మహ్మదుల్లా
T0 World Cup 2022- Bangladesh Squad- Coach Sridharan Sriram Comments: టీ20 ప్రపంచకప్-2022 జట్టు నుంచి మాజీ కెప్టెన్ మహ్మదుల్లాను తప్పించడంపై బంగ్లాదేశ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ స్పందించాడు. మహ్మదుల్లాను ధోనితో పోల్చిన అతడు.. ఎంత గొప్ప ఆటగాడైనా ఎల్లకాలం జట్టుతో ఉండలేడు కదా అని వ్యాఖ్యానించాడు. అతడి వారసుడిని ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్.. బుధవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. షకీబ్ అల్ హసన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ సారథి, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లాకు చోటు దక్కలేదు.
శ్రీధరన్ శ్రీరామ్
ధోని లాంటి వాడు..!
ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆ జట్టు కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మహ్మదుల్లా ఆట తీరును చూసినప్పుడల్లా.. నేను అతడిని ఎంఎస్ ధోనితో పోల్చుకునేవాడిని.
టీమిండియాలో ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడినట్లే మహ్మదుల్లా కూడా బంగ్లాదేశ్ తరఫున అలాంటి పాత్రనే పోషించాడు. ఫినిషర్‌గా రాణించాడు. అయితే, ధోని ఎల్లకాలం టీమిండియాకు ఆడలేడు కదా!
ప్రతి ఆటగాడి స్థానంలో ఏదో ఒకరోజు అతడి వారసుడిని ఎంపిక చేయక తప్పదు. ఇప్పుడు జట్టులో మహ్మదుల్లా స్థానాన్ని భర్తీ చేయగల క్రికెటర్‌ను ఎంపిక చేయాల్సిన సమయం వచ్చింది.
అంత ఈజీ ఏం కాదు! కానీ తప్పలేదు!
మహ్మదుల్లాను జట్టు నుంచి తప్పించడం అంత తేలికైన విషయమేమీ కాదు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్‌లో అతడు అందించిన సేవలు అసమానమైనవి. అతడి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ.. జట్టు కూర్పు గురించిన చర్చల్లో నేను చెడ్డవాడిని కాక తప్పలేదు’’ అని శ్రీధరన్ శ్రీరామ్ పేర్కొన్నాడు. కాగా 36 ఏళ్ల మహ్మదుల్లా గతంలో బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా సేవలు అందించాడు.
చదవండి: MS Dhoni: ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేది.. కానీ!
Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్!
Comments
Please login to add a commentAdd a comment