిసిపట్టాడు.ఆ తర్వాతి బంతికి లెగ్‌బై రూపంలో ఒక పరుగు రాగా.. రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మహరాజ్ బౌలిండ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకోగా.. మహ్మదుల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా టస్కిన్ అహ్మద్ ఒక్కటి మాత్రమే తీయగలిగాడు.చదవండి: జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. నిజానికి మార్క్రమ్ గనుక మహ్మదుల్లా క్యాచ్ వదిలేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా తన కెప్టెన్సీ, అద్బుత ఫీల్డింగ్‌తో మార్క్రమ్ సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
BAN Vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. దీంతో క్లీన్‌స్వీప్ నుంచి జింబాబ్వే తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(36) పరుగులతో రాణించాడు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్రానీ, బెన్నెట్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాంగ్వే, మసకజ్డా చెరో వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బెన్నెట్(70 ), సికిందర్ రజా(72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్హసన్, సైఫుద్దీన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
WC 2023: నాకు మరీ ఎక్కువ రెస్ట్ ఇచ్చేశారు.. సెలక్టర్లపై సెంచరీ ‘హీరో’ విసుర్లు
‘‘ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చెప్పలేను. చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ.. ఆ విషయాల గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఏం జరుగుతుందో తెలియలేదు. బహుశా.. నేనిలా ముందుకు సాగాలనే ఆ అల్లా నాకు ధైర్యాన్నిచ్చాడేమో! ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూ మరింత కఠిన శ్రమకోరుస్తున్నాను. నేను చేయగలిగింది అంతే కదా! జట్టు విజయాల్లో నా పాత్ర ఉండాలని కోరుకుంటాను. నిజానికి నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే విశ్రాంతినిచ్చారు. అయినా నా చేతుల్లో ఏమీలేదు. అంతా మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ నేను నా పనిని నిజాయితీగా పూర్తి చేస్తే నాతో పాటు జట్టుకు కూడా మేలు జరుగుతుంది’’ అని బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అన్నాడు. విశ్రాంతి పేరిట తనను చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితం చేశారంటూ సెలక్టర్లకు పరోక్షంగా చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాను ప్రొటిస్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ మహ్మదుల్లా పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. సౌతాఫ్రికా విధించిన 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కనీసం రెండంకెల స్కోరు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ షాంటో సున్నాకే పరిమితమయ్యాడు. ఇక మిడిలార్డర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మదుల్లా సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111 బంతులు ఎదుర్కొని 111 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు సహా 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే, మిగతా ఆటగాళ్ల నుంచి ఏమాత్రం సహకారం లభించకపోవడంతో మహ్మదుల్లా ఒంటరి పోరాటం వృథాగా పోయింది. సౌతాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా మాట్లాడుతూ.. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పనిలో పనిగా సెలక్టర్లతో పాటు తనను విమర్శించిన వాళ్లకు ఆటతోనే బదులిస్తానంటూ 37 ఏళ్ల మహ్మదుల్లా కౌంటర్లు వేశాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు మహ్మదుల్లాను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అతడికి తిరిగి జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023 టీమ్‌లో స్థానం సంపాదించిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 3 శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: మహ్మదుల్లా అరుదైన ఘనత! తొలి బ్యాటర్‌గా రికార్డు! కానీ బుమ్రా దెబ్బకు..
