T20 World Cup 2022: Bangladesh Announces 15 Member Squad, Check Names Inside - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన.. మాజీ కెప్టెన్‌పై వేటు

Published Wed, Sep 14 2022 3:43 PM | Last Updated on Wed, Sep 14 2022 4:56 PM

T20 World Cup 2022: Bangladesh Announces Their 15 Member Squad - Sakshi

(ఫైల్‌ ఫొటో)

ICC Men's T20 World Cup 2022- Bangladesh Squadటీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్‌ మహ్మదుల్లా రియాద్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు.

ఇక మూడేళ్ల తర్వాత.. ఆసియా కప్‌-2022 టోర్నీలో భాగంగా జట్టులోకి వచ్చిన సబీర్‌ రెహమాన్‌ మాత్రం తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ ఈవెంట్లో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన అతడికి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం విశేషం. 


మహ్మదుల్లా

అదే విధంగా గాయాల నుంచి కోలుకున్న నూరుల్‌ హసన్‌ సోహన్‌, లిటన్‌ దాస్‌, యాసిర్‌ అలీ చౌదరి, హసన్‌ మహ్మూద్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ఆసియా కప్‌లో ఆడిన ఆల్‌రౌండర్‌ మెహెదీ హసన్‌కు మాత్రం ప్రధాన జట్టులో చోటుదక్కకపోవడం గమనార్హం. అతడిని స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆసియా కప్‌-2022లో బంగ్లాదేశ్‌ కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. దారుణమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.

టీ20 వరల్డ్‌కప్‌-2022కు బంగ్లాదేశ్‌ జట్టు:
షకీబ్‌ అల్‌ హసన్‌(కెప్టెన్‌), సబీర్‌ రెహమాన్‌, మెహెదీ హసన్‌ మిరాజ్‌, అఫిఫ్‌ హొసేన్‌ ధ్రూబో, మొసద్దెక్‌ హొసేన్‌ సైకత్‌, లిటన్‌ దాస్‌, యాసిర్‌ అలీ చౌదరి, నూరుల్‌ హసన్‌ సోహన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, నసూమ్‌ అహ్మద్‌, హసన్‌ మహ్మూద్‌, నజ్మల్‌ హొసేన్‌ షాంటో, ఇబాదత్‌ హొసేన్‌, టస్కిన్‌ అహ్మద్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు:
షోరిఫుల్‌ ఇస్లాం, రిషద్‌ హొసేన్‌, మెహెదీ హసన్‌, సౌమ్య సర్కార్‌.
చదవండి: Ind Vs Aus: భారత్‌తో సిరీస్‌.. ఆసీస్‌కు భారీ షాక్‌! ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు అవుట్‌!
Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్‌ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement