Sridharan Sriram
-
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. ఇకపై గంభీర్..
IPL 2024- Lucknow Super Giants: ఐపీఎల్-2024 నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ సిబ్బందిని ప్రకటించింది. టీమిండియా మాజీ స్టార్ గౌతం గంభీర్‌ను గ్లోబల్ మెంటార్‌గా ప్రమోట్ చేసిన మేనేజ్మెంట్.. శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. హెడ్‌కోచ్ అతడే గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీరామ్ ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ఇక లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా ఇప్పటికే జస్టిన్ లాంగర్‌ను నియమించిన విషయం తెలిసిందే. అతడికి తోడుగా.. విజయ్ దహియా, ప్రవీణ్ తాంబేలతో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్, జాంటీ రోడ్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనున్నారు. PC: LSG బంగ్లాదేశ్‌ను గెలుపుబాటలో నడిపి శ్రీధరన్ శ్రీరామ్ చేరిక లక్నో సూపర్ జెయింట్స్‌కు అదనపు బలంగా మారనుంది. 47 ఏళ్ల ఈ టీమిండియా మాజీ స్పిన్నర్ గతంలో బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు మార్గదర్శనం చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో సూపర్-12లో బంగ్లా అద్భుతంగా ఆడేలా కోచింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు సైతం అంతేకాదు.. ఆస్ట్రేలియా జట్టుకు సైతం శ్రీరామ్ కోచ్‌గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్, 2021-22 యాషెస్ సిరీస్ సమయంలో జట్టుతో ప్రయాణించాడు. అదే విధంగా.. గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ప్లేఆఫ్స్ చేరినా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలోనే వైదొలిగినా జట్టు ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగలిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో టాప్-4లో నిలిచిన లక్నో కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కోహ్లి- గంభీర్ వివాదం ఇదిలా ఉంటే.. లక్నో- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్ కారణంగా విరాట్ కోహ్లి- గంభీర్ మధ్య తలెత్తిన గొడవ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్థాయి మరిచి ప్రవర్తించిన ఈ ఇద్దరు స్టార్లపై క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ S Sriram joins to complete our coaching staff for 2024 💙 Full story 👉 https://t.co/4svdieJytL pic.twitter.com/8EgX2Pg8uP — Lucknow Super Giants (@LucknowIPL) September 9, 2023 -
T20 WC: ధోని లాంటి వాడు! కానీ అతడిపై వేటు వేయక తప్పలేదు: కోచ్
T0 World Cup 2022- Bangladesh Squad- Coach Sridharan Sriram Comments: టీ20 ప్రపంచకప్-2022 జట్టు నుంచి మాజీ కెప్టెన్ మహ్మదుల్లాను తప్పించడంపై బంగ్లాదేశ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ స్పందించాడు. మహ్మదుల్లాను ధోనితో పోల్చిన అతడు.. ఎంత గొప్ప ఆటగాడైనా ఎల్లకాలం జట్టుతో ఉండలేడు కదా అని వ్యాఖ్యానించాడు. అతడి వారసుడిని ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి బంగ్లాదేశ్.. బుధవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. షకీబ్ అల్ హసన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మాజీ సారథి, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లాకు చోటు దక్కలేదు. శ్రీధరన్ శ్రీరామ్ ధోని లాంటి వాడు..! ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆ జట్టు కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘మహ్మదుల్లా ఆట తీరును చూసినప్పుడల్లా.. నేను అతడిని ఎంఎస్ ధోనితో పోల్చుకునేవాడిని. టీమిండియాలో ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడినట్లే మహ్మదుల్లా కూడా బంగ్లాదేశ్ తరఫున అలాంటి పాత్రనే పోషించాడు. ఫినిషర్‌గా రాణించాడు. అయితే, ధోని ఎల్లకాలం టీమిండియాకు ఆడలేడు కదా! ప్రతి ఆటగాడి స్థానంలో ఏదో ఒకరోజు అతడి వారసుడిని ఎంపిక చేయక తప్పదు. ఇప్పుడు జట్టులో మహ్మదుల్లా స్థానాన్ని భర్తీ చేయగల క్రికెటర్‌ను ఎంపిక చేయాల్సిన సమయం వచ్చింది. అంత ఈజీ ఏం కాదు! కానీ తప్పలేదు! మహ్మదుల్లాను జట్టు నుంచి తప్పించడం అంత తేలికైన విషయమేమీ కాదు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్లో అతడు అందించిన సేవలు అసమానమైనవి. అతడి పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ.. జట్టు కూర్పు గురించిన చర్చల్లో నేను చెడ్డవాడిని కాక తప్పలేదు’’ అని శ్రీధరన్ శ్రీరామ్ పేర్కొన్నాడు. కాగా 36 ఏళ్ల మహ్మదుల్లా గతంలో బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా సేవలు అందించాడు. చదవండి: MS Dhoni: ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేది.. కానీ! Ind Vs Aus: భారత్‌తో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్! ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్! -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!
Asia Cup 2022- T20 World Cup 2022: ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ల కోసం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను కోచ్‌గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించినట్లు ది డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. ‘‘అవును.. ప్రపంచకప్ ఈవెంట్ వరకు మేము శ్రీరామ్‌తో కలిసి పనిచేయబోతున్నాం. ఆసియా కప్ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్. నిజానికి... వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆసియా కప్ ఈవెంట్ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్ తెలిపింది. మరి పాత కోచ్? అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు శ్రీరామ్ నియామకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్ రసెల్ డొమింగో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేస్తాడని తెలిపినట్లు పేర్కొంది. కాగా చెన్నైకి చెందిన శ్రీధరన్ శ్రీరామ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. 2000- 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన అతడు కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆసీస్‌ను విజేతగా నిలపడంలో! ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి.. అష్టన్ అగర్, ఆడం జంపా వంటి యువకులకు స్పిన్ బౌలింగ్‌లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. గతంలో పంజాబ్ బౌలింగ్ కోచ్‌గానూ శ్రీధరన్ శ్రీరామ్ పనిచేశాడు. ఘోర పరాభవం! కాగా ఇటీవల బంగ్లాదేశ్.. జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జింబాబ్వేలో పర్యటించి వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆసియా కప్-2022కు ముందుకు ఇలాంటి పరాభవం ఎదురైన నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ నియామకం జరిగినట్లు సమాచారం. చదవండి: Ind Vs Zim: అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్! LLC 2022: గంభీర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతీ! -
ఆసీస్ జట్టు కన్సల్టెంట్‌గా శ్రీరామ్
మెల్బోర్న్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్, మైక్‌హస్సీలను ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్స్గా నియమించుకుంది. టోర్నీ ఆరంభ దశలో శ్రీరామ్.. ఆసీస్ జట్టు సన్నాహాకాలను పర్యవేక్షిస్తాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తోనే శ్రీరామ్ బాధ్యతలు చేపడతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ‘భారత్‌కు వచ్చే ముందు మేం ప్రొటీస్‌తో సిరీస్ ఆడతాం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీరామ్ దృష్టిపెడతాడు. అలాగే భారత్‌లో ఎదురయ్యే పరిస్థితులపై క్రికెటర్లకు శిక్షణ ఇస్తాడు. హస్సీకి టి20లతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా అనుభవం ఉంది. కాబట్టి అతని సేవలను కూడా వినియోగించుకుంటాం’ అని సీఏ పేర్కొంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు సహాయక కోచ్‌గా వ్యవహరించిన శ్రీరామ్... భారత్ తరఫున 2000-04 మధ్య ఎనిమిది వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.