ICC Cricket World Cup 2023- Ind vs Ban: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. 36 బంతులు ఎదుర్కొని 46 పరుగులు రాబట్టాడు. బంగ్లాదేశ్ మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(38)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 256 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అదిరే ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు ఇక పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్లు తాంజిద్ హసన్, లిటన్ దాస్ అర్ధ శతకాలతో మెరిశారు. 51 పరుగులు సాధించిన తాంజిద్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా టీమిండియా వంటి పటిష్ట జట్టు మీద.. అదీ వరల్డ్‌కప్ ఈవెంట్లో!! మహ్మదుల్లా సరికొత్త చరిత్ర ఇక లిటన్ దాస్(66)కు సైతం భారత జట్టు మీద వన్డేల్లో ఇదే తొలి అర్ధ శతకం. ఇలా వీరిద్దరు ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకోగా.. ఫిఫ్టీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ మహ్మదుల్లా సరికొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మహ్మదుల్లా రికార్డు టీమిండియాతో మ్యాచ్‌లో మహ్మదుల్లా ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మహ్మదుల్లా రికార్డు సాధించాడు. ఇక భారత జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మహ్మదుల్లా సిక్సర్లు బాదాడు. అయితే, ఆఖరి ఓవర్ రెండో బంతికి జస్ప్రీత్ బుమ్రా అద్భుత బంతితో మహ్మదుల్లాను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. View this post on Instagram A post shared by ICC (@icc) ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే! 1. మహ్మదుల్లా- 16 2. ముష్ఫికర్ రహీం- 13 3. షకీబ్ అల్ హసన్- 10. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన -
భారత్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్ల సరి కొత్త చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాటర్లు మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్, వాషింగ్టన్ సందర్ బంతితో మ్యాజిక్ చేయడం వల్ల బంగ్లాదేశ్ కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో బంగ్లాదేశ్‌ను మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్ద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మెహిదీ హసన్ అజేయ శతకంతో మెరవగా.. మహ్మదుల్లా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ పలు రికార్డులను బద్దలు కొట్టారు. మెహిదీ, మహ్మదుల్లా జోడీ సాధించిన రికార్డులు ఇవే ►భారత్‌తో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బంగ్లాదేశ్ జోడీగా మెహదీ హసన్, మహ్మదుల్లా రికార్డులకెక్కారు. అంతకుముందు 2014 ఆసియాకప్‌లో అనముల్ హక్, ముష్ఫికర్ రహీమ్ 133 పరగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును మెహిదీ,, మహ్మదుల్లా జోడీ బద్దలు కొట్టింది. ►భారత్‌పై వన్డేల్లో 7వ వికెట్‌కు అత్యధిక నెలకొల్పిన జోడిగా మెహదీ హసన్, మహ్మదుల్లా నిలిచారు. అంతకముందు 2005లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్ధనే, ఉపుల్ చందనా ఏడో వికెట్‌కు 126 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజమ్యాచ్లో ఈ 17 ఏళ్ల రికార్డును హసన్, మహ్మదుల్లా బ్రేక్ చేశారు. ►ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెహిదీ.. 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతుకముందు 2021లో దక్షిణాఫ్రికాతో వన్డేలో ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకం బాదాడు. చదవండి: IND vs BAN: మొన్న విలన్.. ఈ రోజు హీరో.. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్ -
మొన్న విలన్.. ఈ రోజు హీరో.. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 47 ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మహ్మదుల్లా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో రాహుల్ కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేతితో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 77 పరుగులు చేసిన మహ్మదుల్లా నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే మంచి టచ్‌లో ఉన్న మహ్మదుల్లాను రాహుల్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడం భారత్‌కు కాస్త ఊరట లభించింది. కాగా రాహుల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ మ్యాన్ అంటూ రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఈజీ క్యాచ్‌ను జారవిడిచి మ్యాచ్ ఓటమికి కారణమైన రాహుల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. What a catch it was by KL Rahul. pic.twitter.com/0gcTgNZQxy — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2022 చదవండి: BAN vs IND: మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా -
T20 WC: ధోని లాంటి వాడు! కానీ అతడిపై వేటు వేయక తప్పలేదు: కోచ్
