ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాది నెం1 స్థానం. ద్వైపాక్షిక సిరీస్‌లలో దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. చివరిసారిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.
ఇక ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్-2022లో బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు భారత జట్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా కెప్టెన్‌తో పాటు కోచ్‌ను మార్చేయాలని వాదనలు కూడా ఊపందుకున్నాయి.
ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంస్ ధోనిని భారత క్రికెట్ డైరక్టర్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మూడు ఫార్మాట్లలో జట్టు బాధ్యతలను చూడటం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కష్టం అవుతోంది.
ఈ క్రమంలోనే ధోనికి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోని జట్టుతో కలిస్తే.. ద్రవిడ్‌కు పని భారం తగ్గుతోంది. ద్రవిడ్ టెస్టు, వన్డే ఫార్మాట్‌లో ఆటగాళ్లను తీర్చదిద్దడంపై దృష్టి సారిస్తే.. ధోని టీ20 స్పెషలిస్టులను తాయరు చేసే పనిలో ఉంటాడు.
టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. నవంబర్ అఖరిలో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం గురుంచి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ధోని భారత జట్టు మెంటార్‌గా బీసీసీఐ నియమించింది. కానీ ఈ మెగా టోర్నీలో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
అయినప్పటకీ ధోనికి ఉన్న అనుభవం దృష్ట్యా మరోసారి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నారట. కాగా వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోని అన్ని ఫార్మాట్‌లు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: IPL 2023: ముంబై విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం! మిస్ యూ పోలీ.. ట్విస్ట్ ఇచ్చాడు మరి!
Comments
Please login to add a commentAdd a comment