T0 World Cup 2022- Bangladesh Squad- Coach Sridharan Sriram Comments: టీ20 ప్రపంచకప్-2022 జట్టు నుంచి మాజీ కెప్టెన్ మహ్మదుల్లాను తప్పించడంపై బంగ్లాదేశ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ స్పందించాడు. మహ్మదుల్లాను ధోనితో పోల్చిన అతడు.. ఎంత గొప్ప ఆటగాడైనా ఎల్లకాలం జట్టుతో ఉండలేడు కదా అని వ్యాఖ్యానించాడు. అతడి వారసుడిని ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్.. బుధవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. షకీబ్ అల్ హసన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ సారథి, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లాకు చోటు దక్కలేదు. శ్రీధరన్ శ్రీరామ్ ధోని లాంటి వాడు..! ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆ జట్టు కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మహ్మదుల్లా ఆట తీరును చూసినప్పుడల్లా.. నేను అతడిని ఎంఎస్ ధోనితో పోల్చుకునేవాడిని. టీమిండియాలో ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడినట్లే మహ్మదుల్లా కూడా బంగ్లాదేశ్ తరఫున అలాంటి పాత్రనే పోషించాడు. ఫినిషర్‌గా రాణించాడు. అయితే, ధోని ఎల్లకాలం టీమిండియాకు ఆడలేడు కదా! ప్రతి ఆటగాడి స్థానంలో ఏదో ఒకరోజు అతడి వారసుడిని ఎంపిక చేయక తప్పదు. ఇప్పుడు జట్టులో మహ్మదుల్లా స్థానాన్ని భర్తీ చేయగల క్రికెటర్‌ను ఎంపిక చేయాల్సిన సమయం వచ్చింది. అంత ఈజీ ఏం కాదు! కానీ తప్పలేదు! మహ్మదుల్లాను జట్టు నుంచి తప్పించడం అంత తేలికైన విషయమేమీ కాదు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్లో అతడు అందించిన సేవలు అసమానమైనవి. అతడి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ.. జట్టు కూర్పు గురించిన చర్చల్లో నేను చెడ్డవాడిని కాక తప్పలేదు’’ అని శ్రీధరన్ శ్రీరామ్ పేర్కొన్నాడు. కాగా 36 ఏళ్ల మహ్మదుల్లా గతంలో బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా సేవలు అందించాడు. చదవండి: MS Dhoni: ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేది.. కానీ! Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్! -
T20 WC 2022: ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్‌పై వేటు
ICC Men's T20 World Cup 2022- Bangladesh Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇక మూడేళ్ల తర్వాత.. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా జట్టులోకి వచ్చిన సబీర్ రెహమాన్ మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఈవెంట్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం విశేషం. మహ్మదుల్లా అదే విధంగా గాయాల నుంచి కోలుకున్న నూరుల్ హసన్ సోహన్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, హసన్ మహ్మూద్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ఆసియా కప్‌లో ఆడిన ఆల్‌రౌండర్ మెహెదీ హసన్‌కు మాత్రం ప్రధాన జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం. అతడిని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆసియా కప్-2022లో బంగ్లాదేశ్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్-2022కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్(కెప్టెన్), సబీర్ రెహమాన్, మెహెదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొసేన్ ధ్రూబో, మొసద్దెక్ హొసేన్ సైకత్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, నూరుల్ హసన్ సోహన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫుద్దీన్, నసూమ్ అహ్మద్, హసన్ మహ్మూద్, నజ్మల్ హొసేన్ షాంటో, ఇబాదత్ హొసేన్, టస్కిన్ అహ్మద్. స్టాండ్ బై ప్లేయర్లు: షోరిఫుల్ ఇస్లాం, రిషద్ హొసేన్, మెహెదీ హసన్, సౌమ్య సర్కార్. చదవండి: Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్! Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే! -
జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..!
జింబాబ్వే పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లును సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 సిరీస్‌కు బంగ్లా రెగ్యులర్ కెప్టెన్ మహ్మదుల్లాకు సెలక్టర్లు విశ్రాంతి విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎంపికయ్యాడు. అదే విధంగా జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జూలై 30 న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌ను మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ టీ20 జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), మునిమ్ షహరియార్, అనాముల్ హక్, లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, మొసద్దెక్ హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో,మెహిదీ హసన్ మిరాజ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, హజ్సన్ మహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్, తైజుల్ ఇస్లాం చదవండి: IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్ -
T20 World Cup WI Vs BAN: వరుస పరాజయాలు... టోర్నీ నుంచి అవుట్!
వీరాభిమానుల ఆశలు ఆవిరి చేస్తూ... ఉత్కంఠ పోరులో తడబడిన బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో పరాజయం చవిచూసింది. కీలక సమయంలో బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ జట్టు మూల్యం చెల్లించుకుంది. వెస్టిండీస్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్ ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. Bangladesh Lost To West Indies By 3 Runs Out Tourney: అత్యున్నత వేదికపై మంచి ఫలితాలు రావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాల్సి ఉంటుంది. లేదంటే ఎంతటి మేటి జట్టుకైనా భంగపాటు తప్పదు. వీరాభిమానులకు కొదువలేని బంగ్లాదేశ్ జట్టు అంచనాలను అందుకోవడంలో విఫలమై టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన చోట బంగ్లాదేశ్ చతికిలపడింది. ఈసారికి సూపర్–12తోనే సరిపెట్టుకోనుంది. చివరి బంతికి 4 పరుగులు అవసరం గ్రూప్–1 లో శుక్రవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ మూడు పరుగుల తేడా తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఎట్టకేలకు ఈ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 9 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బంగ్లాదేశ్ గెలుపునకు చివరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ ఆల్‌రౌండర్ రసెల్ వేసిన బంతిపై క్రీజులో ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్ముదుల్లా ఒక్క పరుగూ తీయలేకపోయాడు. దాంతో విండీస్ విజయం, బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ దూకుడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... తొలి టి20 మ్యాచ్ ఆడిన రోస్టన్ చేజ్ (46 బంతుల్లో 39; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (43 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (24 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా జట్టును విజయతీరానికి చేర్చలేకపోయారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) మెహదీ హసన్ 4; లూయిస్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 6; రోస్టన్ చేజ్ (బి) ఇస్లామ్ 39; హెట్‌మైర్ (సి) సౌమ్య సర్కార్ (బి) మెహదీ హసన్ 9; పొలార్డ్ (నాటౌట్) 14; రసెల్ (రనౌట్) 0; పూరన్ (సి) నైమ్ (బి) ఇస్లామ్ 40; బ్రావో (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తఫిజుర్ 1; హోల్డర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–12, 2–18, 3–32, 4–62, 5–119, 6–119, 7–123. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–27–2, తస్కిన్ అహ్మద్ 4–0–17–0, ముస్తఫిజుర్ 4–0–43–2, షోరిఫుల్ 4–0–20–2, షకీబ్ 4–0–28–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నైమ్ (బి) హోల్డర్ 17; షకీబ్ (సి) హోల్డర్ (బి) రసెల్ 9; లిటన్ దాస్ (సి) హోల్డర్ (బి) బ్రావో 44; సౌమ్య సర్కార్ (సి) గేల్ (బి) హొసీన్ 17; ముష్ఫికర్ (బి) రాంపాల్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 31; అఫిఫ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–60, 4–90, 5–130. బౌలింగ్: రవి రాంపాల్ 4–0– 25–1, హోల్డర్ 4–0–22–1, రసెల్ 4–0– 29–1, హొసీన్ 4–0–24–1, బ్రావో 4–0– 36–1. -
T20 WC: అరె ఏంట్రా ఇది.. పాపం బంగ్లాదేశ్ కెప్టెన్... అసలు మాట్లాడనిస్తే కదా!
Scotland supporters interrupt Bangladesh captain Mahmudullah: టీ20 వరల్డ్‌కప్-2021 క్వాలిఫైయింగ్ పోటీల్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఆదివారం నాటి మ్యాచ్‌లో బంగ్లా ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముష్ఫికర్ రహీం(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మహ్మదుల్లా(23), షకీబ్ అల్ హసన్(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా.. స్కాట్లాండ్ విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఫలితంగా మెగా టోర్నీ ఆరంభమైన మొదటిరోజే స్కాట్లాండ్ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో.. ఆ జట్టుకు మద్దతుగా స్టేడియానికి వచ్చిన అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అంతా కలిసి తమ జాతీయ గీతం పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే, వారి ఉత్సాహం బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ అతడు ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నిస్తుండగా... స్కాట్లాండ్ ఫ్యాన్స్ కేరింతలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో కాసేపు అతడు అలా మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత మాట్లాడటం మొదలుపెట్టగానే మళ్లీ జాతీయగీలాపన ఆరంభించారు. దీంతో... చేసేదేమీ లేక మహ్మదుల్లా కాసేపు వెయిట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: T20 WC 2021 IRE Vs NED: 106 పరుగులకే ఆలౌట్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎనిమిదో నెంబర్ ఆటగాడు అజేయ శతకం; బంగ్లా భారీస్కోరు
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహ్ముదుల్లా (150 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. దీంతో 294/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 126 ఓవర్లలో 468 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్ముదుల్లా, టెయిలెండర్ టస్కిన్ అహ్మద్ (75; 11 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 191 పరుగులు జోడించడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక తొమ్మిదవ వికెట్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. కైటనో (33 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
‘ఎంఎస్ ధోనిని ఫాలో అవుతా’
ఢాకా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి తాను పెద్ద అభిమానిని అంటున్నాడు బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ మహ్మదుల్లా. తనకు ధోని కెప్టెన్సీ అన్నా, అతని బ్యాటింగ్ అన్నా ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే తాను ధోనికి పెద్ద అభిమానినని మహ్మదుల్లా తెలిపాడు. ‘ ధోని మైదానంలో ఆడే తీరు ముచ్చటగా ఉంటుంది. ప్రత్యేకంగా ధోని హిట్టింగ్ చేసే సందర్భాల్లో కంట్రోల్డ్ షాట్లు ఆడుతూ ఉంటాడు. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అతను కొట్టే కొట్టే హెలికాప్టర్ షాట్లను ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటా. ధోని ఆడిన పాత మ్యాచ్‌లే కాకుండా లైవ్ మ్యాచ్‌లు కూడా చూస్తూ ఉంటాను. (తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా) ధోని గేమ్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ మెల్లగా నియంత్రణలోకి తెచ్చుకునే విషయాన్ని ఎక్కువగా పరిశీలిస్తా. నేను కెప్టెన్సీ చేసే సందర్భాల్లో ధోనిని ఫాలో అవుతా. అటు బ్యాటింగ్ విషయంలోనే కాదు.. కెప్టెన్సీ విషయంలో కూడా ధోనిని అనుసరిస్తూ ఉంటా’ అని మహ్మదుల్దా తెలిపాడు. ఇక వన్డే ఫార్మాట్లో ధోని బ్యాటింగ్ యావరేజ్ యాభైకి పైగా ఉండటాన్ని మహ్మదుల్లా ప్రధానంగా ప్రస్తావించాడు. వన్డే క్రికెట్లో యాభైకి పైగా యావరేజ్ కల్గి ఉండటం అంత ఈజీ కాదన్నాడు. స్టైక్‌రేట్ విషయానికొస్తే దాదాపు 90 ఉండటం అతనికి గేమ్‌పై ఉన్న పట్టును చూపెడుతుందన్నాడు. తన క్రికెట్ ఎరీనాలో అత్యధిక ప్రభావం చూపిన క్రికెటర్ ధోనినేనని మహ్మదుల్లా పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌పై రెండేళ్లు వేటు పడిన నేపథ్యంలో టీ20 కెప్టెన్‌గా మహ్మదుల్లాను ఎంపిక చేశారు. ఇప్పుడు షకీబుల్ వారసుడిగా జట్టును నడిపిస్తున్నాడు మహ్మదుల్లా. కాగా, మహ్మదుల్లాలో ధోని కెప్టెన్సీ తరహా లక్షణాలను మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గుర్తించిన విషయం తెలిసిందే. ఇటీవల ఒకానొక సందర్భంలో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. మహ్మదుల్లా కెప్టెన్సీ అచ్చం ధోని సారథ్యాన్ని పోలి ఉంటుందన్నాడు. (టి20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకోండి) -
అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్
నాగ్‌పూర్: భారత్‌తో జరిగిన చివరి టీ20లో తమకు గెలిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా స్పష్టం చేశాడు. ఓ దశలో మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని, కాకపోతే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇక తేరుకోలేక పోయామన్నాడు. తాము సిరీస్‌ను గెలిచే అవకాశాన్ని కోల్పోవడానికి భారత బౌలర్లే కారణమన్నాడు. మహ్మదుల్లా నయీమ్, మహ్మద్ మిథున్లు ఇన్నింగ్స్‌ను నిర్మించడంతో గెలుపుపై ఆశలు ఏర్పడ్డాయని, అయితే వీరిద్దరూ ఔట్ కావడంతో మ్యాచ్ కోల్పోయమన్నాడు. వీరిద్దరూ ఔట్ కావడంతో పాటు స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకోవడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామన్నాడు.(ఇక్కడ చదవండి: చహర్ సిక్సర్... భారత్ విన్నర్) భారత బౌలర్ల విజృంభణే తమ కొంపముంచిందన్నాడు. ఈ క్రమంలోనే నయీయ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు మహ్మదుల్లా. నయీయ్ ఒక టాలెంటెడ్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతను తన పనిని కూల్‌గా నిర్వహిస్తాడనే విషయం తాజా మ్యాచ్‌లో నిరూపితమైందన్నాడు. ప్రధానంగా భారత సీమర్లు తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యారన్నాడు. మూడో టీ20లో భారత 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.కేఎల్ రాహుల్(52), శ్రేయస్ అయ్యర్(62)లు హాఫ్ సెంచరీలు సాధించి గౌరవప్రదమైన స్కోరు సాధించారు. ఆపై 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 144 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. నయీయ్(81: 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిథున్(27)తో కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కాగా, 110 పరుగుల వద్ద మిథున్ మూడో వికెట్‌గా ఔటైన తర్వాత బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 34 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ పరాజయం చవిచూసింది. భారత బౌలర్లు బంగ్లాను ఆలౌట్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. -
కివీస్ ఇన్నింగ్స్ విజయం
హామిల్టన్: తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో గెలిచింది కానీ... బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ (171 బంతుల్లో 149; 21 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (229 బంతుల్లో 146; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన నాలుగో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. కివీస్ భారీస్కోరు (715/6 డిక్లేర్డ్) దృష్ట్యా విజయం ఖాయమైందని ఉత్సాహంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లను సౌమ్య, మహ్ముదుల్లా ద్వయం చెమటలు కక్కించింది. 307 పరుగుల లోటుతో ఓవర్‌నైట్ స్కోరు 174/4తో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడింది. సౌమ్య సర్కార్, మహ్ముదుల్లా శతకాలతో కదంతొక్కారు. తమ పోరాటంతో కివీస్ విజయాన్ని అంతకంతకు ఆలస్యం చేశారు. ఇద్దరు ఐదో వికెట్‌కు 235 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 429 పరుగుల వద్ద ఆలౌటైంది. వాళ్లిద్దరు మినహా ఇంకెవరూ 5 పరుగులైనా చేయలేకపోయారు. సౌమ్యతో పాటు లిటన్ దాస్ (1), అబు జయెద్ (3)లను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా, సౌతీ బౌలింగ్‌లో మహ్ముదుల్లా, ఎబదత్ హొస్సేన్ (0) ఔటయ్యారు. మరో రోజు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్‌తో సరిపెట్టుకున్న పేసర్ బౌల్ట్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సౌతీ 3, వాగ్నర్ 2 వికెట్లు తీశారు. డబుల్ సెంచరీ సాధించిన కివీస్ సారథి విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్టు ఈ నెల 8 నుంచి వెల్లింగ్టన్లో జరుగుతుంది. -
మహ్మూదుల్లా సెంచరీ
ఢాకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు రెండో రోజే పట్టుచిక్కింది. బ్యాటింగ్‌లో 500 పైచిలుకు పరుగులు బాదేసింది... బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. రెండో రోజంతా బంగ్లా ఆధిపత్యంలోనే సాగింది. ఓవర్‌నైట్ స్కోరు 259/5తో శనివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 508 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మహ్మూదుల్లా (136; 10 ఫోర్లు) సెంచరీ సాధించాడు. కెప్టెన్ షకీబ్ (80; 6 ఫోర్లు), లిటన్ దాస్ (54; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను స్పిన్నర్లు మెహదీ హసన్ మిరాజ్ (3/36), షకీబుల్ హసన్ (2/15) దెబ్బ తీశారు. దీంతో ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 75 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (0), పావెల్ (4), హోప్ (10), అంబ్రిస్ (7), చేజ్ (0) వరుసగా క్లీన్‌బౌల్డ్ అయ్యారు. -
రన్..రన్.. రనౌట్!
-
రన్..రన్.. రనౌట్!
కొలంబో: బంగ్లాదేశ్ ఆటగాడు మొహ్మదుల్లా-టీమిండియా ఆటగాడు విజయ్ శంకర్లు పిచ్‌పై పోటీ పడి పరుగెత్తారు. అందులో మొహ్మదుల్లాది రనౌట్‌ను తప్పించుకునే ప్రయత్నమైతే, విజయ్ శంకర్‌ది మాత్రం రనౌట్ చేసే ఆత్రం. ఆ ఇద్దరూ రన్..రన్ అంటూ పరుగెత్తగా చివరకు విజయ్ శంకర్ పైచేయి సాధించాడు. అంటే మొహ్మదుల్లా రనౌట్‌ను చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో భాగంగా విజయ్ శంకర్ వేసిన 15 ఓవర్ రెండో బంతిని ఫ్లిక్ చేసి రన్ కోసం యత్నించాడు. అవతలి ఎండ్‌లో షబ్బీర్ రెహ్మాన్ కూడా పరుగు కోసం రావాలంటూ గట్టిగా అరిచాడు. ఏకబిగిన స్టైకింగ్ ఎండ్‌లోకి దూసుకుపోయాడు. కాగా, పరుగు తీద్దామా.. వద్దా అని ఆలోచించిన మొహ్మదుల్లా తొలుత ఆగుతూ పరిగెట్టాడు. అయితే షబ్బీర్ రెహ్మాన్ అప్పటికే సగం పిచ్‌ను దాటి వెళ్లిపోవడంతో మొహ్మదుల్లా దౌడ్ తీశాడు. అదే సమయంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బంతిని అందుకుని విజయ్ శంకర్‌కు అందించాడు. అప్పుడు మొహ్మదుల్లా, విజయ్ శంకర్ల మధ్య దూరం అంతరం కూడా పెద్దగా లేదు. బంతిని అందుకున్న శంకర్.. కొద్దిపాటి తడబాటుకు గురయ్యాడు. చివరికి తనను తాను నియంత్రించుకున్న శంకర్ బంతిని వికెట్లపైకి విసిరి బెయిల్స్‌ను పడగొట్టాడు. దాంతో మొహ్మదుల్లా నిరాశగా తిట్టుకుంటూ పెవిలియన్‌కు చేరాడు. -
లంకకు భారీ షాక్.. చండిమాల్‌పై నిషేధం
కొలంబో: శ్రీలంక కెప్టెన్ చండిమాల్‌పై రెండు టీ20ల నిషేధం విధించింది ఐసీసీ. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ చండిమాల్‌పై ఈ చర్య తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్లో వెల్లడించింది. రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికి లంక బౌలర్లు నాలుగు ఓవర్లు తక్కువ వేశారని.. దీంతో మ్యాచ్ అధిక సమయం కొనసాగిందని చెప్పారు. ఐసీసీ నిబంధన 2.5.2 ప్రకారం మ్యాచ్‌లో రెండు ఓవర్లు ఆలస్యమైతే ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. మూడు ఓవర్లు ఆలస్యమైతే ఫీజులో 20 శాతం కోత పడుతుంది. అదే సమయంలో కెప్టెన్‌కు పనిష్మెంట్గా రెండు 2 సస్పెన్షన్ పాయింట్లు ఇస్తారు. ఇది ఓ టెస్ట్, లేక రెండు వన్డేలు, లేక రెండు టీ20ల నిషేధానికి సమానమని క్రిస్ బ్రాడ్ తెలిపారు. దీంతో ఈ నెల 12న భారత్, 16న బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20లకు దూరం కానున్నాడు. లంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. బంగ్లా ఆటగాళ్లకూ ‘కోత’ పడింది! బంగ్లాదేశ్ కెప్టెన్ మమ్మదుల్లాకు సైతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ నిబంధన 2.5.1 ప్రకారం బంగ్లా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, కెప్టెన్ మహ్మదుల్లా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు రిఫరీ క్రిస్ బ్రాడ్ వివరించారు. ఏడాదిలోగా మరోసారి టీ20ల్లో స్లో ఓవర్ రేటు నమోదైతే మహ్మదుల్లా మ్యాచ్ నిషేధానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. BREAKING: Dinesh Chandimal has been suspended for two T20Is, after being found guilty of a serious over-rate offence in Saturday's match against Bangladesh.https://t.co/MyS6idOCZY pic.twitter.com/MK1SyxmWhy — ICC (@ICC) 11 March 2018 -
టీ 20ల్లో అలా ఆడితే కష్టం
కొలంబో : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడం కంటే కూడా జట్టు ఆడిన తీరుపై బంగ్లాదేశ్ కెప్టెన్ మొహ్మదుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఏ దశలోనూ తమ జట్టు నాణ్యమైన బ్యాటింగ్ చేయలేదన్నాడు. ఇంకా 30 నుంచి 40 పరుగులు చేయాల్సి ఉన్నా, సాధారణ స్కోరుకే పరిమితమయ్యాం. ప్రధానంగా మధ్య ఓవర్లలో ఎక్కువ డాట్ బాల్స్ పడ్డాయి. కనీసం సింగిల్స్‌తో బ్యాటింగ్ రొటేట్ చేయడం కూడా కష్టమైంది. టీ 20ల్లో డాట్ బాల్స్ అనేవి చాలా తక్కువ శాతం ఉండాలి. మా ఇన్నింగ్స్‌లో 46 బంతులకు అసలు పరుగులే రాలేదు. ఇది మా ఓటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక్కడ మా ఓటమి కంటే కూడా ఆట తీరు బాలేదు. డాట్ బాల్స్‌పై ఇకనుంచైనా జాగ్రత్త పడాలి. బౌండరీలపై ఆధాపడవద్దు.. ఒత్తిడిని అధిగమించాలంటే సింగిల్స్ చాలా ప్రధానం' అని మొహ్మదుల్లా తెలిపాడు. -
'టీమిండియాతో పరాజయాన్ని మరచిపోలేను'
టి-20 ప్రపంచ కప్‌లో టీమిండియా చేతిలో ఎదురైన ఓటమి బంగ్లాదేశ్ క్రికెటర్లను ఇప్పటికీ వెంటాడుతోంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించే అద్భుతమైన అవకాశాలను చేజార్చుకున్నందుకు బంగ్లా క్రికెటర్లు కుమిలిపోతున్నారు. ఈ పరాజయాన్ని మరచిపోవడం చాలా కష్టమని బంగ్లా బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా మరోసారి ఆవేదన చెందాడు. ఈ మ్యాచ్‌లో ధోనీసేన చిరస్మరణీయ విజయం సాధించి నాకౌట్ అవకాశాలను కాపాడుకున్న సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి కేవలం రెండు పరుగులు కావాల్సి ఉండగా, వరసగా మూడు వికెట్లు కోల్పోయి ఊహించని రీతిలో పరాజయం మూటగట్టుకుంది. ఆ సమయంలో ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా క్రీజులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఓవర్లో భారీ షాట్లకు ప్రయత్నించి వీరిద్దరూ క్యాచవుటయ్యారు. చివరి బంతికి ధోనీ.. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను అద్భుతమైన రనౌట్ చేయడంతో బంగ్లా కల చెదిరిపోయింది. ఈ ఓటమి గురించి మహ్మదుల్లా మాట్లాడుతూ.. 'ఈ ఓటమిని ఎలా మరచిపోగలం? ముష్ఫికర్, నేను క్రీజులో ఉన్నాం. ఓడిపోతామని మేం ఊహించలేదు. నాలుగో బంతికి ముష్ఫికర్ అవుటయ్యాక భారీ షాట్‌కు ప్రయత్నించి తప్పు చేశా. సిక్స్ కొట్టడానికి షాట్ ఆడగా, బంతి గాల్లోకి లేచి ఫీల్డర్ చేతిలో పడింది. దీన్ని నమ్మలేకపోతున్నా. కనీసం సింగిల్ చేసినా గెలిచే అవకాశం ఉండేది. ఇది నా తప్పే. ఓటమికి నాదే బాధ్యత. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు చేయను. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన అవకాశాన్ని ఎంచుకుంటా' అని మహ్మదుల్లా చెప్పాడు.